QR Code
-
ఫిన్‌టెక్ కొత్త మంత్రం రూపే కార్డ్
ఇప్పుడు దాదాపు అన్ని చెల్లింపులూ యూపీఐ ద్వారానే. లేదంటే పెద్ద లావాదేవీలకు క్రెడిట్ కార్డ్ వాడుతుంటారు. మరి క్యూఆర్ కోడ్ చెల్లింపులకు బ్యాంక్ ఖాతాలో కచ్చితంగా బ్యాలెన్స్ ఉండాలి. లేదంటే యూపీఐ లైట్ వ్యాలెట్‌లో అయినా బ్యాలెన్స్ లోడ్ చేసుకోవాలి. ఈ రెండూ లేకుండా రూపే క్రెడిట్ కార్డుతో క్యూఆర్ కోడ్ చెల్లింపులకు గతేడాదే ఆర్బీఐ వీలు కల్పించింది. ఇప్పటి వరకు ఇదేమంత ప్రచారానికి నోచుకోలేదు. కానీ, ఇప్పుడు ఫిన్‌టెక్ కంపెనీలు రూపే క్రెడిట్ కార్డుల మార్కెటింగ్‌ను భుజానికెత్తుకున్నాయి. రియో, కివి, క్రెడిట్పే తదితర ఫిన్‌టెక్ సంస్థలు బ్యాంకులతో టైఅప్ అయి రూపే క్రెడిట్ కార్డులను కస్టమర్లకు అందిస్తూ, వాటిపై కమీషన్ పొందుతున్నాయి. ప్రముఖ రిటైల్ సంస్థలు, వర్తకులతోనూ చేతులు కలిపి రూపే కార్డు వినియోగంపై చక్కని ఆఫర్లు ఇస్తున్నాయి. యూపీఐకి అనుసంధానించుకుని చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉండడంతో రూపే క్రెడిట్‌కార్డుతో కొత్త యూజర్లకు ఫిన్‌టెక్‌లు సులభంగా చేరువ అవుతున్నాయి. చిన్న వర్తకుల వద్ద పీవోఎస్ యంత్రాలు లేకపోవడంతో క్రెడిట్ కార్డులతో చెల్లింపులకు అవకాశం ఉండేది కాదు. పీవోఎస్ లేకపోయినా రూపే కార్డ్‌తో చెల్లింపులు చేసుకోవడం కస్టమర్లను ఆకర్షిస్తోంది. ‘‘పీవోఎస్ మెషిన్ లేని వర్తకుల వద్ద చెల్లింపులకు వీలు కలి్పంచే ఏకైక కార్డ్ రూపే క్రెడిట్ కార్డ్’’అని సూపర్.మనీ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రకాశ్ సికారియా తెలిపారు. పీవోఎస్ లేని వర్తకుల సంఖ్య కోట్లలో ఉంటుంది. దీంతో రూపే కార్డుల రూపంలో ఫిన్టెక్లకు పెద్ద మార్కెట్టే అందుబాటులోకి వచి్చనట్టయింది. కివి సంస్థ వర్చువల్ రూపే క్రెడిట్ కార్డ్ ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తోంది. నెలవారీ రూ.300 కోట్ల విలువైన వ్యాపారాన్ని నమోదు చేస్తోంది. ‘‘కస్టమర్లు యూపీఐ లావాదేవీలను క్రెడిట్ కార్డ్‌తో చేయడం మొదలు పెడితే, సేవింగ్స్ ఖాతా అనుసంధానిత యూపీఐ నుంచి మారిపోతారన్నది మా నమ్మకం. ఎందుకంటే ఇందులో సౌలభ్యంతోపాటు మెరుగైన అనుభవం లభిస్తుంది’’అని కివి సహ వ్యవస్థాపకుడు, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మోహిత్ బేడి అభిప్రాయపడ్డారు.ఆఫర్లతో గాలం.. ‘‘యూపీఐ చెల్లింపుల పరంగా సౌకర్యవంతమైన సాధనం. క్రెడిట్ కార్డులన్నవి రివార్డులు, ప్రయోజనాలకు పెట్టింది పేరు. ఈ రెండింటి కలయికతో కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు, రివార్డులు అందించే ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం’’అని సికారియా వివరించారు. కివి జారీ చేసే వర్చువల్ రూపే క్రెడిట్ కార్డ్‌పై 40–50 రోజుల వడ్డీ రహిత (క్రెడిట్ ఫ్రీ) కాలం అమలవుతుంది. దీనికి అదనంగా వ్యయంపై రివార్డులను అందిస్తోంది. ఎయిర్‌పోర్టుల్లో యూపీఐ ఆధారిత లాంజ్ ప్రవేశాలకూ వీలు కలి్పస్తోంది. పెద్ద వర్తకులతో టైఅప్ పెట్టుకుని క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లను సైతం ఫిన్‌టెక్‌లు ఆఫర్ చేస్తుండడంతో కస్టమర్లు సైతం రూపే క్రెడిట్ కార్డులను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. మధ్యవర్తిత్వ పాత్రతో ఆదాయం.. చాలా వరకు ఫిన్‌టెక్‌లు కేవలం మధ్యవర్తిత్వ పాత్రకే పరిమితమవుతున్నాయి. ఇవి నేరుగా క్రెడిట్ కార్డులు జారీ చేయవు. బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుని పంపిణీ, ఇతర సేవలను అందించడానికి పరిమితమవుతున్నాయి. కార్డు యాక్టివేషన్‌పై కొంత మొత్తం చార్జీ కింద, కార్డు వినియోగంపైనా ప్రయోజనాలను అందుకుంటున్నాయి. సంప్రదాయ క్రెడిట్ కార్డులపై యూజర్లు నెలవారీ 8–9 లావాదేవీలు చేస్తుంటే.. యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డుపై దీనికి రెట్టింపు స్థాయిలో ఉండడం గమనార్హం. కివి ప్లాట్‌ఫామ్ ద్వారా జారీ అవుతున్న రూపే క్రెడిట్ కార్డుపై నెలవారీగా ఒక్కో యూజర్ సగటున 22 నుంచి 24 లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. దీనివల్ల కస్టమర్లను నిలుపుకోవడంతోపాటు, అధిక లావాదేవీల రూపంలో ఫిన్టెక్లకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. తొలిసారి క్రెడిట్ యూజర్లకు ఫిక్స్డ్ డిపాజిట్‌పై సెక్యూర్డ్ రూపే క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. యూపీఐపై క్రెడిట్ లైన్ సేవలను అందిస్తున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
జగన్ హయాంలోనే పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ ఘనతను కూడా తన ఘనతగా చెప్పుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం సంకోచించడం లేదు. భూముల రీసర్వే గురించి అబద్ధాలే సిగ్గుపడేలా దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ రీ సర్వే ప్రక్రియను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ముద్రించి ఇస్తామంటూ బిల్డప్ ఇస్తున్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రీ సర్వేను నిలిపివేసింది. అయితే దీనివల్ల ఒనగూరే ప్రయోజనాలు తెలియడం.. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చేసి తీరాలని స్పష్టం చేయడంతో విధి లేక కొనసాగిస్తోంది. అత్యంత పకడ్బందీగా భూముల కొత్త రికార్డులు తయారు చేసేందుకు.. ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదాలను పరిష్కరించేందుకు, భూ అక్రమాలకు తావు లేకుండా చేసేందుకు వైఎస్ జగన్ హయాంలో రీసర్వే మొదలుపెట్టారు. సర్వే పూర్తయిన గ్రామాల భూ రికార్డులను జగన్ ప్రభుత్వం జియో కో–ఆర్డినేట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు)తో జారీ చేసింది. ప్రతి భూమికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్, భూ హక్కు పత్రం, ప్రాపర్టీ పార్సిల్ మ్యాప్, ప్రతి గ్రామానికి రెవెన్యూ విలేజ్ మ్యాప్ ఇచ్చింది. ప్రతి భూ కమతానికి ఆధార్ నంబర్ మాదిరిగా ఒక విశిష్ట సంఖ్య(ఐడీ నంబర్) ఇవ్వడంతో పాటు క్యూఆర్ కోడ్ కేటాయించింది. పట్టాదారు పాస్ పుస్తకంలో పొందుపరిచే ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ భూమికి సంబంధించిన అన్ని వివరాలు లభ్యమవుతాయి. దీనివల్ల వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదు. భూ యజమానికి తెలియకుండా భూ రికార్డుల్లో మార్పు చేయడం అసాధ్యం. డబుల్ రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉండదు. సుమారు 8 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి 30 లక్షల మందికి పైగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చింది. చంద్రబాబు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ ప్రక్రియపై దారుణంగా విషం చిమ్మారు. కానీ, అధికారంలోకి రాగానే మళ్లీ రీ సర్వేను కొనసాగిస్తూ తన ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయ పడుతుండటం గమనార్హం. -
పేటీఎం కొత్త ఫీచర్.. యాప్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు..
పేటీఎం తన వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీసు అందించేందుకు సిద్ధమైంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘రిసీవ్ మనీ క్యూఆర్ విడ్జెట్’ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ పేటీఎం క్యూఆర్ కోడ్‌ను నేరుగా తమ స్మార్ట్ ఫోన్ హోమ్ స్క్రీన్‌పై డిస్ ప్లే చేసుకోవచ్చు. ప్రతిసారి యాప్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇన్స్టంట్ పేమెంట్ కనెక్షన్‌కు వీలు కల్పించింది.లావాదేవీలను సరళతరం చేయడంలో భాగంగా గతంలో ఐఓఎస్ యూజర్లకు ఈ క్యూఆర్ విడ్జెట్‌ను పేటీఎం అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఈ సర్వీసును ఆండ్రాయిడ్‌కు విస్తరించినట్లు ప్రకటించింది. ఇది చిన్న వ్యాపారాలు, దుకాణదారులు.. వంటివారికి నిరాటంకంగా చెల్లింపులను స్వీకరించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ సర్వీసు ద్వారా పేటీఎం చెల్లింపు ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.రియల్ టైమ్ అలర్ట్లుయూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు పేటీఎం ప్రత్యేకమైన కాయిన్ డ్రాప్ సౌండ్ నోటిఫికేషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ రియల్ టైమ్ అలర్ట్ యూజర్ అందుకున్న చెల్లింపుల ధ్రువీకరణను నిర్ధారిస్తుంది. వినియోగదారులు యాప్‌ను తనిఖీ చేయకుండానే లావాదేవీల గురించి తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఫీచర్ డిజిటల్ చెల్లింపుల్లో నమ్మకాన్ని, పారదర్శకతను పెంచుతుందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: బడ్జెట్లో మాకేంటి? ఎవరెవరు ఏం కోరుకుంటున్నారంటే..క్యూఆర్ విడ్జెట్‌ను ఎలా యాడ్ చేయాలంటే..ఆండ్రాయిడ్ ఫోన్లో సులభంగానే హోమ్ స్క్రీన్‌పై క్యూఆర్ విడ్జెట్‌ను సెటప్ చేసుకోవచ్చు.పేటీఎం యాప్ ఓపెన్ చేయండి.ఎగువ ఎడమవైపు ఉన్న ప్రొఫైల్ ఐకాన్ మీద ప్రెస్ చేయాలి.క్యూఆర్ కోడ్ దిగువన ‘యాడ్ క్యూఆర్ టు హోమ్ స్క్రీన్’ ఆప్షన్ ఎంచుకోండి.దాన్ని కన్ఫర్మ్ చేయాలి. వెంటనే విడ్జెట్ హోమ్ స్క్రీన్‌పై వస్తుంది.పేటీఎం యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ విడ్జెట్ ద్వారా చెల్లింపులు స్వీకరించవచ్చు. -
స్కాన్ చేసి ధర్మం చేయండి.. బాబయ్యా..
మొన్నీమధ్యే పంజాగుట్ట వెళదామని ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ కి వచ్చా.. మెట్లు ఎక్కుతోంటే.. నాలుగో మెట్టు మీద అనుకుంటా... ఒక యాచకుడ్ని చూశా.. యధావిధిగానే అతని ముందో పళ్లెం ఉంది. అందులో కొన్ని చిల్లర పైసలు, 10 రూపాయల నోట్లు ఓ నాలుగు ఉన్నట్లున్నాయి. ఇది కొత్తేమి కాదు కానీ... నన్ను ఆకట్టుకున్నదల్లా... అతని మెళ్ళో ఉన్న ఓ డిజిటల్ కార్డు.అది క్యూఆర్ కోడ్ ఉన్న కార్డు.. పెదాలపై ఓ చిన్న చిరునవ్వు వచ్చింది... ఎస్..మోదీ చెప్పింది కరెక్టే అనిపించింది.. "దేశంలో డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది.. ఇప్పుడు అడుగడుగునా డిజిటల్ చెల్లింపులే..రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరించి పల్లెల్లో సైతం వేళ్లూనుకుంటాయి..." అంటూ అప్పుడెప్పుడో ప్రధాని అన్నట్లు వచ్చిన వార్త గుర్తుకొచ్చింది.ఇప్పుడీ సంఘటన చూడగానే... నిజమే కదా అనిపించింది..ఇప్పుడంతా డిజిటల్ మయం అయిపోయిందన్నది వాస్తవం. కూరలు కొనడానికి రైతు బజార్ కి వెళ్లినా.. చివరకు ఛాయ్ తాగుదామని టీ స్టాల్ కు వెళ్లినా... జేబులోంచి ఫోన్ తీయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, పైసలతో సహా డబ్బులు చెల్లించడం... చాలా సింపుల్ అయిపోయింది..ఎప్పుడైతే ఈ డిజిటల్ చెల్లింపులు విస్తృతమవుతున్నాయో చిల్లరతో పనిలేకుండా పోతోంది.. చిల్లర దాకా ఎందుకు... కనీసం ఒక్క పది రూపాయల నోట్ కూడా జేబులో పెట్టుకోకుండా.. కేవలం సెల్ ఫోన్ తో రోడ్డెక్కేవాళ్ళు ఎంతమందో ఈరోజుల్లో..దీంతో ఎవరైనా చెయ్య చాపి యాచిస్తే... ఓ రూపాయి కూడా విదపలేని పరిస్థితి. మరి వారి ఆదాయం పడిపోక ఏమవుతుంది... అందుకే అనుకుంటా... ఆ యాచకుడు ఈ డిజిటల్ మార్గాన్ని ఎంచుకున్నట్లున్నాడు.. తప్పులేదు.. త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర యాచించే వాళ్ళు సైతం మెళ్ళో ఓ కార్డు వేసుకుని మీముందు చెయ్యి చాపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీ ప్రిపేర్..మనం పూర్తి స్థాయిలో నగదురహిత సమాజం వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పేందుకు ఇదో ప్రబల ఉదాహరణగా భావించొచ్చు. గత డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా 1673 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్ధిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2024, జనవరి నెలలో ఈ లావాదేవీలు 1220 కోట్లు జరగ్గా.. ఏడాది చివరికి వచ్చేసరికి 400 కోట్లకు పైగా పెరిగాయి. డిజిటల్ విప్లవానికి ఇంతకంటే నిదర్శనం వేరే ఏం కావాలి?యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) అనేది రకరకాల బ్యాంకుల్ని ఒకేగూటికి చేర్చి చెల్లింపులు చేసేందుకు దోహదపడే ఒక సాధనం. మీ బ్యాంకు ఏదైనా కావచ్చు.. దాన్ని యూపీఐ కి అనుసంధానం చేయడం ద్వారా ఎలాంటి చెల్లింపులైనా క్షణాల్లో చేసేయొచ్చు. పైగా ప్రతీ చెల్లింపునకూ రికార్డు ఉంటుంది.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజా సమాచారం ప్రకారం... గత నవంబర్ నెలలో 1548 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వాటి విలువ రూ. 21.55 లక్షల కోట్లు. డిసెంబర్ కి వచ్చేసరికి రూ.23.25 లక్షల కోట్ల విలువ చేసే 1673 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఐఎంపీఎస్ (ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్) ని తాజాగా యూపీఐ వెనక్కి నెట్టేసింది. ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు 24 గంటల్లో ఎప్పుడైనా సరే తక్షణమే చెల్లింపు చేసే విధంగా ఈ ఐఎంపీఎస్ ను ప్రభుత్వం 2010 లో ప్రారంభించింది. వ్యాపార వర్గాలకు, వ్యక్తులకు ఈ ఐఎంపీఎస్ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. ఐఎంపీఎస్ ద్వారా గత ఏడాది నవంబర్ నెలలో రూ. 5.58 లక్షల కోట్ల విలువ చేసే 40.79 కోట్ల లావాదేవీలు జరగ్గా... డిసెంబర్లో వీటి సంఖ్య 44.1 కోట్లకు పెరిగింది. వీటి విలువ కూడా రూ. 6.01 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం. ఇక మీరు హైవేల మీద ప్రయాణం చేసేటప్పుడు టోల్ ప్లాజా ల దగ్గర చెల్లింపులు చేస్తారు కదా... గతంలో క్యాష్ ఇచ్చేవారు. ఆ తర్వాత డెబిట్/క్రెడిట్ కార్డులు, యూపీఐ లు వచ్చాయి. ఇప్పుడు ఫాస్టాగ్ అనేది ఈ చెల్లింపుల్లో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. ప్రతి టోల్ ప్లాజా ముందు.. ప్రత్యేకంగా కొంతసేపు ఆగాల్సిన అవసరాన్ని ఈ ఫాస్టాగ్ తప్పించింది. మీరు బయల్దేరేముందే... కొంత మొత్తాన్ని మీ బ్యాంకు అకౌంట్ నుంచి ఫాస్టాగ్ కి మళ్లిస్తారు. టోల్ ప్లాజా రాగానే అక్కడి స్కానర్లు మీ వాహనానికి ఉన్న ట్యాగ్ ని స్కాన్ చేస్తాయి. అమౌంట్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఇదంతా కొద్ది సెకన్లలోనే జరిగిపోతుంది. తద్వారా వేచి ఉండే వ్యవధి తగ్గడంతో పాటు, చిల్లర నోట్ల బాధ ఉండదు. ఈ ఫాస్టాగ్ లు ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. గత నవంబర్ నెలలో 35.89 కోట్ల లావాదేవీలు జరగ్గా.. డిసెంబర్లో ఈ సంఖ్య 38.30 కోట్లకు పెరిగాయి. వీటి విలువ కూడా రూ.6,070 కోట్ల నుంచి రూ.6,642 కోట్లకు పెరిగింది.యూపీఐ, ఐఎంపీఎస్, ఫాస్టాగ్ చెల్లింపులు అనేవి మానవాళి జీవితంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చాయి. ఈ చెల్లింపులు చాలా సురక్షితంగా ఉండటమే కాక, వేగవంతంగా పనులు పూర్తయ్యేలా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఫైనాన్షియల్ లావాదేవీలు మరింత విస్తృతమై డిజిటల్ ఇండియా రూపురేఖలనే మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.-బెహరా శ్రీనివాస రావువిశ్లేషకులు -
రూపాయికీ యూపీఐ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రూపాయికీ యూపీఐ.. అవును మీరు విన్నది నిజమే. ఒక్క రూపాయి చెల్లించాలన్నా స్మార్ట్‌గా యూపీఐ పేమెంట్ యాప్‌తో ‘స్కాని’చ్చేస్తున్నారు. ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా పల్లెలకూ పాకింది. ఇదంతా అత్యంత వేగంగా చెల్లింపులను సుసాధ్యం చేస్తున్న టెక్నాలజీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మాయాజాలం. క్షణాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఎవరికైనా రోజుకు గరిష్టంగా రూ.1 లక్ష వరకు.. బ్యాంకు ఖాతాకు, ఖాతా అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు, యూపీఐ ఐడీ, క్యూఆర్ కోడ్‌కు సురక్షితంగా, సులభంగా డిజిటల్ చెల్లింపులను యూపీఐ సుసాధ్యం చేసింది. చిరు వ్యాపారులకూ డిజిటల్ రూపంలో నగదును స్వీకరించే ప్రధాన సాధనంగా మారిపోయింది. చిల్లర సమస్యలకు యూపీఐ చెక్ పెడుతోంది. 2025 జనవరి 1న రూ.81,015.79 కోట్ల విలువైన 56.84 కోట్ల లావాదేవీలతో కొత్త సంవత్సరంలో యూపీఐ శుభారంభం చేసింది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31న ప్రజలు రూ.93,148 కోట్ల విలువైన లావాదేవీలు జరిపారు. కొత్త రికార్డుల ప్రయాణం.. దేశవ్యాప్తంగా 2024 డిసెంబర్ 2న రూ.95,915.6 కోట్ల విలువ చేసే లావాదేవీలు నమోదయ్యాయి. యూపీఐ చరిత్రలో 2016 ఏప్రిల్ నుంచి 2025 జనవరి 1 నాటికి ఇదే అత్యధికం. ఇక 2024 డిసెంబర్ నెలలో సగటున రోజుకు రూ.74,990 కోట్ల విలువైన 54 కోట్ల లావాదేవీలు జరిగాయంటే నోరెళ్లబెట్టాల్సిందే. కస్టమర్లు నవంబర్‌లో రోజుకు సగటున రూ.71,840 కోట్ల విలువైన 51.6 కోట్ల లావాదేవీలు జరిపారు. యూపీఐ లావాదేవీల సంఖ్య గత నెలలో 8 శాతం దూసుకెళ్లి మొత్తం 1,673 కోట్లుగా ఉంది. నవంబర్‌లో ఈ సంఖ్య 1,548 కోట్లు నమోదైంది. లావాదేవీల విలువ గత నెలలో రూ.23.25 లక్షల కోట్లకు చేరింది. నవంబర్‌లో ఇది రూ.21.55 లక్షల కోట్లుగా ఉంది. భారత్ స్కాన్ చేస్తోంది.. దేశం ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తోందంటే అతిశయోక్తి కాదు. రోడ్డు పక్కన ఉండే చిరు వర్తకుల వద్దా ఇవి దర్శనమిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం 2024 నవంబర్ నాటికి భారత్ క్యూఆర్‌తో కలిపి మొత్తం యూపీఐ క్యూఆర్ కోడ్స్ 63.2 కోట్లు జారీ అయ్యాయి. 2023 నవంబర్‌లో ఈ సంఖ్య 31.4 కోట్లు మాత్రమే. అంటే ఏడాదిలో క్యూఆర్ కోడ్స్ రెట్టింపు అయ్యాయన్నమాట. వర్తకుల వద్ద దేశవ్యాప్తంగా 2024 మార్చి 31 నాటికి 34.9 కోట్ల క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల వేగానికి ఈ అంకెలే నిదర్శనం. ఎన్పీసీఐ వేదికగా 55 శాతం.. ఆర్బీఐ గణాంకాల ప్రకారం క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐఎల్), ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, ఎన్ఏసీహెచ్, నెఫ్ట్, యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు, పీవోఎస్ మెషీన్లు, చెక్కులు, బ్యాంక్ డ్రాఫ్టులు, నగదు.. ఇలా ప్రభుత్వ, రిటైల్ పరంగా దేశవ్యాప్తంగా 2024 నవంబర్ నెలలో రూ.2,20,52,158 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇందులో యూపీఐ వాటా 9.77 శాతం. అలాగే నవంబర్‌లో ఎన్పీసీఐ వేదికగా జరిగిన రూ.38,94,079 కోట్ల రిటైల్ లావాదేవీల్లో యూపీఐ 55.34 శాతం వాటా కైవసం చేసుకుంది. ఫోన్‌పే టాప్లావాదేవీల పరంగా ఫోన్‌పే 48 శాతం వాటాతో తొలి స్థానంలో నిలిచింది. గూగుల్ పే 37 శాతం, పేటీఎంకు 7% వాటా ఉంది. మిగిలిన 8% వాటాను క్రెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ యాప్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాప్స్ వంటివి పంచుకున్నాయి. -
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండిలా..
ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ప్రస్తుతం చాలా ప్రకటనల్లో క్యూఆర్ కోడ్‌ను గమనిస్తుంటాం. ఆ కోడ్‌ను స్కాన్(Scan) చేస్తే నేరుగా సదురు ప్రకటన వివరాలు తెలుసుకోవచ్చు. పూర్తి సమాచారాన్ని ఫిజికల్‌గా ప్రకటనల్లో ఇవ్వడం కొన్నిసార్లు కుదరకపోవచ్చు. దాంతో చాలా కంపెనీలు క్యూఆర్(QR Code) కోడ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. కేవలం కంపెనీ ఉత్పత్తుల వివరాలే కాకుండా విద్య, వైద్యం, పరిశ్రమలు, బీమా రంగం.. ఇలా ఏ విభాగంలో చూసినా క్యూఆర్ కోడ్‌తో సమాచారాన్ని తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏదైనా డివైజ్ల్ ఉన్న క్యూఆర్‌ను లేదా ఫేన్పే, జీపే వంటి లావాదేవీలకు సంబంధించిన క్యూఆర్‌ను స్కాన్ చేయడం సులువే. కానీ మీకు ఎవరైనా సాఫ్ట్‌కాపీ(Soft Copy) పంపించి అందులో క్యూఆర్ కోడ్ సమాచారం తెలుసుకోవాలంటే ఏం చేస్తారు.. మీకు వచ్చిన క్యూఆర్‌ను తిరిగి వేరే ఫోన్‌కు పంపించి అందులోనుంచి మీ డివైజ్‌లో స్కాన్ చేస్తారు కదా. ఇది అన్నివేళలా కుదరకపోవచ్చు. అలాంటి సమయంలో సులువుగా క్యూఆర్ స్కాన్ చేసే మార్గం ఉంది.గూగుల్ లెన్స్ఫోన్ స్క్రీన్ నుంచి నేరుగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడానికి గూగుల్ లెన్స్‌ను వినియోగించడం సులువైన మార్గం. దీన్ని గూగుల్ సదుపాయం ఉన్న ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో ఉపయోగించవచ్చు.ఎలా ఉపయోగించాలంటే..ఫోన్లోని క్యూఆర్ కోడ్‌ను స్క్రీన్‌షాట్(Screen Shot) తీసుకోవాలి.గూగుల్ ఫోటోలు లేదా గూగుల్(Google) యాప్‌ను ఓపెన్ చేయాలి.సెర్చ్ బటన్ పక్కన లెన్స్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే గ్యాలరీకి యాక్సెస్ అడుగుతుంది.ఫోటోలకు యాక్సెస్ ఇచ్చి అప్పటికే స్క్రీన్‌షాట్ తీసుకున్న క్యూఆర్ కోడ్‌ను సెలక్ట్ చేసుకోవాలి.గూగుల్ లెన్స్(Google Lens)లోని కృత్రిమమేధ మీరు సెలక్ట్ చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నేరుగా అందులోని సమాచారాన్ని రీడైరెక్ట్ చేస్తుంది.వేరే ఫోన్ అవసరం లేకుండానే నేరుగా సాఫ్ట్‌కాపీ లేదా స్క్రీన్‌షాట్ తీసిన క్యూఆర్ వివరాలు తెలుసుకునేందుకు ఇలా ప్రయత్నించవచ్చు.ఇదీ చదవండి: భలే ఛాన్స్.. తగ్గిన బంగారం ధర! తులం ఎంతంటే..ప్రస్తుతం చాలా ఫోన్ తయారీ కంపెనీలు వాటి కెమెరాలు లేదా గ్యాలరీ యాప్‌ల్లోనే నేరుగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. అంటే గూగుల్ లెన్స్ అవసరం కూడా లేకుండానే నేరుగా కెమెరా ఆన్ చేసి క్యూఆర్‌ను స్కాన్ చేయవచ్చు. -
క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్‌కార్డ్‌లు: కేంద్రం కీలక నిర్ణయం
భారతదేశ ఆర్థిక, పన్ను వ్యవస్థలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం లేటెస్ట్ వెర్షన్ పాన్ 2.0 ప్రారంభించే ప్రణాళికలను ఆవిష్కరించారు. లేటెస్ట్ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పౌరులకు సేవలందించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139A కింద 1972లో ప్రవేశపెట్టిన పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) ప్రవేశపెట్టారు. ఆ తరువాత పాన్ ఎప్పుడూ అప్డేట్ అవ్వలేదు.. కాగా ఇప్పటికే డిజిటల్ అప్డేట్ అందుకుంది. ఇప్పటికి 78 కోట్లకు పైగా సాధారణ పాన్‌కార్డులను జారీ చేశారు. అయితే రాబోయే రోజుల్లో క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్‌కార్డుల పంపిణీ చేయనున్నట్లు సమాచారం.1,435 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో.. ఆదాయపు పన్ను శాఖ పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) సోమవారం ఆమోదం తెలిపింది. భద్రతను దృష్టిలో ఉంచునికి ఈ పాన్ 2.0 ప్రవేశపెట్టారు.#Cabinet approves PAN 2.0 Project of the Income Tax Department enabling technology driven transformation of Taxpayer registration services #CabinetDecisions pic.twitter.com/iQhZCgGWGu— Dhirendra Ojha (@DG_PIB) November 25, 2024 -
వాచీలోనే క్యూఆర్ కోడ్... అదిరిందయ్యా ఆటో డ్రైవర్!
బెంగళూరుకు చెందిన ఈ ‘స్మార్ట్’ఆటో డ్రైవర్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందనలు అందుకున్నాడు. ఎందుకంటే మనవాడు యూపీఐ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ స్మార్ట్ వాచ్‌ను వాడుతున్నాడు మరి! సదరు ఫొటోను ఓ నెటిజన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దాంతో అది తెగ వైరలవుతోంది. అలా రైల్వే మంత్రి దృష్టినీ ఆకర్షించింది. ఆ ఫోటోను ఆయన రీట్వీట్ చేశారు. ‘యూపీఐ కా స్వాగ్! చెల్లింపులు మరింత సులువయ్యాయి’అంటూ కామెట్ చేశారు. ఆటోడ్రైవర్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెలులవెత్తుతున్నాయి. ఐటీలో ట్రెండ్ సెట్టర్ అయిన బెంగళూరు ఆ సాంకేతిక పరిజ్ఞానం వాడకంలోనూ ట్రెండ్ సెట్ చేస్తోందంటూ యూజర్లు కామెంట్ చేస్తున్నారు. ‘నవ భారత ముఖచిత్రమిది’అని ఒకరు, ‘డిజిటల్ ఇండియా మ్యాజిక్’అని మరొకరు పోస్ట్ చేశారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016లో ప్రారంభించిన యూపీఐ బ్యాంకుల మధ్య తక్షణ బదిలీలకు వీలు కలి్పంచడం ద్వారా చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రైల్వేలో క్యూఆర్ కోడ్
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు దక్షిణమధ్య రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్లలో యూపీఐ(యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) చెల్లింపులో భాగంగా క్యూర్ కోడ్ స్కానర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లతోపాటు టికెట్ జారీ కౌంటర్లన్నింటిలో క్యూఆర్ కోడ్ స్కానర్లు ఉంచారు. యూపీఐ పద్ధతిలో చెల్లింపులు అతి సర్వసాధారణంగా మారిన తరుణంలో రైల్వే ఏకంగా దీనిపై ఐదునెలల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించింది. అంతకు కొద్ది నెలల ముందు యూపీఐ చెల్లింపులను కొన్ని స్టేషన్లలో ప్రారంభించినా.. క్యూఆర్ కోడ్ స్కానింగ్ పద్ధతిని మాత్రం అందుబాటులోకి తేలేదు. మార్చి 21న దక్షిణ మధ్య రైల్వేలోని 14 ప్రముఖ స్టేషన్లలో క్యూఆర్‌కోడ్ పరిశీలన ప్రారంభించింది. కేవలం 31 కౌంటర్లలో స్కానర్లను ఏర్పాటు చేసింది. దాదాపు ఐదు నెలల సుదీర్ఘకాల ప్రయోగానంతరం ఎట్టకేలకు ఇప్పుడు జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లలో వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించి ప్రారంభించటం విశేషం. వంద శాతం డిజిటల్ చెల్లింపులు జరగాలని నినాదం ఇచ్చి.. రైల్వేస్టేషన్లలో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు దాదాపు ఆరేళ్ల క్రితం దక్షిణ మధ రైల్వే ప్రకటించింది. ఇందుకోసం కాచిగూడ స్టేషన్లో ఓ అవగాహన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. స్టేషన్లలోని అన్ని దుకాణాల్లో డిజిటల్ చెల్లింపు పద్ధతిని కచ్చితంగా అమలు చేయాలని, ప్రయాణికుల నుంచి బలవంతంగా నగదు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తరచు ఆకస్మిక తనిఖీలతో అధికారులు స్టేషన్లలోని దుకాణాలను తనిఖీ చేసి దాని అమలు తీరును పరిశీలిస్తూ వచ్చారు. ఆపై రైల్వే బోర్డుకు నివేదికలు సమర్పించింది. కానీ, తాను మాత్రం టికెట్ల విక్రయాల్లో దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయింది. ఆర్థిక లావాదేవీల్లో డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడ్డ ప్రజలు రైల్వేస్టేషన్లలో టికెట్ కొనేందుకు మాత్రం నగదు చెల్లించాల్సి రావటంతో ఇబ్బంది పడుతూ వచ్చారు. యూపీఐ చెల్లింపులు విస్తృతమైన నేపథ్యంలో చాలామంది జేబుల్లో నగదు అందుబాటులో ఉండేది కాదు. రైల్వే స్టేషన్లలో ఈ పద్ధతి అమలులో లేదని తెలియక, నగదు లేకుండా వచ్చి క్యూ లైన్లలో నిలబడి తీరా టికెట్ కొనేప్పుడు విషయం తెలిసి ఉసూరుమంటూ ఏటీఎంల వైపు పరుగుపెట్టడం సాధారణంగా మారింది. దీంతో అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతూ వచ్చాయి. కొన్నేళ్లపాటు డెబిట్ కార్డు ద్వారా డిజిటల్ చెల్లింపు పద్ధతులను మాత్రం అమలు చేసింది. యూపీఐ చెల్లింపుల కోసం ఇక తప్పని పరిస్థితి ఎదురుకావటంతో క్యూఆర్‌కోడ్ స్కానర్లను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం చుట్టి జనం ‘జేబు’ఇబ్బందులను దూరం చేసింది. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. ఇకపై చెల్లింపులు ఇలా కూడా
సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం రైల్వే స్టేషన్లలో ఇక నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI)ద్వారా చెల్లింపులకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో క్యూఆర్ (QR) సిస్టం ద్వారా నగదు చెల్లింపు ప్రక్రియ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. రైల్వే స్టేషన్లలోని జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి ఇకపై డిజిటల్ చెల్లింపులు చేవచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.అన్ని స్టేషన్లలోని టికెట్ విండో వద్ద ప్రత్యేక డివైజ్‌ను ఏరర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ప్రయాణికుడికి సంబంధించిన అన్ని వివరాలూ కంప్యూటర్లో ఎంటర్ చేసిన వెంటనే ఆ డివైజ్‌లో క్యూఆర్ కోడ్ ప్రత్యక్షమవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ యాప్స్ ఉపయోగించి చెల్లింపులు చేవచ్చని, పేమెంట్ పూర్తైన తర్వాత టికెట్‌ను అందిస్తారని పేర్కొంది. -
గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. మంత్రి ప్రకటన
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్లకు త్వరలో క్యూఆర్ కోడ్ ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్ల ట్రాకింగ్ కోసం, ఏజెన్సీల ఇన్వెంటరీ నిర్వహణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. దాంతో పాటు నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా భద్రతా చర్యల నమూనా రూపొందించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘గ్యాస్ సిలిండర్ల క్యూఆర్ కోడ్ ముసాయిదాను గ్యాస్ సిలిండర్ రూల్స్ (జీసీఆర్)లో పొందుపరిచాం. త్వరలో దీనిపై తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. గ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్ల ట్రాకింగ్ కోసం ఈ క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘అమెరికా ఇండిపెండెన్స్ డే’.. జుకర్‌బర్గ్ వినూత్న వేడుకలునివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని మంత్రి పెసో (పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్)ను ఆదేశించారు. ఇందుకోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. డీపీఐఐటీ (పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం) కింద పని చేసే పెసో, 1884 ఎక్స్‌ప్లోజివ్స్ చట్టం, 1934 పెట్రోలియం చట్టం నిబంధనలను నియంత్రించే కీలక బాధ్యతను పర్యవేక్షిస్తుంది. పెసో మంజూరు చేసిన లైసెన్స్‌ల లైసెన్సింగ్ ఫీజులో మహిళా పారిశ్రామికవేత్తలకు 80 శాతం, ఎంఎస్ఎంఈలకు 50 శాతం రాయితీని ప్రకటిస్తున్నట్లు మంత్రి వివరించారు. -
డాక్ పే.. జిందాబాద్
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): దేశంలో వినియోగ దారులకు సత్వర సేవలు అందించేందుకు తపాలాశాఖ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఉత్తరాలు, మనీ ఆర్డర్లు, కొరియర్, స్పీడ్ పోస్ట్‌తోపాటు బ్యాంకింగ్, గోల్డ్ బాండ్, బీమా తదితర సేవలను ప్రైవేటు సంస్థలకు దీటుగా దిగ్విజయంగా అందిస్తోంది. మరో అడుగు ముందుకేసి డిజిటల్ లావాదేవీల పెంపునకు గూగుల్ పే, ఫోన్ పే మాదిరిగా డాక్ పే అనే యాప్‌ను 2021లోనే దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు దీనిని ప్రజలకు చేరువ చేసే దిశగా దూసుకెళుతోంది. ఈ డాక్ పే ద్వారా ప్రజలు డిజిటల్ ఫైనాన్స్ సేవలు పొందడంతోపాటు ఇండియా పోస్టు, ఐపీపీబీ, అందించే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. డబ్బు పంపడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, డిజిటల్ రూపంలో వ్యాపారులకు నగదు చెల్లించడం లాంటి పనులను చక్కబెట్టుకోవచ్చు. ప్రతి భారతీయుడి అవసరాలను తీర్చేలా డాక్ పే యాప్‌ను రూపొందించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో యూపీఐ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా దీనిని ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తున్నారు. ఈ యాప్‌ను ఏ బ్యాంకు ఖాతాదారుడైనా వినియోగించవచ్చు. గ్రీవెన్స్ వెసులుబాటు గూగుల్ పే, ఫోన్ పే నగదు లావాదేవీల్లో ఏవైనా పొరపాట్లు చోటుచేసుకుంటే ఫిర్యాదులు చేసేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే వాటి కార్యాలయాలు మనకు అందుబాటులో ఉండవు. అయితే డాక్‌పే యాప్ ద్వారా నగదు బదిలీ సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే ఫిర్యాదుల స్వీకరణకు తపాలా శాఖ వెసులుబాటు కల్పించింది. డాక్ పే అనే యాప్ తపాలాశాఖ కేంద్ర ప్రభుత్వ ఆ«దీనంలోనే పనిచేస్తుండడంతో మన డబ్బుకు గ్యారెంటీ ఉంటుంది. యాప్ గురించిన సమగ్ర సమాచారం కోసం ఐపీపీబీ టోల్‌ఫ్రీ నంబర్ 155299ను వినియోగదారులు సంప్రదించొచ్చని తపాలా శాఖా అధికారులు చెబుతున్నారు. -
Lok Sabha Election 2024: అంతా ఓటర్ స్లిప్‌లోనే
తమ భవిష్యత్‌ను నిర్ణయించే పాలకులను ఎన్నుకోవడంలో కీలకమైన ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో ప్రజల్లో నిర్లిప్లత కనిపిస్తుంటుంది. చాలామంది చిన్న చిన్న ఇబ్బందుల కారణంగా ఓటేసేందుకు ఆసక్తి చూపించరు. ఫలితంగా లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా 70 శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేదు! పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో ఓటింగ్ మరీ తక్కువగా నమోదవుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు, మరింత మందిని పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంటోంది. వీటికి తోడు ఓటరు స్లిప్‌లపై క్యూఆర్ కోడ్లు ముద్రిస్తోంది. పోలింగ్ బూత్ ఎక్కడుంది మొదలుకుని ఓటింగ్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్నీ కోడ్ సాయంతో ఇట్టే తెలుసుకోవచ్చు. స్కాన్ చేస్తే పూర్తి సమాచారం ఓటర్ స్లిప్‌లపై ఉండే క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేస్తే చాలు.. ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో చెబుతుంది. అక్కడికెలా వెళ్లాలో కూడా గూగుల్ మ్యాప్ సాయంతో చూపిస్తుంది. ఇటీవలి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరు పరిధిలో క్యూఆర్‌తో కూడిన ఓటర్ స్లిప్‌ల కారణంగా ఓటింగ్ బాగా పెరిగినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికార మనోజ్‌కుమార్ మీనా వెల్లడించారు. బెంగళూరు టీచర్స్ కాలనీ అసెంబ్లీ స్థానంలో 2020లో 66 శాతం నమోదైన పోలింగ్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 86 శాతానికి పెరిగిందన్నారు. ‘‘చాలామంది ఓటర్లకు పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో తెలియడం లేదు. ముఖ్యంగా పట్టణాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ భవనాలెక్కడున్నదీ తెలియకపోవడం ఇందుకు ప్రధాన కారణం. క్యూఆర్ కోడ్ దీనికి పరిష్కారం. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో 80 శాతానికి పైగా ఓటర్లకు క్యూఆర్ కోడ్ ఆధారిత ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేశాం’’ అని ఆయన వివరించారు. డిజిటల్ ఓటర్ స్లిప్ 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ స్లిప్‌లను ‘ఓటర్ హెల్ప్‌లైన్’ యాప్ ద్వారా డిజిటల్‌గా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఎన్నికల సంఘం కలి్పంచడం విశేషం. పోలింగ్ కేంద్రంలో సిబ్బంది డెస్క్ వరకు ఫోన్లను తీసుకెళ్లి ఈ డిజిటల్ ఓటర్ స్లిప్‌ను చూపించేందుకు అనుమతించారు. భవిష్యత్‌లో ఎన్నికలు మరింత డిజిటల్‌గా మారనున్నాయనేందుకు ఇది మరో సంకేతం. ఆకర్షించే ఏర్పాట్లు ఓటర్లను మరింతగా ఆకర్షించేందుకు ఈ విడత చాలా రాష్ట్రాల్లో థీమ్ ఆధారిత పోలింగ్ బూత్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేవలం మహిళా సిబ్బందితో కూడిన కేంద్రాలు, 30 ఏళ్లలోపు వయసున్న అధికారులతో యూత్ పోలింగ్ కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లో వారి ఇళ్లను పోలిన పోలింగ్ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నారు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో పోలింగ్ కనాకష్టంగా 50 శాతం దాటుతుండటం తెలిసిందే. ఇలా చాలా తక్కువ ఓటింగ్ నమోదవుతున్న ప్రాంతాలపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా ప్రాంతాలకు బృందాలను పంపించి ఓటర్లలో చైతన్యానికి చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సాయం కూడా తీసుకుంటోంది. బూత్ వద్ద చాంతాడంత క్యూలు చూసి అంతసేపు లైన్లో ఉండాలా అని చాలామంది అనుకుంటారు. దీనికి విరుగుడుగా పోలింగ్ బూత్ వద్ద క్యూను ఇంటి నుంచే మొబైల్లో తెలుసుకునేలా యాప్‌లను ఈసీ అభివృద్ధి చేసింది. ఆ బూత్‌ల సమీపంలో వాహనాల పార్కింగ్ వసతులున్నాయా, లేదంటే సమీపంలో ఎక్కడ పార్క్ చేసుకోవచ్చు వంటి సమాచారం కూడా వాటిలో అందుబాటులోకి తెచి్చంది. నడవలేని వృద్ధుల కోసం ఈ యాప్‌ల నుంచి వీల్‌చైర్ కూడా బుక్ చేసుకోవచ్చు. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి అర్హతలు, అఫిడవిట్లో సమాచారం, వారిపై ఏవైనా క్రిమినల్ కేసులు నమోదయ్యాయా? ఆస్తులు, అప్పులు తదితర పూర్తి సమాచారాన్నీ తెలుసుకోవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్యూ ఆర్ స్కాన్‌తో సాధారణ రైలు టికెట్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): డిజిటల్ చెల్లింపులు, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో విజయవాడ డివిజన్లో జనరల్ బుకింగ్ కౌంటర్ (అన్ రిజర్వ్డ్)లో క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టినట్లు సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు తెలిపారు. డివిజన్లోని ప్రధాన రైల్వేస్టేషన్లైన విజయవాడ, ఏలూరు, తెనాలి, రాజమండ్రిలలో 19 జనరల్ బుకింగ్ కౌంటర్లలో ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కౌంటర్ వద్ద టికెట్ కొనుగోలు చేసే సమయంలో ప్రయాణం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు, పిల్లలు/పెద్దల సంఖ్య, చార్జీలు వివరాలను బుకింగ్ క్లర్క్ నమోదు చేయగానే కౌంటర్ బయట ఏర్పాటు చేసిన స్క్రీన్‌లో ఆ వివరాలు కనిపిస్తాయి. ప్రయాణికులు వాటిని సరిచూసుకుని అక్కడ కనిపించే క్యూ ఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్లోని పేమెంట్ యాప్ ద్వారా స్కాన్ చేయడంతో టికెట్ జనరేట్ అవుతుందన్నారు. త్వరలోనే ఈ సౌకర్యాన్ని డివిజన్లోని అన్ని స్టేషన్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీనియర్ డీసీఎం తెలిపారు. -
ఓర్నీ..! ఆఖరికి భిక్ష కూడా డిజటల్ చెల్లింపుల్లోనే..!
ఇప్పుడూ టెక్నాలజీ ఫుణ్యమా! అని అందరూ డిజిటల్ లావాదేవీల ద్వారానే ఈజీగా చెల్లింపులు చేసేస్తున్నారు. బ్యాంకుల వద్దకు వెళ్లి.. బారులు తీరి ఉండాల్సిన పనిలేకుండా పోయింది. ఎలాంటి పని అయినా ఒక్కఫోన్పేతో చకచక అయిపోతుంది. ప్రతిదీ ప్రస్తుతం డిజిటల్ చెల్లిపులే, క్యూర్ కోడ్ స్కానింగ్‌లే. ఇప్పుడు ఆ డిజిటల్ చెల్లింపుల్లోనే బిచ్చగాళ్లు భిక్ష వేయడం వచ్చేసింది. ఓ బిచ్చగాడు ఫోన్ పే క్యూర్ కోడ్‌తో భిక్ష కోరుతూ ఆకర్షించాడు. ఈ ఘటన గౌహతిలో చోటు చేసుకుంది. ఇది చూస్తే నిజంగా టెక్నాలజీకి హద్దులు లేవంటే ఇదే కథ అనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ సోమాని సోషల్ మీడియా ఎక్స్‌లో పంచుకున్నారు. అందులో ఆ వ్యక్తి మెడలో క్యూర్ కోడ్‌తో ఉన్న ఫోన్‌పేని ధరించి భిక్ష కోరుతున్నట్లు కనిపిస్తుంది. ఒక కారులోని ఇద్దరు వ్యక్తులు అతడి క్యూర్ కోడ్‌ని స్కాన్ చేసి భిక్ష వేస్తున్నట్లు కనిపిస్తుంది. అతడు తన ఫోన్‌ని చెవి దగ్గర పెట్టకుని తన ఖాతాలో డబ్బులు జమ అవ్వుతున్న సమాచారం వింటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో దీన్ని మానవత్వంలో డిజిటల్ పురోగతిగా అభివర్ణించాడు. ఇది 'ఆలోచనను రేకెత్తించే క్షణం' అనే క్యాప్షన్‌తో వీడియోని ఎక్స్‌లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇలా ఒక బిచ్చగాడు డిజిటల్ చెల్లింపులను ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుమునుపు బిహార్‌లో ఒక డిజటల్ బిచ్చగాడు ఇలానే మెడలో క్యూఆర్ కోడ్ ప్లకార్డ్‌తో చెల్లింపులు జరిపేలా ప్రజలకు ఆప్షన్ ఇవ్వడం కనిపించింది. అతనను ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో దీన్ని గురించి వినడం ఎప్పటికీ మర్చిపోనని ఆ డిజిటల్ బిచ్చగాడు చెప్పుకొచ్చాడు కూడా. అలాగే న్యూఢిల్లీలో అయేషా శర్మ అనే 29 ఏళ్ల ట్రాన్స్విమన్ కూడా యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారా డబ్బులను స్వీకరిస్తుంది. Stumbled upon a remarkable scene in bustling #Guwahati – a beggar seamlessly integrating digital transactions into his plea for help, using PhonePe! Technology truly knows no bounds. It's a testament to the power of technology to transcend barriers, even those of socio-economic… pic.twitter.com/7s5h5zFM5i — Gauravv Somani (@somanigaurav) March 24, 2024 (చదవండి: ఆవుని ఆస్పత్రికి తరలించడం కోసం ఏకంగా హెలికాప్టర్..!) -
లవ్ స్కానింగ్
ముంబైలోని మహాలక్ష్మీ రేస్‌కోర్స్ ప్రాంతంలో జరిగిన మ్యూజిక్ ప్రోగ్రామ్‌కు హాజరైన ఒక యువకుడి టీ షర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. 22 సంవత్సరాల హార్థిక్ టీ షర్ట్ వెనకాల ఐ–క్యాచింగ్ మెసేజ్ ‘ఫర్ సింగిల్ పీపుల్ వోన్లీ’తోపాటు క్యూ ఆర్ కూడా ఉంది. క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే నేరుగా అతడి టిండర్ ప్రొఫైల్లోకి తీసుకువెళుతుంది. హార్థిక్ డిజిటల్ ఫ్లర్టింగ్ అనేది టాకింగ్ పాయింట్ కావడమే కాదు సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
క్యూఆర్ కోడ్‌తో రైల్ టికెట్ బుకింగ్
సాక్షి, హైదరాబాద్: సాధారణ రైల్వే టికెట్లను క్యూఆర్ కోడ్ ద్వారా బుక్ చేసుకొనే సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. తొలిదశలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14 స్టేషన్లలో ఉన్న 31 కౌంటర్లలో ఈ సౌకర్యాన్ని ప్రవేశ పెట్టారు. జనరల్ బుకింగ్ కౌంటర్లలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. టికెట్ కొనుగోలు చేసే సమయంలో జనరల్ బుకింగ్ కౌంటర్ల టికెట్ విండో వద్ద ప్రయాణికులు బుక్ చేసుకునే టికెట్ వివరాలు, చార్జీలను అందుబాటులో ఉంచుతారు. అందుకనుగుణంగా చార్జీలు చెల్లించి క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు. ఈ డిస్ప్లే బోర్డులో రైలు బయల్దేరే స్టేషన్, చేరుకొనే స్టేషన్, ప్రయాణపు తరగతి, పెద్దలు, పిల్లల సంఖ్య, చార్జీలు వంటి వివరాలను ప్రదర్శిస్తారు. సికింద్రాబాద్ డివిజన్లోని సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, హైటెక్ సిటీ, బేగంపేట్, కాజీపేట, జేమ్స్‌స్ట్రీట్, ఫతేనగర్ బ్రిడ్జ్, వరంగల్, మంచిర్యాల, మహబూబాబాద్, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, వికారాబాద్ స్టేషన్లలోని 31 కౌంటర్ల ద్వారా నగదు రహిత లావాదేవీల సదుపాయాన్ని ప్రయాణికులు పొందవచ్చు. -
నుదుటిపై క్యూఆర్ కోడ్ టాటూ.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!
ఫ్యాషన్ పేరుతో టాటూలు వేయించుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇందులో కూడా పాత పద్ధతులకు గుడ్ బై చెబుతూ.. కొత్త టాటూలకు వేయించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ వ్యక్తి క్యూఆర్ కోడ్‌ను టాటూ వేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నిజానికి నుదుటిన టాటూ వేయించుకున్న వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ క్యూఆర్ కోడ్‌ను టాటూగా వేయించుకున్నారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ అయింది. ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లలో కొందరు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి అని బంధువులను, స్నేహితులను అడగటం కంటే ఇదే మంచి ఆలోచన అంటున్నారు, మరి కొందరు అతని ఇన్స్టాగ్రామ్ పిచ్చి పట్టిందని ఇలా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by UNILAD (@unilad) -
Pawan Kalyan: సేనాని రూటే సెపరేటు!
ఊళ్లలో కొంతమంది ఉంటారు.. లోకం ఎలా పోయినా ఫర్లేదు.. నేను, నా ఫ్యామిలీ బాగుంటే చాలు అనుకుంటారు. దేశం ఎలా తగలాడినా నాకేటి బాధ నా ఆదాయం బాగుంటే చాలకునుకేవాళ్లు ఇంకొందరు. అచ్చం అలాంటివాళ్లే రాజకీయాల్లోనూ ఉంటారు. విలువలు... గౌరవం.. మట్టిగడ్డ ఏమి ఎలా పొతే నాకేం.. నా లాభం... నా ప్రయోజనం నాకు ముఖ్యం అనుకుంటారు... అందులో చంద్రబాబు ఎలానూ ఉండనే ఉంటారు... ఇప్పుడు ఆ టీంలో చేరిన పవన్ కళ్యాణ్ సైతం అచ్చం అదే పాలసీ ఫాలో అవుతున్నారు. రాష్ట్రంలోని వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం ఇంకా బీజేపీ వంటి పార్టీలు సైతం.. ‘‘అమ్మో.. ఎన్నికలు వస్తున్నాయి... పార్టీని నడపాలి... ఇంఛార్జులను వేయాలి ... క్యాడర్‌ను సమాయత్తం చేయాలి.. ఈసారి ఎలాగైనా గట్టిగా పోరాడి పార్టీని ఒక స్థాయికి తీసుకు రావాలి... అధికారం చేపట్టాలి’’ అంటూ వాళ్ళవాళ్ళ స్థాయిని బట్టి వ్యూహాలు.. సమీకరణాలు వేస్తున్నారు... కానీ జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం ఇవేం పట్టించుకోకుండా హాయిగా డబ్బులు కలెక్షన్ మీద దృష్టి పెట్టారు. నా పార్టీ కోసం ఎవరూ పైసా ఇవ్వొద్దు అని, తన సొంత సొమ్ము ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నాను అని, రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నాను అని చెబుతూ వచ్చిన జనసేనాని ఇప్పుడు ఏకంగా అధికారికంగా విరాళాలు సేకరించే పనిలో పడ్డారు. దీనికోసం ఏకంగా క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేసి ట్విట్టర్లో పోస్ట్ చేసి నేరుగా విరాళాలు దండుకుంటున్నారు. రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకోవడం కొత్త కాదు, తప్పు కాదు కానీ ఏకంగా ఇలా చిల్లరగా క్యూ ఆర్ కోడ్ పెట్టి దండుకోవడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నడపడం లేదు. క్యాడర్ కోసం ఏమీ చేయడం లేదు.. పవన్ సభలకు వాహనాలు.. ఇతర ఏర్పాట్ల ఖర్చు సైతం స్థానిక నాయకులే చూసుకుంటున్నారు తప్ప పార్టీ నుంచి ఏమీ మద్దతు లేదు. దీనికితోడు చంద్రబాబు కోసం దశాబ్దకాలంగా పని చేస్తున్నందుకు అయన నుంచి కూడా భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నట్లు పవన్ మీద ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నవే!. మరి అలాంటప్పుడు.. ఇంకా ఈ చిల్లర కలెక్షన్ ఎందుకు అన్న అనుమానాలు వస్తున్నాయి. అటు బాబు నుంచి భారీగా ప్యాకేజి అందుకుంటూనే ఇటు చిల్లర కలెక్షన్ సైతం వదలడం లేదని అంటున్నారు. అంటే అయన కూడా తన గురువు చంద్రబాబు మాదిరి తనకు వాచీ , ఉంగరం లేదని, ఏదోలా బతుకుతున్నాను అని చెప్పడానికే ఈ విరాళాల సేకరణ అని అంటున్నారు. వాస్తవానికి జనసైనికులే తల్లిదండ్రులమీద ఆధారపడి బతుకుతుంటారు. వారి జేబు ఖర్చులకే పేరెంట్స్ నుంచి వంద యాభై అడిగి తీసుకుంటారని, ఇప్పుడు వారి దగ్గరున్న ఆ చిల్లర సైతం లాగేసేందుకు పవన్ కల్యాణ్ భలే ఎత్తులు వేశారని సెటైర్లు వినిపిస్తున్నాయి. :::సిమ్మాదిరప్పన్న -
యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా.. జర భద్రం!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో యూపీఐ యాప్స్ వినియోగం బాగా పెరిగింది. దీంతో చాలా మంది జేబులో డబ్బు పెట్టుకోవాలన్న సంగతే మరచిపోయారు. ఎక్కడికెళ్లినా స్మార్ట్‌ఫోన్ ఉంటే సరిపోతుంది. కిరాణా కొట్టులో వస్తువులు కొనే దగ్గర నుంచి షాపింగ్ మాల్స్‌లో షాపింగ్ చేసే వరకు అన్నీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేస్తున్నారు. దీన్నే అదునుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు నకిలీ క్యూఆర్ కోడ్ల ద్వారా యూజర్ల వ్యక్తిగత వివరాలను దొంగలిస్తున్నారు. ఇది ఆ తరువాత రోజుల్లో ప్రమాదాలను కలిగించే అవకాశం ఉంది. యూపీఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే అది యూజర్లను ఒక వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. అక్కడ చెల్లించాల్సిన పేమెంట్ ఎంటర్ చేసి చెల్లిస్తారు. కానీ సైబర్ నేరగాళ్ళకు సంబంధించిన క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసిన తరువాత అది కూడా వేరొక వెబ్‌సైట్‌కి కనెక్ట్ చేస్తుంది. ఈ వెబ్సైట్ సాధారణంగా నిజమైన వెబ్సైట్ మాదిరిగానే కనిపిస్తుంది. అందులో యూజర్ వ్యక్తిగత సమాచారం ఎంటర్ చేయమని చెబుతుంది. దీనిని నమ్మి వినియోగదారుడు సమాచారం ఎంటర్ చేస్తే.. వివరాలన్నీ కూడా స్కామర్‌కు వెళ్ళిపోతుంది. యూజర్ వ్యక్తిగత వివరాలు తెలుసుకున్న స్కామర్ అకౌంట్ నుంచి డబ్బు కాజేయడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నేరుగా యూపీఐ పిన్ ఎంటర్ చేయమని చెబుతారు.. ఇదేగానీ జరిగితే యూజర్ పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: ఆధార్ కార్డు ఆధారం కాదు - లిస్ట్ నుంచి తొలగించిన ఈపీఎఫ్ఓ ఇలాంటి స్కామ్ నుంచి తప్పించుకునే మార్గాలు! బహిరంగ ప్రదేశాల్లో ఉండే క్యూఆర్ కోడ్లను ఎట్టి పరిస్థితుల్లో స్కాన్ చేయకూడదు. క్యూఆర్ కోడ్లు మీకు తెలియని వ్యక్తుల నుంచి సందేశం లేదా ఇమెయిల్ రూపంలో వస్తే వాటిని స్కాన్ చేయకూడదు. సోషల్ మీడియాలో కనిపించే క్యూఆర్ కోడ్ల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. లింక్‌ను కలిగి ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసేముందు, యూఆర్ఎల్ చెక్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వెబ్సైట్లోకి తీసుకెళ్తే.. అలాంటి వాటిని విస్మరించడం మంచిది. ఇలాంటి మోసాలను నివారించడానికి బిల్డ్ ఇన్ సెక్యూరిటీ ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. మీ డిజిటల్ అకౌంట్స్ పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. -
రామ మందిర విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్
లక్నో: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం పేరిట దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. మందిర నిర్మాణానికి భక్తుల నుంచి విరాళాలు వసూలు చేస్తున్నామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో నకిలీ క్యూఆర్ కోడ్లు వెలుగులోకి వచ్చాయి. వీటిని గుర్తించిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. ఈ కుంభకోణానికి గురికావద్దని ప్రజలను కోరింది. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర అయోధ్య పేరిట ఓ సోషల్ మీడియా పేజ్‌ను దుండగులు క్రియేట్ చేశారు. ఇందులో పోస్టు చేసిన క్యూఆర్ కోడ్‌తో రామ మందిర నిర్మాణం పేరుతో నిధులను అందించమని వినియోగదారులను కోరుతున్నట్లు గుర్తించామని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తెలిపారు. ప్రజలు ఈ మోసానికి గురికావద్దని కోరారు. "మీకు చేతనైనంత విరాళం ఇవ్వండి. డైరీలో మీ పేరు, నంబర్ నమోదు చేయబడుతుంది. ఆలయం పూర్తయిన తర్వాత, మీ అందరినీ అయోధ్యకు ఆహ్వానిస్తారు. నేను ఉన్నాను. అయోధ్యలోనే ఉన్నాను." అని రామాలయం పేరుతో విరాళాలు కోరిన వ్యక్తి కోరాడు. దీనిపై స్పందించిన వీహెచ్‌పీ.. ఇలాంటి మోసాల్లో బాధితులు కావద్దని ప్రజలకు తెలిపారు. ఇదీ చదవండి: Ayodhya Airport: అయోధ్య విమానాశ్రయం విశేషాలివే -
చిల్లర లేకపొతేనేం.. క్యూఆర్ ఉందిగా!
ఆధునిక సాంకేతికత అంతటా యమ వేగంగా అల్లుకుపోతూ ఉంది. ప్రస్తుతం ఆన్లైన్ చెల్లింపుల యుగం నడుస్తోంది. అందులో భాగంగా ఫోన్ పే, గుగూల్ పే, పేటీఎం తదితర పద్దతుల్లో ప్రజలు సొమ్ము చెల్లింపు, ఇతర లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు క్యూఆర్ కోడ్‌ను కూడా అనుసరిస్తున్నారు. ఈ పద్ధతిని ఓ ఆలయ నిర్వాహకులు కూడా అందిపుచ్చుకున్నారు. భక్తులు నగదు అందుబాటులో లేదని సరిపుచ్చుకొని వెళ్లిపోకుండా క్యూ ఆర్ స్కానింగ్ పద్ధతి కూడా అందుబాటులో ఉందని తెలుపుతూ హుండీపై స్టిక్కర్‌ను ఏర్పాటు చేశారు. హుండీలో కానుకగా వేసేందుకు నగదు అందుబాటులో లేని భక్తుల కోసం ఈ క్యూర్ కోడ్‌ను ‘కానుక’గా ఏర్పాటుచేశారు. –కడప కల్చరల్ -
ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్
హైదారబాద్: గణేష్ నిమజ్జన సామూహిక ఊరేగింపుల పర్యవేక్షణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇలా దాదాపు 12 వేల విగ్రహాలను ట్యాగ్ చేశారు. పోలీసులు గణేష్ విగ్రహాల వివరాలతో పోలీసులు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించి అందిస్తున్నారు. ఇలా ఈ విగ్రహాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు ఐసీసీసీలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించారు. ఈ క్యూఆర్ కోడ్స్, జియో ట్యాగింగ్ డేటాను పోలీసు అధికారిక యాప్ టీఎస్ కాప్‌లోకి లింకు ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు ఏర్పాటు అవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను తమ ట్యాబ్స్, స్పార్ట్‌ఫోన్స్‌లో చూసుకునే అవకాశం ఏర్పడింది. ఊరేగింపు మార్గాలను పరిశీలించిన సీపీ సామూహిక నిమజ్జనం గురువారం జరగనుండటంతో నగర కొత్వాల్ సీవీ ఆనంద్ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. మంగళవారం ఆయన అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, జి.సు«దీర్‌బాబు, సంయుక్త సీపీ ఎం.శ్రీనివాసులు తదితరులతో కలిసి చారి్మనార్, ఎంజే మార్కెట్ సహా వివిధ ప్రాంతాల్లోని ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు మొత్తం 19 కిమీ మేర ప్రధాన ఊరేగింపు జరగనుంది. ఈ మార్గంలో అనేక ఇతర ఊరేగింపులు వచ్చి కలుస్తాయి. బందోబస్తు, భద్రతా విధుల్లో మొత్తం 25,694 మంది సిబ్బంది, అధికారులు పాల్గొంటారు. వీరికి అదనంగా 125 ప్లటూన్ల సాయుధ బలగాలు, మూడు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వినియోగిస్తున్నారు. ఈ బలగాలు హుస్సేన్‌సాగర్ చుట్టూతో పాటు 18 కీలక జంక్షన్లలో మోహరించి ఉంటాయి. ప్రతి ఊరేగింపు మార్గాన్ని ఆద్యంతం కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవసరమైన సంఖ్యలో క్యూఆరీ్ట, యాంటీ చైన్ స్నాచింగ్, షీ–టీమ్స్ బృందాలతో పాటు డాగ్ స్వా్కడ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ఐసీసీసీలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఈ ఊరేగింపును పర్యవేక్షిస్తారు. నగర ప్రజలు సైతం తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. రాచకొండ పరిధిలో.. వినాయక నిమజ్జనానికి రాచకొండ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కమిషనరేట్ పరిధిలోని 56 చెరువుల వద్ద 3,600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై మంగళవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. అన్ని చెరువులను సందర్శించి ఇప్పటికే క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు. 6 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారని తెలిపారు. మరో 1000 మంది అదనపు సిబ్బందిని కూడా జిల్లాల నుంచి రప్పించామన్నారు. రూట్ టాప్, షీ టీమ్స్, మఫ్టీ పోలీస్‌లతో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. అదనంగా ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు ఈ నెల 28న జరగనున్న వినాయక నిమజ్జన వేడుకల కోసం ఆరీ్టసీ, ఎంఎంటీఎస్, మెట్రో సంస్థలు విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 535 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వివిధ మార్గాల్లో 8 ఎంఎంటీఎస్ సర్వీసులను అదనంగా నడపనున్నారు. భక్తుల రద్దీకనుగుణంగా మెట్రో రైళ్లను నడిపేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ చర్యలు చేపట్టింది. బస్సుల వివరాల కోసం ప్రయాణికులు 99592 26154, 99592 26160లను సంప్రదించవచ్చు. సమన్వయంతో.. సమష్టిగా – నిమజ్జనానికి ఏర్పాట్లు సామూహిక గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయనున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సమాచారం, పౌరసంబంధాలు, పోలీసు, రవాణా, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, మెడికల్అండ్ హెల్త్, ఫైర్‌సరీ్వసెస్, టీఎస్ ఆరీ్టసీ,టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, టూరిజం విభాగాలతో పాటు 108 ఈఎంఆర్ఐ విభాగాల ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేసేలా ప్రణాళిక రూపొందించారు. అన్ని విభాగాల అధికారుల ఫోన్‌నెంబర్లు అందరి వద్ద అందుబాటులో ఉంచారు. నిమజ్జనాల సందర్భంగా వెలువడే వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు దాదాపు 3 వేల మంది పారిశుద్ధ్య కారి్మకులు విధులు నిర్వర్తిస్తారు. విభాగాల వారీగా అన్ని ప్రభుత్వ శాఖలు పని చేయనున్నాయి. మహా నిమజ్జనానికి ట్రయల్ రన్ ఖైరతాబాద్: శ్రీ దశమహా విద్యాగణపతిగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి నిమజ్జనానికి పోలీసులు మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఖైరతాబాద్ మండపం నుంచి ఎనీ్టఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం– 4 వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. నేటి ఉదయం 11 గంటల వరకే మహాగణపతి దర్శనాలు ఉంటాయని, తెల్లవారుజామున 5 గంటల నుంచి షెడ్డు తొలగించే పనులు ప్రారంభించి 7 గంటల కల్లా పూర్తి చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యుడు సందీర్ రాజ్ తెలిపారు. మినట్ టు మినట్.. మంగళవారం రాత్రి నుంచే ట్రాయిలర్ వాహనానికి వెల్డింగ్ పనులు మొదలు పెట్టారు. నేటి రాత్రి నుంచే నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభిస్తారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు మహాగణపతి ఇరువైపులా ఉన్న విగ్రహాలను మరో వాహనంపైకి తెస్తారు. తెల్లవారుజామున 4 గంటల కల్లా రవి క్రేన్ సాయంతో మహాగణపతిని ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ వాహనంపైకి తెస్తారు. ఉదయం 7 గంటలకు మహాగణపతికి వెల్డింగ్ పనులు పూర్తి చేసి 9.30 గంటలకు మహా శోభాయాత్ర ప్రారంభిస్తారు. ఎనీ్టఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం–4 వద్ద మధ్యాహ్నం 12 గంటల వరకు నిమజ్జనం పూర్తయ్యేలా పోలీసులు మినట్ టు మినట్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ విధంగానే ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. -
క్యూఆర్ కోడ్‌తో స్టార్ హెల్త్ పాలసీ కొనుగోలు
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా పాలసీల కొనుగోలు, రెన్యువల్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంపై స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరిపే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచి్చంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తోడ్పాటుతో దీన్ని రూపొందించినట్లు సంస్థ ఎండీ ఆనంద్ రాయ్ తెలిపారు. దీనితో లావాదేవీకి పట్టే సమయం గణనీయంగా తగ్గగలదని వివరించారు. ప్రీమియం చెల్లింపును గుర్తు చేసేందుకు పంపించే సందేశాల్లో యూపీఐ క్యూఆర్ కోడ్ ఉంటుందని, అందులో ఎంత ప్రీమియం కట్టాలనే వివరాలు నిక్షిప్తమై ఉంటాయని సంస్థ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ చిట్టి బాబు తెలిపారు. దాన్ని స్కాన్ చేయడం ద్వారా లేదా లింక్‌ను క్లిక్ చేసి యూపీఐ యాప్ ద్వారా సెకన్లలో చెల్లింపును పూర్తి చేయొచ్చన్నారు. స్టార్ హెల్త్ కూడా సౌకర్యవంతమైన యూపీఐ ఆధారిత ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ను ప్రవేశపెట్టడం సంతోషకరమని ఎన్పీసీఐ చీఫ్ (ప్రోడక్ట్స్) కునాల్ కలావతియా చెప్పారు. -
క్యూఆర్ కోడ్‌తో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ - డిజిటల్ రూపీ చెల్లింపులు
న్యూఢిల్లీ: యూపీఐ క్యూఆర్ కోడ్‌కు డిజిటల్ రూపీని (సీబీడీసీ) అనుసంధానం చేసినట్లు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వెల్లడించింది. దీంతో ఇక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి డిజిటల్ రూపీ ద్వారా చెల్లింపులు జరపవచ్చని సంస్థ తెలిపింది. వ్యాపారవర్గాలు నిరాటంకంగా డిజిటల్ రూపీ రూపంలో చెల్లింపులను పొందేందుకు ఇది సహాయపడగలదని బ్యాంకు ఈడీ మదివణన్ బాలకృష్ణన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సీబీడీసీ వినియోగాన్ని మరింతగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు యూపీఐ ఇంటరాపరబిలిటీ ఉపయోగపడగలదని వివరించారు. భౌతిక కరెన్సీకి సమాన హోదా ఉండే డిజిటల్ రూపీని రిజర్వ్ బ్యాంక్ గతేడాది అధికారికంగా ప్రవేశపెట్టింది. -
‘సీక్రెట్ కోడ్’
ఫోన్ పే వచ్చాక వింతలూ విశేషాలూ బాగానే వైరల్ అవుతున్నాయి. చిన్నా చితక వ్యాపారులు స్కాన్ కోడ్‌ను రకరకాలుగా వేళ్లాడగడుతుంటారు. కాని ఈమె ఏకంగా తూకం గిన్నెకే అంటించింది. మహరాష్ట్రలో కూరగాయలామె చేసిన పనికి కోటి ఇరవై లక్షల వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ‘భేషైన ఐడియా’ అంటున్నారు. మామూలుగా రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునేవారు క్యూఆర్ కోడ్ స్టాండ్‌ను పెట్టుకుంటారు. అయితే ఆ ఖర్చు కూడా ఎందుకనుకుందో ఈ కూరగాయలామె కోడ్ కాగితాన్ని తూకం గిన్నె కింద అంటించేసింది. ఈ వీడియోలో వేరుశనక్కాయలను తూకం వేసిన ఆమె కొన్న వ్యక్తి సంచిలో వాటిని పోసి, అతను ఫోన్ పే ఉందా అనగానే టక్కున గిన్నె ఉల్టా చేసి చూపింది. ఆ స్టయిల్‌కు, ఆలోచనకు అందరికీ నవ్వు, ముచ్చటా కలుగుతున్నాయి. విపరీతంగా ఈ వీడియోను చూస్తున్నారు. -
చూడటానికి చిన్న "క్యూఆర్ కోడ్"..వ్యాపారంలో ప్రకంపమే సృష్టిస్తోంది!
రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టు, చాట్ బండి, పండ్ల షాపులను గమనించారా? అక్కడ మీకో యూపీఐ క్యూఆర్ కోడ్ దర్శనమిస్తుంది. చూడ్డానికి చిన్నదే అయినా వాటి ఆధారంగా జరుగుతున్న వ్యాపారం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! దేశ వాణిజ్యంలో యూపీఐ క్యూఆర్ కోడ్స్ అత్యంత కీలకంగా మారాయంటే అతిశయోక్తి కాదు. కుగ్రామాల్లోని చిరు వ్యాపారుల వద్ద కూడా దర్శనమిస్తున్న ఈ కోడ్లను గమనిస్తే, డిజిటల్ పేమెంట్స్ రంగంలో భారతావని ముఖచిత్రం ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తుల నుంచి వర్తకులకు చేరిన డిజిటల్ పేమెంట్స్‌లో సంఖ్యపరంగా రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల వాటా ఏకంగా 84.27 శాతం ఉంది. చిన్న చిన్న మొత్తాలే డిజిటల్ రూపంలో చేతులు మారుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. ఇన్స్టంట్ పేమెంట్ సిస్టమ్ భారత వాణిజ్యాన్ని పునర్నిర్మించింది. అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి కోట్లాది మందిని తీసుకొచ్చింది. రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతం చేసింది. కోట్లాదిమంది భారతీయులకు క్రెడిట్, సేవింగ్స్ వంటి బ్యాంకింగ్ సేవలను విస్తరించింది. ప్రభుత్వ కార్యక్రమాలు లబ్ధిదారులకు నేరుగా చేరాయి. పన్నుల వసూళ్లలో వృద్ధి నమోదవుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారతదేశం ఇంతకు ముందు చూడని స్థాయిలో ఈ సాంకేతిక ఆవిష్కరణ ప్రభావం చూపించింది. సౌకర్యాల కలబోత.. చాక్లెట్ కొన్నా షాపు యజమానికి అక్కడి క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ లేదా బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబరు సాయంతో డబ్బులు చెల్లించొచ్చు. అదీ 10 సెకన్లలోపే. కస్టమర్‌కి గాని, వ్యాపారస్తుడికి గాని చేతిలో చిల్లర లేదన్న బెంగ లేదు. క్యాష్ కోసం ఏటీఎమ్‌కి, బ్యాంకుకు పరుగెత్తే పని లేదు. షాపింగ్ కోసం చేతినిండా నగదు ఉంచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కావాల్సిందల్లా చేతిలో ఉన్న ఫోన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్ యాప్ ఉంటే చాలు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి క్షణాల్లోనే చెల్లింపులు పూర్తి చేయవచ్చు. వర్తకులు ప్రతిసారీ తమ మొబైల్‌ను చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వాయిస్ బాక్సులు వచ్చాయి. వినియోగదారుడి బ్యాంకు ఖాతా, లేదా డిజిటల్ వాలెట్ నుంచి లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు డబ్బులు నేరుగా బదిలీ అవుతాయి. యూపీఐ యాప్‌లో ప్రతి బ్యాంకు ఖాతాకు ఒక వర్చువల్ పేమెంట్ అడ్రస్ (ఐడీ) క్రియేట్ అవుతుంది. ఈ యూపీఐ ఐడీ లేదా బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబరుతో కూడా డబ్బులు చెల్లించవచ్చు. బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు జరిగే చెల్లింపులకు ఎటువంటి చార్జీ ఉండదు. అంటే బ్యాంకు ఖాతా నుంచి క్యూఆర్ కోడ్ ద్వారా జరిగే లావాదేవీలు కూడా ఉచితం అన్నమాట. మొబైల్ రీచార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్లులు, బీమా, డీటీహెచ్ చెల్లింపులు, సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు. లావాదేవీల పరిమితి రోజుకు రూ.1 లక్ష వరకు ఉంది. దేశవ్యాప్తంగా అధికారికంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీల్లో విలువ పరంగా యూపీఐ వాటా 43 శాతం ఉందంటే అతిశయోక్తి కాదు. పీవోఎస్ టెర్మినల్స్‌ను మించి.. క్యూఆర్ కోడ్స్‌కు ఆదరణ అంతా ఇంతా కాదు. విక్రేతలు ఎవరైనా డిజిటల్ రూపంలో నగదును స్వీకరించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణమేమిటంటే తెల్లకాగితం మీద కూడా క్యూఆర్ కోడ్‌ను ప్రింట్ తీసుకుని వినియోగించే వెసులుబాటు ఉండడం. పైగా పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్ ఖరీదు సుమారు రూ.12 వేల వరకు ఉంది. ఎంపీవోఎస్ ఖరీదు అయిదు వేల వరకు పలుకుతోంది. చౌకైన వ్యవహారం కాబట్టే క్యూఆర్ కోడ్స్ పాపులర్ అయ్యాయి. వినియోగదారులు సైతం డిజిటల్ పేమెంట్లకు మొగ్గు చూపుతుండటమూ వీటి వినియోగం పెరిగేందుకు దోహదం చేసింది. నగదుతో పోలిస్తే చాలా సందర్భాల్లో అతి తక్కువ సమయంలో డిజిటల్ చెల్లింపులు పూర్తి చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి నాటికి వర్తకుల కోసం 26 కోట్ల పైచిలుకు క్యూఆర్ కోడ్స్ జారీ అయ్యాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా నగదును స్వీకరించే పీవోఎస్ టెర్మినల్స్ 78 లక్షలు ఉన్నాయి. పీవోఎస్ టెర్మినల్స్‌ను మించి క్యూఆర్ కోడ్స్ జారీ అయ్యాయంటే యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపుల వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్స్ సంస్థలు క్యూఆర్ కోడ్స్‌ను జారీ చేస్తున్నాయి. ఆధార్ ఆధారంగా.. దేశంలో 99 శాతం మంది పెద్దలు బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్యను కలిగి ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 130 కోట్లకుపైగా ఆధార్ ఐడీలు జారీ అయ్యాయి. ఈ ఐడీలు కొత్తగా బ్యాంక్ ఖాతాలు తెరిచే పనిని సులభతరం చేశాయి. అలాగే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని పిలిచే తక్షణ చెల్లింపు వ్యవస్థకు పునాదిగా మారాయి. 2016 నవంబర్‌లో భారత ప్రభుత్వం రూ.500, 1,000 నోట్లను రద్దు చేసింది. నోట్ల కొరత కూడా డిజిటల్ లావాదేవీల వైపు మళ్లడానికి కారణం అయింది. గత ఏడాది భారత్‌లో ఇన్స్టంట్ డిజిటల్ పేమెంట్స్ లావాదేవీల విలువ యూఎస్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌ల కంటే చాలా ఎక్కువ. ఈ నాలుగు దేశాల మొత్తం లావాదేవీలే కాదు, ఈ మొత్తం విలువను నాలుగుతో గుణించినదాని కంటే భారత లావాదేవీలు అధికమని ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం సందర్భంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో 30 కోట్ల పైచిలుకు వ్యక్తులు, 5 కోట్లకు పైగా వర్తకులు యూపీఐ వేదికపైకి వచ్చి చేరారు. పట్టణ ప్రాంతాలను దాటి.. యూపీఐ వేదికగా 2021 ఏప్రిల్‌లో రూ.4,93,663 కోట్ల విలువైన 264 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆ తర్వాతి సంవత్సరం ఏప్రిల్‌లో రూ.9,83,302 కోట్ల విలువైన 558 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2023 వచ్చేసరికి యూపీఐ లావాదేవీల విలువ ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.14,15,504.71 కోట్లకు ఎగసింది. లావాదేవీల సంఖ్య 886.32 కోట్లకు చేరింది. అంటే రెండేళ్లలో లావాదేవీల విలువ మూడింతలకు చేరువ అవుతోంది. పరిమాణం మూడు రెట్లు దాటింది. 2021లో గరిష్ఠంగా డిసెంబర్లో రూ.8,26,848 కోట్లు, 2022 అత్యధికంగా డిసెంబర్లో రూ.12,81,970.8 కోట్లు నమోదయ్యాయి. డిజిటల్ పేమెంట్లు భారత్‌లో వేగంగా ఆదరణ చెందుతున్నాయని అనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. కోవిడ్–19 మహమ్మారి సమయంలో యూపీఐ ప్లాట్‌ఫామ్ పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి వచ్చింది. పట్టణ ప్రాంతాలను దాటి గ్రామీణ భారతదేశానికి కూడా యూపీఐ విస్తరించడం నిపుణులనూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత్‌లో 2016 నుంచి.. సౌలభ్యం ఉంది కాబట్టే చెల్లింపుల వ్యవస్థలో రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు విప్లవం సృష్టిస్తోంది. భారత్‌లో అయితే వీటి లావాదేవీల సంఖ్య, విలువ అనూహ్య రీతిలో పెరుగుతూ వస్తోంది. విభిన్న బ్యాంకు ఖాతాలను పేమెంట్ యాప్‌కు అనుసంధానం చేయడం ద్వారా నగదుకు బదులు డిజిటల్ రూపంలో చెల్లింపులను సురక్షితంగా, క్షణాల్లో పూర్తి చేయవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) 2016 ఏప్రిల్ 11న యూపీఐ సేవలను పైలట్ ప్రాజెక్టుగా 21 బ్యాంకులతో కలసి భారత్‌లో ప్రారంభించింది. అదే ఏడాది ఆగస్ట్ 25 నుంచి గూగుల్ ప్లే స్టోర్లలో బ్యాంకులు తమ పేమెంట్ యాప్స్‌ను జోడించడం మొదలుపెట్టాయి. భారత్‌లో ప్రస్తుతం 414 బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నాయి. పేమెంట్ యాప్స్‌లో ఫోన్‌పే విజయపరంపర కొనసాగిస్తోంది. ఈ యాప్ 2023 ఏప్రిల్‌లో లావాదేవీల సంఖ్య, విలువ పరంగా తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. గూగుల్‌పే, పేటీఎమ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎన్పీసీఐ ప్రమోట్ చేస్తున్న భీమ్ యాప్ క్రమంగా ఆదరణ పెంచుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో టాప్–10 పేమెంట్ యాప్స్‌లో ఏడవ స్థానాన్ని భీమ్ దక్కించుకుంది. 2023 ఏప్రిల్‌లో విలువ పరంగా తొలి 10 స్థానాల్లో నిలిచిన యాప్స్ పేమెంట్ యాప్స్‌లో ఫోన్‌పే విజయపరంపర కొనసాగిస్తోంది. ఈ యాప్ 2023 ఏప్రిల్‌లో లావాదేవీల సంఖ్య, విలువ పరంగా తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. గూగుల్‌పే, పేటీఎమ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎన్పీసీఐ ప్రమోట్ చేస్తున్న భీమ్ యాప్ క్రమంగా ఆదరణ పెంచుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో టాప్–10 పేమెంట్ యాప్స్‌లో ఏడవ స్థానాన్ని భీమ్ దక్కించుకుంది. (2023 ఏప్రిల్‌లో విలువ పరంగా తొలి 10 స్థానాల్లో నిలిచిన యాప్స్) కోవిడ్ కాలంలో రెండింతలు.. 2016 డిసెంబర్లో రూ.708 కోట్ల విలువైన యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు జరిగాయి. 2017లో ఒక నెలలో గరిష్ఠంగా రూ.13,174 కోట్లు నమోదయ్యాయి. 2018 డిసెంబరులో లక్ష కోట్ల మార్కును దాటింది. ఏడాదిలోనే రెట్టింపు అయ్యాయి. 2020 జూలై నుంచి యూపీఐ లావాదేవీల వేగం పుంజుకుంది. ఆ నెలలో రూ.2,90,538 కోట్ల విలువైన 149.7 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కాలంలో వైరస్ భయానికి నోట్లను ముట్టుకోవడానికి ప్రజలు ససేమిరా అన్నారు. దీంతో డిజిటల్ చెల్లింపులకు మళ్లారు. ఫలితంగా 2020, 2021లో డిజిటల్ లావాదేవీల విలువ రెట్టింపైంది. 2022 మే నెలలో రూ.10 లక్షల కోట్ల మైలురాయి దాటి యూపీఐ సరికొత్త రికార్డు సృష్టించింది. అంటే 40 నెలల్లోనే పదిరెట్లు అయ్యాయంటే పేమెంట్ యాప్స్ ఏ స్థాయిలో ప్రజల్లోకి చొచ్చుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. యూపీఐదే 43 శాతం వాటా.. ఏటీఎమ్‌ల నుంచి నగదు స్వీకరణ, జమ, చెక్కులు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు, ఇతర మార్గాల్లో దేశవ్యాప్తంగా నమోదైన ఆర్థిక లావాదేవీల పరిమాణం 2022–23లో 10,620.6 కోట్లు. వీటి విలువ రూ.3,22,36,700 కోట్లు. ఇందులో యూపీఐ సింహభాగం కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో యూపీఐ వేదికగా 8,375.1 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.1,39,20,678 కోట్లు. అధికారికంగా జరిగిన మొత్తం ఆర్థిక లావాదేవీల్లో యూపీఐ ఏకంగా 43.18 శాతం వాటా కైవసం చేసుకుందన్న మాట. చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) చెక్ క్లియరింగ్ విధానం ద్వారా రూ.71,67,040 కోట్ల లావాదేవీలు జరిగాయి. మొబైల్ ఫోన్స్ ద్వారా బ్యాంకుల మధ్య ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సేవలైన ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) వేదికగా రూ.55,86,147 కోట్లు నమోదయ్యాయి. ఏటీఎమ్‌లలో నగదు జమ, స్వీకరణ లావాదేవీల విలువ రూ.16,62,419 కోట్లు ఉంది. ప్రజల వద్ద చలామణీలో ఉన్న నగదు రూ.36 లక్షల కోట్లు. ఇవీ డిజిటల్ లావాదేవీలు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ప్రధానంగా డిజిటల్ చెల్లింపుల విభాగంలో పురోగతి ఇందుకు తోడ్పడింది. 2017–18లో దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య 2,000 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 10,000 కోట్లు దాటింది. దీంతో డిజిటల్ లావాదేవీల విలువ 50 శాతానికిపైగా ఎగసింది. యూపీఐ ఇందుకు దోహదం చేసింది. 2022లో రూ.149.5 లక్షల కోట్ల విలువైన 8,792 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఇందులో రూ.126 లక్షల కోట్ల విలువైన 7,405 కోట్ల లావాదేవీలు యూపీఐ కైవసం చేసుకుంది. డిజిటల్ పేమెంట్ల విలువ 2026 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఫోన్‌పే, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇటీవలి నివేదిక వెల్లడించింది. ఇదే జరిగితే నగదు లావాదేవీల వాటా 60 నుంచి 35 శాతానికి వచ్చి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల విషయంలో భవిష్యత్ అంతా 3–6 తరగతి శ్రేణి నగరాలు, పట్టణాలదే. గడిచిన రెండేళ్లుగా కొత్త మొబైల్ పేమెంట్ కస్టమర్లలో ఈ నగరాలు, పట్టణాలకు చెందినవారు 60–70 శాతం ఉన్నారట. 2023 మార్చినాటికి భారత్‌లో 96.12 కోట్ల డెబిట్ కార్డులు జారీ అయ్యాయి. 5.5 కోట్ల మంది వద్ద 8.53 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. డిజిటల్ వేదికల రాకతో బ్యాంకులపై భారం గణనీయంగా తగ్గింది. బ్యాంకుల్లో ఇప్పుడు క్యూలు కానరావడం లేదు. ఎక్కడ ఎక్కువంటే.. గ్రాసరీస్, సూపర్మార్కెట్లలో అత్యధికంగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఆహార విక్రయ కేంద్రాలు, రెస్టారెంట్లు, టెలికం సేవలు, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్, గేమ్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, సర్వీస్ స్టేషన్స్, ఔషధ దుకాణాలు, బేకరీస్ నిలిచాయి. విలువ పరంగా 2023 ఏప్రిల్‌లో నమోదైన లావాదేవీల్లో వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీర్ టు పీర్) చేరిన మొత్తం 77.18 శాతం. మిగిలినది వ్యక్తుల నుంచి వర్తకులకు (పీర్ టు మర్చంట్) చేరింది. పీర్ టు పీర్ విభాగంలో రూ.2 వేలు ఆపైన విలువ చేసే లావాదేవీలు 87.05 శాతం, రూ.500–2000 వరకు 9.73, రూ.500 లోపు 3.21 శాతం కైవసం చేసుకున్నాయి. పీర్ టు మర్చంట్ విభాగంలో రూ.2,000 పైన 67.3 శాతం, రూ.500–2000 వరకు 17.72, రూ.500 లోపు 15.24 శాతం నమోదయ్యాయి. లావాదేవీల సంఖ్య పరంగా 2023 ఏప్రిల్‌లో పీర్ టు మర్చంట్ అధికంగా 56.63 శాతం దక్కించుకుంది. మిగిలినది పీర్ టు పీర్ చేజిక్కించుకుంది. పీర్ టు మర్చంట్ విభాగంలో సింహభాగం అంటే 84.27 శాతం లావాదేవీలు రూ.500 లోపు విలువైనవే. రూ.500–2000 విలువ చేసేవి 11.01 శాతం, రూ.2 వేలకుపైగా విలువ కలిగిన కొనుగోళ్లు 4.71 శాతం ఉన్నాయి. వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.500 లోపు బదిలీ చేసినవి 54.22 శాతం, రూ.500–2,000 వరకు 22.25 శాతం, రూ.2 వేలకుపైగా చెల్లించినవి 23.53 శాతం ఉన్నాయి. ఇంటర్నెట్ తోడుగా.. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ), మార్కెట్ డేటా అనలిటిక్స్ సంస్థ కాంటార్ సంయుక్త నివేదిక ప్రకారం.. భారత్‌లో సగానికి పైగా జనాభా ఇంటర్నెట్ను తరచుగా వినియోగిస్తోంది. 2022లో దేశవ్యాప్తంగా 75.9 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఈ స్థాయిలో యాక్టివ్ యూజర్లు ఉండడం భారత్‌లో ఇదే ప్రథమం. వీరు కనీసం నెలకు ఒకసారైనా నెట్లో విహరిస్తున్నారు. రెండేళ్లలో ఈ సంఖ్య 90 కోట్లకు చేరనుంది. మొత్తం యాక్టివ్ యూజర్లలో 39.9 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా, మిగిలిన వారు పట్టణ ప్రాంతాల నుంచి ఉన్నారు. దేశీయంగా ఇంటర్నెట్ వినియోగ వృద్ధికి గ్రామీణ ప్రాంతం దన్నుగా నిలుస్తోందనడానికి ఇది నిదర్శనమని నివేదిక వివరించింది. ఏడాది వ్యవధిలో పట్టణ ప్రాంతాల్లో నెట్ వినియోగ వృద్ధి 6 శాతంగా ఉండగా, గ్రామీణ భారతంలో ఇది 14 శాతంగా నమోదైందని వివరించింది. 2025 నాటికి కొత్త ఇంటర్నెట్ యూజర్లలో 56 శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచే ఉండవచ్చని నివేదిక తెలిపింది. ఇక డిజిటల్ చెల్లింపులు చేసేవారి సంఖ్య 2021తో పోలిస్తే గతేడాది 13 శాతం దూసుకెళ్లి 33.8 కోట్లకు చేరింది. వీరిలో 36 శాతం మంది గ్రామీణ ప్రాంతాలవారు ఉన్నారు. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న వారిలో 99 శాతం మంది యూపీఐ యూజర్లే ఉండడం విశేషం. క్రెడిట్‌ను విస్తరించడానికి.. భారతదేశం యూపీఐ రూపంలో ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను కలిగి ఉంది. ఇప్పుడు యూపీఐ పట్టాలను క్రెడిట్ లావాదేవీలకు విస్తరించడానికి సమయం ఆసన్నమైంది. రూపే క్రెడిట్ కార్డ్‌లపై యూపీఐ లావాదేవీలను ప్రారంభించడం ద్వారా దీని మొదటి దశ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే భారత్ కేవలం 5.5 కోట్ల క్రెడిట్ కార్డ్ వినియోగదారులను కలిగి ఉంది. క్రెడిట్ కార్డ్‌లకు ఎటువంటి లింక్ లేకుండా నిజమైన క్రెడిట్ లావాదేవీలను ప్రారంభించడానికి ఈ పట్టాలను విస్తరించడం చాలా ముఖ్యం. ఇది అధికారిక క్రెడిట్ పరిధికి దూరంగా ఉన్న 60 కోట్లకుపైగా మందికి క్రెడిట్‌ను విస్తరించడానికి వివిఫై, ఇతర కంపెనీలకు వీలు కల్పిస్తుంది. – అనిల్ పినపాల, ఫౌండర్, వివిఫై ఇండియా ఫైనాన్స్. -- నూగూరి మహేందర్ -
మెడిసిన్ నకిలీదా.. కాదా? సింపుల్‌గా తెలుసుకోండిలా!
ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. ఆరోగ్యం కూడా అంతే వేగంగా క్షిణిస్తోంది. కావున మెడిసిన్స్ మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే ఈ మెడిసిన్స్ తీసుకునేటప్పుడు కొంతమందికి అవి నకిలీ ముందుకు అయుండొచ్చని సందేహం వస్తుంది. అలాంటి అనుమానాలకు చెక్ పెట్టటానికి క్యూఆర్ కోడ్ విధానం అందుబాటులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. క్యూఆర్ కోడ్.. నివేదికల ప్రకారం.. సుమారు 300 మందుపైన క్యూఆర్ కోడ్ వేయాలని 'డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా' (DCJI) ఫార్మా కంపెనీలను ఆదేశించింది. కావున నిర్దేశిత మందులపైన క్యూఆర్ లేదా బార్ కోడ్ తప్పనిసరి అయింది. వీటిని స్కాన్ చేయడం ద్వారా ఆ మెడిసిన్ గురించి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. క్యూఆర్ లేదా బార్ కోడ్ కలిగిన మందుల జాబితాలో యాంటీ బయాటిక్స్, కార్డియాక్ పిల్స్, పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్లు, యాంటీ డయాబెటిక్స్, యాంటీ డయాబెటిక్స్ మిక్స్‌టార్డ్, గ్లైకోమెట్-జిపి, యాంటీబయాటిక్స్ ఆగ్మెంటిన్, మోనోసెఫ్, గ్యాస్ట్రో మెడిసిన్ వంటివి ఉన్నాయి. ఫార్మా రిటైల్ మార్కెట్లో దాదాపు రూ. 50,000 కోట్ల విలువైన అధికంగా అమ్ముడవుతున్న 300 కంటే ఎక్కువ మందులపై క్యూఆర్ కోడ్ రానుంది. ఈ క్యూఆర్ కోడ్ అమలు చేయడంలో ఏదైనా అవకతవకలు జరిగితే భారీ జరిమానా చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని డసీజేఐ ఆదేశించింది. ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ కొత్త ఇయర్‌బడ్స్ ధరెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు! మెడిసిన్ డీటెయిల్స్.. నిజానికి ఈ క్యూఆర్ కోడ్ వల్ల మనం తీసుకున్న మెడిసిన్ వివరాలను తెలుసుకోవచ్చు. అంటే దాని జనరల్ నేమ్, బ్రాండ్ నేమ్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ పేరు, బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, తయారీదారు లైసెన్స్ నెంబర్ వంటివి ఒక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల తెలుసుకోవచ్చు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి ప్రభుత్వం నకిలీ మందులను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఈ విధానం మీద కృషి చేయగా ఈ రోజు (2023 ఆగష్టు 01) నుంచి అందుబాటులోకి వచ్చింది. దీన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 1940 డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ చట్టాన్ని సవరించింది. -
బ్యాంకుల్లో రూ.5 లక్షల బీమాపై అవగాహన అవసరం
ముంబై: డిపాజిట్ బీమా పథకం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఆగస్టు 31లోగా తమ వెబ్సైట్లు అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్లలో తన లోగో, క్యూఆర్ కోడ్‌ను ప్రముఖంగా ప్రదర్శించాలని ఆర్బీఐ అనుబంధ విభాగం– డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) అన్ని బ్యాంకులను కోరింది. బ్యాంకుల్లో రూ.5 లక్షల వరకు డిపాజిట్లకు డీఐసీజీసీ ద్వారా బీమా కవరేజ్ ఉంటుంది. ఈ బీమా పథకం వాణిజ్య బ్యాంకులుసహా లోకల్ ఏరియా బ్యాంకులు (ఎల్ఏబీ), చెల్లింపుల బ్యాంకులు (పీబీ), చిన్న ఆర్థిక బ్యాంకులు (ఎస్ఎఫ్బీ), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీ) సహకార బ్యాంకులలో డిపాజిట్లకు వర్తిస్తుంది. ఆర్బీఐ సంప్రదింపులతో తాజా సూచనలు చేస్తున్నట్లు డీఐసీజీసీ సర్కులర్ వివరించింది. ఎందుకంటే... ► చిన్న డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో, బ్యాంకింగ్ వ్యవస్థపై విశ్వాసాన్ని పటిష్టం చేయడంలో, ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో డిపాజిట్ బీమా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని వివరించింది. ► లోగో, క్యూర్ కోడ్ ప్రదర్శన వల్ల డీఐసీజీసీ డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పరిధిలోకి వచ్చే బ్యాంకులను కస్టమర్ సులభంగా గుర్తించడానికి వీలవుతుందని, అలాగే డిపాజిట్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన సమాచారం సకాలంలో వారు పొందగలుగుతారని తెలిపింది. బీమా కవరేజ్ బ్యాంకులు 2,027 డీఐసీజీసీ నమోదిత బీమా బ్యాంకుల సంఖ్య 2023 మార్చి 31 నాటికి 2,027. ఇందులో 140 వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి. 43 ఆర్ఆర్బీలు, రెండు ఎల్ఏబీలు, ఆరు పీబీలు, 12 ఎస్ఎఫ్బీలు, 1,887 సహకార బ్యాంకులు కూడా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం దేశంలోని బ్యాంకుల్లో డిపాజిట్ బీమా ప్రస్తుత పరిమితి రూ. 5 లక్షలు. ఇందుకు సంబంధించి కవరవుతున్న ఖాతాల సంఖ్య 2023 మార్చి 31 నాటికి 294.5 కోట్లు. బీమా కవరవుతున్న డిపాజిట్ల విలువ రూ.83,89,470 కోట్లు. -
ఏం తెలివి సామీ.. క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన చేస్తున్న మోడ్రన్ బిక్షగాడు
మనం ప్రతిరోజూ రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, దేవాలయాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బిచ్చగాళ్లను చూస్తుంటాం. కొందరు తమకు తోచినంత సాయం చేస్తారు. ఇంకొందరేమో చిల్లర లేదని సింపుల్‌గా చెప్పి తప్పించుకుంటుంటారు. అయితే ఈ బిచ్చగాడి నుంచి మాత్రం మీరు అస్సలు తప్పించుకోలేరు. ఇందుకంటే ఇతను టెక్నాలజీని వాడుకుంటూ చేతిలో క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన చేస్తూ చాలా స్టైల్‌గా అడుక్కుంటున్నాడు. సాధరణంగా యచకులు పాత సంచి లేదా ఏదైనా చిన్న బొచ్చులాంటి పాత్ర పట్టుకొని అడ్డుకోవడం చూశాం. కానీ ఇది డిజిటల్ యుగం కదా. కాలం మారడంతో మనమూ మారాలి అనుకున్నాడేమో ఏకంగా ఇలా క్యూఆర్ కోడ్ ఇచ్చి మరీ దానం చేయమని అడుక్కుంటున్నాడు. ముంబైలోని ఓ రద్దీ లోకల్ ట్రైన్లో కనిపించింది ఈ దృశ్యం. చక్కగా పాటలు పాడుతూ స్టైల్లో క్యూఆర్ కోడ్ ఇచ్చి భిక్షాటన చేయడంతో అక్కడున్నవారంతా నోరెళ్లబెట్టారు. ఓ వ్యక్తి ఈ తతంగమంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ డిజిటల్ భిక్షగాడి తెలివికి నెటిజన్లు షాకవుతున్నారు. మరికొందరేమో ఇన్ని తెలివితేటలు ఉన్నవాడు సొంతంగా ఉద్యోగం చేస్తూ బతకొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. #MumbaiLocal #DigitalIndia That's Mumbai local where you can see the height of using digital payment A beggar is carrying the online payment sticker with him so you have not to bother about excuses of not having change its purely a cashless facility 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/HIxlRJkbmM — 💝🌹💖jaggirmRanbir💖🌹💝 (@jaggirm) June 25, 2023 -
ఇదేం బాలేదు.. కాంగ్రెస్ పార్టీకి ఫోన్‌పే వార్నింగ్!
భోపాల్: ఈ సారి ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో బీజేపీని గద్దె దించేందకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ పాలిత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. పోస్టర్ల ప్రచారానికి తెర లేపింది. సీఎం శివరాజ్ 50 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లుపై ఆరోపణలు చేసింది. ఫోన్ పే క్యూఆర్ కోడ్‌ను ప్రింట్ చేసి దాంట్లో శివరాజ్ బొమ్మను చేర్చి ఆ పోస్టర్లును పలు చోట్ల అంటించింది. పోస్టర్ల రచ్చ అందులో "50% లావో, ఫోన్‌పే కామ్ కరో (మీ పని పూర్తి కావాలంటే 50% కమీషన్ చెల్లించాలి). అయితే ప్రస్తుతం ఆ పోస్టర్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోస్టర్ యుద్ధం సాగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే సంస్థ తమ కంపెనీ పేరు, లోగోను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పోస్టర్లను తొలగించాలని కాంగ్రెస్‌ను కోరడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఫోన్‌పే పోస్టర్లపై స్పందిస్తూ, "రాజకీయ లేదా రాజకీయేతర వాటికోసం తమ బ్రాండ్ లోగోను అనధికారికంగా ఉపయోగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి వాటికి తమ కంపెనీ లోగోను వాడవద్దు అని తన ట్వీట్లో చెప్పింది. అనుమతి లేకుండా లోగోను వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫోన్ పే కంపెనీ తెలుపుతూ.. ఆ పోస్టర్లను తొలగించాలని కాంగ్రెస్‌ను కోరింది. బీజేపీ స్పందన ఇదే భోపాల్, ఇండోర్, గ్వాలియర్, సెహోర్, రేవా, మందసౌర్, ఉజ్జయిని, భింద్, బాలాఘాట్, బుధ్ని, మరికొన్ని నగరాల్లో వెలువడిన ఈ పోస్టర్ల వీడియోలను కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసింది. పోస్టర్లపై బీజేపీ స్పందిస్తూ.. పలు నగరాల్లో పోస్టర్లు అంటించిన తర్వాత కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని మధ్యప్రదేశ్ హోంమంత్రి, బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రా మండిపడ్డారు. చదవండి: రైలు అక్కడకు రాగానే ‘అంధకారం’.. విచిత్రమో, విడ్డూరమో కాదు! -
క్షణాల్లో చెల్లింపులు చేసే క్యూఆర్ కోడ్ ఎలా పనిచేస్తుందంటే..
క్యూఆర్ కోడ్ ఫుల్ పార్మ్ క్విక్ రెస్పాన్స్ కోడ్. ఇది మెషీన్ రీడబుల్ లేబుల్ వంటిది. దీనిని కంప్యూటర్.. టెక్స్ట్ కన్నా సులభంగా అర్థం చేసుకుంటుంది. డిజిటల్ యుగం వైపు పయనిస్తున్న భారతదేశం అభివృద్ధి పథంలోనూ దూసుకుపోతోంది. నేడు ప్రపంచం మొత్తం మీద అత్యధిక సంఖ్యలో ప్రజలు డిజిటల్ చెల్లింపులు చేస్తుండగా, వారిలో భారతీయుల సహకారం అధికంగా ఉండటం విశేషం. అయితే దీని వెనుక పలువురు ఇంజినీర్ల సహకారం దాగుంది. వారు పలు యాప్‌లను రూపొందించి, డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేశారు. డిజిటల్ చెల్లింపులలో అత్యంత ముఖ్యమైనది క్యూఆర్ కోడ్. దీని సాయంతో ఎవరికైనా నగదును సులభంగా చెల్లించవచ్చు. ఈ మాధ్యమం ద్వారా ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది నగదు చెల్లింపులు చేస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా ఈ క్యూఆర్ కోడ్ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించారా? క్యూఆర్ కోడ్ అంటే ఏమిటి? ఈ రోజుల్లో ప్రతిచోటా క్యూఆర్ కోడ్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఉత్పత్తిని ట్రాక్ చేయడం, దానిని గుర్తించడంలో దీని వినియోగం అధికంగా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ అడ్వర్టైజ్మెంట్, బిల్బోర్డ్, బిజినెస్ విండోలో అధికంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది ఉత్పత్తి డేటాను సేవ్ చేయడానికి కూడా ఉపయోగ పడుతుంది. అయితే క్యూఆర్ కోడ్ డేటాను నిల్వ చేసేందుకు ఎన్కోడింగ్ మోడ్‌లను ఉపయోగిస్తుంది. క్యూఆర్ కోడ్ ఎలా పని చేస్తుంది? బార్కోడ్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా క్యూఆర్ కోడ్ కోడ్ కూడా పనిచేస్తుంది. అయితే ఇది చూసేందుకు దానికన్నా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. మనకు క్యూఆర్ కోడ్‌లో అనేక చుక్కలు కనిపిస్తాయి. బార్కోడ్లో గీతలు కనిపిస్తాయి. క్యూఆర్ కోడ్‌లో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది స్టాటిక్ క్యూఆర్ కోడ్. రెండవది డైనమిక్ క్యూఆర్ కోడ్. స్టాటిక్ క్యూఆర్ కోడ్ స్థిరంగా ఉంటుంది. అంటే అది ఒకసారి రూపొందించిన తరువాత దానిని మార్చలేరు. డైనమిక్ క్యూఆర్ కోడ్ అంటే అందులో ఉన్న సమాచారాన్ని తిరిగి అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే.. -
గ్రేటర్ వరంగల్‌లో ‘క్యూఆర్ కోడ్’తో పన్నుల చెల్లింపు... స్కాన్ అండ్ పే..
వరంగల్ అర్బన్: స్మార్ట్ సేవలు అందించడంలో గ్రేటర్ వరంగల్ మరో ముందడుగు వేసింది. తెలంగాణలో మొదటిసారిగా క్యూ ఆర్ కోడ్ సిస్టమ్‌ను వరంగల్ నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈనూతన విధానంతో ప్రజలు సులువుగా పన్నులు చెల్లించేందుకు అధికారులు వెసులుబాటు కల్పించారు. ఆస్తి, చెత్త పన్నులు, నీటి చార్జీలు ఇళ్లు, ఆఫీస్, వ్యాపార దుకాణాల్లో నుంచి చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)కి అన్ని రకాల పన్నులకు సంబంధించి కార్యకలాపాలను అనుసంధానం చేసి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మీసేవ, ఈసేవ, అమెజాన్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పన్ను కట్టేందుకు సౌకర్యం ఉంది. ఆన్లైన్లో సొమ్ము చెల్లిస్తే నగదు సక్రమంగా జమ కాని పరిస్థితులూ ఉన్నాయి. నూతన విధానం ద్వారా పారదర్శకంగా చెల్లింపులకు వీలు కలగనుంది. నగరంలో 2,07 లక్షల అసెస్మెంట్లు(భవనాలు) ఉండగా.. 1.70 లక్షల నల్లా కనెక్షన్లున్నాయి. అందులో 1.20 లక్షల అసెస్మెంట్లకు డిజిటల్ డిమాండ్ నోటీసులను పంపిణీ పూర్తి చేశారు. మిగిలిన నోటీసులను ఒకటి, రెండు రోజుల్లో అందిస్తామని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. క్యూ ఆర్ కోడ్ విధానం ద్వారా రెండు రకాలుగా పన్నులు చెల్లించే అవకాశం ఉంది. ● ఇళ్లల్లో, వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో పన్నుల విభాగానికి చెందిన బిల్ కలెక్టర్లు క్యూఆర్ కోడ్‌తో కలిగి ఉన్న డిజిటల్ డిమాండ్ నోటీసుల్ని పంపిణీ చేస్తారు. అనంతరం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పన్నులు, వడ్డీ చూపెడుతుంది. ఆసొమ్ము చెల్లిస్తే బల్దియా బ్యాంక్ ఖాతాలోకి చేరుతుంది. ● క్యూఆర్ కోడ్‌తో ఉన్న డిజిటల్ డిమాండ్ నోటీసులు అందకపోతే మరో విధానం ద్వారా పన్నులు చెల్లించవచ్చు. జీడబ్ల్యూఎంసీ వెబ్‌సైట్‌కు వెళ్లి పే ప్రాపర్టీ ట్యాక్స్ అని క్లిక్ చేస్తే ‘ఇ మునిసిపాలిటీ తెలంగాణ’ సైట్లో ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత జిల్లా, ప్రాంతం, సర్కిల్, ఇంటి నంబర్ ఎంటర్ చేస్తే ప్రాపర్టీ ట్యాక్స్ వివరాలు కనిపిస్తాయి. అనంతరం ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూ క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది. కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తే రసీదు వస్తుంది. అదేవిధంగా వాటర్ చార్జీ చెల్లింపునకు క్యాన్ నంబరు డీటెయిల్స్‌పై క్లిక్ చేసి కింది భాగంలో ఆన్లైన్ పేమెంట్ అని క్లిక్ చేస్తే వచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయవచ్చు. పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి క్యూ ఆర్ కోడ్ ద్వారా ఆస్తి, నీటి, చెత్త పన్నుల చెల్లింపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. పన్నులు చెల్లిస్తేనే నగరాభివృద్ధి జరుగుతుంది. నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయి. – షేక్ రిజ్వాన్ బాషా, బల్దియా కమిషనర్ -
చిన్న క్యూఆర్.. పెద్ద వ్యాపారం
రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టు, చాట్ బండి, పండ్ల షాపులను గమనించారా? అక్కడ మీకో యూపీఐ క్యూఆర్ కోడ్ దర్శనమిస్తుంది. చూడ్డానికి చిన్నదే అయినా వాటి ఆధారంగా జరుగుతున్న వ్యాపారం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! దేశ వాణిజ్యంలో యూపీఐ క్యూఆర్ కోడ్స్ అత్యంత కీలకంగా మారాయంటే అతిశయోక్తి కాదు. కుగ్రామాల్లోని చిరు వ్యాపారుల వద్ద కూడా దర్శనమిస్తున్న ఈ కోడ్లను గమనిస్తే, డిజిటల్ పేమెంట్స్ రంగంలో భారతావని ముఖచిత్రం ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తుల నుంచి వర్తకులకు చేరిన డిజిటల్ పేమెంట్స్‌లో సంఖ్యపరంగా రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల వాటా ఏకంగా 84.27 శాతం ఉంది. చిన్న చిన్న మొత్తాలే డిజిటల్ రూపంలో చేతులు మారుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. ∙నూగూరి మహేందర్ ఇన్స్టంట్ పేమెంట్ సిస్టమ్ భారత వాణిజ్యాన్ని పునర్నిర్మించింది. అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి కోట్లాది మందిని తీసుకొచ్చింది. రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతం చేసింది. కోట్లాదిమంది భారతీయులకు క్రెడిట్, సేవింగ్స్ వంటి బ్యాంకింగ్ సేవలను విస్తరించింది. ప్రభుత్వ కార్యక్రమాలు లబ్ధిదారులకు నేరుగా చేరాయి. పన్నుల వసూళ్లలో వృద్ధి నమోదవుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారతదేశం ఇంతకు ముందు చూడని స్థాయిలో ఈ సాంకేతిక ఆవిష్కరణ ప్రభావం చూపించింది. సౌకర్యాల కలబోత.. చాక్లెట్ కొన్నా షాపు యజమానికి అక్కడి క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ లేదా బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబరు సాయంతో డబ్బులు చెల్లించొచ్చు. అదీ 10 సెకన్లలోపే. కస్టమర్‌కి గాని, వ్యాపారస్తుడికి గాని చేతిలో చిల్లర లేదన్న బెంగ లేదు. క్యాష్ కోసం ఏటీఎమ్‌కి, బ్యాంకుకు పరుగెత్తే పని లేదు. షాపింగ్ కోసం చేతినిండా నగదు ఉంచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కావాల్సిందల్లా చేతిలో ఉన్న ఫోన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్ యాప్ ఉంటే చాలు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి క్షణాల్లోనే చెల్లింపులు పూర్తి చేయవచ్చు. వర్తకులు ప్రతిసారీ తమ మొబైల్‌ను చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వాయిస్ బాక్సులు వచ్చాయి. వినియోగదారుడి బ్యాంకు ఖాతా, లేదా డిజిటల్ వాలెట్ నుంచి లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు డబ్బులు నేరుగా బదిలీ అవుతాయి. యూపీఐ యాప్‌లో ప్రతి బ్యాంకు ఖాతాకు ఒక వర్చువల్ పేమెంట్ అడ్రస్ (ఐడీ) క్రియేట్ అవుతుంది. ఈ యూపీఐ ఐడీ లేదా బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబరుతో కూడా డబ్బులు చెల్లించవచ్చు. బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు జరిగే చెల్లింపులకు ఎటువంటి చార్జీ ఉండదు. అంటే బ్యాంకు ఖాతా నుంచి క్యూఆర్ కోడ్ ద్వారా జరిగే లావాదేవీలు కూడా ఉచితం అన్నమాట. మొబైల్ రీచార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్లులు, బీమా, డీటీహెచ్ చెల్లింపులు, సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు. లావాదేవీల పరిమితి రోజుకు రూ.1 లక్ష వరకు ఉంది. దేశవ్యాప్తంగా అధికారికంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీల్లో విలువ పరంగా యూపీఐ వాటా 43 శాతం ఉందంటే అతిశయోక్తి కాదు. పీవోఎస్ టెర్మినల్స్‌ను మించి.. క్యూఆర్ కోడ్స్‌కు ఆదరణ అంతా ఇంతా కాదు. విక్రేతలు ఎవరైనా డిజిటల్ రూపంలో నగదును స్వీకరించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణమేమిటంటే తెల్లకాగితం మీద కూడా క్యూఆర్ కోడ్‌ను ప్రింట్ తీసుకుని వినియోగించే వెసులుబాటు ఉండడం. పైగా పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్ ఖరీదు సుమారు రూ.12 వేల వరకు ఉంది. ఎంపీవోఎస్ ఖరీదు అయిదు వేల వరకు పలుకుతోంది. చౌకైన వ్యవహారం కాబట్టే క్యూఆర్ కోడ్స్ పాపులర్ అయ్యాయి. వినియోగదారులు సైతం డిజిటల్ పేమెంట్లకు మొగ్గు చూపుతుండటమూ వీటి వినియోగం పెరిగేందుకు దోహదం చేసింది. నగదుతో పోలిస్తే చాలా సందర్భాల్లో అతి తక్కువ సమయంలో డిజిటల్ చెల్లింపులు పూర్తి చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి నాటికి వర్తకుల కోసం 26 కోట్ల పైచిలుకు క్యూఆర్ కోడ్స్ జారీ అయ్యాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా నగదును స్వీకరించే పీవోఎస్ టెర్మినల్స్ 78 లక్షలు ఉన్నాయి. పీవోఎస్ టెర్మినల్స్‌ను మించి క్యూఆర్ కోడ్స్ జారీ అయ్యాయంటే యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపుల వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్స్ సంస్థలు క్యూఆర్ కోడ్స్‌ను జారీ చేస్తున్నాయి. ఆధార్ ఆధారంగా.. దేశంలో 99 శాతం మంది పెద్దలు బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్యను కలిగి ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 130 కోట్లకుపైగా ఆధార్ ఐడీలు జారీ అయ్యాయి. ఈ ఐడీలు కొత్తగా బ్యాంక్ ఖాతాలు తెరిచే పనిని సులభతరం చేశాయి. అలాగే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని పిలిచే తక్షణ చెల్లింపు వ్యవస్థకు పునాదిగా మారాయి. 2016 నవంబర్‌లో భారత ప్రభుత్వం రూ.500, 1,000 నోట్లను రద్దు చేసింది. నోట్ల కొరత కూడా డిజిటల్ లావాదేవీల వైపు మళ్లడానికి కారణం అయింది. గత ఏడాది భారత్‌లో ఇన్స్టంట్ డిజిటల్ పేమెంట్స్ లావాదేవీల విలువ యూఎస్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌ల కంటే చాలా ఎక్కువ. ఈ నాలుగు దేశాల మొత్తం లావాదేవీలే కాదు, ఈ మొత్తం విలువను నాలుగుతో గుణించినదాని కంటే భారత లావాదేవీలు అధికమని ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం సందర్భంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో 30 కోట్ల పైచిలుకు వ్యక్తులు, 5 కోట్లకు పైగా వర్తకులు యూపీఐ వేదికపైకి వచ్చి చేరారు. భారత్‌లో 2016 నుంచి.. సౌలభ్యం ఉంది కాబట్టే చెల్లింపుల వ్యవస్థలో రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు విప్లవం సృష్టిస్తోంది. భారత్‌లో అయితే వీటి లావాదేవీల సంఖ్య, విలువ అనూహ్య రీతిలో పెరుగుతూ వస్తోంది. విభిన్న బ్యాంకు ఖాతాలను పేమెంట్ యాప్‌కు అనుసంధానం చేయడం ద్వారా నగదుకు బదులు డిజిటల్ రూపంలో చెల్లింపులను సురక్షితంగా, క్షణాల్లో పూర్తి చేయవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) 2016 ఏప్రిల్ 11న యూపీఐ సేవలను పైలట్ ప్రాజెక్టుగా 21 బ్యాంకులతో కలసి భారత్‌లో ప్రారంభించింది. అదే ఏడాది ఆగస్ట్ 25 నుంచి గూగుల్ ప్లే స్టోర్లలో బ్యాంకులు తమ పేమెంట్ యాప్స్‌ను జోడించడం మొదలుపెట్టాయి. భారత్‌లో ప్రస్తుతం 414 బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నాయి. కోవిడ్ కాలంలో రెండింతలు.. 2016 డిసెంబర్లో రూ.708 కోట్ల విలువైన యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు జరిగాయి. 2017లో ఒక నెలలో గరిష్ఠంగా రూ.13,174 కోట్లు నమోదయ్యాయి. 2018 డిసెంబరులో లక్ష కోట్ల మార్కును దాటింది. ఏడాదిలోనే రెట్టింపు అయ్యాయి. 2020 జూలై నుంచి యూపీఐ లావాదేవీల వేగం పుంజుకుంది. ఆ నెలలో రూ.2,90,538 కోట్ల విలువైన 149.7 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కాలంలో వైరస్ భయానికి నోట్లను ముట్టుకోవడానికి ప్రజలు ససేమిరా అన్నారు. దీంతో డిజిటల్ చెల్లింపులకు మళ్లారు. ఫలితంగా 2020, 2021లో డిజిటల్ లావాదేవీల విలువ రెట్టింపైంది. 2022 మే నెలలో రూ.10 లక్షల కోట్ల మైలురాయి దాటి యూపీఐ సరికొత్త రికార్డు సృష్టించింది. అంటే 40 నెలల్లోనే పదిరెట్లు అయ్యాయంటే పేమెంట్ యాప్స్ ఏ స్థాయిలో ప్రజల్లోకి చొచ్చుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. యూపీఐదే 43 శాతం వాటా.. ఏటీఎమ్‌ల నుంచి నగదు స్వీకరణ, జమ, చెక్కులు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు, ఇతర మార్గాల్లో దేశవ్యాప్తంగా నమోదైన ఆర్థిక లావాదేవీల పరిమాణం 2022–23లో 10,620.6 కోట్లు. వీటి విలువ రూ.3,22,36,700 కోట్లు. ఇందులో యూపీఐ సింహభాగం కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో యూపీఐ వేదికగా 8,375.1 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.1,39,20,678 కోట్లు. అధికారికంగా జరిగిన మొత్తం ఆర్థిక లావాదేవీల్లో యూపీఐ ఏకంగా 43.18 శాతం వాటా కైవసం చేసుకుందన్న మాట. చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) చెక్ క్లియరింగ్ విధానం ద్వారా రూ.71,67,040 కోట్ల లావాదేవీలు జరిగాయి. మొబైల్ ఫోన్స్ ద్వారా బ్యాంకుల మధ్య ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సేవలైన ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) వేదికగా రూ.55,86,147 కోట్లు నమోదయ్యాయి. ఏటీఎమ్‌లలో నగదు జమ, స్వీకరణ లావాదేవీల విలువ రూ.16,62,419 కోట్లు ఉంది. ప్రజల వద్ద చలామణీలో ఉన్న నగదు రూ.36 లక్షల కోట్లు. ఇవీ డిజిటల్ లావాదేవీలు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ప్రధానంగా డిజిటల్ చెల్లింపుల విభాగంలో పురోగతి ఇందుకు తోడ్పడింది. 2017–18లో దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య 2,000 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 10,000 కోట్లు దాటింది. దీంతో డిజిటల్ లావాదేవీల విలువ 50 శాతానికిపైగా ఎగసింది. యూపీఐ ఇందుకు దోహదం చేసింది. 2022లో రూ.149.5 లక్షల కోట్ల విలువైన 8,792 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఇందులో రూ.126 లక్షల కోట్ల విలువైన 7,405 కోట్ల లావాదేవీలు యూపీఐ కైవసం చేసుకుంది. డిజిటల్ పేమెంట్ల విలువ 2026 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఫోన్‌పే, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇటీవలి నివేదిక వెల్లడించింది. ఇదే జరిగితే నగదు లావాదేవీల వాటా 60 నుంచి 35 శాతానికి వచ్చి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల విషయంలో భవిష్యత్ అంతా 3–6 తరగతి శ్రేణి నగరాలు, పట్టణాలదే. గడిచిన రెండేళ్లుగా కొత్త మొబైల్ పేమెంట్ కస్టమర్లలో ఈ నగరాలు, పట్టణాలకు చెందినవారు 60–70 శాతం ఉన్నారట. 2023 మార్చినాటికి భారత్‌లో 96.12 కోట్ల డెబిట్ కార్డులు జారీ అయ్యాయి. 5.5 కోట్ల మంది వద్ద 8.53 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. డిజిటల్ వేదికల రాకతో బ్యాంకులపై భారం గణనీయంగా తగ్గింది. బ్యాంకుల్లో ఇప్పుడు క్యూలు కానరావడం లేదు. ఎక్కడ ఎక్కువంటే.. గ్రాసరీస్, సూపర్మార్కెట్లలో అత్యధికంగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఆహార విక్రయ కేంద్రాలు, రెస్టారెంట్లు, టెలికం సేవలు, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్, గేమ్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, సర్వీస్ స్టేషన్స్, ఔషధ దుకాణాలు, బేకరీస్ నిలిచాయి. విలువ పరంగా 2023 ఏప్రిల్‌లో నమోదైన లావాదేవీల్లో వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీర్ టు పీర్) చేరిన మొత్తం 77.18 శాతం. మిగిలినది వ్యక్తుల నుంచి వర్తకులకు (పీర్ టు మర్చంట్) చేరింది. పీర్ టు పీర్ విభాగంలో రూ.2 వేలు ఆపైన విలువ చేసే లావాదేవీలు 87.05 శాతం, రూ.500–2000 వరకు 9.73, రూ.500 లోపు 3.21 శాతం కైవసం చేసుకున్నాయి. పీర్ టు మర్చంట్ విభాగంలో రూ.2,000 పైన 67.3 శాతం, రూ.500–2000 వరకు 17.72, రూ.500 లోపు 15.24 శాతం నమోదయ్యాయి. లావాదేవీల సంఖ్య పరంగా 2023 ఏప్రిల్‌లో పీర్ టు మర్చంట్ అధికంగా 56.63 శాతం దక్కించుకుంది. మిగిలినది పీర్ టు పీర్ చేజిక్కించుకుంది. పీర్ టు మర్చంట్ విభాగంలో సింహభాగం అంటే 84.27 శాతం లావాదేవీలు రూ.500 లోపు విలువైనవే. రూ.500–2000 విలువ చేసేవి 11.01 శాతం, రూ.2 వేలకుపైగా విలువ కలిగిన కొనుగోళ్లు 4.71 శాతం ఉన్నాయి. వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.500 లోపు బదిలీ చేసినవి 54.22 శాతం, రూ.500–2,000 వరకు 22.25 శాతం, రూ.2 వేలకుపైగా చెల్లించినవి 23.53 శాతం ఉన్నాయి. ఇంటర్నెట్ తోడుగా.. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ), మార్కెట్ డేటా అనలిటిక్స్ సంస్థ కాంటార్ సంయుక్త నివేదిక ప్రకారం.. భారత్‌లో సగానికి పైగా జనాభా ఇంటర్నెట్ను తరచుగా వినియోగిస్తోంది. 2022లో దేశవ్యాప్తంగా 75.9 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఈ స్థాయిలో యాక్టివ్ యూజర్లు ఉండడం భారత్‌లో ఇదే ప్రథమం. వీరు కనీసం నెలకు ఒకసారైనా నెట్లో విహరిస్తున్నారు. రెండేళ్లలో ఈ సంఖ్య 90 కోట్లకు చేరనుంది. మొత్తం యాక్టివ్ యూజర్లలో 39.9 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా, మిగిలిన వారు పట్టణ ప్రాంతాల నుంచి ఉన్నారు. దేశీయంగా ఇంటర్నెట్ వినియోగ వృద్ధికి గ్రామీణ ప్రాంతం దన్నుగా నిలుస్తోందనడానికి ఇది నిదర్శనమని నివేదిక వివరించింది. ఏడాది వ్యవధిలో పట్టణ ప్రాంతాల్లో నెట్ వినియోగ వృద్ధి 6 శాతంగా ఉండగా, గ్రామీణ భారతంలో ఇది 14 శాతంగా నమోదైందని వివరించింది. 2025 నాటికి కొత్త ఇంటర్నెట్ యూజర్లలో 56 శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచే ఉండవచ్చని నివేదిక తెలిపింది. ఇక డిజిటల్ చెల్లింపులు చేసేవారి సంఖ్య 2021తో పోలిస్తే గతేడాది 13 శాతం దూసుకెళ్లి 33.8 కోట్లకు చేరింది. వీరిలో 36 శాతం మంది గ్రామీణ ప్రాంతాలవారు ఉన్నారు. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న వారిలో 99 శాతం మంది యూపీఐ యూజర్లే ఉండడం విశేషం. క్రెడిట్‌ను విస్తరించడానికి.. భారతదేశం యూపీఐ రూపంలో ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను కలిగి ఉంది. ఇప్పుడు యూపీఐ పట్టాలను క్రెడిట్ లావాదేవీలకు విస్తరించడానికి సమయం ఆసన్నమైంది. రూపే క్రెడిట్ కార్డ్‌లపై యూపీఐ లావాదేవీలను ప్రారంభించడం ద్వారా దీని మొదటి దశ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే భారత్ కేవలం 5.5 కోట్ల క్రెడిట్ కార్డ్ వినియోగదారులను కలిగి ఉంది. క్రెడిట్ కార్డ్‌లకు ఎటువంటి లింక్ లేకుండా నిజమైన క్రెడిట్ లావాదేవీలను ప్రారంభించడానికి ఈ పట్టాలను విస్తరించడం చాలా ముఖ్యం. ఇది అధికారిక క్రెడిట్ పరిధికి దూరంగా ఉన్న 60 కోట్లకుపైగా మందికి క్రెడిట్‌ను విస్తరించడానికి వివిఫై, ఇతర కంపెనీలకు వీలు కల్పిస్తుంది. – అనిల్ పినపాల,ఫౌండర్, వివిఫై ఇండియా ఫైనాన్స్. -
ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి ప్రధాన పేపర్ల పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన పరీక్షలను ఆరు పేపర్లతో నిర్వహించారు. ప్రథమ భాష (పేపర్–1), ద్వితీయ భాష, ఇంగ్లిష్, మేథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు జరిగాయి. ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2, ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1, పేపర్–2, వొకేషనల్ కోర్సుల పేపర్లతో టెన్త్ పరీక్షలు పూర్తవుతాయి. జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 19 నుంచి 26 వరకు జరుగుతుంది. ఇతర ప్రక్రియలను కూడా ముగించి ఫలితాలను మే 2వ వారంలో విడుదల చేయనున్నారు. గతేడాది అనుభవాల దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు లీకులు, ఫేక్‌లకు ఆస్కారం లేకుండా విద్యా శాఖ జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి ప్రశ్నపత్రంపైనా ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించింది. పరీక్ష కేంద్రాల వారీగా ప్రశ్నపత్రాలకు బార్ కోడింగ్ పెట్టింది. దీంతో ఎక్కడా అవకతవకలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. కాపీయింగ్‌కు కూడా అడ్డుకట్ట పడింది. ఈ ఆరు రోజుల పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ కేసులు రాష్ట్రవ్యాప్తంగా 5 మాత్రమే నమోదయ్యాయి. గతేడాది ‘నారాయణ’ అక్రమాలు గతేడాది కొన్ని కార్పొరేట్ యాజమాన్యాలు విద్యా వ్యాపారాన్ని పెంచుకొనేందుకు అత్యధిక పాస్ పర్సంటేజీ, మార్కుల కోసం ప్రశ్నపత్రాల లీకులకు తెగబడ్డాయి. టీడీపీ పెద్దలతో అనుబంధమున్న ‘నారాయణ’ విద్యా సంస్థ దీనికి తెరతీసింది. తమ సంస్థల్లోని పిల్లలతో కాపీయింగ్ చేయించేలా, అదే తరుణంలో ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేసేలా వ్యవహారాన్ని నడిపించింది. కొందరు ప్రభుత్వ టీచర్లనూ మభ్యపెట్టింది. ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా దీనికి తోడయ్యారు. లీకులతో, సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ ప్రశ్నపత్రాల ప్రచారంతో విద్యార్థుల్లో గందరగోళం సృష్టించారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకొని కఠిన చర్యలు తీసుకుంది. అక్రమాలతో సంబంధమున్న పలువురు నారాయణ విద్యా సంస్థల సిబ్బందిని, ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లు, ఇతర వ్యక్తులపైనా కేసులు నమోదు చేసింది. 74 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమాలకు ప్రధాన కారణమైన నారాయణ విద్యా సంస్థల యాజమాన్యంపైనా కేసులు నమోదు చేశారు. ఈసారి పకడ్బందీ చర్యలు ఈసారి పరీక్షల్లో చిన్న ఘటనలకు కూడా తావివ్వకూడదన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విద్యా శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. పరీక్షల నిర్వహణలో పూర్తిగా ప్రభుత్వ సిబ్బందినే భాగస్వామ్యం చేసింది. గతంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇన్విజిలేటర్లు కాకుండా ఇతర సిబ్బంది ఆయా సంస్థల వారే ఉండేవారు. దీనివల్ల అక్రమాలకు ఎక్కువ ఆస్కారముండేది. ఈసారి దానికి అడ్డుకట్ట వేస్తూ ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లోనూ మొత్తం ప్రభుత్వ సిబ్బందినే నియమించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్ల ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ తరలింపు, రూట్ ఆఫీసర్ల నియామకం, పరీక్ష కేంద్రాలకు మెటీరియల్ పంపిణీలో ఎక్కడా లోటుపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు. లీక్, ఫేక్ లకు ఆస్కారం లేకుండా తీసుకున్న చర్యలివీ.. ♦ లీకులకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాలను నో ఫోన్ జోన్లుగా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్లతో సహా ఎవరికీ పరీక్ష కేంద్రాల్లో ఫోన్లను అనుమతించలేదు. స్మార్ట్, డిజిటల్ వాచీలు, కెమెరాలు, బ్లూటూత్ వంటి ఎల్రక్టానిక్ పరికరాలనూ నిషేధించారు. ♦ ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలకు ఎంపికచేశారు. ♦ టీచర్లకు వారి స్కూళ్ల విద్యార్థులు పరీక్షలు రాసే కేంద్రాల్లో కాకుండా ఇతర కేంద్రాల్లో విధులు కేటాయించారు. ♦ విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన ప్రశ్నపత్రాలను చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్ సహా ఇద్దరు ఇన్విజిలేటర్ల సమక్షంలో సీల్ వేశారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు చేశారు. ♦ ప్రతి ప్రశ్నపత్రానికి బార్‌కోడింగ్ ఇవ్వడమే కాకుండా క్యూఆర్ కోడ్‌ను సూపర్ ఇంపోజ్ చేయించారు. దీనివల్ల ప్రశ్నపత్రం బయటకు వచ్చినా అది ఎక్కడి నుంచి వచ్చిందో వెంటనే తెలిసిపోతుంది. ♦ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలను అందించిన వెంటనే విద్యార్థులతో వాటిలోని అన్ని పేజీలపై రోల్ నంబర్, సెంటర్ నంబర్‌ను రాయించారు. ♦ విద్యార్థుల ఓఎమ్మార్ పత్రాలపైనా ఈసారి బార్ కోడింగ్ ఇచ్చారు ♦ సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ల సంఖ్యను రెట్టింపు చేశారు. రెవెన్యూ, పోలీసు సహా ఇతర విభాగాల సీనియర్ అధికారులను, ఇతర సిబ్బందిని కూడా పరీక్షల్లో భాగస్వాములను చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు ఎస్పీల ఆధ్వర్యంలో పని చేశాయి. ♦ పరీక్ష కేంద్రాల్లోకి నిర్ణీత సమయంలో అనుమతించడమే కాకుండా పరీక్ష ముగిసిన తర్వాతే విద్యార్థులు, సిబ్బంది బయటకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. -
