secundrabad railway station
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. ఇకపై చెల్లింపులు ఇలా కూడా
సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం రైల్వే స్టేషన్లలో ఇక నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI)ద్వారా చెల్లింపులకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో క్యూఆర్ (QR) సిస్టం ద్వారా నగదు చెల్లింపు ప్రక్రియ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. రైల్వే స్టేషన్లలోని జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి ఇకపై డిజిటల్ చెల్లింపులు చేవచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.అన్ని స్టేషన్లలోని టికెట్ విండో వద్ద ప్రత్యేక డివైజ్‌ను ఏరర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ప్రయాణికుడికి సంబంధించిన అన్ని వివరాలూ కంప్యూటర్లో ఎంటర్ చేసిన వెంటనే ఆ డివైజ్‌లో క్యూఆర్ కోడ్ ప్రత్యక్షమవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ యాప్స్ ఉపయోగించి చెల్లింపులు చేవచ్చని, పేమెంట్ పూర్తైన తర్వాత టికెట్‌ను అందిస్తారని పేర్కొంది. -
జెండా ఊపి వందే భారత్ రైలుని ప్రారంభించిన మోదీ
-
అగ్నిపథ్ అల్లర్లు: 700 కోట్ల ఆస్తి నష్టం.. 718 మంది అరెస్ట్
అగ్నిపథ్.. పేరుకు తగ్గట్టే దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనల జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ యువకుల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. నిరసనలు మరో రూపం దాల్చి హింసాత్మక రంగు పులుముకున్నాయి. గత నాలుగు రోజుల క్రితం రాజుకన్న అగ్గి ఇప్పటి వరకు చల్లారడం లేదు. 700 వందల కోట్ల ఆస్తి హాంఫట్ నిరసనకారుల ఆందోళనలో ఇప్పటి వరకు 60 రైళ్లకు నిప్పంటించారు. బిహార్‌లో 11 ఇంజిన్లను తగలబెట్టారు. గత నాలుగు రోజుల అల్లర్లలో ఇప్పటి వరకు ఆందోళనకారులు సుమారు 700 వందల కోట్ల రూపాయల ఆస్తిని అగ్నికి ఆహుతి చేశారు. అంతే కాకుండా రైల్వే స్టేషన్లలో స్టాళ్లను తగులబెట్టడంతోపాటు రైల్వేకు చెందిన ఇతర ఆస్తులను ధ్వంసం చేశారు. ఆస్తి నష్టం కేవలం అధికారులు అంచనా వేసినవి మాత్రమే.. అధికారికంగా ఇంకా ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి. సంబంధిత వార్త: సికింద్రాబాద్ కాల్పుల ఘటన: నిరసనకారుల శరీరాల్లో 8 పెల్లెట్లు 718 మంది అరెస్ట్ దేశవ్యాప్తంగా గడిచిన మూడు రోజుల్లో మొత్తం 138 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, 718 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ, వీడియో ఫుటేజీల ద్వారా హింసకు పాల్పడుతున్న మరికొంత మందిని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బిహార్ నిరసనలు విధ్వంసానికి దారి తీశాయి. నిరసనకారులు రైల్వే స్టేషన్లు లక్ష్యంగా దాడి జరుగుతోంది. బిహార్‌లో హింసాకాండకు సంబంధించి ఇప్పటి వరకు 25 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. మొత్తం 250 మందిని అరెస్టు చేశారు. అగ్నిపథ్ నిరసనలు ఒక్క బిహార్ రాష్ట్రంలోనే 15 జిల్లాలకు విస్తరించాయి. రైల్వే అధికారుల ప్రకారం.. ఒక జనరల్ బోగిని నిర్మాణానికి రూ. 80 లక్షలు ఖర్చు అవుతుంది., అదే స్లీపర్ కోచ్‌కు 1.25 కోట్లు, ఏసీ కోచ్ రూ. 3.5 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక ఒక రైలు ఇంజిన్‌ను తయారు చేసేందుకు ప్రభుత్వం అక్షరాల రూ. 20 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. మొత్తంగా చూసుకుంటే 12 బోగీల రైలును ఏర్పాటుకు చేసేందుకు రూ. 40 కోట్లు, 24 కోచ్‌ల ట్రైన్ నిర్మించేందుకు రూ. 70 కోట్లకుపైనే ఖర్చు చేస్తోంది. ఆస్తి నష్టం వాటిల్లిన రాష్ట్రాల్లో బిహార్‌లో ఎక్కువగా ఉంది. ఇది కూడ చదవండి: Agnipath Scheme: అనుమానాలు, వివరణలు 60 కోట్ల మంది టికెట్లు రద్దు ఇప్పటి వరకు సుమారు రూ. 700 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తూర్పు-మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ తెలిపారు. ఈ అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ఆస్తి నష్టంపై పూర్తి నివేదికను రైల్వే రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీనికి తోడు అధికారిక సమాచారం మేరకు 60 కోట్ల మంది ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకున్నారు. ట్రాక్‌లు దెబ్బతిని రైళ్ల రద్దు ఫలితంగా రైల్వేకు భారీ ఆర్థిక దెబ్బ తగిలింది. అయినప్పటికీ వీటన్నిటిపై రైల్వే శాఖ అధికారిక అంచనాను విడుదల చేసే పరిస్థితిలో లేనట్లు కనిపిస్తోంది. చదవండి: ఒకసారి కేసు నమోదైతే మాఫీ ఉండదు! -
సికింద్రాబాద్ విధ్వంసం.. సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసంపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. వివిధ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై సుమోటోగా కేసు స్వీకరించింది. ఘటనలో ఒకరి మృతి, 13 మందికి తీవ్ర గాయాలు రైల్వే ఆస్తి నష్టంపై జూలై 20లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్పీఎఫ్, జీఆర్పీ డీజీలను మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. కాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులులు చేపట్టిన నిరసనలు అల్లకల్లోల్లాన్ని సృష్టించాయి. ఈ అల్లర్లలో వరంగల్‌కు చెందిన రాకేష్ అనే ఆర్మీ ఉగ్యోగ అభ్యర్థి కూడా మరణించాడు. చదవండి: సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. 52 మంది అరెస్ట్ -
హైదరాబాద్‌లో మెట్రోరైళ్లు నిలిపివేత
-
అగ్నిపథ్ ఆందోళన ఎఫెక్ట్.. హైదరాబాద్ మెట్రో రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో హైదరాబాద్ మెట్రో రైళ్లను అధికారులు నిలిపివేశారు. మెట్రో స్టేషన్లకు ప్రయాణికులు రావొద్దని అధికారులు సూచించారు. నగరంలోని అన్ని మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. రేపటి నుంచి యధావిధిగా సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో సబ్ అర్బన్ సర్వీస్‌లను రద్దుచేశారు. మరోవైపు ఢిల్లీలోనూ మెట్రో రైళ్లను అధికారులు నిలిపివేశారు. చదవండి: Live Updates: అగ్నిగుండంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆర్పీఎఫ్ కాల్పుల్లో గాయపడిన యువకుడు మృతి చెందాడు. గత నాలుగు గంటలుగా పోలీసులు కాల్పులు జరిపినా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఇంకా రైల్వేట్రాక్‌పైనే వేలాదిమంది నిరసనకారులు బైఠాయించారు. రైల్వే పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వుతున్నారు. రైల్వే స్టేషన్ వదిలి వెళ్లిపోవాలని, ఆందోళనలు విరమించకపోతే మళ్లీ కాల్పులు జరుపుతామని పోలీసులు హెచ్చరించారు. సంబంధిత వార్త: న్యాయం కావాలని అడిగితే చంపేస్తారా: ఆందోళనకారులు -
న్యాయం కావాలని అడిగితే చంపేస్తారా: ఆందోళనకారులు
సాక్షి, హైదరాబాద్: తమపై కాల్పులు జరపాలని ఎవరు ఆర్డర్ ఇచ్చారని ఆందోళనకారులు ప్రశ్నించారు. తాము ఏమైనా ఉగ్రవాదులమా.. కాల్పులు జరపడానికి అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆందోళన చేస్తే కాల్పులు జరుపుతారా అని మండిపడ్డారు. తమ నిరసనల్లో ఎలాంటి రాజకీయాలు లేవని, తమ న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. ‘నాలుగు సంవత్సరాలుగా దీన్నే నమ్ముకొని ఉన్నాం. ఆందోళనల్లో రెండు బోగీలు తగలబడ్డాయంటున్నారు.. మూడు ఏళ్లుగా మా జీవితాలు నాశనం అవుతున్నాయి. అవి ఎవరూ పట్టించుకోవడం లేదు. కేవలం నాలుగేళ్ల కోసం సర్వీస్‌లో చేరలేం. అందరికీ పరీక్షను నిర్వహిస్తామని తెలిపే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. వయోపరిమితిని కూడా పెంచాలి. దాదాపు 2 వేల మందికి పైగా వచ్చాం. 8.30 గంటలకు వచ్చాం. మేం ఫిజికల్, మెడికల్‌పాస్ అయినం. పెండింగ్‌లో ఉన్న కామన్ ఎగ్జామ్‌ను నిర్వహించాలి. ’ అంటూ ఆర్మీ అభ్యర్థులు పేర్కొన్నారు. చదవండి: Secunderabad Railway Station: రైల్వేస్టేషన్ వదిలి వెళ్లిపోండి.. లేదంటే మరోసారి కాల్పులు మరోవైపు బీహార్, యూపీ, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అగ్నిపథ్ ఆర్మీ ఎంపిక పథకానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. గత నాలుగు గంటలుగా పోలీసులు కాల్పులు జరిపినా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఇంకా రైల్వేట్రాక్‌పైనే వేలాదిమంది నిరసనకారులు బైఠాయించారు. రైల్వే పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వుతున్నారు. రైల్వే స్టేషన్ వదిలి వెళ్లిపోవాలని, ఆందోళనలు విరమించకపోతే మళ్లీ కాల్పులు జరుపుతామని పోలీసులు హెచ్చరించారు.సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అలాగే రైల్వేస్టేషన్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. చదవండి: అగ్నిపథ్ ఆందోళన ఎఫెక్ట్.. హైదరాబాద్ మెట్రో రైళ్లు రద్దు అసలేంటి అగ్నిపథ్? కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల్లో చేరాలనుకునే వారికోసం కొత్తగా స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకం ‘అగ్నిపథ్’ను తీసుకొచ్చింది.. ఇందులో భాగంగా మూడు నెలల్లోనే 45 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. ఈ పథకం కింద ఎంపికయ్యే వారిని అగ్నివీరులుగా పిలుస్తామని తెలిపింది. అంతవరకూ బాగానే ఉన్నా ఈ పథకం కింద అగ్నివీరులకు లభించే ప్రయోజనాల విషయంలోనే అసంతృప్తి మొదలైంది. ప్రధానంగా అగ్నిపథ్ పథకంలో భాగంగా ఎంపికైన జవాన్లలో 75 శాతం మందిని నాలుగేళ్లకే ఇంటికి పంపేయాలని నిర్ణయించడం చిచ్చు రేపుతోంది. వలం 25 శాతం మందిని మాత్రమే నాలుగేళ్ల తర్వాత 15 ఏళ్ల వరకూ కొనసాగించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం నిరుద్యోగ యువతలో ఆందోళన రేపుతోంది. అంతే కాదు అగ్నిపథ్ పథకం ద్వారా ఎంపికైన జవాన్లకు పెన్షన్ ఉండదు. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలూ దక్కవు. ప్రస్తుతం ఆర్మీకి ఇస్తున్న ఎలాంటి ప్రయోజనాలు వారికి దక్కవు. వీరి పదవీకాలం పూర్తి కాగానే సెటిల్ మెంట్ మొత్తం ఇచ్చి పంపేస్తారు. దీంతో ఈ పథకం ప్రకటించి 24 గంటలు తిరగకుండానే దేశ వ్యాప్తంగా నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. -
అగ్నిపథ్ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీ: అగ్నిపథ్ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లకు భద్రతను పెంచింది. రైల్వే స్టేషన్ల దగ్గర భారీగా పోలీసులను మోహరించింది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చెందవద్దని, అగ్నిపథ్ వల్ల యువతకు ప్రయోజనమని తెలిపారు. అగ్నిపథ్‌ను అర్థం చేసుకోవాలి అగ్నిపథ్ ఆందోళనపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. అగ్నిపథ్‌ను యువత సరిగా అర్థం చేసుకోవాలని సూచించారు. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం పోతుందని అనుకోవద్దన్నారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయన్నారు. అందులో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. సంబంధిత వార్త: Army Students Protests Live Updates: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఘటనపై ఉన్నతాధికారులతో రైల్వే జీఎం అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. ఆస్తి నష్టం, ప్రయాణికుల ప్రత్యామ్నాయం తరలింపుపై అధికారులతో చర్చించారు. కాగా ఆందోళనకారులతో 3 రైలు(అజంతా, ఈస్ట్‌కోస్ట్, ఎమ్ఎమ్టీఎస్) ధ్వంసమయ్యాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు. పార్సిల్ రైల్తోపాటు అజంతా ఎక్స్‌ప్రెస్‌లో రెండు బోగీలు దగ్దమయ్యాయని తెలిపారు. 40 ద్విచక్రవాహనాలు కూడా ద్వంసం అయ్యాయని పేర్కొన్నారు. రైళ్ల రద్దు పైన కాసేపట్లో ప్రకటన చేస్తామని అన్నారు. ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది ఇప్పుడే అంచనా వేయలేమని అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రయాణికులకు ఊరట.. లష్కర్లో మినీ బస్సులు.. టికెట్ రూ.5
సాక్షి, హైదరాబాద్: నిత్యం జనసమ్మర్థం.. వాహనాల రద్దీతో పద్మవ్యూహాన్ని తలపించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులకు అతి పెద్ద ఊరట లభించనుంది. రైల్వేస్టేషన్‌కు నాలుగు వైపులా ఉన్న బస్టాపులను అనుసంధానం చేస్తూ మినీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఓ బస్సును ఏర్పాటు చేశారు. కేవలం రూ.5 టికెట్‌తో ప్రయాణికులు ఒక బస్టాపు నుంచి మరో బస్టాపు వరకు వెళ్లవచ్చు. అనుసంధానం ఇలా.. కేవలం రెండు మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్న ఆయా బస్టాపుల్లో ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు ప్రయాణికులు నడక దారిలో అవస్థల పాలవుతున్నారు. ఆటోల్లో వెళ్లాలంటే కొద్దిపాటి దూరానికే రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లించుకోవాల్సి వస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చుట్టూ ఉన్న బస్టాపుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఘట్కేసర్, బోడుప్పల్ వైపు నుంచి వచ్చి చిలకలగూడ చౌరస్తాలో దిగి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వెళ్లే ప్రయాణికులకు వెసులుబాటు కలగనుంది. మల్కాజిగిరి, ఈసీఐఎల్ వైపు నుంచి వచ్చే బస్సులు బ్లూసీ హోటల్ ఎదురుగా ఉన్న బస్టాపులకే పరిమితం. అక్కడ దిగిన వాళ్లు రైల్వేస్టేషన్‌కు వెళ్లాలన్నా, చిలకలగూడ క్రాస్‌రోడ్‌కు వెళ్లాలన్నా ఒకటిన్నర కిలోమీటర్ నడవాలి. అల్వాల్, బోయిన్పల్లి, జీడిమెట్ల, బాలానగర్, పటాన్చెరు, తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు సికింద్రాబాద్ గురుద్వారాకే పరిమితం. ఇక్కడ దిగి అటు బ్లూసీ వైపు, ఇటు చిలకలగూడ వైపు వెళ్లేవారికి ఊరట లభిస్తుంది. చదవండి: హైదరాబాద్ మెట్రో: టికెట్ ధరలు పెంపునకు సంకేతాలు -
దారుణం:పసికందును వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు
-
దారుణం: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పసికందు
సాక్షి, సికింద్రాబాద్: 20 రోజుల వయసున్న పసికందును గుర్తు తెలియని వ్యక్తులు సోమ వారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వదిలి వెళ్లారు. సదరు ఆడశిశువును సరక్షితంగా కాపాడిన రైల్వేపోలీసులు తదుపరి రక్షిత చర్యల నిమిత్తం శిశువిహార్‌కు తరలించారు. జీఆర్పీ సికింద్రాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీను కథనం ప్రకారం.. రైల్వేస్టేషన్ 2–3 ప్లాట్‌ఫామ్ మీద శిశువు ఒంటరిగా ఉన్నట్టు అదే ప్లాట్‌ఫామ్ మీద డ్యూటీలో ఉన్న టీటీఐ జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే శిశువును కాపాడిన పోలీసులు 1098కు సమాచారం అందించి శిశువిహార్‌కు తరలించారు. స్టేషన్‌లోని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా గుర్తుతెలియని ఒక జంట శిశువును మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో వదలి వెళ్లినట్టు గుర్తించారు. శిశువును స్టేషన్లో వదిలి వెళ్లిన జంట ఎవరన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది. అయితే సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆడపిల్ల అనే వదిలివెళ్లినట్టు భావిస్తున్నారు. చదవండి: జ్వరం, జలుబు, దగ్గుతో ఉక్కిరిబిక్కిరి.. కరోనా కావచ్చేమోనని? -
ఇదేం బాదుడు బాబోయ్! సికింద్రాబాద్ స్టేషన్లో ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ రూ.500
