abandoned
-
అత్యంత చెత్త రికార్డు.. 91 ఏళ్ల చరిత్రలో తొలిసారి..?
-
ఒక్క బంతి కూడా పడకుండా రద్దైన టెస్ట్ మ్యాచ్‌లు
గ్రేటర్ నోయిడా వేదికగా ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్ వర్షం, తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యేలా కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే మూడు రోజులు రద్దయ్యాయి. కనీసం టాస్ కూడా పడలేదు. ఆటగాళ్లు హోటల్ రూమ్లకే పరిమితమయ్యారు. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో డ్రైనేజీ సదుపాయం సరిగ్గా లేకపోవడం కారణంగా వర్షం పడకపోయినా తొలి రెండు రోజుల ఆట రద్దైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా రెండు రోజుల ఆట కూడా జరిగే ఆస్కారం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో క్రికెట్‌కు ఆతిథ్యం ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో భారత్ వారికి గ్రేటర్ నోయిడా మైదానాన్ని హోం గ్రౌండ్‌గా ఆఫర్ చేసింది. బీసీసీఐ వారి ముందు కాన్పూర్, బెంగళూరు, నోయిడా వేదికలను ఛాయిస్‌గా ఉంచితే వారే నోయిడాను ఎంచుకున్నారు. కాబుల్ నుంచి ఢిల్లీ.. ఢిల్లీ నుంచి నోయిడా దగ్గర కావడమే ఇందుకు కారణం. ఏది ఏమైనా వర్షం, సరైన డ్రైనేజీ సదుపాయం లేకపోవడం కారణంగా నోయిడాలో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ రద్దయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌లు రద్దైన పలు సందర్భాలు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.1890లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది1938లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది1970లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- టెస్ట్ మ్యాచ్‌ను వన్డేగా మార్చారు1989లో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్- టెస్ట్ మ్యాచ్‌ను వన్డేగా మార్చారు1990లో ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్- ఐదో రోజు వన్డే మ్యాచ్ ఆడారు1998లో పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే- కనీసం జట్లు కూడా ప్రకటించలేదు1998లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్- మూడో రోజు మ్యాచ్‌ను రద్దు చేశారుచదవండి: Afg vs NZ: మొన్న అలా.. ఇప్పుడిలా! ఖేల్ ఖతం? -
T20 World Cup 2024: వర్షం ఎఫెక్ట్.. భారత్-కెనడా మ్యాచ్ రద్దు
టీ20 వరల్డ్‌కప్-2024లో మరో మ్యాచ్ వర్షార్పణమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫ్లోరిడా వేదికగా శనివారం భారత్-కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. భారీ వర్షం కారణంగా స్టేడియం ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది. పలుమార్లు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు ఆటగాళ్లు భద్రత(గాయాల బారిన పడకుండా) దృష్ట్యా.. చివరికి మ్యాచ్‌ను రద్దు చేశారు. టాస్ పడకుండానే ఈ మ్యాచ్‌ను అంపైర్లు రద్దుచేశారు.దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. కాగా ఇదే స్టేడియంలో శుక్రవారం అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ మెగా టోర్నీలో ఇప్పటికే టీమిండియా సూపర్-8లో అడుగుపెట్టింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో భారత్ అద్భుత విజయాలు నమోదు చేసింది. ఇక సూపర్-8లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో బార్బోడస్ వేదికగా జూన్ 20న తలపడనుంది. మరోవైపు కెనడా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. -
ఇంగ్లండ్-పాకిస్తాన్ టీ20 మ్యాచ్ రద్దు
కార్డిఫ్ వేదికగా పాకిస్తాన్-ఇంగ్లండ్ మధ్య నిన్న (మే 28) జరగాల్సిన టీ20 మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా టాస్ కూడా సాధ్యపడలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ కూడా వర్షం కారణంగానే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో టీ20 ఓవల్ వేదికగా మే 30న జరుగనుంది. ఈ సిరీస్‌లో జరిగిన ఏకైక మ్యాచ్‌లో (రెండో టీ20) ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. జోస్ బట్లర్ (84) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. షాహీన్ అఫ్రిది 3, ఇమాద్ వసీం, హరీస్ రౌఫ్ తలో వికెట్ పడగొట్టారు.184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 19.2 ఓవర్లలో 160 పరుగులకు చాపచుట్టేసింది. రీస్ టాప్లే 3, మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్ చెరో 2 వికెట్లు.. క్రిస్ జోర్డన్, ఆదిల్ రషీద్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ సిరీస్ ముగిసిన వెంటనే పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు టీ20 వరల్డ్‌కప్ 2024 ఆడేందుకు బయల్దేరతాయి. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 4న (స్కాట్లాండ్తో).. పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 6న (యూఎస్ఏతో) ఆడనున్నాయి. మెగా టోర్నీలో భారత్-పాక్ సమరం జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది. -
పిల్లి కోసం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత
బావిలో పడిన పిల్లిని రక్షించబోయి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బయోగ్యాస్ పిట్లోకి దిగిన ఐదుగురు వ్యక్తులు చనిపోయిన ఘటన కలకలం రేపింది. పిల్లిని రక్షించడానికి కుటుంబం మొత్తం బావిలోకి దిగింది. మొత్తం ఆరుగురు ఒకరి తర్వాత మరొకరు దూకారు. అయితే ఊపిరాడక చనిపోయిన ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ స్వాధీనం చేసుకుందని అహ్మద్‌నగర్‌లోని నెవాసాపోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్ జాదవ్ తెలిపారు. బాధితులు ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో బావిలోకి దిగి ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. నడుముకి తాడు కట్టుకుని బావిలోకి ప్రవేశించిన వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడని అతణ్ణి ఆసుపత్రిలో చేర్చినట్టు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. మృతులను మాణిక్ గోవింద్ కాలే, సందీప్ మాణిక్ కాలే, బబ్లూ అనిల్ కాలే, అనిల్ బాపురావ్ కాలే, బాబాసాహెబ్ గైక్వాడ్‌లుగా గుర్తించారు. చిన్న కుమారుడు విజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బావి లోపలికి దిగిన తరువాత ఊపిరాడటంలేదని ఫిర్యాదు చేయడంతో స్థానికులు వెంటనే పోలీసులకు, నిపుణులకు సమాచారం అందించారు. దీంతో సహాయక బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీమ్‌లు ఆపరేషన్‌ను పూర్తి చేయడానికి 5 గంటలకు పైగా పట్టిందనీ, అందుకే ప్రాణనష్టం జరిగిందని స్థానికులు విమర్శించినట్టు తెలుస్తోంది. #WATCH | Five people died in a bid to save a cat who fell into an abandoned well (used as a biogas pit) in Wadki village of Ahmednagar, Maharashtra, late at night. According to Dhananjay Jadhav, Senior Police Officer of Nevasa Police station, Ahmednagar, "A rescue team… pic.twitter.com/fb4tNY7yzD — ANI (@ANI) April 10, 2024 -
ఈ చిన్నారి మృత్యుంజయుడు!
విజయపుర: ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన రెండేళ్ల చిన్నారిని 20 గంటలపాటు శ్రమించి, 16 అడుగుల లోతు నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ఎంతో ఉత్కంఠ రేపిన ఈ ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లా ఇండి తాలూకా లచియానా గ్రామంలో చోటుచేసుకుంది. చిన్నపాటి గాయమైనా కాకుండానే బాలుడిని రక్షించిన సహాయక సిబ్బందిని గ్రామస్తులు ప్రశంసల్లో ముంచెత్తారు. లచ్యాణ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన రైతు శంకరప్ప మంగళవారం తన భూమిలో బోరుబావిని తవ్వారు. నీళ్లు పడకపోవడంతో దాన్ని వదిలేసి, మరో బోరు వేశారు. బుధవారం మధ్యాహ్నం శంకరప్ప మనవడు సాతి్వక్ సతీశ్ ముజగోండ్ ఖాళీగా ఉన్న బోరుబావి వద్దకు ఆడుకుంటూ వెళ్లి అందులో పడిపోయాడు. బోరు బావి నుంచి ఏడుపు వినిపించడంతో గ్రామస్తులు సాయంత్రం 6.15 గంటల సమయంలో ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్, వైద్య, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది తాడును లోపలికి వేసి, బాలుడి కాలికి గట్టిగా బిగుసుకునేలా చేశారు. బాలుడు మరింత లోతుకు జారిపోకుండా నివారించగలిగారు. పైపు సాయంతో ఆక్సిజన్‌ను సరఫరా చేశారు. 16 అడుగుల లోతులో చిన్నారి బండరాళ్ల మధ్య చిక్కుకున్నట్లు గుర్తించారు. బండరాళ్లు అడ్డురావడంతో నిట్టనిలువుగా, అర్ధరాత్రి దాటాక 2 గంటలకల్లా 21 అడుగుల లోతు మేర గుంత తవా్వరు. 20 గంటల తర్వాత గురువారం మధ్యాహా్ననికి చిన్నారిని బయటికి తెచ్చారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు పండుగ చేసుకున్నారు. -
కంటి పాపను వదిలించుకుని..
రఘునాథపల్లి: తలపై పెద్ద కణితితో పుట్టిన శిశువును నడిరోడ్డుపై వదిలేశారు. ఈ అమానవీయ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఉదయం జరిగింది. కంచనపల్లి రోడ్డులోని ఫాతిమా చికెన్ సెంటర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున మూడు రోజుల ఆడశిశువు ఏడుస్తుండటాన్ని స్థానికులు పలువురు గుర్తించారు. పాప తలపై పెద్ద కణితి ఉండటంతో వదిలేసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అంగన్వాడీ టీచర్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె ఐసీపీఎస్, చైల్డ్‌లైన్ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించారు. వారి ఆదేశాలతో ఆశ వర్కర్లు కవిత, శ్రీలత అంగన్వాడీ టీచర్లతో కలిసి పసికందును స్థానిక పీహెచ్‌సీకి.. అక్కడి నుంచి జనగామ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం ఐసీడీఎస్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్‌లైన్ 1098 అధికారులు బాలరక్ష వాహనంలో పాపను హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. పోషించలేకుంటే సమాచారం ఇవ్వండి.. తల్లిదండ్రులు పసి పిల్లలను పోషించలేని స్థితిలో ఉంటే చెత్త కుప్పలు, రోడ్లపై వదిలేయకుండా.. బాలల పరిరక్షణ విభాగం లేదా 1098కు సమాచారం అందిస్తే సంరక్షిస్తామని బాలల పరిరక్షణ అధికారిణి జయంతి తెలిపారు. స్వయంగా బాలల పరిరక్షణ అధికారులకు అందజేస్తే ఆ పాపను మరొకరికి దత్తత ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుందని, అలా ఇచ్చి న వారి వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేశారు. -
అనాథ పాపను దత్తత తీసుకోవాలనుకున్నా : స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తుంది. 2018లో నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న ప్రియాంక ఇటీవలె సరోగసి ద్వారా తల్లైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోనే సెటిల్ అయిన ప్రియాంక తాజాగా తన బయోగ్రఫీలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'ఓరోజు ఇంట్లో చిన్న పాప ఏడుపు వినిపించింది. వెళ్లి చూస్తే అమ్మ ఆ పాపను ఊయలలో వేసి ఆడిస్తుంది. ఎవరు అని అడగ్గా హాస్పిటల్ బయట కారు పార్కింగ్‌లో పాపను ఎవరో వదిలి వెళ్లారని, అక్కడ ఏడుస్తూ ఉండటంతో ఇంటికి తీసుకొచ్చానని అమ్మ నాకు చెప్పింది. వర్షం కురుస్తున్న సమయంలో చిన్న పాపను అలా వదిలేసి వెళ్లడం నాకు చాలా బాధనిపించింది. దీంతో ఆ పాపను దత్తత తీసుకొని నా దగ్గరే ఉంచుకుంటానని పట్టుబట్టగా అమ్మ అభ్యంతరం చెప్పింది. సంతానం లేని దంపతులకు పాపను ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు అమ్మ పేర్కొంది. ఆరోజు జన్మాష్టమి. అదేరోజు వర్షంలోనే వాహనం నడుపుకుంటూ సంతానం లేని దంపతులకు పాపును ఇచ్చేసింది అమ్మ. ఆ సమయంలో వాళ్ల సంతోషం ,ఆనాటి సంఘటనల్ని ఎప్పటికీ మర్చిపోలేను' అంటూ ప్రియాంక రాసుకొచ్చింది. -
రోడ్లపై నిలిపివేసే వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
-
Hyderabad: రోడ్లపై వాహనాలను వదిలేస్తే ఇక ఉండవు అంతే..