25 ఏళ్లకే కొడుకు ఆకస్మిక మరణం! సమాధిపై క్యూఆర్‌కోడ్‌తో తండ్రి నివాళి
జీవితం ఎప్పుడూ సాఫీగా సాగిపోదు. ఎక్కడో ఒక చోట ఒక అగాధాన్నో లేక విషాధాన్నో ఒక పరీక్షలా పెడతాడేమో దేవుడు. మనిషి సహనానికి పరీక్ష లేక ఇంకేదైనా గానీ దాన్నుంచే కొత్త ఆలోచనలు లేదా కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి ఒక్కొసారి. ఇక్కడ ఒక తండ్రి విషాధ గాథలో కూడా అలానే చోటు చేసుకుంది. అన్నింటిలోనూ అత్యంత ప్రతిభావంతుడైన కొడుకు ఆకస్మిక మరణం తన జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. అదే అతన్ని తన కొడుకు గురించి ప్రపంచం తెలుసుకునేలా చేసేందుకు పురిగొల్పింది. అందులోంచి పుట్టుకొచ్చిందే సమాధిపై క్యూఆర్‌కోడ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన. అసలు ఏంటి ఇది? డిజిటల్ చెల్లింపులకు ఉపయోగించే క్యూఆర్ కోడ్ సమాధిపై ఎందుకు? ఎందుకోసం ఇలా అని అందరిలోనే ఆలోచనలు రేకెత్తించేలా చేశాడు కొడుకుని కోల్పోయిన తండ్రి. అసలేం జరిగిందంటే..కేరళలోని త్రిస్సూర్ జిల్లా కురియాచిరాకు చెందిన ఫ్రావిన్స్ అనే వ్యక్తికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. ఆయన వృత్తిరీత్యా ఒమన్‌లోని ఐబీఎం కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య, పిల్లలు కేరళలోని కురియాచిరాలో ఉంటారు. ఐతే కొడుకు ఐవిన్ ప్రావిన్స్ చిన్నప్పటి నుంచి చదువులోనూ, ఆటల్లోనూ, సంగీతంలోనూ టాపర్. ఏ కాంపిటీషన్లో పోటీ చేసిన ప్రైజ్ అతడిదే. ఎంబీబీఎస్ చేశాడు. కోజికోడ్‌లోని మలబార్ మెడికల్ కాలేజీలో జనరల్ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు కూడా. అలాగే కూతురు ఒక పెద్ద కార్పోరేటర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ..నెలకు లక్షరూపాయాల దాక సంపాదిస్తోంది. ఒక తండ్రికి ఇంతకంటే కావల్సింది ఏమి లేదు కూడా. ఇక అతను కూడా ఉద్యోగానికి రిజైన్ చేసి ఇండియా వచ్చి సెటిల్ అయిపోవాలనుకున్నాడు. ఇక కూతురు పెళ్లి కూడా చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇంతలో ఒకరోజు ప్రావిన్స్ తన బాస్‌తో మీటింగ్‌లో ఉండగా తన కూతురు ఎవెలిన్ ఫ్రాన్సిస్ నుంచి పదే పదే కాల్స్ వచ్చాయి. ఫ్రావిన్స్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ప్లీజ్ డాడీ అర్జెంటుగా మాట్లాడాలి ఫోన్ లిఫ్ట్ చేయండి అని ఒక మెసేజ్ పెట్టింది కూతురు. దీంతో మీటింగ్ మధ్యలోనే బయటకు వచ్చి కాల్ చేయగా.. అన్నయ బ్యాడ్మింటన్ ఆడుతూ చనిపోయాడని చెబుతుంది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఫ్రాన్సిస్. అతడి బాస్ ఈ విషయం తెలసుకుని అతడిని ఓదార్చి.. ఇండియా వెళ్లేందకు ఫ్లైట్ టికెట్టు ఏర్పాటు చేసి మరి పంపించాడు. ఎంతో హాయిగా సాగిపోతున్న తన జీవితంలో కొడుకు మరణం అతన్ని దారుణంగా కుంగదీసింది. కోలుకోవడానికే నెల పట్టింది. 25 ఏళ్లకే చిన్న వయసులో మరణించిన కొడుకు ఐవిన్ 100 ఏళ్లకు సాధించే అన్ని విజయాలను అతను సాధించాడు. తన కొడుకు ఐవిన్కి వచ్చిన అవార్డులు, రివార్డులు పెట్టడనినకి ఒక గది కూడా సరిపోదు. అలాంటి అత్యంత ప్రతిభావంతుడైన కొడుకు గురించి ప్రపంచానికి తెలిసేలా చేయాలనుకున్నాడు. వాస్తవానికి ఐవిన్ ఎంత ప్రతిభావంతుడంటే గిటార్ దగ్గర నుంచి బ్యాడ్మింటన్, కబడ్డీ వరకు అన్నింటిల్లోనూ టాపర్. కొత్త కొత్త ఆవిష్కరణలంటే అతనికి అత్యంత ఇష్టం. పైగా వ్యక్తుల ప్రోఫైల్స్తో క్యూఆర్ కోడ్లు క్రియేట్ చేస్తాడు కూడా. అంతేగాదు తన తండ్రి పనిచేస్తున్న ఐబీఎం కంపెనీ కొత్త టెక్నాలజీని తీసుకురాకమునుపే తన తండ్రిని ఆ టెక్నాలజీ గురించి అప్రమత్తం చేసేవాడు. అలాంటి తన కొడుకు చిన్న వయసులో మరణించడం అనేది ఏ కుంటుంబానికైనా కోలుకోలేని వ్యధే. అందుకే అతడి గురించి, తన టాలెంట్ గురించి తెలసుకునేలా.. అతడి జీవితాన్నే సమాధిపై పొందుపర్చాలనుకున్నాడు ఫ్రాన్సిస్. ఒకవైపు సెయింట్ జోసఫ్ చర్చి వద్ద అతడి సమాధి నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. అయితే అతడి గురించి, అతని సాధించిన విజయాల గురించి సమాధిపై రాయించడానికి ప్లేస్ సరిపోదని కూతురు ఎవెలిన్ చెప్పింది. అందుకని తన అన్నయ్య క్రియేట్ చేసిన క్యూఆర్ కోడ్‌తోనే ఇది చేయాలనే ఆలోచనకు వచ్చింది. దానికోసం అతడి అన్నయ్య ప్రోఫెల్తో వెబ్ పేజి క్రియేట్ చేసి..దాంట్లో అతడి సాధించిన విజయాలు, తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపిన క్షణాలన్నింటిని పొందుపరిచారు. ఈ వెబ్‌పేజిని క్యూఆర్ కోడ్‌కి లింక్ చేసి ఐవిన్ సమాధిపై ఏర్పాటు చేశారు అతడి కుటుంబ సభ్యులు. దీన్ని చూసిన అక్కడి వాళ్లంతా సమాధిపై క్యూఆర్ కోడ్ ఏంటి అని స్కాన్ చేసి చూసేందుకు ఆసక్తి కనబర్చడమే గాక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సమాధిపై ఐవిన్ ఫోటో, దిగువన జనన, మరణ తేదిలు, కింద అడాప్ట్ అనే ఒక పదం దానికింద ఈ క్యూఆర్‌కోడ్ ఉంటుంది. అడాప్ట్ అంటే ఏదైనా కొత్త సాంకేతికను స్వీకరించడం అని అర్థం. అదే ఐవిన్ నినాదం కూడా. కొత్త సాంకేతికకు ఎప్పటికప్పుడూ అడాప్ట్ అయిపోతుండాలని ఐవిన్ చెబుతూ ఉండే వాడని అతడి తండ్రి ఫ్రాన్సిస్ చెబుతున్నారు. (చదవండి: కర్నాటక అసెంబ్లీ ఎలక్షన్స్: నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదల) -
డబ్బులెందుకు.. ఫోన్ ఉంటే చాలు..
సాక్షి, అమరావతి: బడ్డీ కొట్టులో రూపాయి చాక్లెట్ కొన్నా.. ఇంట్లోనే కూర్చొని టికెట్లు బుక్ చేయాలన్నా.. గ్యాస్, కరెంట్ తదితర బిల్లులు చెల్లించాలన్నా.. అన్నింటికీ ప్రజలు ఇప్పుడు ‘యూపీఐ’ యాప్‌లనే ఆశ్రయిస్తున్నారు. చివరకు భిక్షాటనలోనూ యూపీఐ క్యూఆర్ కోడ్లనే ఉపయోగించేస్తున్నారు. అన్నింటికీ పేమెంట్ యాప్‌లతోనే చెల్లింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా గత రెండు, మూడేళ్ల నుంచి జనం చేతుల్లో క్యాష్ తక్కువైపోయి.. స్కానింగ్ ఎక్కువైపోయింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వాడే ఒక వాహకం. దీని ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ చాలా సులవుగా, వేగంగా జరిగిపోతున్నాయి. ప్రస్తుతం పేమెంట్ యాప్‌ల ద్వారా రోజుకు రూ.లక్ష వరకు బదిలీ చేసే అవకాశముండటంతో.. దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల ప్రజలు బ్యాంకులకు వెళ్లి.. గంటల పాటు వేచి చూసే శ్రమ కూడా తప్పింది. సమయం కూడా ఆదా అవుతోంది. వేగంగా వృద్ధి.. ‘డేటా డాట్ ఏఐ’ అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న యాప్స్‌లో ఫోన్ పే, పేటీఎం, గూగుల్‌పే మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్, పేమెంట్, పర్సనల్ లోన్స్ ఎంతో వేగంగా వృద్ధి చెందాయని ఈ నివేదిక వెల్లడించింది. ఇక టాప్–10 డౌన్లోడెడ్ యాప్స్‌లో నాలుగు, ఆ తర్వాతి స్థానాల్లో బజాజ్ ఫిన్ సర్వ్, యోనో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్, క్రెడిట్ బీ, ధని, నవీ, గ్రో యాప్స్ ఉన్నాయి. ఆదమరిస్తే అంతే.. డిజిటల్ పేమెంట్స్ వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో.. ముప్పు కూడా అదే స్థాయిలో ఉంది. కాస్త అజాగ్రత్తగా ఉన్నా.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయే ప్రమాదముంది. యూపీఐ పేమెంట్స్‌పై అవగాహన లేకపోవడం, తమకు వచ్చే మోసపూరిత ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మడం వల్ల చాలామంది మోసపోతున్నారు. లాటరీ తగిలిందని.. మీ ఖాతా వివరాలు అప్డేట్ చేయాలి ఓటీపీ చెప్పండని, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే అదృష్టం వరిస్తుందని.. ఇప్పుడు కొత్తగా మా వీడియోలను చూస్తే చాలు, సోషల్ మీడియాలో లైక్ కొడితే చాలు డబ్బులిస్తామంటూ అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసి.. వన్‌టైమ్ పాస్వర్డ్(ఓటీపీ), యూపీఐ పిన్ నంబర్లు తెలుసుకొని డబ్బులు లాగేస్తున్నారు. ఇలా మోసపోకుండా ఉండాలంటే.. పాస్‌వర్డ్‌లను తరచుగా మారుస్తుండాలి. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను తెరవకూడదు. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయకూడదు. ఎవరికీ ఎలాంటి సందర్భంలోనూ ఓటీపీ చెప్పకూడదు. ఇలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉంటే మోసాల నుంచి తప్పించుకోవచ్చు. -
RBI: నోట్లతో పనిలేదు.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కాయిన్స్!
చిల్లర సమస్యకు చెక్ పెడుతూ ముఖ్యంగా నాణేల చలామణిని ప్రోత్సహిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సరికొత్త పరిష్కారాన్ని తీసుకొస్తోంది. కొన్ని ముఖ్యమైన బ్యాంకులతో కలిసి క్యూఆర్ కోడ్ బేస్డ్ కాయిన్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన ప్రకటన సందర్భంగా తెలియజేశారు. ఎంపిక చేసిన 12 నగరాల్లోని 19 ప్రాంతాల్లో ఈ మిషన్లను పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా కాయిన్ వెండింగ్ మిషన్లలో మనం నోట్లు పెడితే అందుకు తగినంత నగదు నాణేల రూపంలో వస్తుంది. కానీ నోట్లు లేకుండా నగదు నాణేల రూపంలో కావాల్సినవారు ఈ మిషన్ల ద్వారా పొందవచ్చు. ఇతర కాయిన్ వెండింగ్ మిషన్ల మాదిరిగా కాకుండా ఇది యూపీఐ వ్యవస్థ అనుసంధానంతో పనిచేస్తుంది. కాయిన్స్ కోసం నోట్లు ఇవ్వాల్సిన పనిలేదు. వినియోగదారులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమకు కావాల్సిన నాణేలు, అవసరమైన డినామినేషన్లో పొందవచ్చు. పైలట్ ప్రాజక్ట్ కింద మొదట ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ మిషన్ల పనితీరు, ఉపయోగాన్ని పరిశీలించిన తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించి నాణేల విస్తృత చలామణికి సంబంధించి బ్యాంకులకు గైడ్‌లైన్స్ ఇవ్వనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. ఈ మిషన్లతో వినియోగదారులకు కాయిన్స్ కొరత తీరడమే కాకుండా నాణేల చలామణిని కూడా ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. (ఇదీ చదవండి: RBI: విదేశీయులూ యూపీఐ చెల్లింపులు చేయొచ్చు!) -
కాల్ చేసి స్కాన్ చేయాలని తొందరపెడుతున్నారా? ఖాతా ఖాళీ కావడం ఖాయం!
►కొండాపూర్‌కు చెందిన స్వామినాథన్ తన 3 బీహెచ్‌కే ఇంటిని నెలకు రూ.20 వేలకు అద్దెకు ఇస్తానంటూ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో యాడ్ ఇచ్చారు. రెండురోజుల తర్వాత ఒక వ్యక్తి తాను సీఐఎస్ఎఫ్ అధికారి రాజ్‌దీప్‌సింగ్ అని, తనకు పుణే నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయ్యిందంటూ పరిచయం చేసుకున్నాడు. ఇంటి అద్దె అడ్వాన్స్ చెల్లిస్తానని చెప్పి తొలుత కొంత డబ్బు పంపాడు. ఆ తర్వాత మిగతా డబ్బు పంపిస్తానంటూ స్వామినాథన్‌ను గందరగోళానికి గురిచేసి, తాను పంపిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, పిన్ నంబర్ ఎంటర్ చేయాలంటూ తొందరపెట్టాడు. స్వామినాథన్ అలానే చేయడంతో అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.2.5 లక్షలు అవతలి వ్యక్తికి బదిలీ అయిపోయాయి. ►బల్క్ ఆర్డర్ల పేరిట ఒకేసారి 20 ఫ్రిజ్‌లు కావాలని ఓ షోరూం నిర్వాహకులకు ఒక అపరిచిత వ్యక్తి కాల్ చేశాడు. ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తానంటూ వాళ్లు పంపిన క్యూఆర్ కోడ్ ద్వారా తొలుత కొంత డబ్బు పంపాడు. ఆ తర్వాత మరోసారి డబ్బులు పంపించానని, ఆ నగదు మధ్యలో ఆగిపోయిందని చెబుతూ తాను పంపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పిన్ ఎంటర్ చేయాలంటూ కంగారు పెట్టాడు. అతడు చెప్పినట్టు చేసిన షోరూం నిర్వాహకులు రూ.10 లక్షలు పోగొట్టుకున్నారు. సాక్షి, హైదరాబాద్: నగదు లావాదేవీల్లో భాగంగా ఆన్లైన్ చెల్లింపులు పెరిగిపోయాయి. కొందరు అసలు నగదు అనే మాటే లేకుండా లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే చేసేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతూ డబ్బులు కొల్లగొడుతున్నారు. ఆన్లైన్ పరిజ్ఞానం అంతగా లేని అమాయకుల్ని మాటలతో మభ్యపెట్టి, గందరగోళానికి గురిచేసి, కంగారు పెట్టేస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. రెగ్యులర్‌గా ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించే వారు కూడా కొన్నిసార్లు వీరి బారిన పడుతూ వేలు, లక్షల రూపాయలు నష్టపోతున్నారు. కేటుగాళ్లు కూర్చున్న చోటు నుంచి కదలకుండానే తమ జేబులు నింపుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు అనుసరిస్తున్న సైబర్ నేరగాళ్లు.. తాజాగా క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ స్కానింగ్‌తో చేసే చెల్లింపులు ఆధారంగా చేసుకుని బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. సరికొత్త మోసం.. క్యూరిషింగ్ ఇటీవలి కాలంలో క్యూఆర్ కోడ్ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. జేబులో నగదు ఉండాల్సిన పనిలేదు. బ్యాంకులో డబ్బు, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. పెద్ద షోరూంలు మొదలుకుని చిన్న కిరాణా షాపుల్లో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. నగదు చెల్లింపులకే కాదు.. పెద్ద కంపెనీలు తమ వెబ్సైట్లు, బిజినెస్ కార్డులు, బ్రోచర్లు, ఇలా ప్రతి సమాచారమూ స్కాన్ చేస్తే చాలు వచ్చేలా క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఇస్తున్నాయి. దీంతో సైబర్ దోపిడీగాళ్లు క్యూఆర్ కోడ్‌పై దృష్టి పెట్టారు. దీన్ని వినియోగిస్తూ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును, అది కుదరకపోతే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కొట్టేస్తున్నారు. ఈ సరికొత్త సైబర్ మోసాన్ని సైబర్ సెక్యూరిటీ నిపుణులు క్యూరిషింగ్గా చెబుతున్నారు. అప్రమత్తంగా వ్యవహరించాలి క్యూఆర్ కోడ్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ క్యూఆర్ కోడ్లను సృష్టిస్తున్నారు. వీటిని ఉపయోగించి మన వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. అనుమానాస్పద క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసినప్పుడు మనకు తెలియకుండానే మన మొబైల్ ఫోన్లోకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అవుతుంటాయి. లేదంటే క్యూఆర్ కోడ్‌ను మనం స్కాన్ చేయగానే మనల్ని అవి అన్‌సేఫ్ (సైబర్ నేరగాళ్ల అధీనంలో ఉండే) వెబ్సైట్లలోకి తీసుకెళ్లేలా యూఆర్ఎల్ లింకులు జత చేసి ఉంటున్నాయి’అని చెబుతున్నారు. క్యూఆర్ కోడ్ మోసాలకు ఇక్కడే ఎక్కువ.. ►గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, ఫ్రీ రీచార్జ్ వంటి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌లలో జరిగే లావాదేవీలను నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ►వెబ్సైట్లో వస్తువుల అమ్మకాల విషయంలో ఎక్కువగా ఈ తరహా మోసాలు జరుగుతున్నాయి. ►కోవిడ్ వెరిఫికేషన్ పేరిట కూడా సైబర్ నేరగాళ్లు ఫేక్ క్యూఆర్ కోడ్లను పోస్ట్ చేస్తున్నారు. ► బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కింగ్ ప్రదేశాల్లో, ఇతర కంపెనీలకు సంబంధించిన క్యూఆర్ కోడ్ పోస్టర్లపైనా నకిలీ క్యూఆర్ కోడ్ లింక్‌లు పెడుతున్నారు. ఇలా చేస్తే మేలు.. ►అపరిచితులు పంపే ఈ మెయిల్స్, వాట్సాప్, ఇతర డాక్యుమెంట్లలోని క్యూఆర్ కోడ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ స్కాన్ చేయవద్దు. ►క్యూఆర్ కోడ్ కింద రాసి ఉన్న యూఆర్ఎల్ లింక్, మనం స్కాన్ చేసిన తర్వాత వచ్చిన వివరాలు ఒకేలా ఉన్నాయా లేదా? అన్నది సరిచూసుకోవాలి. ►యూపీఐ ఐడీలు, బ్యాంక్ ఖాతాల వివరాలు అపరిచితులతో ఎట్టిపరిస్థితుల్లో షేర్ చేసుకోవద్దు. ►ఓఎల్ఎక్స్ లేదా ఇతర వెబ్సైట్లలో వస్తువుల క్రయ, విక్రయాలు చేసేటప్పుడు వీలైనంత వరకు ఆన్లైన్ చెల్లింపుల కంటే నగదు లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆన్లైన్ చెల్లింపుల్లో తొందరపడొద్దు ఆన్లైన్ వెబ్సైట్లలో కొనుగోళ్లు చేసేటప్పుడు తొందరపడొద్దు. అవతలి వ్యక్తులు మనల్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని, పిన్ ఎంటర్ చేయాలని గందరగోళ పెడుతున్నట్లయితే అది మోసమని గ్రహించాలి. మనకు పంపే క్యూఆర్ కోడ్‌ను గమనించినా..మన బ్యాంకు ఖాతా నుంచే డబ్బులు కోతకు గురవుతాయని గుర్తించవచ్చు. – బి.రవికుమార్‌రెడ్డి, డీఎస్పీ, సీఐడీ సైబర్ క్రైమ్స్ -
కోర్ట్ లో టిప్పులు.. యూనిఫామ్ పై QR కోడ్..
-
Viral Video: నగదు లేకున్నా పర్లేదు పేటీఎం చెయి! ఉద్యోగికి షాకిచ్చిన కోర్టు
ప్రపంచమంతా డిజిటల్మయమవడంతో ‘చిల్లర’కు కొరత ఏర్పడింది. చిన్నాపెద్దా అని తేడా లేకుండా ఎంత మొత్తమైనా ఆన్లైన్లో చెల్లించేస్తున్నారు చాలామంది. మామూలుగా ఏదైనా వస్తువు కొన్నప్పుడు లేక సేవలు పొందినప్పుడు డబ్బులు ఆన్లైన్ చెల్లింపు యాప్‌ల ద్వారా చేయడం తెలిసిందే. కానీ, ‘మామూలు’ కూడా ఆన్‌లైన్‌గా మారడం ఇక్కడ ప్రత్యేకం. అలహాబాద్ హైకోర్టులో వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైకోర్టుకు పనుల నిమిత్తం వచ్చే లాయర్ల వద్ద అక్కడ పనిచేసే జమాదార్ (బండిల్స్ ఎత్తేవాడు) ‘టిప్పు’ వసూలు చేసేవాడు. అయితే, ఇటీవల కాలంలో చాలామంది చెల్లింపులు ఆన్‌లోనే చేస్తున్నారు. అందువల్ల చిన్న నోట్ల కరెన్సీకి కొరత ఏర్పడింది. దీంతో జమాదార్ రాజేంద్ర కుమార్ ఆన్లైన్ సేవలను వాడుకోవాలనుకున్నాడు. నగదు లేకుంటే పేటీఎం ద్వారా చెల్లించినా సరేనంటూ వాళ్లకు ఆఫర్ ఇచ్చాడు. అంతేకాకుండా పేటీఎం క్యూ ఆర్ కోడ్‌ను ఏకంగా యూనిఫారంకు తగిలించుకుని కోర్టు విధులకు హాజరయ్యాడు. కానీ, ఈ తతంగానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగుచూసింది. రాజేంద్ర కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు జడ్జి జస్టిస్ అజిత్ సింగ్ ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బిందాల్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టగా విషయం నిజమేనని తేలింది. దీంతో రాజేంద్ర కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సాధారణంగా కేసులో విజయం సాధించిన లాయర్లు జమాదార్‌కు కొంత చిల్లర టిప్పుగా ఇస్తారని కొందరు హైకోర్టు ఉద్యోగులు చెప్పుకొచ్చారు. కానీ, రాజేంద్ర కుమార్ కోర్టు పరిసరాల్లో, అది కూడా యూనిఫాంకు పేటీఎం స్టికర్‌ను అంటించుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. (చదవండి: వీడియో కాల్‌తో విపత్తు.. ఫోన్ లిఫ్ట్ చేశామో పోర్న్ చిత్రాలతో ఎడిట్ చేసి..) -
కొత్త డ్రగ్ రూల్ తో నకిలీ మందులకు చెక్
-
కేంద్రం కొత్త రూల్స్..ట్యాబ్లెట్, సిరప్ కొనుగోలుదారులకు ముఖ్యగమనిక
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న డ్రగ్ రూల్స్ (ఫార్మాస్యూటికల్)ను సవరించింది. ఈ రూల్స్ వచ్చే ఏడాది ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 18న విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం..డ్రగ్ రూల్స్ (ఎనిమిదవ సవరణ)- 2022లో భాగంగా కాల్పోల్,అల్లేగ్రా,బెటాడిన్, గెలుసిల్, డోలో 650తో సహా టాప్ 300 డ్రగ్ ఫార్ములేషన్ ప్యాకేజింగ్ లేబుల్‌పై క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్‌ను తప్పని సరి చేస్తున్నట్లు అధికారింగా ప్రకటించింది. ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా నకిలీ మెడిసిన్‌ను గుర్తించవచ్చని తెలిపింది. ఆగస్ట్ 1, 2023 నుంచి కొత్త డ్రగ్ రూల్స్ ఆగస్ట్ 1, 2023 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. షెడ్యూల్ హెచ్2లో పేర్కొన్న డ్రగ్ ఫార్ములేషన్ ఉత్పత్తుల తయారీదారులు దాని ప్రాథమిక ప్యాకేజింగ్ లేబుల్ (ప్రైమరీ ప్యాకేజీ లేబుల్) పై బార్ కోడ్ లేదా క్విక్ రెస్పాన్స్ కోడ్‌ను ప్రింట్ చేయాలి లేదా అతికించాలి. ప్రాథమిక ప్యాకేజీ లేబుల్‌లో తగినంత స్థలం లేకపోతే, నిల్వ చేసే సెకండరీ ప్యాకేజీ లేబుల్‌పై ప్రామాణీకరణను సులభతరం చేయడానికి సాఫ్ట్వేర్ అప్లికేషన్‌తో చదవగలిగే డేటా ఉంచాలని’ స్పష్టం చేసింది క్యూఆర్ కోడ్‌తో క్యూఆర్ కోడ్ సాయంతో మెడిసిన్ తయారీ చేసిన ప్రొడక్షన్ కోడ్, డగ్స్ సరైన..సాధారణ పేరు, బ్రాండ్ పేరు, తయారీదారు పేరు,చిరునామా, బ్యాచ్ నంబర్, మ్యానిఫ్యాక్చరింగ్ తేదీ, ఎక్స్‌పైయిరీ డేట్ (గడువు తేదీ). లైసెన్స్ నంబర్ డేటా వివరాలు తెలుసుకునే సౌకర్యం కలగనుంది. కాగా, నకిలీ మెడిసిన్ లేదా సిరప్‌ల అమ్మకాల్ని అరికట్టేందుకు రష్యా, బ్రిటన్,జర్మనీ,అమెరికా తోపాటు ఇతర దేశాల్లో ఈ క్యూఆర్ కోడ్ ఇప్పటికే అమల్లో ఉండగా తాజాగా భారత ప్రభుత్వం ఈ లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపింది. -
కేంద్రం సంచలన నిర్ణయం, గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త. సిలిండర్ వెయిటేజీ నుంచి డెలివరీ వరకు ఇలా అన్నీ రకాల విభాగాల సమాచారం వినియోగదారులకు అందనుంది. ఇందుకోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్ వ్యవస్థను అమలు చేయనుంది. ఇటీవల కాలంలో గ్యాస్ కంపెనీలపై వినియోగదారులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. గ్యాస్ సంస్థలు ప్రకటించినట్లుగా కాకుండా తమకు 1 నుంచి 2 కేజీల గ్యాస్ తగ్గుతుందని, భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, బుక్ చేసిన గ్యాస్ సిలిండర్ డెలివరీ టైంకు రావడం లేదనే’ ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. అయితే ఈ ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. కేంద్ర చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇకపై ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్లను క్యూఆర్‌కోడ్‌తో మెటల్ స్టిక్కర్‌ను అందించనున్నట్లు తెలిపారు. తద్వారా స్మార్ట్‌ఫోన్‌తో గ్యాస్ సిలిండర్‌కున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మీ గ్యాస్ ఏ ఏజెన్సీ నుండి డెలివరీ అవుతుంది. సిలిండర్‌లో గ్యాస్‌ను ఎక్కడ ఫిల్ చేశారు. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్‌కు భద్రతా ప్రమాణాలు పాటించారా? లేదా?. సిలిండర్‌లో ఎన్ని కేజీల గ్యాస్ ఉంది. ఎప్పుడు, ఏ తేదీన డెలివరీ అవుతుందనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇలా క్యూఆర్‌కోడ్‌ను సిలిండర్లకు అమర్చడం ద్వారా..దొంగిలిస్తున్న గ్యాస్‌తో పాటు సిలిండర్ భద్రత, ఇతర గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ వంటి విషయాల సమాచారం వినియోగదారులకు అందించ వచ్చని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఈ ప్రాజెక్టు మూడు నెలల్లో పూర్తి కానుంది. క్యూఆర్ కోడ్ ప్రస్తుతం ఉన్న సిలిండర్లతో పాటు కొత్త సిలిండర్లకు క్యూఆర్ కోడ్ మెటల్ స్టిక్కర్‌ను అమర్చనున్నట్లు వెల్లడించారు. Fueling Traceability! A remarkable innovation - this QR Code will be pasted on existing cylinders & welded on new ones - when activated it has the potential to resolve several existing issues of pilferage, tracking & tracing & better inventory management of gas cylinders. pic.twitter.com/7y4Ymsk39K — Hardeep Singh Puri (@HardeepSPuri) November 16, 2022 -
ఒక్క క్లిక్‌తో ఓపీ రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: ప్రస్తుత డిజిటల్ యుగంలో అగ్గిపెట్టె నుంచి ఆడి కారు కొనుగోలు వరకూ ఆర్థిక లావాదేవీలు మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. బ్యాంకు ఖాతా నెంబర్, మొబైల్ ఫోన్ నెంబర్‌తో పనిలేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అవతలి వ్యక్తి ఖాతాలోకి డబ్బులు పంపుతున్నారు. ఇదే తరహాలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా అవుట్ పేషెంట్ (ఓపీ) రిజిస్ట్రేషన్ పూర్తి చేసి డాక్టర్ అపాయింట్మెంట్కు టోకెన్ పొందే వెసులుబాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి వస్తోంది. దక్షిణాదిలో తొలిసారిగా ఈ సేవలు విజయవాడ జీజీహెచ్‌లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈమేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ విధానంపై ఆస్పత్రిలో రిసెప్షన్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుతో పాటు క్యూఆర్ కోడ్ హోర్డింగ్స్, ఓపీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలను అమర్చారు. ఏమిటి లాభం? సాధారణంగా ఎవరైనా వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే తొలుత ఓపీ కౌంటర్లో వివరాలను నమోదు చేసుకోవాలి. రోగి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఇతర వ్యక్తిగత వివరాలను వెల్లడించాలి. అనంతరం సంబంధిత విభాగానికి రోగిని రిఫర్ చేస్తూ టోకెన్ ఇస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు కనీసం 5–10 నిమిషాలు పడుతుంది. పెద్దాస్పత్రుల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రోగులు గంటల తరబడి క్యూలో నిల్చొని పడిగాపులు పడాల్సి వస్తుంది. అదే క్యూఆర్ కోడ్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేరుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌కు వెళ్లి టోకెన్ తీసుకుని డాక్టర్‌ను సంప్రదించవచ్చు. క్యూలైన్లో నిరీక్షించే అగచాట్లు తప్పుతాయి. దేశానికి ఆదర్శంగా ఏపీ ప్రజలకు కాగిత రహిత వైద్య సేవలు అందించడంలో ఏపీ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఏపీ విధానాలను మార్గదర్శకంగా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు సూచిస్తున్నట్లు నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్హెచ్ఏ) డైరెక్టర్ కిరణ్ గోపాల్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3.50 కోట్ల మందికి ఆభా ఐడీలు సృష్టించారు. వీటిని ఆయా వ్యక్తుల ఆరోగ్య రికార్డులతో అనుసంధానించడంలో ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఉంది. డిజిటల్ హెల్త్ సేవల్లో దేశంలోనే టాప్‌లో ఉన్న మన రాష్ట్రాన్ని పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం వరించాయి. మిగిలిన ఆస్పత్రులకూ విస్తరిస్తాం విజయవాడ జీజీహెచ్‌లో ఈ వారం క్యూఆర్ కోడ్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తాం. అనంతరం మిగిలిన ఆస్పత్రులకు సేవలను విస్తరిస్తాం. డిజిటల్ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు వెళుతోంది. ప్రతి వ్యక్తి ఆభా ఐడీని వారి ఆరోగ్య రికార్డులతో అనుసంధానిస్తున్నాం. తద్వారా ఆ వ్యక్తి దేశంలో ఎక్కడికి వెళ్లిన ఆరోగ్య చరిత్ర వివరాలన్నీ ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వస్తాయి. – జి.ఎస్.నవీన్‌కుమార్, ప్రత్యేక కార్యదర్శి, రాష్ట్ర డిజిటల్ హెల్త్ ఇదీ నమోదు విధానం.. ► స్మార్ట్ ఫోన్ ద్వారా ఆస్పత్రిలో ప్రదర్శించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ► వెంటనే యూఆర్ఎల్ కోడ్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేస్తే నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన ఆభా, ఇతర భాగస్వామ్య యాప్‌లు పేటీఎం, డ్రిఫ్కేస్, ఆరోగ్యసేతు, ఎక కేర్ లాంటి యాప్‌లు కనిపిస్తాయి. ► ఒకవేళ ఇప్పటి వరకూ ఆ యాప్‌లు ఫోన్లో లేకుంటే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. ► ఆయుష్మాన్ డిజిటల్ హెల్త్ అకౌంట్(ఆభా) 14 అంకెల గుర్తింపు/ఆభాలో రిజిస్టర్ చేసిన ఫోన్ నెంబర్/మెయిల్ ఐడీ ద్వారా యాప్‌లో రిజిస్టర్ అవ్వాలి. ► యాప్‌లోకి లాగిన్ అయిన వెంటనే ఆభా వివరాలు ప్రత్యక్షం అవుతాయి. వీటిని ఆస్పత్రితో షేర్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. షేర్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే టోకెన్ నెంబర్ వస్తుంది. ఈ టోకెన్ 30 నిమిషాల పాటు వ్యాలిడిటీలో ఉంటుంది. ► టోకెన్ నెంబర్ వచ్చాక ఆస్పత్రిలో కౌంటర్‌కు వెళ్లి ఆభా గుర్తింపు నెంబర్, ఫోన్ నెంబర్ తెలియచేసి ఏ స్పెషాలిటీలో ఓపీ అవసరమో చెబితే రిసెప్షన్ సిబ్బంది స్లిప్ ఇస్తారు. దీన్ని తీసుకుని నేరుగా డాక్టర్‌ను సంప్రదించవచ్చు. -
నగదు చెల్లింపుల కోసం క్యూ ఆర్ కోడ్ స్కాన్.. ఇవి తెలుసుకోకపోతే జేబుకి చిల్లే!
ఓ టెక్కీ బ్యాంక్ నుంచి మెయిల్లో వచ్చిందని అనుకుని తన మొబైల్‌కు వచ్చిన క్యూ ఆర్‌కోడ్ ను స్కాన్ చేశాడు. వెంటనే అతని ఫోన్లో ఉన్న వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, బ్యాంకు అకౌంట్ పిన్‌లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. కొద్దిసేపటి తరువాత అతని బ్యాంకు అకౌంట్లో ఉన్న నగదు కూడా ఖాళీ అయింది, వ్యక్తిగత ఫోటోలను చూపి దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు తెలిపాడు. ఇటీవల టెక్నాలజీ వాడకం పెరిగే కొద్దీ నేరగాళ్లు కొత్త దారులను ఎంచుకుంటున్నారు. కాలానుగుణంగా కొత్త రకం దోపిడికి వ్యూహాలు రచ్చిస్తున్నారు. మన బ్యాంక్ నుంచి మనకి తెలియకుండానే నగదు ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వాటిపై కాస్త అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. క్యూఆర్ కోడ్‌తో జాగ్రత్త.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ పేరుతో కేటుగాళ్లు కొత్త రకం దోపిడికి స్కెచ్ వేస్తున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మీరు ఇబ్బందుల్లో పడక తప్పదు. బ్యాంక్ నుంచి నగదు తీసుకోవడానికి ఓ వ్యక్తి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మోసపోగా మరో రెస్టారెంట్లో పెట్టిన క్యూ ఆర్‌కోడ్‌ను మార్చివేసి తమ అకౌంట్ కు నగదు జమఅయ్యేలా చేసి వంచనకు పాల్పడిన ఘటనలు ఇటీవల ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మోసగాళ్లు పలు కేంద్రాల్లో( రెస్టారెంట్లు, షాపుల్లో, కస్టమర్లు రద్దీ ఉండే ప్రాంతాలు) యజమానులకు తెలియకుండా అక్కడి క్యూ ఆర్‌కోడ్‌ను మార్చి తమ క్యూఆర్ సంకేతాన్ని ఉంచుతున్నారు. ఇది తెలియక కస్టమర్లు తమ బిల్లులు చెల్లించడానికి క్యూ ఆర్ కోడ్‌ని స్కాన్ చేసి అందులోకి డబ్బులను పంపుతున్నారు. అయితే చివరికి ఈ పైసలన్నీ మోసగాళ్ల ఖాతాల్లోకి జమఅవుతున్నాయి. మరో వైపు రెస్టారెంట్లో రోజురోజుకు ఆదాయం తగ్గుతుండటంతో దీనిపై విచారించిన యజమానులకు అసలు నిజం తెలియంతో ఈ తరహా మోసాలు బయటపడ్డాయి. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
క్యూఆర్ కోడ్‌లో భూమి
సాక్షి, అమరావతి: బ్రిటీష్ కాలం నాటి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి వివాదాలకు శాశ్వతంగా తెరదించే లక్ష్యంతో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా భూముల రీ సర్వే కార్యక్రమాన్ని శరవేగంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ముద్రించనుంది. దీన్ని స్కాన్ చేయడం ద్వారా భూ కమతం, విస్తీర్ణం, ఎలాంటి భూమి, మ్యాప్ తదితర వివరాలన్నీ తెలుసుకోవచ్చు. రీ సర్వేలో ఆక్షాంశాలు, రేఖాంశాలతో (జియో కో–ఆర్డినేట్స్) భూమి హద్దులను నిర్ధారిస్తున్నారు. భూమికి నలువైపులా వీటిని సూచించడం ద్వారా విస్తీర్ణాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చు. వీటి ఆధారంగా రైతుల పట్టాదార్ పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు. ప్రస్తుతం ఒక సర్వే నంబర్‌కి ఒక ఎఫ్ఎంబీ ఉండగా, నలుగురైదుగురు భూ యజమానులుంటే ఉమ్మడిగా ఒక మ్యాప్ కేటాయిస్తున్నారు. రీ సర్వే తర్వాత ప్రతి భూమిని (సెంటు భూమి విడిగా ఉన్నా సరే) సర్వే చేసి ప్రత్యేకంగా రాళ్లు పాతుతారు. దానికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ఇస్తారు. ఆ సర్వే నంబర్లో ఎంత మంది ఉంటే అందరి మ్యాప్‌లు విడివిడిగా పొందుపరుస్తారు. ప్రతి భూ యజమానికి తమ భూములపై ఎవరూ సవాల్ చేయడానికి వీలు లేని శాశ్వత హక్కులు లభిస్తాయి. 70 బేస్ స్టేషన్లతో కార్స్ నెట్వర్క్ జీపీఎస్ కార్స్ నెట్వర్క్ (కంటిన్యుస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ నెట్వర్క్) ద్వారా భూములను కొలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 బేస్ స్టేషన్లు శాటిలైట్ రేడియో సిగ్నళ్లను స్వీకరించి కచ్చితమైన అక్షాంశ, రేఖాంశాలను సెంట్రల్ కంట్రోల్ స్టేషన్‌కు పంపుతాయి. కార్స్, డ్రోన్, రోవర్ సహాయంతో భూములను కచ్చితంగా కొలుస్తారు. తద్వారా ప్రతి స్థిరాస్తి కొల తలు, హద్దులు, విస్తీర్ణం, భూ కమత పటం ల్యాండ్ రిజిస్టర్లో డిజిటల్ రూపంలో నమోదవుతాయి. వీటితో మ్యాప్‌లో క్యూఆర్ కోడ్ రూపంలో పొందుపరుస్తారు. నకిలీలు, ట్యాంపరింగ్‌కు తెర ప్రతి భూమికి (ల్యాండ్ పార్సిల్) ఒక విశిష్ట సంఖ్య కేటాయించి భూమి వివరాలతోపాటు భూ యజమాని ఆధార్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ సేకరించి భూ రికార్డులో భద్రపరుస్తారు. భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. డూప్లికేట్ రికార్డులు, ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదు. ఆయా భూముల క్రయ విక్రయాలు జరిగిన వెంటనే రికార్డుల్లో ఆటోమేటిక్‌గా మారిపోతాయి. తద్వారా భూ సమాచారాన్ని ఎవరైనా, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ ఆధారిత భూ సమాచార వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీనిద్వారా ఎవరైనా తమ భూమిని మ్యాప్‌తో సహా చూసుకోవడానికి వీలుంటుంది. సర్వేతో ఇవీ ప్రయోజనాలు.. ► ప్రతి ఆస్థికి యజమాని గుర్తింపు ► రికార్డుల్లో పదిలంగా ఆస్తి హక్కులు ► ఆ ఆస్తిని మరొకరు ఇతరులకు విక్రయించే అవకాశం ఉండదు ► పకడ్బందీగా హద్దులు, కొలతలు ► క్షేత్రస్థాయిలో భూమి ఏ ఆకారంలో ఉందో రికార్డుల్లో అలాగే ఉంటుంది ► ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఆస్తి వివరాలు తెలుసుకోవచ్చు ► హద్దు రాళ్లు తొలగించినా, గట్టు తెగ్గొట్టినా మీ ఆస్తి డిజిటల్ రికార్డుల్లో భద్రంగా ఉంటుంది. ► భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం, సంపూర్ణ హక్కుతో ఉంటుంది. సంపూర్ణ హక్కులు, రక్షణే లక్ష్యం స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా భూముల రీ సర్వే నిర్వహిస్తున్నాం. రీ సర్వేతో అస్తవ్యస్థంగా ఉన్న రికార్డుల ప్రక్షాళన జరుగుతుంది. వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం డిజిటల్ రికార్డులు తయారవుతాయి. దళారీ వ్యవస్థకు ఆస్కారం ఉండదు. ప్రస్తుతం సర్వే నెంబర్ల వారీగా హద్దు రాళ్లు లేకపోవడంతో సరిహద్దు వివాదాలు తలెత్తుతున్నాయి. రీ సర్వేలో ప్రతి సర్వే నెంబరును ఉచితంగా సర్వే చేస్తున్నాం. వైఎస్సార్ జగనన్న హద్దురాళ్లు ఏర్పాటు చేస్తాం. ప్రతి భూమిపై సంబంధిత యజమానికి సంపూర్ణ హక్కు, రక్షణ కల్పించడమే రీ సర్వే ఉద్దేశం. – సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ -
పేటీఎం తరహాలో ‘పేసీఎం’.. క్యూఆర్ కోడ్‌తో నేరుగా..!
బెంగళూరు: కర్ణాటక అధికార పార్టీ బీజేపీపై సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. యూపీఐ పేమెంట్ యాప్ పేటీఎం తరహాలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖచిత్రం, క్యూఆర్ కోడ్‌తో ‘పేసీఎం’ పోస్టర్లను బెంగళూరు మొత్తం ఏర్పాటు చేసింది. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినట్లయితే.. వినియోగదారులు నేరుగా ‘40 శాతం సర్కార్’ వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను కాంగ్రెస్ ప్రారంభించింది. కొద్ది రోజులుగా బీజేపీ పాలనలో 40 శాతం కమిషన్ తప్పనిసరిగా మారిందనే ఆరోపణలు వచ్చాయి. 40 శాతం కమిషన్‌ను ఎత్తిచూపేలా ఈ వెబ్సైట్, పోస్టర్లను డిజైన్ చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతిని ఎండగట్టేందుకు గత వారమే ప్రచారం మొదలు పెట్టింది కాంగ్రెస్. 40percentsarkara.com ద్వారా ప్రభుత్వ అవినీతిని నివేదించాలని, వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు సూచిస్తోంది. రాష్ట్ర పరిపాలన విభాగం 40శాతం కమిషన్‌తో నడుస్తోందని, దోపిడీదారులతో నిండిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కొద్ది రోజుల క్రితమే ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం నోరు విప్పే వరకు తాము ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఇదీ చదవండి: ‘భారత్ జోడో యాత్రను నియంత్రించండి’.. కేరళ హైకోర్టులో పిటిషన్ -
పాఠం స్కాన్ చేసేయొచ్చు.. మళ్లీ మళ్లీ వినొచ్చు
సాక్షి, ప్రత్తిపాడు(గుంటూరు జిల్లా): ఒక్క స్కాన్‌తో పాఠం మళ్లీమళ్లీ వినొచ్చు. దృశ్యరూపంగానూ వీక్షించొచ్చు. అవగతమయ్యే వరకు వినొచ్చు. చూడొచ్చు. అవును ప్రభుత్వం పాఠ్యాంశాల బోధనలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాఠ్యపుస్తకాలకు క్యూఆర్ కోడ్ హంగులు అద్దింది. దీనివల్ల పిల్లలు పాఠ్యాంశాలను ఇళ్ల వద్ద కూడా అర్థమయ్యేవరకూ వినొచ్చు. చూడొచ్చు. గతంలో ఎన్నో ఇబ్బందులు గతంలో విద్యార్థులు తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం అర్థం కాకపోతే చాలా గందరగోళానికి గురయ్యేవారు. ఏం చేయాలో పాలుపోక లోలోన కుమిలిపోయేవారు. అర్థం కాలేదని అడిగితే టీచర్ ఏమంటారోనని భయపడేవారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం క్యూఆర్ కోడ్‌తో పాఠ్యపుస్తకాలను రూపొందించింది. ఒక్కో పాఠానికి ఒక్కో కోడ్.. గుంటూరు జిల్లాలో 1,113 పాఠశాలలు ఉండగా 1,35,871 మంది విద్యార్థులు, పల్నాడు జిల్లాలో 1,631 పాఠశాలలు ఉండగా 2,12,025 మంది విద్యార్థులు, బాపట్ల జిల్లాలో 807 పాఠశాలలు ఉండగా 59,099 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికోసం సుమారు 25.56 లక్షలకుపైగా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం దశలవారీగా అందించింది. గతంలో పాఠ్యపుస్తకం మొత్తానికి కలిపి ఒక్కటే క్యూ ఆర్ కోడ్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి పాఠం వద్ద క్యూ ఆర్ కోడ్‌ను ముద్రించింది. ఈ కోడ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేస్తే ఎంచక్కా డిజిటల్ పాఠాలను వినొచ్చు. చూడొచ్చు. దీక్ష యాప్ లేకున్నా.. తొలుత గణితం, భౌతిక, సాంఘిక శాస్త్రాల పుస్తకాలపైనే క్యూఆర్ కోడ్లు ముద్రించారు. అప్పట్లో దీక్ష యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని విద్యార్థి లేదా ఉపాధ్యాయుడు అనే ఆప్షన్ ఇచ్చి ఆ తర్వాత క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే పాఠం వచ్చేది. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాలపైనా కోడ్‌ను ముద్రించారు. ఇప్పుడు దీక్ష యాప్ లేకున్నా నేరుగా గూగుల్ లెన్స్ ద్వారా కోడ్ స్కాన్ చేసి పాఠ్యాంశాలు వినవచ్చు. ఎంతో ఉపయుక్తం క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పునశ్చరణ సమయంలో బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. దృశ్యరూపంలో పాఠాలు వినడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటాయి. – సీహెచ్ వెంకటరెడ్డి, ఉపాధ్యాయుడు, బీవీఆర్ జెడ్పీ హైస్కూల్, ప్రత్తిపాడు కొత్తగా.. ఆసక్తిగా ఉంది క్లాస్ రూంలో టీచర్ చెప్పిన పాఠం అర్థం కాని సమయంలో ఈ క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసి మళ్లీ పాఠం వినవచ్చు. ఇది మాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వీడియో రూపంలో పాఠాలు వినడం కొత్తగా, ఆసక్తిగా ఉంది. – గురుగూరి పూజ, 9వ తరగతి విద్యార్థిని, ప్రత్తిపాడు హైస్కూల్ -
క్యూఆర్ కోడ్‌తో రైల్వే టిక్కెట్లు
సాక్షి, హైదరాబాద్: అన్ రిజర్వ్డ్ రైల్వే టిక్కెట్లు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల కోసం ఇకక్యూలైన్‌లలో పడిగాపులు కాయాల్సిన పని లేదు. క్యూఆర్ కోడ్‌తో మరింత సులభంగా ఈ టిక్కెట్లు తీసుకోవచ్చు. నగదు రహిత సేవలను మరింత ప్రోత్సహించేందుకు, డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు దక్షిణమధ్యరైల్వే తాజాగా ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. రైల్వేస్టేషన్లలోని ఆటోమేటిక్ టికె ట్ వెండింగ్ మెషిన్ల (ఏటీవీఎం) ద్వారా టికెట్ల కొనుగోలు కోసం ఈ క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ సదుపాయాన్ని అందుబా టులోకి తెచ్చారు. ఏటీవీఎంలలో ప్రయాణికులు తమ వివరాలను నమోదు చేసిన తరువాత, ప్రస్తుతం ఉన్న చెల్లింపు సదుపాయాలకు అదనంగా పేటీఎమ్, యూపీఐ వంటి మరో రెండు ఆప్షన్లు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ ద్వా రా చెల్లింపునకు ప్రయాణికులు ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. అనంతరం ప్రయాణికులకు స్క్రీన్‌పై క్యూ ఆర్ కోడ్ కనిపిస్తుంది. దీనిని స్మార్ట్ ఫోన్లో స్కాన్ చేస్తే టికెట్ చార్జీ చెల్లింపు పూర్తవుతుంది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిన తర్వాత టికెట్ మెషిన్ ద్వారా బయటకు వస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ తెలిపారు. స్మార్ట్‌కార్డు లేకపోయినా... ఏటీవీఎంల ద్వారా అన్ రిజర్వ్డ్ టికెట్లు పొందాలనుకుంటే ప్రయాణికులు ఇప్పటివరకు కచి్చతంగా నగదుతో కూడిన స్మార్ట్ కా ర్డులను కలిగి ఉండాల్సి వచ్చేది. వీటిని ఎ ప్పటికప్పుడు రీచార్జి చేసుకుంటూ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ పద్ధతిలో లేదా జనరల్ బుకింగ్ కౌంటర్లో చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ స దుపాయానికి అదనంగా పేటీఎమ్, యూ పీఐ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ పద్ధతిలో స్మార్ట్ కార్డ్ అవసరం ఉండదు. జనరల్ బుకింగ్ కౌంటర్ల వద్ద క్యూలైన్లను, నగదు లావాదేవీలను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని జీఎం తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
హైటెక్ బిచ్చగాడు.. వీడు మాములోడు కాదు
గంగిరెద్దులు ఆడించే వ్యక్తి క్యూఆర్ కోడ్‌తో దానాలు స్వీకరించే వీడియోను గతంలో షేర్ చేశారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ వృద్ధికి ప్రతీకగా ఆ వీడియోను మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. అభివృద్ధి పట్టికలో అట్టడుగున ఉండే బీహార్‌లో ఓ బిచ్చగాడు మెడలో క్యూఆర్ కోడ్ తగిలించుకుని అడుక్కుంటూ వార్తల్లో ట్రెండవుతున్నాడు. బీహార్ రాష్ట్రంలో బెట్టియా రైల్వే స్టేషన్ ఉంది. అక్కడే ఉన్నాడు హైటెక్ బిచ్చగాడు రాజు పటేల్ (40). రైల్వేస్టేషన్లు, రైళ్లలో అడుక్కుంటూ రాత్రి వేళ అక్కడే పడుకుంటూ కొన్నేళ్లుగా జీవిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. ఎవరిని ధర్మం అడిగినా చిల్లర లేదంటూ చెప్పడం కామన్ అయిపోయింది. దీంతో రాజు పటేల్‌కి బిచ్చం తగ్గిపోయింది. మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా అప్డేట్ అయ్యాడు రాజు పటేల్. గతంలో బిచ్చం ఎత్తుకోగా వచ్చిన డబ్బులతో సమీపంలో బ్యాంకుకి వెళ్లి ఖాతా ఓపెన్ చేశాడు. బ్యాంకు అకౌంట్ ఆధారంగా ఓ డిజిటల్ పేమెంట్ సర్వీస్ అందించే సంస్థ నుంచి ఈ వాలెట్ - క్యూ ఆర్ కోడ్ సాధించాడు. అక్కడితో ఆగిపోలేదు.. తనకు బిచ్చం వస్తుందో రావట్లేదో తెలుసుకునేందుకు ఓ ట్యాబ్ కూడా కొనుక్కున్నాడు. ఎప్పటిలాగే స్టేషన్ ఆవరణలో బిచ్చం అడుక్కోవడం ప్రారంభించారు. అయితే కొత్త పద్దతిలో దీన్ని ప్రారంభించారు. మెడలో క్యూఆర్ కోడ్ ఉన్న ప్లకార్డు, చేతిలో ట్యాబ్‌తో.. ధర్మం చేయండి బాబు అని వేడుకుంటాడు. ఎవరైనా బిచ్చం వేయబోతే వెంటనే మెడలో క్యూఆర్ కోడ్ చూపిస్తాడు. ధర్మం వచ్చింది లేనిది ట్యాబ్‌లో చెక్ చేసుకుంటాడు. Bihar | Raju Patel, a beggar in Bettiah, goes digital; accepts PhonePe & puts a QR code around his neck "I accept digital payments, it's enough to get the work done & fill my stomach," said Raju Patel Visuals from Bettiah railway station pic.twitter.com/nbw83uXop6 — ANI (@ANI) February 8, 2022 రాజు పటేల్ బిచ్చం అడుక్కునే తీరుతో తోటి బిచ్చగాళ్లు అవాక్కవుతున్నారు. ఆ నోటా ఈ నోటా చివరకు రాజు పటేల్ స్టోరీ సోషల్ మీడియాకు చేరుకుంది. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ విస్త్రృతికి ఇదో ఉదాహరణగా కొందరు చెబుతుంటే మరికొందరు డిజిటల్ పేమెంట్స్ వచ్చినా పేదరికం మాత్రం పోవడం లేదంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. -
‘రేషన్’కు ట్రాక్.. పరేషాన్‌కు చెక్
సాక్షి, సిద్దిపేట: ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్) బియ్యం పక్కదారి పట్టకుండా గన్నీ బ్యాగుకు క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టి ‘ట్రాక్’లోకి తీసుకువచ్చేందుకు పౌర సరఫరాల అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్‌తో గన్నీ బ్యాగుల కొరత, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. రేషన్ బియ్యం సరఫరా కోసం ఏటా గన్నీ బ్యాగులను సమకూర్చడం సమస్యగా మారింది. ఈ క్యూఆర్ కోడ్‌తో బియ్యం బస్తా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనే దానిని ట్రాక్ చేయనున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ 90.4 లక్షలమంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదికి 10.5 కోట్ల బ్యాగులను వినియోగిస్తోంది. ఇందులో సుమారు 35 శాతం సంచులు ఏటా మాయమవుతున్నాయి. దీంతో ప్రతియేడు గన్నీ బ్యాగుల కోసం టెండర్లు పిలిచి కొనుగోలు చేస్తున్నారు. రేషన్ షాప్‌లకు గన్నీ బ్యాగులను ప్రభుత్వం తిరిగి ఒక్కోదాన్ని రూ.21లకు కొనుగోలు చేస్తుంది. బహిరంగ మార్కెట్లో దీని ధర ఎక్కువే ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఉన్న బియ్యం బస్తా అక్రమమార్గంలో పట్టుబడితే ఆ బస్తా ఏ షాప్‌నకు చెందినది.. ఏ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి వచ్చిందని తెలుసుకోవడం సులభతరం. పైలెట్ ప్రాజెక్ట్‌గా సిద్దిపేట, జనగామ రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద సిద్దిపేట, జనగామ జిల్లాలను ఎంపిక చేసి క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టనున్నారు. తొలిదశలో 10 వేల బస్తాలకు కోడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి క్యూఆర్ కోడ్ ఉన్న గన్నీ బ్యాగుల ద్వారానే రేషన్ షాప్‌లకు బియ్యం సరఫరా చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ షాప్‌నకు ఎంత స్టాక్ పంపించారు.. నిర్దిష్ట దుకాణంలో ఎన్ని సంచులు అందుబాటులో ఉన్నాయి.. బఫర్ గోదాంలో ఇంకా ఎంత స్టాక్ ఉంది.. ఇలాంటి చాలా ప్రశ్నలకు క్షణాల్లో సమాధానం తెలుసుకోవచ్చు. ట్యాగ్లు తారుమారు చేసినా ప్రూఫ్, డ్యామేజ్ చేయబడవు. ఏదైనా ప్రయత్నాలు జరిగితే, సెంట్రల్ సర్వర్‌లో హెచ్చరికను జారీచేస్తుంది. దీని ద్వారా అధికారులు ఆ ప్రదేశాన్ని గుర్తించి చర్యలను తీసుకోనున్నారు. క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నాం బియ్యం గన్నీ సంచికి క్యూ ఆర్ కోడ్ తొలివిడతలో ఒక్క రైస్ మిల్లో కుట్టిస్తున్నాం. ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ కింద సిద్దిపేటను ఎంపిక చేసింది. ఫిబ్రవరి నుంచి సరఫరాను ప్రారంభించే అవకాశాలున్నాయి. గన్నీ బ్యాగులు కొరత రాకుండా క్యూ ఆర్ కోడ్ ఉపయోగపడనుంది. –హరీశ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
క్యూఆర్ కోడ్ ఉన్నపెప్సీ ట్రక్‌లను తగలబెట్టేస్తా!
ప్రముఖ కంపెనీ ఇటీవల ఇచ్చే కొన్ని అడ్వర్టైస్మెంట్ల విషయంలో కాస్త జాగురకతతో వ్యవహరించకపోతే ఇంతే సంగతులు. ఇటీవల కొన్ని అడ్వర్టైస్మెంట్లు ఆ పరిస్థితిని ఎదుర్కొన్న ఘటనలను కూడా చూశాం. అయితే వినియోగదారులకు ఉపయుక్తంగా ఇచ్చే క్యూఆర్ కోడ్ పట్ల పాకిస్తాన్లో ఒక వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా క్యూర్ కోడ్ తీసేయాలి అని హెచ్చరించాడు. (చదవండి: కోవిడ్ అంటే కరోనా కాదు మనిషి పేరు అని తెలుసా!!) అసలు విషయంలోకెళ్లితే...పాకిస్తాన్‌లోని కరాచీలో రద్దీగా ఉండే రహదారిపై ముల్లా అనే వ్యక్తి సెవెన్ అప్ పెప్సీ బాటిల్ పై ఉన్న క్యూఆర్ కోడ్ పై అభ్యంతరం తెలిపాడు. ఈ క్యూఆర్ కోడ్‌లో ప్రవక్త ముహమ్మద్ పేరు ఉందని చెబుతున్నాడు. అయితే అతను పక్కన ఉన్న వ్యక్తి ఇమ్రాన్ నోషాద్ ఖాన్ ఇది క్యూఆర్ కోడ్ అని చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ అంగీకరించలేదు. అంతేకాదు సెవెన్ అప్ బాటిల్ ట్రక్‌కి నిప్పు పెడతానంటూ హెచ్చరించాడు కూడా. అయితే క్యూఆర్ కోడ్ వినియోగదారులకు పోషకాహార సమాచారం, తయారీ సమాచారాన్ని అందించే నిమిత్తం పానీయాల కంపెనీలు సీసాలు, డబ్బాలపై ఇస్తారు. ఈ మేరకు ముల్లా ఈ కోడ్‌ని కంపెనీలు తొలగించాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని తన సహచరుడు ఇమ్రాన్ నోషాద్ ఖాన్ పట్టుబట్టాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో సంబంధిత కంపెనీ ప్రతినిధి ఖాన్‌కు కృతజ్ఞతలు తెలపడమే కాక క్యూఆర్ కోడ్‌ను మార్చడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పారని ఆయన తెలిపారు. (చదవండి: తల్లే పిల్లల్ని కిడ్నాప్ చేసింది.. ఎందుకో తెలుసా?) Lack of awareness. I spotted this Ashiq e Rasool he was threatening this poor truck driver on University Road and the Mob was gathering and threatening to burn the truck. The truck belongs to a well known Beverage brand I tried to explain to him that this is a QR code 1/2 pic.twitter.com/RnLS71Bf3M — Imran Noshad Khan - عمران نوشاد خان (@ImranNoshad) December 31, 2021 -
కాలం మారింది.. ఇక మీ టేబుల్ వద్దకు వెయిటర్స్ రారు, అంతా మీ చేతుల్లోనే!
తరాలు మారుతున్న కొద్దీ ప్రజల్లో అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు, అభిరుచులు ఆలోచనా విధానాల్లో విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. తదనుగుణంగా ఆధునిక జీవనశైలి అలవర్చుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచం డిజిటల్ వైపు పరుగులు తీస్తోంది. అందుకు హోటళ్లు, రెస్టారెంట్ పరిశ్రమలు సైతం మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో ఆయా రంగాలు.. సాధారణ ముద్రిత మెనూల స్థానంలో ‘డిజిటల్ మెనూ’ను ప్రవేశపెడుతున్నాయి. వెయిటర్స్‌తో సంబంధం లేకుండా కూర్చున్న చోటు నుంచే వినియోగదారులు ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి, బిల్లు చెల్లింపులు చేసేందుకు ‘నో టచ్ ఆర్డరింగ్’ పేరుతో క్యూఆర్ కోడ్ సాయంతో డిజిటల్ మెనూను తీసుకొస్తున్నాయి. – సాక్షి, అమరావతి నో వెయిటింగ్.. ఈజీ ఆర్డర్ టేబుల్‌పై ఉంచిన ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లో రెస్టారెంట్లో లభించే పదార్థాల వివరాలను పొందుపరుస్తారు. దానికే సంబంధిత బ్యాంకు ఖాతాను జత చేస్తారు. వినియోగదారులు స్మార్ట్ ఫోన్‌తో కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా డిజిటల్ మెనూను వీక్షించవచ్చు. నచ్చిన ఆహారాన్ని వెయిటర్ సాయం లేకుండానే ఆర్డర్ చేయొచ్చు. ఇక్కడ ‘కిచెన్ టు టేబుల్’ (కేవోటీ)విధానంలో కోరిన ఆహారం జాప్యం లేకుండానే అందుతుంది. ఎలా తయారు చేస్తున్నారో చూడొచ్చు.. అన్య దేశాలకు చెందిన సంస్థల్లో ప్రత్యేకమైన డిజిటల్ మెనూ అందుబాటులో ఉంది. వాటిలో ట్యాబ్‌లను డిజిటల్ మెనూలుగా డైనింగ్ టేబుళ్లకు జోడిస్తున్నారు. మరోవైపు ‘సెల్ఫ్ ఆర్డరింగ్ కియోస్క్’లో మనం ఆర్డర్ చేసే పదార్థాన్ని 3డీ రూపంలో ముందుగానే చూపిస్తున్నారు. ఇక ఇంటరాక్టివ్ డిస్ప్లే టేబుల్స్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువు వచ్చేలోగా కిచెన్‌లో అది తయారు చేసే విధానాన్ని వీక్షించవచ్చు. టెక్నాలజీ వైపు.. కోవిడ్ తర్వాత భారతదేశంలోని దాదాపు మూడింట ఒకవంతు రెస్టారెంట్లు క్యూఆర్ కోడ్ ఆర్డరింగ్ టెక్నాలజీని చురుకుగా ఉపయోగిస్తున్నట్టు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2021 చివరి నాటికి దేశంలోని 80 శాతం రెస్టారెంట్లు క్యూఆర్ కోడ్లు, ఇతర ఆన్లైన్ ఆర్డరింగ్ టెక్నాలజీలోకి వస్తాయని అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లలో మాత్రమే డిజిటల్ మెనూ అమలవుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని హరిత హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లలో డిజిటల్ మెనూ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు పర్యాటక శాఖ చర్యలు చేపడుతోంది. పైలట్ ప్రాజెక్టు కింద తొలుత 14 చోట్ల అందుబాటులోకి తేనున్నామని ఏపీటీడీసీ ఎండీ సత్యనారాయణ చెప్పారు. శ్రామిక శక్తి సామర్థ్యం పెంపు రద్దీగా ఉండే హోటళ్లలో వెయిటర్‌కు ఆర్డర్ ఇచ్చేందుకు గంటల పాటు ఎదురు చూసే అవస్థలు తప్పుతాయి. ముఖ్యంగా శ్రామిక శక్తి కొరతను, పని భారాన్ని అధిగమించొచ్చు.ఈ డిజిటల్ మెనూలను బహుళ భాషల్లో సులభంగా సృష్టించవచ్చు. -
ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో ఇంటి నంబర్ కనుక్కోవడం ‘కత్తి మీద సామే’. ఒకరకంగా పజిల్‌ను తలపిస్తుంది. ఈ సంక్లిష్టతను ఛేదిస్తూ ఇంటి నంబర్ల ఆచూకీని సులభతరం చేసే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్‌ను కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటి నంబర్ల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రపంచ బ్యాంకు నిధులతో తెలంగాణ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు(టీఎండీపీ) కింద డిజిటల్ డోర్ నంబరింగ్(డీడీఎన్) సిస్టంను ఇప్పటికే సూర్యాపేట జిల్లాలోని శ్రీరాంనగర్‌లో పైలట్ ప్రాజెక్టు కింద విజయవంతంగా అమలు చేశారు. దానిని మరింత అభివృద్ధి చేస్తూ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ 5వ, బాచుపల్లి 17వ, బండ్లగూడ 19వ డివిజన్లో కూడా డిజిటల్ నంబరింగ్ విధానం తీసుకొస్తున్నారు. అలాగే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. ప్రతి ఇంటికీ కేటాయించిన ‘క్యూఆర్’కోడ్‌ను స్కాన్ చేస్తే ఇంటి యజమాని పేరు, చిరునామా వివరాలన్నీ తెలుస్తాయి. జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధానం చేసి, ఇతర ప్రభుత్వ శాఖలకు లింక్ చేయడంతో పన్నుల వసూళ్లు, ఇతర వివరాలన్నీ ఆ నంబర్ ద్వారా తెలిసిపోతుంది. క్యూఆర్ కోడ్, డిజిటలైజేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ దేశంలోని వివిధ పట్టణాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ మేరకు ఆధార్ తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి ఈ డీడీఎన్ ప్రాజెక్టును అనుసంధానించాలని సర్కార్ నిర్ణయించింది. ముందుగా 142 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో 16 అంకెల డిజిటల్ నంబర్‌తో కూడిన క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయనున్నారు. అన్ని నగరాలు, మునిసిపాలిటీల్లో ... గత కొన్నేళ్లుగా హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి నంబర్లను మార్చేందుకు అనేక ప్రయత్నాలు జరిగినా ఏదీ విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతికత సహాయంతో డిజిటల్ డోర్ నంబరింగ్ విధానాన్ని రూపొందించాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. డిజిటల్ డోర్ నంబరింగ్‌లో 16 అంకెలతో కూడిన కోడ్ ఉంటుంది. ఈ అంకెల్లోనూ మూడు విభాగాలుంటాయి. నగరం/పట్టణాన్ని తెలిపే కోడ్‌తోపాటు స్థానిక డివిజన్/వార్డును తెలిపేందుకు మరో కోడ్, స్థానిక కాలనీని తెలిపేందుకు ఇంకో కోడ్ ఉంటుంది. ఈ మూడు కోడ్ల తర్వాత ఇంటికి ప్రత్యేక డోర్ నంబరును కేటాయిస్తారు. డిజిటల్ డోర్ నంబర్ ఆధారంగా ఇల్లు ఏ నగరం /పట్టణం... ఏ వార్డు/డివిజన్లో ఉన్నదో తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఇంటి పలకపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇంటికి సంబంధించిన సమగ్ర వివరాలతోపాటు ఇంటి పన్ను, ఇతర పన్నుల వివరాలన్ని తెలిసిపోతాయి. చెల్లింపులు, బకాయి వివరాలు ప్రత్యక్షమవుతాయి. జీహెచ్ఎంసీ పరిధిలో క్యూ ఆర్ కోడ్ విధానంలో డిజిటల్ నంబరింగ్ సిస్టమ్‌ను త్వరగా అమలులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఆయా ఇళ్ల నుంచి చెత్త సేకరించేవారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, రోజుకు ఎన్ని ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నారన్న విషయం తెలుస్తుంది. ఆస్తుల బదిలీకి అనుసంధానం డిజిటల్ డోర్ నంబరింగ్‌లో కొత్తగా కేటాయించే డిజిటల్ నంబర్, క్యూఆర్ కోడ్‌ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగే లావాదేవీలకు అనుసంధానం చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో డిజిటల్ నంబర్ కేటాయింపు అనంతరం మనం ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు ఈ నంబర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో వచ్చేలా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. -
నిన్న ఆర్థిక మంత్రి, నేడు ఆనంద్ మహీంద్రా.. ఆకట్టుకుంటున్న క్యూఆర్ గంగిరెద్దు
భారత్‌లో డిజిటల్ చెల్లింపులు శరవేగంగా విస్తరించే అవకాశాలే ఉన్నాయంటూ ‘ఇండియా మొబైల్ పేమెంట్స్ మార్కెట్ 2021 నివేదిక ప్రకటించిన రోజే .. అందులోని అంశాలు నిజమే అన్నట్టుగా ఓ వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తోంది. గంగిరెద్దు ఆడించే వ్యక్తులు క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు స్వీకరిస్తున్నారను. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గంగిరెద్దు తలకు క్యూఆర్ కోడ్ ఉంచి నగదు స్వీకరిస్తున్న వీడియోను చూసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ పేమెంట్స్ శరవేగంతో విస్తరిస్తున్నాయంటూ తన ట్విట్టర్ పేజీలో స్పెషల్‌గా పోస్ట్ చేశారు. మరుసటి రోజే బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా సైతం ఇదే వీడియోను చూసి ఆశ్చర్యపోయారు. డిజిటల్ పేమెంట్స్ భారీ ఎత్తున విస్తరిస్తున్నాయని అని చెప్పడానికి ఇంత కంటే పెద్ద ఉదాహారణ ఏమైనా కావాలా ? అని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేయగా.. అది కూడా వైరల్‌గా మారింది. Do you need any more evidence of the large-scale conversion to digital payments in India?! pic.twitter.com/0yDJSR6ITA — anand mahindra (@anandmahindra) November 6, 2021 -
గంగిరెద్దులకు క్యూఆర్ కోడ్.. నిర్మలా సీతారామన్ ఆసక్తికర వీడియో
ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. వివిధ రకాల బిల్లుల చెల్లింపులు మరింత సులభతరం అయ్యాయి. అంతా డిజిటల్ చెల్లింపులు అయిపోయాయి. ఇక భారత్‌లో డిజిటల్ పేమెంట్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతిచోటా నగదుకు బదులు ఫోన్లోని యాప్స్ ద్వారానే పే చేసేస్తున్నారు. ఇక కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి టీ కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ట్రాన్సక్షన్స్కే మొగ్గు చూపుతున్నారు. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో షేర్ చేశారు. ఇది దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎలా మార్పు తీసుకొచ్చిందనే దానికి అద్దం పడుతోంది. చదవండి: కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ పండుగ సమయంలో ఇంటింటికీ తిరిగే గంగిరెద్దులను ఆడించే వారు కూడా డిజిటల్ రూపంలో భిక్షాటన చేస్తున్న వీడియోను మంత్రి ట్విటర్లో షేర్ చేస్తూ.. డిజిటల్ విప్లవం జానపద కళాకారుల వైపుకు కూడా చేరుకుందని ఆమె తెలిపారు. 30 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో.. ఓ ఇంటి ముందుకు వచ్చిన గందిరెద్దుపై క్యూఆర్ కోడ్ ట్యగా్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేస్తాడు. ఈ వీడియోను పోస్టు చేస్తూ..‘గంగరెద్దలాటకు చెందిన వీడియో ఇది. డిజిటల్ చెల్లింపు విప్లవం జానపద కళాకారులకు చేరువైంది. ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో గంగిరెద్దులవాళ్లు సంక్రాంతి వంటి పండుగల సమయంలో ఎద్దులకు పలమాలలు వేసి ఇంటింటికి వెళ్లి నాదస్వారం వాయిస్తూ భిక్ష తీసుకుంటారు.’ అని పేర్కొన్నారు. Recd a video of a Gangireddulata, where alms are given thru a QR code! India’s #digitalpayment revolution, reaching folk artists. In AP + Telangana, Gangireddulavallu dress up old oxen no longer helpful on farms, walk door to door during fests, performing with their nadaswarams pic.twitter.com/8rgAsRBP5v — Nirmala Sitharaman (@nsitharaman) November 4, 2021 -
Photo Stories: మొక్కకూ క్యూఆర్ కోడ్
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. నాటిన ప్రతీ మొక్కకు సంబంధించి వివరాలతో క్యూఆర్ కోడ్లను రూపొందించారు. ప్రతి మొక్క వద్ద ఉండే క్యూఆర్ కోడ్లను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేస్తే మొక్క శాస్త్రీయ నామం, స్థానిక నామం తదితర వివరాలు తెలుసుకోవచ్చునని ఆ కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్‌సింగ్ తెలిపారు. ఈ క్యూర్ కోడ్లను బాటనీ లెక్చరర్ సహకారంతో టీఎస్కేసీ మెంటార్ ఇమ్రాన్ రూపొందించారని చెప్పారు. ఇవి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడు తా యన్నారు. – చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ బొగత పరవళ్లు బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. రెండు రోజులుగా ఎగువన తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దండకారణ్యంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు పోటెత్తుతూ జలపాతంలో కలుస్తోంది. దీంతో ములుగు జిల్లా వాజేడు మండలంలో గల ఈ జలపాతాన్ని వీక్షించేందుకు శనివారం పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. – వాజేడు ‘నీటి పిల్లుల’ హల్చల్ కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో నీటి పిల్లులు సంచరిస్తూ హల్చల్ చేస్తున్నాయి. గతేడాది నుంచి కాళేశ్వరం బ్యారేజీ బ్యాక్ వాటర్ పెరగడంతో గోదావరిలో నీటి పిల్లులు అధికంగా వచ్చి చేరాయి. రాత్రి వేళ సంచరిస్తూ అవి చేపలను తింటూ జాలర్లు వేసిన వలలను కొరికి తెంపేస్తున్నాయి. దీంతో జాలర్లకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ పరిధి మండలపురం గ్రామానికి చెందిన జాలరి కొమ్మలి గోదావరిలో తరుచూ చేపలు పడుతున్నాడు. కాగా వలలను తెంపి పాడుచేస్తున్న రెండు నీటి పిల్లులను శుక్రవారం రాత్రి పట్టుకుని తర్వాత గోదావరికి దూరంగా అడవిలో వదిలేశాడు. నేను గానీ వల వేస్తే.. వల విసరడమూ ఓ కళే. సరిగ్గా విసిరితేనే చేపలు చిక్కుతాయి. లేదంటే వల వేయలేక విలవిల్లాడాల్సిందే. శుక్రవారం కురిసిన వర్షానికి మంచిర్యాలలోని రాళ్లవాగులో వరద నీరు చేరింది. శనివారం చేపలు పట్టడానికి మత్స్యకారులు ఉత్సాహం చూపారు. పోటీపడి వలలు విసురుతూ చేపలు పడుతున్న దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల భారీ మీనం.. మత్స్యకారుడి ఆనందం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్ చెరువులో శనివారం ఓ జాలరికి 25 కిలోల చేప దొరికింది. చేప విలువ సుమారు రూ.5 వేలు ఉంటుందని జాలరీ గూండ్ల సాయిలు తెలిపారు. – ఎడపల్లి(బోధన్) -
ఇకపై వాహనాలకు ఏకీకృత కాలుష్య సర్టిఫికెట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఇకపై ఏకీకృత పొల్యూషన్ సర్టిఫికెట్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై అందజేసే పొల్యూషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికెట్‌పై క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తారు. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ వాహనం, వాహన యజమాని పూర్తి వివరాలు కనిపిస్తాయి. వాహనం యజమాని, అతని ఫోన్ నంబర్, చిరునామా, వాహన ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్, వాహనం కాలుష్యాన్ని ఎంత స్థాయిలో ఉద్గారాలను వెదజల్లుతోంది తదితర వివరాలన్నింటినీ పొందుపరుస్తారు. ఇకపై వాహనం యజమాని మొబైల్ నంబర్‌ను తప్పనిసరి చేశారు. వ్యాలిడేషన్, చెల్లింపులు తదితరాల కోసం ఎస్ఎంఎస్ అలర్ట్లనూ పంపుతారు. పరిమితికి మించి అధిక ఉద్గారాలు వెలువడితే ఇకపై రిజెక్షన్ స్లిప్‌ను ఇవ్వనున్నారు. కేంద్ర మోటార్ వెహికల్ చట్టాలు–1989లో సవరణలు చేసి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. ఇకపై పీయూసీ డేటాబేస్‌ను జాతీయ రిజిస్ట్రర్‌తో అనుసంధానిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీసహా ఇతర పత్రాల రెన్యువల్ గడువు పొడిగింపు కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో వాహనాల పత్రాలను రెన్యువల్ చేసుకోలేని వారికి కేంద్రం మరో ఉపశమనం కల్గించింది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), ఫిట్నెస్ సర్టిఫికెట్లతో పాటు అన్ని రకాల పర్మిట్ల చెల్లుబాటును కేంద్రం సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి గడువు ముగిసిన మోటారు వాహన డ్రైవర్లపై విచారణ చేయరాదని రాష్ట్రాల రవాణా శాఖలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఒక అడ్వైజరీ జారీ చేసింది. చదవండి: దేశంలో 8 లక్షల దిగువన కరోనా పాజిటివ్ కేసులు చదవండి: వాహనదారులకు కేంద్రం శుభవార్త! -
క్యూఆర్ కోడ్‌తో చెల్లింపులు
హైదరాబాద్: క్యూఆర్ కోడ్ ఆధారంగా నగదు చెల్లించే విధానాన్ని ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ అమల్లోకి తెచ్చింది. ఆర్డర్ చేసిన వస్తువు కవర్‌పై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కస్టమర్లు డిజిటల్ పేమెంట్ చేయోచ్చు. పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం యూపీఐ యాప్‌ను వినియోగించవచ్చు. చెల్లింపుల విషయంలో క్యూఆర్ కోడ్ విధానంతో వినియోగదార్లలో విశ్వాసం పెరుగుతుందని వివరించింది. సీఓడీ ఆప్షన్‌తో కరోనా కారణంగా టచ్ తగ్గించడం ప్రధానంగా మారింది. అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు నగదు చెల్లింపు కొంత రిస్క్‌గా మారింది. దీంతో సీఓడీ ఆప్షన్లో క్యూఆర్ కోడ్ పేమెంట్ ఆప్షన్ని ఫ్లిప్‌కార్ట్ అమల్లోకి తెచ్చింది. -
పుస్తకాలన్నింట్లో క్యూఆర్ కోడ్.. స్కాన్ చేయండి పాఠాలు వినండి.
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధన ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో విద్యార్థులు ఇళ్ల వద్దే ఉండి డిజిటల్ పాఠాలు వినేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకున్న విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్‌ను ముద్రించింది. విద్యార్థులు వాటిని మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేస్తే ఆడి యో, వీడియో పాఠాలు వస్తాయి. గతంలో కొన్ని సబ్జెక్టులకు పైలట్ ప్రాజెక్టుగా ముద్రించిన క్యూ ఆర్ కోడ్‌ను ప్రభుత్వం ఈసారి అన్ని సబ్జెక్టుల పుస్తకాల్లో ముద్రించింది. దీంతో విద్యార్థులు మరింత మెరుగ్గా పాఠాలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. జిల్లా కేంద్రాల నుంచి పంపిణీ చేసేందుకు.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు మొత్తం 1.42 కోట్ల పాఠ్య పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 41 శాతం పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరాయి. అక్కడి నుంచి వెంటవెంటనే మండల కేంద్రాలకు, పాఠశాలలకు పంపిణీ చేసేలా జిల్లాల్లో అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మిగతా పాఠ్య పుస్తకాలనూ ఈ నెలాఖరులోగా స్కూల్ పాయింట్‌కు చేరేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులతోపాటు గురుకులాల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఉచితంగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తోంది. వాటిలో ఆరు నుంచి నుంచి టెన్త్ వరకు చదువుకునే దాదాపు 14 లక్షల మంది విద్యార్థులకు క్యూఆర్ కోడ్ ముద్రించిన పుస్తకాలను ఇస్తారు. విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌లో ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు ఆ పాఠానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు, ఆడియోతో కూడిన వివరాలను పొందగలుగుతారు. లాక్‌డౌన్‌తో మిగిలిపోయిన సేల్ పుస్తకాలు రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ముద్రించిన సేల్ పుస్తకాలు భారీగా మిగిలిపోయాయి. 2020–21 విద్యా సంవత్సరంలో 35 లక్షల వరకు సేల్ పుస్తకాలను ముద్రించగా, అందులో 17 లక్షల పుస్తకాలను మాత్రమే విద్యార్థులు కొనుగోలు చేశారు. కరోనా కారణంగా ప్రత్యక్ష బోధన లేకపోవడంతో విద్యార్థులు పుస్తకాలను కొనుక్కోలేదు. దీంతో దాదాపు 18 లక్షల పుస్తకాలు మిగిలిపోయాయి. అయితే వాటిని 2021–22 విద్యా సంవత్సరంలో విక్రయించుకునేందుకు ప్రింటర్లు విద్యాశాఖ అనుమతి కోరారు. ఈ అంశంపై తాము నిర్ణయం తీసుకోలేమని, ప్రభుత్వానికి లేఖ రాశామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో బడులెన్ని..? పాఠశాలలు విద్యార్థులు ప్రభుత్వ 30,135 26,88,805 ప్రైవేట్ 10,763 32,37,448 మొత్తం 40,898 59,26,253 -
నెగిటివ్ రిపోర్టు క్యూఆర్ కోడ్ ఉంటేనే ఎంట్రీ
న్యూఢిల్లీ : భారత్ నుంచి వచ్చే విమాన ప్రయాణికులపై ఆంక్షలు కఠినతరం చేశాయి విదేశాలు. ఇకపై ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్‌కి అనుసంధానంగా ఉన్న క్యూర్‌కోడ్ చూపిస్తేనే ఎంట్రీకి అనుమతి ఇస్తున్నాయి. క్యూఆర్ కోడ్ లేకుండా చూపించే కోవిడ్ 19 నెగటివ్ రిపోర్టులను తిరస్కరిస్తున్నాయి. దీంతో మే 22 అర్థరాత్రి నుంచి విదేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులు తమతో పాటు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నెగటివ్ రిపోర్టుకి అనుసంధానంగా ఉండే క్యూఆర్ కోడ్‌ను వెంట ఉంచుకోవాలంటూ పౌరవిమానయాణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల భారత్ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రయాణికుల్లో కొందరు నకిలీవీ, ఫోటోషాప్ చేసిన ఆర్టీ పీసీఆర్ రిపోర్టులు తీసుకెళ్లారు. విదేశాల్లోని చెక్పాయింట్ల వద్ద వారు పట్టుబడ్డారు. దీంతో పేపర్ రిపోర్టులకు బదులు ఒరిజినల్ కోవిడ్ రిపోర్టుకి అనుబంధంగా ఉండే క్యూఆర్ కోడ్‌ని తప్పనిసరి చేశాయి. -
ఓఎల్ఎక్స్: 8 సార్లు బకరాను చేశారు..
సాక్షి, సిటీబ్యూరో: తన ఇంట్లో ఉన్న పాత సోఫాను ఓఎల్ఎక్స్ ద్వారా రూ.6,500 అమ్మాలని భావించిన మారేడ్‌పల్లి వాసి సైబర్ నేరగాడి చేతికి చిక్కి రూ.1.96 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన సుశీల్ తన ఇంట్లో ఉన్న పాత సోఫాను ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టారు. దీన్ని చూసిన సైబర్ నేరగాడు ఆ ప్రకటనలో ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా సుశీల్‌ను సంప్రదించారు. ఆ సోఫా తమకు నచ్చిందని, రూ.6,500 గూగుల్ పే క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లిస్తానని చెప్పాడు. దీనికి సుశీల్ అంగీకరించడంతో ఓ క్యూఆర్ కోడ్ పంపాడు. దీన్ని సుశీల్ స్కాన్ చేయగా... రూ.6,500 తన ఖాతాలోకి రావాల్సింది పోయి... ఆ మొత్తం కట్ అయింది. దీంతో ఆయన సైబర్ నేరగాడికి ఫోన్ ద్వారా సంప్రదించారు. ఏదో పొరపాటు జరిగిందంటూ చెప్పిన అతడు ఈసారి మొత్తం రూ.13 వేలకు క్యూఆర్ కోడ్ పంపుతున్నట్లు చెప్పాడు. అలా వచ్చిన దాన్ని స్కాన్ చేయగా... రూ.13 వేలు కట్ అయ్యాయి. ఇలా మొత్తం ఎనిమిది సార్లు కోడ్స్ పంపి స్కాన్ చేయించిన సైబర్ నేరగాడు బాధితుడి ఖాతా నుంచి రూ.1.96 లక్షలు కాజేశాడు. మరోసారి కోడ్ పంపిస్తానంటూ చెప్పడంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: రూ.1.04 కోట్ల ఆభరణాల పట్టివేత -
ఆన్లైన్లో వైన్ ఆర్డర్ చేస్తే రూ 1.6 లక్షలు గల్లంతు..!
బెంగళూరు: 25 ఏళ్ల బెంగళూరు మహిళ గూగుల్‌లో సెర్చి చేసి వైన్ బాటిల్ కోసం ఆర్డర్ చేస్తే వైన్ రాకపోగా ఆమె ఖాతా నుంచి రూ.1.6 లక్షలను సైబర్ క్రిమినల్స్ కాజేశారు. ఈ సంఘటన జరిగిన మరుసటి వారం ఆమె పోలీసులకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత వెలుగులోకి వచ్చింది. వైట్‌ఫీల్డ్‌లో నివసిస్తున్న ఆంచల్ ఖండేల్వాల్ అనే మహిళ మార్చి 24న ఆన్లైన్లో వైన్‌ను విక్రయించి హోం డెలివరీ చేసే వారి కోసం గూగుల్‌లో సెర్చ్ చేయగా ఆమెకు రణవీర్ సింగ్ అనే వ్యక్తి ఫోన్ నంబర్‌ను కనబడింది. తనకు ఫోన్ చేసిన తర్వాత రణ్వీర్ సింగ్ మీరు కోరుకున్న వైన్ తన వద్ద ఉందని దానిని సరఫరా చేస్తానని ఫోన్లో నమ్మించాడు. ఆన్లైన్లో అడ్వాన్స్ చెల్లిస్తే నేరుగా ఆమె ఫ్లాట్‌కి వైన్ బాటిల్‌ను డెలివరీ చేస్తామని తను పేర్కొన్నాడు. తర్వాత వారు పంపిన క్యూఆర్ స్కాన్ కోడ్‌ను ఉపయోగించి ఆమె చెల్లింపులు చేసింది. అయితే, నిందితుడు రణవీర్ తనకు ఎటువంటి నగదు రాలేదని ఆమెను ఒప్పించి మరికొన్ని లావాదేవీలు చేసేలా చేశాడు. అలా మొత్తం ఐదు లావాదేవీలు చేయడంతో ఆమె రూ.1,59,595ను కోల్పోయింది. ఒక వారం తరువాత ఆంచల్ వైన్ పంపిణీ చేయకపోగా మోసం చేశాడని గ్రహించి పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసింది. ఈ కుంభకోణం జరిగిన వెంటనే మహిళ 100 డయల్ చేసి పిర్యాదు చేసి ఉంటే నిందితుల బ్యాంక్ ఖాతాను నిలిపివేసేవారమని ఆమె ఫిర్యాదు చేయడంలో తీవ్ర జాప్యం చేశారని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: పేద వర్గాల కోసం పీఎన్బీ సరికొత్త హోమ్ లోన్ స్కీమ్ -
ఏటీఎం: కార్డు లేకుండానే నగదు విత్ డ్రా
గతంలో బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేయాలంటే సదురు బ్యాంకు శాఖకు వెళ్లి నగదును తీసుకునేవాళ్లం. ఇక ఏటీఎం మిషన్ వచ్చాక బ్యాంకుకు వెళ్లకుండానే కార్డులు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నాం. ప్రస్తుతం అభివృద్ధి చెందిన టెక్నాలజీ వల్ల త్వరలో ఏటీఎం కార్డు అవసరం లేకుండానే గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ ద్వారా ఏటీఎం కేంద్రాలలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు కావాల్సిన మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీని మీరు ఉపయోగించడానికి ఇంకెంతో సమయం ఆగాల్సిన అవసరం లేదు. ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్(ఎటిఎం) తయారుచేసే ఎన్సీఆర్ కార్పొరేషన్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యుపీఐ) ప్లాట్‌ఫాంతో కలిసి మొట్టమొదటి సారిగా ఇంటర్‌పెరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా(ఐసిసిడబ్ల్యు) సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొనిరావడానికి సిటీ యూనియన్ బ్యాంక్, ఎన్సీఆర్తో చేతులు కలిపింది. క్యూఆర్ కోడ్ ఆధారిత ఇంటర్‌పెరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా సదుపాయాన్ని బ్యాంక్ ఇప్పటికే 1,500 ఏటీఎంలను అప్‌గ్రేడ్ చేసింది. ఈ ఏటీఎంలలో ఎటువంటి కార్డు అవసరం లేకుండానే స్కాన్ చేసి క్షణాల్లో డబ్బులు డ్రా చేయొచ్చు. "మొబైల్ ఫోన్లో ఉన్న యుపీఐ యాప్ ద్వారా ఎటిఎమ్ లో ఉన్న క్యూఆర్ కోడ్ క్యాష్ విత్ డ్రా చేయవచ్చు, దీని కోసం ఎటువంటి కార్డులు అవసరం లేదు" అని ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & ఎన్సీఆర్ కార్పొరేషన్లో సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు నవ్రోజ్ దస్తూర్ పీటీఐకి చెప్పారు. ఎలా పని చేస్తుంది ఈ కొత్త సదుపాయంతో వినియోగదారులు తమ మొబైల్ లోని యుపీఐ ఎనేబుల్ చేసిన బీమ్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ ద్వారా నగదు డ్రా చేసుకోవచ్చు. దీనికోసం ఎటువంటి కార్డ్స్ కూడా అవసరం లేదు. మొదట ఏటీఎం స్క్రీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఎంతమొత్తం డ్రా చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పిన్ ఎంటర్ చేయాలి. అంతే యూపీఐ యాప్‌లో ప్రాసెస్ పూర్తి కాగానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అవుతాయి. ప్రస్తుతం, పరీక్ష దశలో ఉంది కాబట్టి రూ.5వేలకు డ్రా మించి విత్ డ్రా చేయలేరు. ఇది సురక్షితమేనా? భద్రతా విషయంలో ఇది ఇంకా అత్యంత సురక్షితమైనది. ఎందుకంటే కార్డు అవసరం లేదు కాబట్టి కార్డుతో జరిగే మోసాలు అరికట్టవచ్చు. ఇక ఈ లావాదేవీ డైనమిక్ క్యూఆర్ కోడ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి లావాదేవీ సమయంలో క్యూఆర్ కోడ్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ డైనమిక్ క్యూఆర్ కోడ్ ఆధారిత ఇంటర్‌పెరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా సేవలను అన్ని బ్యాంకుల యూజర్లకు అందుబాటులోకి తీసుకోని రావడానికి ఎన్సీఆర్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు నవ్రోజ్ దస్తూర్ తెలిపారు. చదవండి: రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్ గడువు పొడగింపు రైల్వే ప్రయాణికులకు తీపికబురు -
మాస్టర్ కార్డు వినియోగదారులకు శుభవార్త!
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఏదైనా వస్తువును తాకాలంటే ఎక్కువ శాతం ప్రజలు భయపడుతున్నారు. దింతో నగదు చెల్లింపుల విషయంలో కూడా ప్రజలు డిజిటల్ చెల్లింపులు చెల్లిస్తున్నారు. ఇప్పుడు బ్యాంకులు కూడా ఎటిఎంలను తాకకుండానే నగదు ఉపసంహరణ చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకోని రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ విధానం ఇంకా అందరికి అందుబాటులోకి రాకున్నప్పటికీ పరీక్ష దశలో ఉంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ కార్డ్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్‌తో సహాయంతో పూర్తి కాంటాక్ట్‌లెస్ నగదు ఉపసంహరణను విధానాన్ని తీసుకోని రాబోతుంది. మాస్టర్ కార్డు దారులు బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించి ఎటిఎం స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బ్యాంక్ యాప్‌లో పిన్ను నమోదు చేయాలి. తర్వాత మీరు మొబైల్ లో ఎంటర్ చేసిన మొత్తాన్ని ఎటిఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఈ విధానం ఏటీఎంలలో మోసాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ మొదట బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ప్రారంభించింది. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ తన నెట్‌వర్క్‌లోని అన్ని ఎటిఎంలకు దశలవారీగా ఈ 'కాంటాక్ట్‌లెస్' క్యూఆర్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. చదవండి: సంచలనాలు సృష్టిస్తున్న షియోమీ భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు -
గూగుల్ మరో కొత్త ఫీచర్
ఆండ్రాయిడ్ 12లో వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకోవడాన్ని సులభతరం చేయడానికి గూగుల్ మరో కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా యూజర్స్ తమ వైఫై నెట్వర్క్ పాస్‌వర్డ్‌ని ఇతరులతో సులభంగా షేర్ చేసుకోవచ్చు. గూగుల్ ఆండ్రాయిడ్‌లో నియర్‌బై షేర్ ద్వారా వైఫై పాస్‌వర్డ్‌లను షేర్ చేసుకోవడానికి వినియోగదారులను సహాయపడనుంది. ఆపిల్ యొక్క ఎయిర్‌డ్రాప్ టెక్నాలజీని తరహాలోనే ఇది కూడా పనిచేయనుంది. క్రొత్త ఫీచర్లో ఆండ్రాయిడ్ షేర్ వైఫై పేజీలో షేర్ బటన్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. షేర్ బటన్ నొక్కడం ద్వారా రెండు ఫోన్ల మధ్య ఎటువంటి కేబుల్ సహాయం లేకుండా వైఫైకి కనెక్ట్ చేయబడిన ఫోన్ నుంచి వైఫై పాస్‌వర్డ్‌ను వినియోగదారులు షేర్ చేసుకోవచ్చు.(చదవండి: ఈ రోజు ఫేస్ మార్చుకుందామా!) ఇప్పటికే ఆండ్రాయిడ్ 10 ఓఎస్ యూజర్స్‌కి క్యూఆర్ కోడ్ ఆధారంగా వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకునే ఫీచర్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 12 డెవలపర్ ప్రివ్యూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైనల్ వెర్షన్ ని ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో తీసుకురానున్నట్లు సమాచారం. షేర్ వైఫై పేరుతో ఈ ఏడాడి రెండో అర్ధభాగంలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం. ఇప్పటికే దీని సంబంధించిన కార్యచరణను గూగుల్ ప్రారంభించింది. -
వివాహ వేడుక.. వినూత్న ఆలోచన
ఎవరైనా పెళ్లికి పిలిస్తే, వారికి బహుమతి ఏమివ్వాలా అని ఆలోచిస్తారు. వస్తువు కొనాలా, డబ్బులు ఇవ్వాలా అని తర్జనభర్జనల తరవాత ఒక నిర్ణయానికి వస్తారు. వీలైనంతవరకు డబ్బు ఇవ్వడానికే చాలామంది ఇష్టపడుతున్నారు. అలా ఇవ్వటం వల్ల కొత్త జంట వాళ్లకు కావలసింది వాళ్లు కొనుక్కోవచ్చు. అయితే పెళ్లికి బయలుదేరే ముందు కానీ కొన్ని విషయాలు గుర్తుకు రావు. ముఖ్యంగా నూతన వధూవరులకు ఇవ్వాలనుకునే నగదును ఉంచటానికి కావలసిన గిఫ్ట్ క్యాష్ కవర్. ఓ పక్కన ముహూర్తానికి సమయం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ కవరు కోసం వెతుకులాట కొనసాగుతూ ఉంటుంది. చివరకు ఏమీ చేయలేక, వధూవరుల చేతిలో నేరుగా డబ్బు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇంక కవరు కోసం వెతుకులాడవలసిన అవసరం లేదు. నేరుగా వారి అకౌంట్లోకి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా డబ్బును ట్రాన్స్ఫర్ చేసేయొచ్చు. ఇంకో అడుగు ముందుకు వేశారు. తమిళనాడులోని మదురైలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న టి. జె. జయంతి కుటుంబం ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. శుభలేఖ మీద క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసి, గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా నూతన వధూవరులకు ఇవ్వాలనుకుంటున్న నగదు బహుమతిని ఈ కోడ్ ద్వారా బదిలీ చేసేందుకు వీలు కల్పించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా వివాహానికి హాజరు కాలేని వారి కోసం ఆ ఆలోచనను ఆచరణలో ఉంచారు. ‘‘30 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. పెళ్లి కానుకను క్యూఆర్ కోడ్ ద్వారా పంపారు, మా కుటుంబంలో ఈ విధంగా క్యూఆర్ కోడ్ ప్రచురించటం ఇదే ప్రథమం. ఆదివారం నాడు వివాహం జరిగింది. మరుసటి రోజు నుంచి ఈ కార్డు వైరల్ అవుతోంది. చాలామంది ఫోన్లు చేస్తున్నారు’’ అంటున్నారు జయంతి. ఆన్లైన్ టెక్నాలజీ వల్ల కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలే ఒక వివాహం సందర్భంగా, ఇళ్ల దగ్గర నుంచి ఆన్లైన్లో వివాహం వీక్షిస్తున్న బంధువులు, స్నేహితులకి, వారివారి ఇళ్ల దగ్గరకే విందును ఆర్డర్ చేశారు. ఏ లోటూ రాకుండా, దేనినీ మిస్ అయ్యామనే భావన లేకుండా, ఆన్లైన్ ద్వారా అన్నీ సమకూరుతున్నాయి. టెక్నాలజీకి రెండు చేతులతో నమస్కరించాల్సిందే. -
ఇక డిజిటల్ ఓటరు కార్డు!
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియాలో భాగంగా ఓటరు గుర్తింపు కార్డును డిజిటల్ చెయ్యా లని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకి ముందే డిజిటల్ ఫార్మేట్లోకి మార్చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని వల్ల ఓటరు తమ గుర్తింపు కార్డుని పోలింగ్ బూతులకి వెంట తీసుకువెళ్లాల్సిన పని ఉండదు. అంతేగాక క్యూఆర్ కోడ్ల ద్వారా సమాచారాన్ని కార్డులో ఉంచనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు శనివారం వెల్లడించారు. దీంతో విదేశాల్లో ఉన్న వారు కూడా తమ కార్డుని ఒక్క క్లిక్ సాయంతో క్షణాల్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. -
కొత్త క్యూఆర్ కోడ్లపై ఆర్బీఐ నిషేధం
ముంబై: చెల్లింపుల లావాదేవీల కోసం పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు (పీఎస్వో) కొత్తగా మరిన్ని సొంత క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టకుండా రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న యూపీఐ క్యూఆర్, భారత్ క్యూఆర్ కోడ్లనే కొనసాగించాల్సి ఉంటుందని తెలిపింది. సొంత క్యూఆర్ కోడ్లు ఉపయోగించే పీఎస్వోలు కూడా ఈ రెండింటికి మారాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ 2022 మార్చి 31 నాటికి పూర్తి కావాల్సి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. జపాన్‌కి చెందిన డెన్సో వేవ్ అనే సంస్థ 1990లలో క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్లను ఆవిష్కరించింది. ప్రస్తుతం దేశీయంగా క్యూఆర్ కోడ్ పేమెంట్ సిస్టమ్‌లు ప్రధానంగా భారత్ క్యూఆర్, యూపీఐ క్యూఆర్‌లతో పాటు సంస్థల సొంత క్యూఆర్‌లను సపోర్ట్ చేస్తున్నాయి. -
పోస్టు చేయడమే పాపమైంది...
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసులపై సైబర్ నేరగాళ్లు విరుచుకుపడుతున్నారు. యాడ్స్ యాప్ ఓఎల్ ఎక్స్‌లో వస్తువులు ఉంచి అమ్ముతామని, ఇతరులు పొందుపరిచిన వాటికి కొనుగోలు చేస్తామ ని ఫోన్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. వీరి బారిని పడి రూ.5.29 లక్షలు నష్టపోయిన ఐదుగురు బాధితులు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. పోస్టు చేయడమే పాపమైంది... కొవిడ్ విజృంభణ నేపథ్యంలో దీని నిరోధానికి ఉపకరించే వస్తువుల తయారీ, విక్రయాలు పెరిగాయి. ఇందులో భాగంగా నగరానికి చెందిన ఓ మహిళ శానిటైజర్ స్టాండ్లు తయారు చేస్తున్నామని, తక్కువ ధరకు విక్రయిస్తానంటూ ఓఎల్ఎక్స్లో పోస్టు చేశారు. అందులో ఉన్న నంబర్ ద్వారా ఆమెను సంప్రదించిన సైబర్ నేరగాడు తనను ఆర్మీ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. తమకు పెద్ద సంఖ్యలో స్టాండ్లు కావాలని కోరాడు. అందుకోసం కొంత మొత్తం అడ్వాన్సు పంపిస్తున్నానని, ఆ మొత్తం తీసుకుని తనకు ఓ నమూనా పంపాలని కోరాడు. నగదు చెల్లింపుల పేరుతో గూగుల్ పే ద్వారా కొన్ని క్యూఆర్ కోడ్స్ పంపాడు. వీటిని నగర మహిళ స్కాన్ చేయడంతో ఈమె ఖాతా నుంచి డబ్బు నేరగాడికి వెళ్లిపోయింది. ఈ విషయం గుర్తించిన ఆమె ఫోన్ చేసి ప్రశ్నించగా.. రీఫండ్ ఇస్తున్నానంటూ మరికొన్ని క్యూఆర్ కోడ్స్ పంపాడు. వీటినీ స్కాన్ చేయగా తిరిగి రావాల్సింది పోయి మరికొంత అతడి ఖాతాలోకి వెళ్లింది. ఇలా ఆమె రూ.1.29 లక్షలు ఆమె కోల్పోయింది. నగరానికి చెందిన ఓ వ్యక్తి కంప్రెషర్లు తయారు చేస్తుంటాడు. తాను తయారు చేసిన వాటిని విక్రయిస్తానంటూ పోస్టు చేశారు. దీనిని చూసి స్పందించిన సైబర్ నేరగాళ్లు కొనుగోలు చేస్తామంటూ కాల్ చేశారు. బేరసారాల అనంతరం అడ్వాన్స్ పంపుతున్నామంటూ గూగుల్ పే క్యూఆర్ కోడ్స్ పంపారు. వీటిని బాధితుడు స్కాన్ చేయగా... రూ.1.5 లక్షలు నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి. అమ్ముతామంటూ అందినకాడికి... వేసవి నేపథ్యంలో నగరంలో ఏసీలకు డిమాండ్ పెరిగింది. దీనిని కూడా సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. సెకండ్ హ్యాండ్ ఏసీలు విక్రయిస్తామంటూ యాడ్స్ పోస్టు చేసి వాటిలో తమ ఫోన్ నంబర్లు పొందుపరుస్తున్నారు. వాటిని చూసి స్పందించిన వారి నుంచి ఆన్లైన్లో కాజేస్తున్నారు. సెకండ్ హ్యాండ్ ఏసీల విక్రయం పేరుతో ఓఎల్ఎక్స్లో ఉన్న యాడ్స్ చూసి స్పందించిన ఇద్దరు నగర వాసులతో సైబర్ నేరగాళ్లు బేరసారాలు చేశారు. చివరకు ఓ రేటు ఖరారు చేసుకున్నారు. నగదు చెల్లిస్తున్నామని, తమకు వచ్చిన నగదు రీఫండ్ ఇస్తున్నామంటూ వీరిద్దరికీ క్యూఆర్ కోడ్స్ పంపారు. వీటిని బాధితులు స్కాన్ చేయగా... ఒకరి నుంచి రూ.1.05లక్షలు, మరొకరి నుంచి రూ.84 వేలు కాజేశారు. నగరానికే చెందిన మరో వ్యక్తి సెకండ్ హ్యాండ్ కారు ఖరీదు చేయాలని భావించారు. దీనికోసం ఆయన ఓఎల్ఎక్స్లో సెర్చ్ చేశారు. మారుతి స్విఫ్ట్ కారు విక్రయం పేరుతో ఉన్న యాడ్ చూసిన అతను అందులో పేర్కొన్న ఫోన్ నెంబర్‌కు కాల్ చేశాడు. స్పందించిన సైబర్ నేరగాళ్లు బేరసారాల తర్వాత కారును రూ.45 వేలకు అమ్మడానికి అంగీకరించారు. ఆ వాహనం పంపిస్తున్నామంటూ చెప్పి అడ్వాన్సు, ఇతర ఖర్చుల పేరుతో రూ.61,300 కాజేశారు. ఈ ఐదుగురు బాధితులు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. -
రైల్వే జనరల్ టికెట్లు మరింత తేలిక!
సాక్షి, హైదరాబాద్: రైల్వే జనరల్ టికెట్లు మరింత తేలిగ్గా లభించనున్నాయి. యూటీఎస్ మొబైల్ యాప్‌లో క్యూఆర్ కోడ్ ఆధారంగా వేగంగా టికెట్లను బుక్ చేసుకొనే సదుపాయాన్ని దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం యూటీఎస్ యాప్ నుంచి జనరల్ టికెట్లను బుక్ చేసుకొనే వెసులుబాటు ఉన్నప్పటికీ బుకింగ్ కోసం ఎక్కువ సమయం వెచ్చించవలసి వస్తోంది. దీంతో ప్రయాణికులు ఈ యాప్ వినియోగంపై ఆసక్తి చూపడంలేదు. దీన్ని దృష్టిలో ఉం చుకొని వేగంగా టికెట్లను బుక్ చేసుకునేందుకు క్విక్ రెస్పాన్స్ కోడ్‌ను ప్రవేశపెట్టారు. ఇది సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, హైటెక్ సిటీ, బేగంపేట్ తదితర అన్ని ప్రధాన స్టేషన్ల్లో అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర 18 రైల్వేస్టేషన్లలో యూటీఎస్ క్యూఆర్ కోడ్ ద్వారా జనరల్ టిక్కెట్లను పొందే సదుపాయాన్ని దక్షిణమధ్య రైల్వే ప్రవేశపెట్టింది. దశలవారీగా అన్ని రైల్వేస్టేషన్లలోనూ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన ఇబ్బం ది ఉండదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా తెలిపారు. క్షణాల్లో టిక్కెట్..: ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వే పరిధిలో రోజూ 8.5 లక్షల నుం చి 9 లక్షల మంది రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తు న్నారు. ఏసీ, నాన్ ఏసీ రిజర్వేషన్ బుకింగ్ కోసం ఐఆర్సీటీసీతో పాటు రిజర్వేషన్ కార్యాలయాల్లో బుకింగ్ సదుపాయం ఉంది. కానీ అప్పటికప్పుడు బయలుదేరే జనరల్ టికెట్ల కోసం ప్రయాణికులు రైల్వేస్టేషన్‌ల్లో కౌంటర్ల వద్ద పడిగాపు లు కాయాల్సిందే. పండుగలు, వరుస సెలవులు, వేసవి రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో తరచుగా రైళ్లు బయలుదేరే సమయం వరకు కూడా ప్రయాణికులు టికెట్లను తీసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం దక్షిణ మధ్య రైల్వే యూటీఎస్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కానీ బుకింగ్ సమయంలో ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ వరకు అనే వివరాలతో పాటు, అనేక అంశాలను భర్తీ చేయవలసి వస్తోంది. దీంతో జాప్యం చోటుచేసుకుంటుంది. యూటీఎస్‌ను వినియోగించాలని ఉన్నప్పటికీ వివరాలను భర్తీ చేయడంపై ప్రయాణికులు నిరాసక్తతను ప్రదర్శిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు లక్ష మందికి పైగా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నప్పటికీ వినియోగించే వారి సంఖ్య 40 వేల నుంచి 50 వేల వరకు ఉంది. తాజాగా క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టడం వల్ల ప్రయాణికులు స్టేషన్‌కు ఒక కిలోమీటర్ దూరం నుంచి స్టేషన్ వర కు ఎక్కడైనా సరే క్షణాల్లో టికెట్ పొందవచ్చు. అన్ని ప్రధాన స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌లు, ఏటీవీఎం సెంటర్లు, ప్రధాన ప్రాంగణాల్లో క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో యూటీఎస్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుందని అంచనా. అన్ని రకాల టికెట్లు తీసుకోవచ్చు..: యూటీఎస్–క్యూఆర్ సదుపాయంతో స్లీపర్, థర్డ్ ఏసీ, సెకెండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ వంటి రిజర్వ్డ్ టికెట్లు, వివిధ రకాల రా యితీ టికెట్లు మినహాయించి అన్ని రకాల జనరల్ టికెట్లను తీసుకోవచ్చు. ఎం ఎంటీఎస్, ప్లాట్‌ఫామ్ టికెట్లు పొందవచ్చు. వివిధ ప్రాంతాల మధ్య రెగ్యులర్ గా ప్రయాణం చేసేవారు నెలవారీ పాస్‌లను పొందవచ్చు. ఈ మొబైల్ యాప్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా జనరల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. -
అన్ని లావాదేవీలకు ఒకే క్యూఆర్ కోడ్
రోజురోజుకు డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గూగుల్‌పే, ఫోన్‌పే, అమెజాన్‌పే, పేటిఎం వంటి క్యూఆర్ కోడ్లు కనిపిస్తుంటాయి. ఈ తరహాలోనే పేటీఎం ఇటీవల దేశవ్యాప్తంగా ఆల్-ఇన్-వన్ క్యూఆర్ కోడ్‌ను పేటీఎం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక వ్యాపారులు కేవలం వ్యాలెట్, యూపీఐ ద్వారా మాత్రమే కాకుండా రూపే కార్డుల నుంచి చెల్లింపులను అందుకునే వీలుంది. అంతేకాదు, ఇలాంటి చెల్లింపులకు ఎండీఆర్ చార్జీలు కూడా విధించలేదు. ఈ క్యూఆర్ కోడ్ వ్యాపారుల కోసం పేటీయం రూపొందించిన 'పేటీయం ఫర్ బిజినెస్ యాప్' ద్వారా వస్తుంది. దీని ద్వారా వ్యాపారులు ఎన్ని విధాలుగా అయినా అన్లిమిటెడ్ పేమెంట్లను ఆమోదించవచ్చు. కేవలం చెల్లింపులు మాత్రమే కాకుండా వ్యాపారులతో మరింత అనుబంధం కోసం మర్చంట్ సొల్యూషన్స్‌లో పెట్టుబడి పెట్టే ఆలోచనలో కూడా పేటీఎం ఉన్నట్లు సమాచారం. ఇన్స్టంట్ బ్యాంక్ సెటిల్మెంట్, రియల్ టైమ్ నోటిఫికేషన్ వంటి ఫీచర్లు కూడా ఈ యాప్‌లో ఉన్నాయి. మొదట వ్యాలెట్గానే ఉన్నప్పటికీ క్రమంగా పేటీయంకు యూపీఐని కూడా జత చేశామని, నేడు రూపే కార్డుల ద్వారా కూడా చెల్లింపులు జరిపే ఫీచర్‌ను జోడించినట్లు వ్యవస్థాపకులు వెల్లడించారు. 2019లో 900 కోట్ల క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపులు జరగ్గా అందులో 500 కోట్ల చెల్లింపులు పేటీయం ద్వారానే జరిపినట్టు అధికారంగా తెలిపారు. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ మార్కెట్లో మొత్తం 50కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయితే ఈ ఫీచర్ పేటీయం ప్రత్యర్థి సంస్థలు గూగుల్ పే, ఫోన్ పేల్లో అందుబాటులో లేదు. పేటీఎం ఆల్-ఇన్-వన్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను కాలిక్యులేటర్, పవర్ బ్యాంక్, క్లాక్, పెన్ స్టాండ్స్, రేడియో లాంటివాటిపై అందిస్తోంది. వ్యాపారి పేర్లు, లోగోలు, ఫోటోలతో కూడా క్యూఆర్ కోడ్ ఆర్డర్ చేయొచ్చు. -
వ్యాపారుల కోసం పేటీఎం ఆల్–ఇన్–వన్ క్యూఆర్
ముంబై: డిజిటల్ పేమెంట్స్ సేవల సంస్థ పేటీఎం దేశవ్యాప్తంగా వ్యాపారుల కోసం ఆల్–ఇన్–వన్ క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. పేటీఎం వ్యాలెట్, రూపే కార్డులు, అన్ని యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్స్ ద్వారా జరిగే చెల్లింపులు నేరుగా వ్యాపారుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. దీనికి ఎటువంటి ఫీజు ఉండదని పేర్కొన్నారు. దీనితో పాటు కస్టమర్ల లావాదేవీల వివరాలను పొందుపర్చే డిజిటల్ లెడ్జర్ ‘బిజినెస్ ఖాతా’ సర్వీసును కూడా పేటీఎం ప్రవేశపెట్టింది. -
టెన్త్ మెమోలపై క్యూఆర్ కోడ్!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి నకిలీ మెమోలను అరికట్టేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పది మెమోలపై ఇకపై క్యూఆర్ కోడ్ పొందుపరిచేందుకు చర్యలు చేపడుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించేందుకు సిద్ధమవుతోంది. 2004 నుంచి పదో తరగతి మెమోలను ఆన్లైన్లో పొందుపరిచిన ప్రభుత్వ పరీక్షల విభాగం అంతకుముందుకు మెమోలనూ ఆన్లైన్లో పొందుపరిచేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన వారు అందజేసిన మెమోలు నకిలీవా? అసలైనవా? అని గుర్తించేందుకు ఈ విధానాన్ని తీసుకువస్తోంది. ఇకపై విద్యార్థులకు ఇచ్చే మెమోలపై క్యూఆర్ కోడ్ ముద్రించే ఆలోచనకు వచ్చింది. తద్వారా నకిలీ మెమోలను అరికట్టవచ్చని భావిస్తోంది. అసలైన మెమోపై ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను రీడ్ చేస్తే సదరు అభ్యర్థి సమగ్ర వివరాలు తెలుస్తాయని, అదే నకిలీ మెమోపై క్యూఆర్ కోడ్ ఉండదని, ఒకవేళ ఏదైనా ముద్రించినా ఆ వివరాలు రావని, తద్వారా మెమోలు నకిలీవి తయారు చేయకుండా నిరోధించవచ్చని అధికారులు చెబుతున్నారు. -
మెట్రోరైల్లో టీకెట్ లేని ప్రయాణం
-
షాపులకు క్యూఆర్...ఇది కొత్తది యార్!
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగం అధికారులు మరో ముందడుగు వేశారు. ఇప్పటికే సర్కిల్ పరిధిలోని జనప్రియ ప్రాంతంలో క్యూఆర్ కోడ్ (క్విక్ రెస్పాన్స్) ద్వారా ఇంటింటి నుంచి చెత్త సేకరణను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా కమర్షియల్ ప్రాంతాల్లోనూ క్యూఆర్ కోడ్‌ను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉప కమిషనర్ ప్రదీప్‌కుమార్, శానిటరీ సూపర్వైజర్లు ఆంజనేయులు, కృష్ణ కిశోర్ ఆధ్వర్యంలో హైదర్‌గూడ, అత్తాపూర్‌లోని దుకాణాలను సిబ్బంది సర్వే చేస్తున్నారు. ప్రతి దుకాణానికి ఒక కోడ్‌ను కేటాయిస్తున్నారు. తడి, పొడి చెత్తగా వేరు చేసి అందించాలని వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఇక చెత్త సేకరణకు వచ్చే సిబ్బంది తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా కోడ్‌ను స్కాన్ చేసి చెత్తను సేకరించనున్నారు. అదేవిధంగా కోడ్ ఆధారంగా సిబ్బంది పని తీరును సైతం ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నా రు. హైదర్‌గూడ, అత్తాపూర్ ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు చెత్తను రోడ్లపై వేయకుండా ఏర్పాట్లు చేశారు. తడి, పొడి చెత్త కోసం డబ్బాలను సైతం అందజేశారు. క్యూఆర్ కోడ్‌తో మరింత పకడడడడ్బందీగా ప్రతి దుకాణం నుంచి చెత్తను సేకరించడం సులభతరం కానుంది. – రాజేంద్రనగర్ హైదర్‌గూడ అపార్ట్మెంట్లో తొలిసారిగా గత మార్చి 28న జీహెచ్ఎంసీ యంత్రాంగం 1,200 కుటుంబాలు ఉంటున్న హైదర్‌గూడ జనప్రియ అపార్ట్మెంట్లో దేశంలోనే తొలిసారి క్యూఆర్ కోడ్‌తో చెత్త సేకరణను ప్రారంభించింది. మొదట కొంతమేర ఇబ్బందులు ఎదురైనా అనంతరం పూర్తిస్థాయిలో కొనసాగిస్తున్నారు. ఇది విజయవంతం కావడంతో వ్యాపార ప్రాంతాల్లో అమలు చేసేందుకు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నివాస ప్రాంతాల నుంచీ క్యూఆర్ కోడ్‌తో చెత్త సేకరిస్తున్నారు. త్వరలో ప్రారంభానికి సన్నాహాలు.. అత్తాపూర్, హైదర్‌గూడ ప్రాంతాల్లో ప్రధానంగా వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. ఇవి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అతిపెద్ద వ్యాపార కేంద్రాలు. దీంతో ఈ ప్రాంతంలో నూరు శాతం చెత్తను సేకరించేందుకు అధికారులు క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు త్వరలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను ఆహ్వానించేందుకు అధికారులు నిర్ణయించారు. -
గోనె సంచులకు బార్ కోడ్..
సాక్షి, హైదరాబాద్: ధాన్యం రవాణా, ప్రజాపంపిణీ రవాణా, బియ్యం సరఫరా వంటి అంశాల్లో వినియోగిస్తున్న గోనె సంచుల విషయంలో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసరఫరాల సంస్థకు చెందిన గోనె సంచులు దుర్వినియోగం కాకుండా ప్రతీ సంచికి బార్‌కోడింగ్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతీ గన్నీ బ్యాగుకు క్యూఆర్ కోడ్ ట్యాగ్‌ను ఇవ్వనుంది. దీని ద్వారా మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి వీలుకానుంది. ఈ కోడ్‌ను స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేయడం ద్వారా వచ్చిన సమాచారాన్ని సర్వర్‌లో నిక్షిప్తం చేస్తారు. ఇది దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అమల్లోకి తెస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్‌లలో త్వర లో దీనిని ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. మార్చే వీలు లేకుండా.. ఈ క్యూఆర్ కోడ్ ట్యాగ్‌ను ఉపయోగించడం ద్వారా గోనె సంచుల వివరాలను మార్చడానికి వీలుండదు. సంచులు ఏ గోదాములో, ఏ జిల్లాల్లో ఉన్నాయి, ఏ రేషన్ షాపు వద్ద వీటిని వినియోగిస్తున్నారు వంటి వివరాలు పౌరసరఫరాలశాఖ వద్ద ఉంటాయి. ఈ సంచులను ఒకటి, రెండు సార్లు లేదా మల్టీ యూజ్‌గా ఉపయోగించారా? లేదా? అన్న విషయాలు తెలుసుకునే వీలుంది. ఈ సంచి ఉపయోగించే ప్రతి సందర్భంలోనూ స్కాన్ చేసి దాని వివరాలు అందుబాటులో ఉంచుతారు. ఈ విధానానికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీగా నామకరణం చేశారు. ప్రతీ సీజన్లో ధాన్యం కొనుగోలు సమయంలో పౌరసరఫరాలశాఖ గోనెసంచులను కొనుగోలు చేసి మిల్లర్లకు అందజేస్తోంది. మిల్లర్లకు కేటాయిం చిన ధాన్యానికి సరిపడా సంచులు ఇవ్వాల్సిన జిల్లా మేనేజర్లు.. అవసరమైన దానికన్నా ఎక్కువ మొత్తంలో ఇస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారు. పైగా కస్టమ్ మిల్లింగ్ పెండింగ్‌లో ఉండటం, ఇచ్చిన గోనెసంచులు తిరిగి వెనక్కి రాకపోవడం, దీంతో మళ్లీ సీజన్ లో కొత్త బ్యాగులను కొనివ్వాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ విధంగా ఏకంగా ఆరేళ్లలో కొన్ని కోట్ల గోనెసంచులు లెక్కాపత్రం లేకుండా మాయమయ్యాయి. మరోవైపు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం దాదాపు కావాల్సిన 12 కోట్ల గన్నీ సంచులను అందుబాటులో ఉంచారు. ఈ సంచుల్లో అక్రమాలకు తావులేకుండా బార్‌కోడింగ్, క్యూఆర్ కోడ్ ట్యాగ్‌ను ప్రవేశపెట్టారు. -
కొంటామంటూ.. కొల్లగొడుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: ఓఎల్ఎక్స్లో వాహనాలు, వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ప్రకటనలు పెట్టడం.. బేరసారాల తర్వాత ఓ రేటు ఖరారు చేసుకుని ఆ మొత్తమో, అడ్వాన్సో కాజేయడం.. ఈ తరహా మోసాలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ కొత్త పంథాలో సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. ఇక్కడా సైబర్ నేరగాళ్లు ఓఎల్‌ఎక్స్‌నే ఆధారంగా చేసుకున్నారు. అయితే ఈసారి తాము పలాన వాటిని కొంటామంటూ.. ఖాతాలోని సొమ్మును కొల్లగొడుతున్నారు. గూగుల్ పే క్యూఆర్ కోడ్ ఆధారంగా జరిగిన ఈ వ్యవహారంపై బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని బృందం ఈ కేసును సాంకేతికంగా దర్యాప్తు చేస్తోంది. చెల్లిస్తామంటూ.. స్వాహా.. హిమాయత్‌నగర్ ప్రాంతానికి చెందిన సంజయ్ భట్నాగర్ వృత్తిరీత్యా కాంట్రాక్టర్. అతను తన వద్ద ఉన్న పుస్తకాల్లో కొన్నింటిని విక్రయించాలని భావించాడు. వాటిని రూ.5 వేలకు అమ్ముతానంటూ ఈ–కామర్స్ సైట్ ఓఎల్ఎక్స్లో ఓ ప్రకటన ఇచ్చాడు. దీనిని చూసిన ఓ వ్యక్తి సంజయ్‌కు ఫోన్ చేశారు. ట్రూ కాలర్ యాప్ ప్రకారం అతడి పేరు శ్రీనాథ్ బుర్మాగా సంజయ్ గుర్తించాడు. ఎలాంటి బేరసారాలు చేయని శ్రీనాథ్ ఆ పుస్తకాలన్నీ తనకు నచ్చాయని, వాటిని ఖరీదు చేయడానికి సిద్ధమేనంటూ అంగీకరించాడు. ఆర్మీలో పని చేస్తున్న తాను హైదరాబాద్ బయట ఉన్నానని, నగదును గూగుల్ పే యాప్ ద్వారా చెల్లిస్తానంటూ చెప్పాడు. అందుకుగాను ఆ యాప్‌కు సంబంధించిన క్యూఆర్ కోడ్ పంపాలని సంజయ్‌ని కోరాడు. ఈయన కోడ్ పంపగానే డబ్బు రావడానికి బదులు ఖాతాలో ఉన్న మొత్తం పోయింది. నసీబ్ ఖాన్ అనే వ్యక్తికి చెందిన గూగుల్ పే ఖాతాలోకి రూ.40 వేలు నాలుగు దఫాల్లో బదిలీ అయినట్లు గుర్తించారు. తనకు నగదు రావాల్సి ఉండగా తన డబ్బు పోవడంపై శ్రీనాథ్‌ను ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే అతడి సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ అయింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు వినియోగించిన సెల్‌ఫోన్ నంబర్‌తో పాటు గూగుల్ పే ఖాతాకు జత చేసిన నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ‘రిక్వెస్ట్’కు బదులుగా ‘పే’ ఎంచుకోవడంతో.. ఈ వ్యవహారంలో నిందితుల మాట విని బాధితుడు చేసిన చిన్న పొరపాటు ఫలితంగానే డబ్బు కోల్పోయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఆ స్కామ్ జరిగిన తీరును ఇలా వివరిస్తున్నారు. గూగుల్ పే ద్వారా ఎవరి నుంచైనా డబ్బు పొందాలంటే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా వారి నంబర్‌ను యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తంతు పూర్తయిన తర్వాత డబ్బు చెల్లించాల్సింగా కోరుతూ ఎదుటి వ్యక్తి నంబర్‌కు యాప్ ద్వారానే ‘రిక్వెస్ట్’ పంపాల్సి ఉంటుంది. అందులో ఉన్న మొత్తాన్ని సరిచూసుకునే ఎదుటి వ్యక్తి అంగీకరిస్తే ఆ డబ్బు ఇవతలి వ్యక్తి గూగుల్ పే ఖాతాలోకి వస్తుంది. అలా కాకుండా డబ్బు పొందాల్సిన వ్యక్తి పొరపాటునో, ఎదుటి వారు చెప్పిన మాటల వల్లో పడో ‘పే’ అంటూ పంపించినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. దీనిని అవతలి వ్యక్తి ‘డినైడ్’ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ అంగీకరిస్తే తాను చెల్లించాల్సింది పోయి తన ఖాతాలోకే డబ్బు వస్తుంది. సంజయ్ తన గూగుల్ పే క్యూఆర్ కోడ్‌ను ఇలానే పొరపాటున పంపి ఉంటారని, దానిని సైబర్ నేరగాళ్ళు తమకు అనుకూలంగా వాడుకుని నాలుగు దఫాల్లో రూ.40 వేలు కాజేశారని దర్యాప్తు అధికారులు వివరించారు. ఈ విషయాన్ని ప్రతి వినియోగదారుడు దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఆయా యాప్స్‌ను వినియోగించాలని సూచిస్తున్నారు. -
‘ప్లేస్టోర్’లో పుస్తకం!
సాక్షి, చీరాల (ప్రకాశం): విద్యావిధానంలో కొత్త మార్పులు వస్తున్నాయి. బట్టీ విధానానికి స్వస్తి పలికేందుకు వస్తున్న మార్పులు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్యపుస్తకాలపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. క్యూఆర్ కోడ్ వలన సమగ్ర సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు. దీని వరిశోధానాత్మక బోధన, పూర్తిస్థాయిలో అభ్యసనకు అవకాశం కలుగుతుంది. పాఠ్యాంశాలను విద్యార్థుల వీక్షించేందుకు దీక్షా యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది గణితం, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రం పుస్తకాలపై ముద్రించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి తెలుగు, హిందీ, ఆంగ్ల సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలపై కూడా క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. ఈ విధానం వలన విద్యార్థులు తమ పాఠ్యాంశాలను ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా చూసుకోవచ్చని ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలపై త్వరితగతిన అర్థం చేసుకోవచ్చు. ఎలా? గూగుల్ ప్లేస్టోర్ నుంచి దీక్షాయాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌లో విద్యార్థి లేదా ఉపాధ్యాయుడు అనేది ఎంపిక చేసుకున్న అనంతరం భాషను ఎంపిక చేసుకోవాలి. తర్వాత పాఠ్యాంశం పైన ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సమగ్రసమాచారం ఫోన్లో ప్రత్యక్షమవుతుంది. ఇలా చేయడం వలన ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు నల్లబజారుకు తరలివెళ్లకుండా ఉంటుంది. క్యూఆర్ కోడ్‌ను పుస్తకం మొదటి, చివరి పేజీల్లో ముద్రించేవారు. ప్రస్తుతం ముఖ్యమైన పాఠ్యాంశాలపై కూడా ముద్రించడంతో విద్యార్థులకు మరింత సులభతరం అయింది. మెరుగైన ఫలితాలు వస్తాయి... ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. డిజిటల్ తరగతులు, క్యూఆర్ కోడ్ వలన విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి. పాఠ్యాంశాలను బోధన ద్వారా వినడం కంటే దృశ్యరూపంలో తిలకించడం వలన మార్చిపోయే అవకాశం ఉండదు. - నాగేశ్వరరావు, ఎంఈఓ