పూర్తి స్థాయిలో రైళ్లు ఇంకా పట్టాలు మీద పరుగులు పెట్టడం లేదు.. అప్పుడే పార్కింగ్ ఛార్జీల పేరుతో దక్షిణ మధ్య రైల్వే ప్రజల మీద మోయలేని భారాన్ని మోపుతోంది. ముఖ్యంగా జంటనగరాల్లో రైలు ప్రయాణాలకు గుండెకాయలాంటి సికింద్రాబాద్ స్టేషన్‌కు సొంత వాహనంలో రావాలంటే వెన్నులో వణుకుపుట్టే రేంజ్లో ఛార్జీలను విధిస్తోంది. ఇదేమంటే స్టేషన్లో రద్దీని నియంత్రించేందుకే అంటూ వితండవాదం ఎత్తుకుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ప్రధానమైంది సికింద్రాబాద్ జంక్షన్. ఈ స్టేషన్ మీదుగా నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. లక్ష మందికి పైగా ప్రయాణికులు ఈ స్టేషన్‌ను వినియోగించుకుంటారు. రద్దీ తగ్గట్టుగా స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని, పీపీపీ మోడ్‌లో పనులు చేపట్టబోతున్నట్టు ఇన్నాళ్లు ప్రకటిస్తూ వస్తోన్న రైల్వేశాఖ.. ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సామాన్యుల నడ్డీ విరిచేలా పార్కింగ్ ఫీజుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తోంది. కేవలం రెండు గంటలే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి ఇరువైపులా పార్కింగ్ ప్లేస్‌లు ఉన్నాయి. ఇక్కడ టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలను ప్రయాణికులు నిలిపి ఉంచుతున్నారు. దక్షిణ మధ్య తాజా నిబంధనల ప్రకారం ఇక్కడ రెండు గంటల పాటు టూ వీలర్ నిలిపి ఉంచితే రూ.15 , ఫోర్ వీలర్ అయితే రూ.50 వంతున పార్కింగ్ ఛార్జీగా విధించింది. ఆలస్యమయితే ఎవరైనా రెండు గంటలకు మించి పార్కింగ్ ప్లేస్‌లో వాహనం నిలిచి ఉంచినట్టయితే గుండె గుబిల్లుమనేలా జరిమానాలు విధిస్తోంది రైల్వేశాఖ. రెండు గంటల తర్వాత మొదటి ఎనిమిది నిమిషాలకు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ లేదు. కానీ ఆ తర్వాత గడిచే ఒక్కో నిమిషానికి ఒక్కొ రేటు విధించింది. అవి చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. - తొలి రెండు గంటల తర్వాత 8 నుంచి 15 నిమిషాల ఆలస్యానికి ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ రూ.100 - తొలి రెండు గంటల తర్వాత 16 నుంచి 30 నిమిషాల ఆలస్యానికి ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ రూ.200 - తొలి రెండు గంటల తర్వాత 30 నిమిషాలు దాటి ఆలస్యమయితే ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ రూ.500 ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతం అవుతున్న సామాన్యులకు ఈ ఎక్స్ట్రా పార్కింగ్ ఛార్జీలు శరాఘాతంగా మారాయి. పండగ వేళ స్టేషన్‌కి వెళ్లి ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జీల కాటుకు గురైన ఎందరో సోషల్ మీడియా వేదికగా రైల్వేపై విమర్శలు గుప్పిస్తున్నారు. Privatisation Shows its Colour. Parking a car for 31 minutes at a railway station now costs Rs.500 as parking charges. Whose Vikas? pic.twitter.com/EyFNS4rdPl — Brigadier A K Jairath, Retd (@KWecare) November 9, 2021 కవరింగ్ ఎక్స్ట్రా పార్కింగ్ ఛార్జీల విషయంలో నలువైపులా విమర్శలు పెరిగినా రైల్వే అధికారుల్లో మార్పు రాలేదు. పైగా స్టేషన్లో అనవసర రద్దీని నియంత్రించేందుకు స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల సౌకర్యంగా ఉండేందుకే ఈ ఓవర్ స్టే ఛార్జీలు పెట్టామంటూ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. Clarification about the messages circulating in the socialmedia regarding parking charges @Secunderabad Stn. These are only Overstay charges introduced to avoid unnecessary crowding of Station premises and provide hassle free movement facility for rail passengers @KTRTRS @KWecare pic.twitter.com/KNEhUcHBZq — South Central Railway (@SCRailwayIndia) November 10, 2021 ఇలాగైతే ఎలా రెండు గంటలు దాటితే రైల్వేశాఖ అమలు చేస్తోన్న ఓవర్ స్టే ఛార్జీలు తమకు భారంగా మారాయని ప్రయాణికులు అంటున్నారు. ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేలా ప్రయాణం చేయడం కష్టంగా అవుతోంది అంటున్నారు. మరోవైపు చాలా రైళ్లు సమయానికి రావు. ఒక వేళ రైలు ఆలస్యం కావడం వల్ల స్టేషన్లో ఎక్కువ సేపు ఉండాల్సి వస్తే.. అది రైల్వేశాఖ తప్పు అవుతుంది. అందుకు వాళ్లే పరిహారం ఇవ్వాల్సింది పోయి.. తిరిగి ప్రజల నుంచి ఓవర్ స్టే ఛార్జీలు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అక్కడ స్పెషల్.. ఇక్కడ ఓవర్‌స్టే కోవిడ్ తర్వాత సాధారణ రైళ్లను క్రమంగా పట్టాలెక్కుతున్నాయి. అయితే వాటిని సాధారణ రైళ్లుగా కాకుండా స్పెషల్ రైళ్లుగా పేర్కొంటూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది రైల్వేశాఖ. కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి.. అక్కడ కూడా సొమ్ము చేసుకుంటోంది. వీటిపైనే చాలా విమర్శలు ఉండగా తాజాగా పార్కింగ్ ఓవర్‌స్టే ఛార్జీలు తెర మీదకు వచ్చాయి. -
సికింద్రాబాద్, నాంపల్లి: మాకొద్దీ స్టేషన్లు!
సాక్షి, హైదరాబాద్: రైల్వేస్టేషన్ల పునరభివృద్ధి అంశం మరోసారి వెనక్కి వెళ్లింది. రైల్వే శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు సరికదా కనీసం ఆసక్తి కూడా చూపకపోవడం గమనార్హం. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లను విమానాశ్రయం తరహాలో పునరభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు గత నాలుగేళ్లుగా నానుతూనే ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో ఇండియన్ రైల్వేస్టేషన్స్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్ఎస్డీసీ) రెండుసార్లు, గతంలో దక్షిణమధ్య రైల్వే రెండుసార్లు ఇన్వెస్టర్లను ఆహ్వానించాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరు ముందుకు రాలేదు. మొదట్లో కొన్ని కన్సార్టియంలు ఆసక్తిని ప్రదర్శించినప్పటికీ బిడ్డింగ్ దశలో వెనుకంజ వేశాయి. ఇటీవల ఐఆర్ఎస్డీసీ మరోసారి బిడ్డింగ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ కోవిడ్ దృష్ట్యా ఇన్వెస్టర్లు, కన్సార్టీయంల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్లు ఒక అధికారి వెల్లడించారు. మరోవైపు కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలోని పలు రైల్వేస్టేషన్ల పునరభివృద్ధిలో కూడా ఇలాంటి అనాసక్తి వ్యక్తం కావడంతో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లను పెండింగ్ జాబితాలో పెట్టినట్లు పేర్కొన్నారు. ఎందుకీ అనాసక్తి. ►రైల్వేల ప్రైవేటీకరణలో భాగంగానే స్టేషన్ల రీడెవలప్మెంట్ ముందుకు వచి్చంది. ఐఆర్ఎస్డీసీ సైతం అదే లక్ష్యంతో ఏర్పడింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లను ‘డిజైనింగ్, బిల్డింగ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్’ అనే పద్ధతిలో ప్రైవేట్‌సంస్థలకు అప్పగించేందుకు కార్యాచరణ చేపట్టారు. ►దక్షిణమధ్య రైల్వేలో మొదటి దశలో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లను ఎంపిక చేశారు. ఈ స్టేషన్ల రీ డెవలప్మెంట్ ద్వారా పెట్టుబడి సంస్థలు వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలతో ఆదాయాన్ని ఆర్జించవచ్చు. స్టేషన్లలో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు రైల్వేకు కూడా ఆదాయం లభిస్తుంది. పైగా రైల్వే సొంతంగా పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉండదు. ►కింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లను 45 సంవత్సరాలకు లీజుకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఆ తరువాత నిర్మాణాలతో సహా స్టేషన్లను రైల్వేకు అప్పగించవలసి ఉంటుంది. కానీ ఈ లీజు కాలపరిమితికి బడా కన్సార్టియంలు విముఖతను వ్యక్తం చేశాయి. లీజు గడువును పెంచాలని కోరాయి. కానీ రైల్వేశాఖ అంగీకరించకపోవడంతో రీ డెవలప్మెంట్ వాయిదా పడింది. ఇప్పుడు కోవిడ్... ►మొదట్లో లీజు గడువు తక్కువగా ఉందనే కారణంతో ఇన్వెస్టర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాగా ఇప్పుడు కోవిడ్ కారణంగా ఇంచుమించు గత రెండేళ్లుగా ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు. ►ఒక్క ఢిల్లీ రైల్వేస్టేషన్ల రీడెవలప్మెంట్ మాత్ర మే పట్టాలెక్కింది. మిగతా చోట్ల అటకెక్కింది. ►సాధారణంగా 7 నుంచి 12 మంది ఇన్వెస్టర్లు లేదా నిర్మాణ సంస్థలు ముందుకు వస్తే అనూహ్యమైన స్పందన ఉన్నట్లుగా భావిస్తారు. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లకు 2 నుంచి 3 సంస్థల కంటే ఎక్కువగా ముందుకు రాకపోవడం గమనార్హం. మూడంచెల్లో నిర్మాణం... ఐఆర్ఎస్డీసీ ప్రతిపాదించినట్లుగా స్టేషన్లను పునరభివృద్ధి చేస్తే ఇప్పుడు ఉన్న స్టేషన్‌కు ఏ మాత్రం విఘాతం కలగకుండా కింద మూడు వరుసల్లో పార్కింగ్, పైన మూడు వరుసల్లో వాణిజ్య స్థలాలను ఏర్పాటు చేస్తారు. ప్లాట్‌ఫామ్‌లపైన డోమ్ ఆకారంలో పై కప్పు ఏర్పాటు చేస్తారు. దీంతో ఇది పూర్తిగా ఎయిర్‌పోర్టు తరహాలో కనిపిస్తుంది. -
దర్భంగ పేలుడు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే ‘పార్సిల్’
సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ‘పార్సిల్ వ్యవస్థ’ అస్తవ్యస్థంగా మారిందని, ఎలాంటి భద్రతా చర్యలు ఇక్కడ తీసుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 17న బిహార్‌లోని దర్భంగ రైల్వే స్టేషన్లో పేలిన బాంబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని పార్సిల్ సర్వీస్ కేంద్రం నుంచే వెళ్లినట్లు తేలడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. బుక్ చేసిన పార్సిల్స్‌ను స్కానర్ యంత్రం ద్వారా తనిఖీ చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే ఇష్టారాజ్యంగా పార్సిల్స్‌ను డిస్పాచ్ చేస్తున్నారు. ఈ విషయంలో రైల్వే అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయంపైనే దృష్టి... అటు లీజు హోల్డర్లు, ఇటు నగర ప్రజల నుంచి వచ్చిన పార్సిళ్లను ఎడాపెడా స్వీకరించి ఆదాయం రాబట్టుకుంటున్న రైల్వే అధికారులు అందులో ఏముందనే విషయంలో మాత్రం దృష్టి సారించడం లేదు. దర్భంగ రైల్వేస్టేషన్లో పేలిన బాంబు సికింద్రాబాద్ పార్సిల్ సర్వీసు నుంచి వెళ్లిందేనని తేలాక అనుమానాస్పద వ్యక్తుల సంచారం పట్ల రైల్వే రక్షక దళం పోలీసులు గస్తీ పెంచారే తప్ప రవాణా చేయాల్సిన పార్సిళ్లను తనిఖీ చేసే విషయంలో మాత్రం ఎటువంటి చర్యలు లేవు. ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం సుమారుగా 130 వరకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు బయలుదేరుతున్నాయి. ఒక్కో రైలులో రెండు బోగీలను పార్శిల్ సర్వీసు సేవలకు వినియోగిస్తున్నారు. ఈ బోగీల్లో సరుకులు రవాణా చేసేందుకు 29 మంది లీజుదారులు ఉన్నారు. వారు చేస్తున్న బుకింగ్‌ల ఆధారంగానే సరుకులు వెళ్తుంటాయి. స్కానర్లు లేని కారణంగానే.. ఒక లీజుదారు బుక్ చేసుకున్న పార్సిల్‌లోనే బాంబు ఉంచారు. రాత్రి 10.40 గంటలకు బయలుదేరాల్సిన దర్భంగా రైలులో పార్సిల్ పంపించాలని ఒక వ్యక్తి లీజుదారుడిని రాత్రి 8.30 గంటలకు సంప్రదించడంతో హడావుడిగా బుక్ చేసుకుని రైల్లో పంపించగా..ఆ పార్శిల్లోని బాంబే దర్భంగ స్టేషన్లో పేలింది. ప్యాసింజర్ రైళ్లలో పార్సిళ్లను పంపించడానికి కాంట్రాక్టు దక్కించుకున్న 29 మంది లీజుదారుల్లో ఏ ఒక్కరి వద్ద పార్సిళ్లు తనిఖీ చేసేందుకు స్కానర్లు లేవు. టెండరు సొమ్ము, లాభాన్ని రాబట్టుకోవడం కోసం స్కానింగ్ తదితర భద్రతా చర్యలు చేపట్టకుండానే బుకింగ్‌లు చేసుకుంటున్నారు. బుకింగ్దారుల వద్దకు ప్రైవేటు వాహనాలు, వ్యక్తులు పంపిస్తున్న లీజుదారులు దుస్తులు, వస్తువులతో కూడిన పార్సిళ్లను నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పార్సిల్ కార్యాలయానికి చేరవేస్తున్నారు. అన్ని స్టేషన్లలోనూ అదే పరిస్థితి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తోపాటు నగరంలో పార్సిల్ సేవలు అందిస్తున్న అన్ని రైల్వేస్టేషన్లలో ఎక్కడా స్కానింగ్ మెషిన్లు లేవు. అటు లీజుదారుల నుంచి, ఇటు నగర ప్రజల నుంచి వస్తున్న అన్ని రకాల వస్తువులతో కూడిన పార్సిళ్లను స్వీకరిస్తున్న పార్సిల్ కార్యాలయ సిబ్బంది నేరుగా రైళ్లకు ఎక్కించేస్తున్నారు. రైల్వేస్టేషన్లలో స్వీకరించిన బాక్సులు, లగేజీలకు తూకం వేయడం, బిల్లులు రాయడం మినహా వేరే ఎటువంటి భద్రతా చర్యలు ఇక్కడ తీసుకోవడం లేదు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పార్శిల్ సేవలను వినియోగించుకునేందుకు వందల సంఖ్యలో వ్యక్తులు బారులు తీరుతున్నారు. బుకింగ్ కోసం వచ్చే వ్యక్తుల నివాస ధృవీకరణలు, ఫోన్ నెంబర్లు స్వీకరించడం మినహా వారు వెంట తెచ్చిన పార్శిల్లో ఏముందన్న విషయాన్ని పట్టించుకునేవారు లేరు. గస్తీ పెంచాం..లేఖలు రాశాం దర్భంగ ఘటన నేపథ్యంలో పార్సిల్ కేంద్రాల వద్ద గస్తీ ముమ్మరం చేశాం. పార్సిల్ సర్వీసు లీజుదారులకు అవగాహన సదస్సులు నిర్వహించాం. పార్సిల్ సేవలను వినియోగించుకునేందుకు వచ్చే వ్యక్తుల వివరాలు పూర్తిగా తీసుకోవాలని సూచించాం. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు పోలీసులకు అందించాలని తెలియజెప్పాం. పార్సిల్ కార్యాలయాల వద్ద స్కానర్ల ఏర్పాటు కోసం రైల్వే అధికారులకు లేఖలు రాశాం. – కె.బెన్నయ్య, ఇన్స్పెక్టర్ రైల్వే రక్షణ దళం చదవండి: దర్భంగ పేలుడు: తండ్రికి తగని కుమారులు! -
రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా..
-
తేమ నుంచి తేటగా
సాక్షి, హైదరాబాద్ : సాధారణంగా నదులు, చెరువులు, భూగర్భం నుంచి సేకరించిన నీటిని వివిధ పద్ధతుల్లో శుద్ధిచేసి తాగేందుకు అనుకూలంగా మార్చడం గురించి విన్నాం. కానీ గాలిలోని తేమను స్వచ్ఛమైన జలాలుగా అందజేసే వినూత్న సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ‘మేఘ్‌దూత్ వాటర్ ఫ్రమ్ ఎయి ర్ కియోస్క్’ను దేశంలోనే తొలిసారిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో గురువారం ప్రారంభించనున్నారు. 1వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై దీనిని ఏర్పాటు చేస్తారు. మొదట వెయ్యి లీటర్లతో ప్రారంభించి 5 వేల లీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచనున్నారు. ‘ఈ నీరు వంద శాతం స్వచ్ఛం. ఎలాంటి కలుషితాలు ఉం డవు. అట్మాస్పెరిక్ వాటర్ జనరేషన్ టెక్నాలజీ ద్వారా గాలిలోని తేమ నుంచి ఈ నీటిని సేకరిస్తారు’అని ఇండియన్ రైల్వేస్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్డీసీ) సికింద్రాబాద్ స్టేషన్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. స్వచ్ఛ జలం సేకరణ.. విక్రయం దేశంలోనే తొలిసారిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అందుబాటులోకి.. నేడు 1వ నంబర్ ప్లాట్ ఫామ్‌పై మేఘ్‌దూత్ కియోస్క్ ప్రారంభం తేమ నుంచి నీటి సేకరణ ఇలా.. గాలిలోని తేమలో పుష్కలంగా ఉండే జలాన్ని రిఫ్రిజిరేషన్ టెక్నిక్స్‌ను అనుసరించి మేఘదూత్ అట్మాస్పెరిక్ వాటర్ జనరేటర్ సేకరిస్తుంది. బయటి గాలిని లోపలికి లాక్కొని ఒక మార్గంలో చల్లటి కాయిల్స్ ద్వారా పంపించే క్రమంలో తేమ.. నీరుగా మారుతుంది. ఆ నీటి నుంచి ఘన పదార్థాలు, వాసనలు, బ్యాక్టీరియా కారకాలను ఫిల్టర్లు తొలగిస్తాయి. వివిధ రకాలుగా నీటిని శుద్ధి చేశాక వంద శాతం స్వచ్ఛమైన నీటిని నిల్వ చేస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఈ నీరు ఉంటుంది. సికింద్రాబాద్ స్టేషన్ 1వ నంబర్ ప్లాట్‌ఫా మ్పై ఈ మేఘదూత్ కియోస్క్‌ను ఏర్పాటు చేశారు. రక్షణ శాఖ తరువాత మన దగ్గరే.. మేఘదూత్ అట్మాస్పెరిక్ వాటర్ జనరేటర్, రెమినరలైజర్ ద్వారా తేమ నుంచి నీటి సేకరణ ప్రక్రి య నిర్వహిస్తారు. నగరానికి చెందిన స్టార్టప్ కంపెనీ మైత్రి ఆక్వాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది. రక్షణశాఖలో మాత్రమే ఇప్పటి వరకు గాలి లోని తేమ నుంచి నీటిని సేకరించే వ్య వస్థ ఉంది. కేంద్ర జల్‌శక్తితో పాటు, ఐఐసీటీ, ఎన్ఐపీఈఆర్, ఈపీటీఆర్ఐ) వంటి సంస్థలు ఈ నీటిని వంద శాతం శుద్ధ జలాలుగా ఆమోదించాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం రైల్‌నీర్ ద్వారా అందజేస్తున్నట్లుగానే మేఘదూత్ కియోస్క్ నుంచి లభించే నీటినీ లీటరు రూ.8 చొప్పున విక్రయించనున్నారు. -
24x7 మీ సేవలో..
సాక్షి, హైదరాబాద్ : రైల్వే స్టేషన్లో మీరు వేచి ఉన్న విశ్రాంతి గదిలో తాగునీరు లేదా.. ఏసీలు పని చేయడం లేదా... టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయా.. వీల్‌చైర్స్ కావాలా... ఇకపై ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయాణికుల సహాయ కేంద్రం సిద్ధంగా ఉంది. 24/7 ఈ కేంద్రం పని చేసేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కొత్తగా హెల్ప్ డెస్క్‌లను అందుబాటులోకి తెచ్చారు. వైద్యం, అంబులెన్స్‌లు వంటి అత్యవసర సేవలతో పాటు అన్ని రకాల ప్రయాణ సదుపాయాల కోసం నేరుగా ఈ సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చు. హెల్ప్ డెస్క్ సేవలు ఇలా... రైల్వేస్టేషన్ల అభివృద్ధి, సదుపాయాల విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా ఐదు రైల్వేస్టేషన్లు బెంగళూర్, పుణే, సికింద్రాబాద్, ఢిల్లీలోని ఆనంద్‌బాగ్, చండీఘర్లను ఎంపిక చేసి ఇండియన్ రైల్వేస్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్డీసీ)కి అప్పగించారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్, పదో నంబర్ ప్లాట్‌ఫామ్‌ల వద్ద సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు నేరుగా కానీ, ఫోన్ నంబర్ల ద్వారా కానీ సేవలను పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, గర్భిణులు, నడవలేని స్థితిలో ఉన్న రోగుల కోసం వీల్చైర్లను ఏర్పాటు చేస్తారు. కొత్తగా వచ్చే ప్రయాణికులు ఏ ప్లాట్‌ఫామ్‌కు ఎలా వెళ్లాలి, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఎక్కడ ఉన్నాయో చెబుతారు. ఏసీ వెయిటింగ్ హాళ్లు, ప్రీపెయిడ్ రెస్ట్‌రూమ్‌ల వివరాలను తెలియజేస్తారు. స్టేషన్ పరిశుభ్రత, మంచినీటి సదుపాయం, టాయిలెట్ల నిర్వహణ, విద్యుత్ సదుపాయం వంటి వివిధ రకాల సేవల్లో లోపాలకు తావు లేకుండా చూస్తారు. దేశవ్యాప్తంగా రైళ్ల నిర్వహణ, టికెట్ బుకింగ్, రిజర్వేషన్ల వంటి అంశాలకు మాత్రమే రైల్వేలు పరిమితమవుతాయి. స్టేషన్ల నిర్వహణ, రైల్వేస్థలాల్లో వాణిజ్య కార్యకలాపాల విస్తరణ ద్వారా ఆదాయాన్ని ఆర్జించడం వంటివి ఐఆర్ఎస్డీసీ పరిధిలోకొస్తాయి. సికింద్రాబాద్ స్టేషన్లో పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ సెంటర్లు, సినిమా హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. తొలిదశలో ప్రయాణికుల సదుపాయాల నిర్వహణ, రెండో దశలో స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టును చేపట్టనున్నారు. సికింద్రాబాద్‌లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య : 1.95 లక్షలు రాకపోకలు సాగించే రైళ్ల సంఖ్య (సుమారు) : 150 మొత్తం ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య : 10 వీల్‌చైర్, హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్ : 040–27788889 వాటర్, టాయిలెట్లు, విద్యుత్, రెస్ట్‌రూమ్స్ వంటి వాటి కోసం : 040–27786607 ఐఆర్ఎస్డీసీ సిబ్బంది సహాయం కోసం : 8008400051, 9849759977 -
లైట్ తీస్కో.. బాబూ లైట్ తీస్కో!
పై ఫోటోలో ఉన్న సీన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనం చాలాసార్లు చూసుంటాం.. లగేజీ స్కానర్ అక్కడే ఉంటుంది.. మనం మాత్రం లగేజీ స్కాన్ చేయించుకోకుండానే వెళ్లిపోతుంటాం. ఈ ఫొటోలోని వాళ్లలాగే.. అక్కడ ఉండే పోలీసులు కూడా స్కాన్ చేయించుకోవాలని ప్రయాణికులకు చెప్పరు..వాళ్ల ఫోన్లలో వారు బిజీ.. అండర్ వెహికిల్ స్కానర్.. మీకు తెలుసా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇది కూడా ఉంది.. పార్కింగ్‌కు వచ్చే వాహనాలు అండర్ వెహికిల్ స్కానర్ల మీదుగా వచ్చే ఏర్పాటు చేశారు. కానీ స్కానర్లను పర్యవేక్షించేందుకు సిబ్బంది.. ఏర్పాటు చేయనే లేదు.. స్కానర్లు పనిచేస్తున్నా, వాహనాల దిగువన అనుమానిత వస్తువులు ఉన్నాయా లేదా అని పట్టించుకునేవాడే లేడు.. ఇంతేనా.. డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లతో సిబ్బంది.. ఇలా చాలా ఉన్నాయి.. రోజూ 1.60 లక్షల మంది ప్రయాణికులు వచ్చే సికింద్రాబాద్ స్టేషన్లో కనిపిస్తున్న భద్రత ఏర్పాట్లివీ.. అన్నీ ఆన్‌లోనే ఉంటాయి.. కానీ ఇవన్నీ చూడ్డానికే.. వాడ్డానికి కానట్లు తయారయ్యాయి. చాన్నాళ్లుగా ఇదే పరిస్థితి. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో, ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా టెర్రర్ అటాక్ అలర్ట్‌ను కేంద్రం ప్రకటించింది.. అటు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూడా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద హై అలర్టు అమలులో ఉంది. ఇలాంటి కీలక తరుణంలో భద్రత విషయంలో రైల్వే యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించటం విశేషం. సికింద్రాబాద్ స్టేషన్లోకి ప్రవేశించేందుకు మొత్తం ఆరు మార్గాలున్నాయి. కానీ 2 మార్గాల్లో మాత్రమే లగేజీ స్కానర్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఆ రెండు మార్గాల్లోనే లోనికి వెళ్లేలా చేస్తే రద్దీ ఏర్పడి కీలక వేళల్లో తొక్కిసలాటకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో మరో రెండు చోట్ల లగేజీ స్కానర్లు ఏర్పాటు చేసి మిగతా మార్గాలను మూసేయాల్సి ఉంది. . కానీ అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. -
అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మన్ సదాశివప్రసాద్ గుండెపోటుతో మృతి
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తోపులాట
- పోలీసుల లాఠీచార్జి హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో నగరంలోని బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫలక్‌నుమా రైలు ఎక్కేసమయంలో ప్రయాణికుల మధ్య తోపులాట జరిగింది. జనరల్ బోగీలో ఎక్కాల్సిన ప్రయాణికులను రైల్వే పోలీసులు క్యూలైన్లో ఉంచారు. రైలు వచ్చే సమయంలో ప్రయాణికులు క్యూ నుంచి బయటకు వచ్చి రైలు ఎక్కేందుకు ప్రయత్నించడంతో.. గందరగోళ పరిస్థితి తలెత్తింది. వారిని అదుపు చేయడం కోసం పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పల్లవి అనే ప్రయాణికురాలికి తీవ్ర గాయాలు కావడంతో.. స్టేషన్లోనే ఆమెకు ప్రాధమిక చికిత్స అందించారు.