
ముంబై: చెల్లింపుల లావాదేవీల కోసం పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు (పీఎస్‌వో) కొత్తగా మరిన్ని సొంత క్యూఆర్ కోడ్‌లను ప్రవేశపెట్టకుండా రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న యూపీఐ క్యూఆర్, భారత్ క్యూఆర్ కోడ్‌లనే కొనసాగించాల్సి ఉంటుందని తెలిపింది. సొంత క్యూఆర్ కోడ్‌లు ఉపయోగించే పీఎస్‌వోలు కూడా ఈ రెండింటికి మారాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ 2022 మార్చి 31 నాటికి పూర్తి కావాల్సి ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. జపాన్‌కి చెందిన డెన్సో వేవ్ అనే సంస్థ 1990లలో క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్‌లను ఆవిష్కరించింది. ప్రస్తుతం దేశీయంగా క్యూఆర్ కోడ్ పేమెంట్ సిస్టమ్‌లు ప్రధానంగా భారత్ క్యూఆర్, యూపీఐ క్యూఆర్‌లతో పాటు సంస్థల సొంత క్యూఆర్‌లను సపోర్ట్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment