సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం రైల్వే స్టేషన్లలో ఇక నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI)ద్వారా చెల్లింపులకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో క్యూఆర్ (QR) సిస్టం ద్వారా నగదు చెల్లింపు ప్రక్రియ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. రైల్వే స్టేషన్లలోని జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి ఇకపై డిజిటల్ చెల్లింపులు చేవచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
అన్ని స్టేషన్లలోని టికెట్ విండో వద్ద ప్రత్యేక డివైజ్‌ను ఏరర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ప్రయాణికుడికి సంబంధించిన అన్ని వివరాలూ కంప్యూటర్‌లో ఎంటర్ చేసిన వెంటనే ఆ డివైజ్‌లో క్యూఆర్ కోడ్ ప్రత్యక్షమవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ యాప్స్ ఉపయోగించి చెల్లింపులు చేవచ్చని, పేమెంట్ పూర్తైన తర్వాత టికెట్‌ను అందిస్తారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment