
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తోపులాట
రైలు వచ్చే సమయంలో ప్రయాణికులు క్యూ నుంచి బయటకు వచ్చి రైలు ఎక్కేందుకు ప్రయత్నించడంతో.. గందరగోళ పరిస్థితి తలెత్తింది. వారిని అదుపు చేయడం కోసం పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పల్లవి అనే ప్రయాణికురాలికి తీవ్ర గాయాలు కావడంతో.. స్టేషన్‌లోనే ఆమెకు ప్రాధమిక చికిత్స అందించారు.