రైల్వే మంత్రి వైష్ణవ్ ప్రశంసలు
బెంగళూరుకు చెందిన ఈ ‘స్మార్ట్’ఆటో డ్రైవర్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందనలు అందుకున్నాడు. ఎందుకంటే మనవాడు యూపీఐ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ స్మార్ట్ వాచ్‌ను వాడుతున్నాడు మరి! సదరు ఫొటోను ఓ నెటిజన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దాంతో అది తెగ వైరలవుతోంది. అలా రైల్వే మంత్రి దృష్టినీ ఆకర్షించింది. ఆ ఫోటోను ఆయన రీట్వీట్ చేశారు. ‘యూపీఐ కా స్వాగ్! చెల్లింపులు మరింత సులువయ్యాయి’అంటూ కామెట్ చేశారు.
ఆటోడ్రైవర్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెలులవెత్తుతున్నాయి. ఐటీలో ట్రెండ్ సెట్టర్ అయిన బెంగళూరు ఆ సాంకేతిక పరిజ్ఞానం వాడకంలోనూ ట్రెండ్ సెట్ చేస్తోందంటూ యూజర్లు కామెంట్ చేస్తున్నారు. ‘నవ భారత ముఖచిత్రమిది’అని ఒకరు, ‘డిజిటల్ ఇండియా మ్యాజిక్’అని మరొకరు పోస్ట్ చేశారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016లో ప్రారంభించిన యూపీఐ బ్యాంకుల మధ్య తక్షణ బదిలీలకు వీలు కలి్పంచడం ద్వారా చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచి్చంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment