
సాక్షి, సికింద్రాబాద్: 20 రోజుల వయసున్న పసికందును గుర్తు తెలియని వ్యక్తులు సోమ వారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో వదిలి వెళ్లారు. సదరు ఆడశిశువును సరక్షితంగా కాపాడిన రైల్వేపోలీసులు తదుపరి రక్షిత చర్యల నిమిత్తం శిశువిహార్‌కు తరలించారు. జీఆర్‌పీ సికింద్రాబాద్ ఇన్‌స్పెక్టర్ శ్రీను కథనం ప్రకారం.. రైల్వేస్టేషన్ 2–3 ప్లాట్‌ఫామ్ మీద శిశువు ఒంటరిగా ఉన్నట్టు అదే ప్లాట్‌ఫామ్ మీద డ్యూటీలో ఉన్న టీటీఐ జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే శిశువును కాపాడిన పోలీసులు 1098కు సమాచారం అందించి శిశువిహార్‌కు తరలించారు. స్టేషన్‌లోని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా గుర్తుతెలియని ఒక జంట శిశువును మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో వదలి వెళ్లినట్టు గుర్తించారు. శిశువును స్టేషన్‌లో వదిలి వెళ్లిన జంట ఎవరన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది. అయితే సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆడపిల్ల అనే వదిలివెళ్లినట్టు భావిస్తున్నారు.
చదవండి: జ్వరం, జలుబు, దగ్గుతో ఉక్కిరిబిక్కిరి.. కరోనా కావచ్చేమోనని?
Comments
Please login to add a commentAdd a comment