సాక్షి, హైదరాబాద్: రోడ్లపై రోజుల తరబడి వాహనాలను వదిలేస్తున్నారా..? అయితే మీ వాహనం పోలీస్ స్టేషన్‌కే పరిమితం కానుంది. రోడ్లపై వదిలేసే వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రోడ్లపై ఇష్టానుసారం వదిలివెళ్లే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనుమానాస్పదంగా, నిర్లక్ష్యంగా ఉన్న వందలాది వాహనాలను ట్రాఫిక్ క్రేన్ల ద్వారా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఆ వాహనాలకు సంబంధించి ఎవరూ క్లెయిమ్ చేయకుంటే హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని 39బి కింద వేలం వేస్తామని చెప్పారు. రాబోయే కొన్ని రోజులపాటు ఈ డ్రైవ్ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. చదవండి: (బెంగాల్ సీఎం లేఖ.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ) -
దారుణం:పసికందును వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు
-
దారుణం: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పసికందు
సాక్షి, సికింద్రాబాద్: 20 రోజుల వయసున్న పసికందును గుర్తు తెలియని వ్యక్తులు సోమ వారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వదిలి వెళ్లారు. సదరు ఆడశిశువును సరక్షితంగా కాపాడిన రైల్వేపోలీసులు తదుపరి రక్షిత చర్యల నిమిత్తం శిశువిహార్‌కు తరలించారు. జీఆర్పీ సికింద్రాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీను కథనం ప్రకారం.. రైల్వేస్టేషన్ 2–3 ప్లాట్‌ఫామ్ మీద శిశువు ఒంటరిగా ఉన్నట్టు అదే ప్లాట్‌ఫామ్ మీద డ్యూటీలో ఉన్న టీటీఐ జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే శిశువును కాపాడిన పోలీసులు 1098కు సమాచారం అందించి శిశువిహార్‌కు తరలించారు. స్టేషన్‌లోని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా గుర్తుతెలియని ఒక జంట శిశువును మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో వదలి వెళ్లినట్టు గుర్తించారు. శిశువును స్టేషన్లో వదిలి వెళ్లిన జంట ఎవరన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది. అయితే సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆడపిల్ల అనే వదిలివెళ్లినట్టు భావిస్తున్నారు. చదవండి: జ్వరం, జలుబు, దగ్గుతో ఉక్కిరిబిక్కిరి.. కరోనా కావచ్చేమోనని? -
హృదయ విదారక ఘటన: నవజాత శిశువుని మెట్లపై వదిలేశారు
సిమ్లా: పిల్లలు కలగాలని కొందరు దంపతులు ఆసుపత్రుల చుట్టు తిరుగుతుంటే.. మరికొందరు గుళ్ల చుట్టు తిరుగుతూ దేవుడికి మొక్కులు చెల్లింస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే, దీనికి భిన్నంగా కొంత మంది మాత్రం.. తమకు పుట్టిన సంతానాన్ని వేర్వేరు కారణాలతో వదిలివేస్తున్న సంఘటనలను తరచుగా వార్తల్లో చూస్తుంటాం. నిన్న(సోమవారం) జరిగిన ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిమచల్ ప్రదేశ్‌లోని సోలాన్ అనే ప్రాంతంలో ఒక శివాలయం ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే ఆలయం ముందు నుంచి స్థానికులు వాకింగ్‌కు వెళ్తుంటారు. ఈ క్రమంలో సోమవారం ఒక చిన్నారి ఏడుపు వాకర్లకు వినిపించింది. దీంతో వారు అక్కడికి వెళ్లి చూశారు. ఆలయం మెట్లమీద ఒక నవజాత ఆడ శిశువు టవల్లో చుట్టి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆ చిన్నారి చలికి వణికిపోతుంది. వెంటనే స్థానికులు ఆలయ పూజారీ బ్రహ్మనంద్కు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి ఏవరో.. అని ఆరాతీస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నెలలు నిండకుండానే చిన్నారి పుట్టడం వలన వదిలేసుంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ పూజారీ బ్రహ్మనంద్ చిన్నారిని.. తాను దత్తత తీసుకుని పెంచుకుంటానని గ్రామస్తులకు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: బిడ్డ వేదనను చూడ లేక.. విషపు ఇంజెక్షన్ ఇచ్చి.. -
మ్యాచ్‌కు ముందు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.. భయంతో వణికిపోయాం
Everything changed.. NZC Defends Decision To Abort Pak Tour: పరిమిత ఓవర్ల సిరీస్ కోసం 18 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తొలి వన్డే(సెప్టెంబర్ 17)కు కొద్ది నిమిషాల ముందు భద్రతా కారణాల రీత్యా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత పాక్‌లోనే రెండు రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపిన 34 మంది సభ్యుల న్యూజిలాండ్ బృందం ఆదివారం వేకువజామున దుబాయ్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ మాట్లాడుతూ.. అత్యంత భయానక పరిస్థితుల నుంచి బయటపడ్డామని తెలిపాడు. మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు తమ దేశ సెక్యూరిటీ విభాగం హెచ్చరిక మేరకు తాము అలర్ట్ అయ్యామని, ఆ సమయంలో పరిస్థితులంతా ఒక్కసారిగా మారిపోయాయని, న్యూజిలాండ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాకే తప్పనిసరి పరిస్థితుల్లో పర్యటన రద్దు నిర్ణయాన్ని తీసుకున్నామని వెల్లడించాడు. పాక్ క్రికెట్‌కు నష్టం వాటిల్లుతుందని తెలిసినా.. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొన్నాడు. తమ బృంద సభ్యులు 24 గంటల పాటు దుబాయ్‌లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటారని, అనంతరం 21 మంది వారం వ్యవధిలో స్వదేశానికి తిరిగి వెళ్తారని, మిగిలిన సభ్యులు టీ20 ప్రపంచకప్ బృందంతో కలుస్తారని తెలిపారు. ఇదిలా ఉంటే, తప్పనిసరి పరిస్థితుల్లో న్యూజిలాండ్ తీసుకున్న నిర్ణయంపై పాక్ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సెక్యూరిటీ హెచ్చరిక లేదు.. ఏదీ లేదు.. అదంతా వట్టి డ్రామా.. హామీ ఇచ్చినా సిరీస్‌ను రద్దు చేసుకోవడం దారుణమని షాహిద్ అఫ్రిది మండిపడగా.. "పాక్ క్రికెట్‌ను న్యూజిలాండ్ చంపేసింది" అంటూ ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ విరుచుకుపడ్డాడు. మరోవైపు సిరీస్ రద్దుపై న్యూజిలాండ్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సైతం పాక్ పర్యటనపై పునరాలోచన చేస్తామని ప్రకటించిన విషయం విధితమే. కాగా, పాక్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు ఆడాల్సి ఉండింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ పర్యటన జరగాల్సి ఉండింది. చదవండి: గంటల వ్యవధిలో పాక్ క్రికెట్‌కు మరో షాక్.. ? -
గంటల వ్యవధిలో పాక్ క్రికెట్‌కు మరో షాక్.. ?
England Tour Of Pakistan In Doubt : పాకిస్థాన్ క్రికెట్‌కు గంటల వ్యవధిలో మరో షాక్ తగిలింది. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం 18 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తొలి వన్డేకు కొద్ది నిమిషాల ముందు భద్రతా కారణాల రీత్యా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించగా, త్వరలో పాక్‌లో పర్యటించాల్సిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సైతం కివీస్ బాటలోనే పయనించాలని నిర్ణయించుకుంది. పాకిస్థాన్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేశాక పర్యటనపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఒకటి, రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. కాగా, ఇంగ్లండ్ జట్టు చివరిసారి 2005లో పాక్‌లో పర్యటించింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ పాక్‌లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే నెలలో ఇరు జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే, న్యూజిలాండ్ తాజా నిర్ణయంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) కూడా పునరాలోచనలో పడింది. న్యూజిలాండ్ నిర్ణయం గురించి తమకు తెలిసిందని, ఆ జట్టు అక్కడే ఉంది కాబట్టి అక్కడి పరిస్థితులపై వారికి పూర్తి అవగాహన ఉంటుందని ఈసీబీ పేర్కొంది. ఇదిలా ఉంటే, పాక్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు ఆడాల్సి ఉండింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ పర్యటన జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా నేడు రావల్పిండి వేదికగా తొలి వన్డే జరగాల్సింది. చదవండి: మరికాసేపట్లో వన్డే మొదలు.. పాక్ సిరీస్‌ను రద్దు చేసుకున్న న్యూజిలాండ్ -
"పాక్ క్రికెట్‌ను న్యూజిలాండ్ చంపేసింది.."
Shoaib Akhtar And Shahid Afridi Slams New Zealand Cricket Board: పరిమిత ఓవర్ల సిరీస్ కోసం 18 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తొలి వన్డేకు కొద్ది నిమిషాల ముందు భద్రతా కారణాల రీత్యా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. న్యూజిలాండ్ సెక్యూరిటీ విభాగం సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. భద్రతాధికారుల నుంచి అందిన ఆదేశాలతో కివీస్ క్రికెటర్లు హోటల్ రూముల నుంచి బయటకు రాలేదు. ప్రస్తుతం వారు స్వదేశానికి తిరుగుటపా కట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భద్రత విషయమై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖానే స్వయంగా న్యూజిలాండ్ క్రికెటర్లకు భరోసా ఇచ్చినప్పటకీ వారు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. NZ just killed Pakistan cricket 😡😡 — Shoaib Akhtar (@shoaib100mph) September 17, 2021 సెక్యూరిటీ హెచ్చరిక లేదు.. ఏదీ లేదు.. అదంతా వట్టి డ్రామా.. హామీ ఇచ్చినా సిరీస్‌ను రద్దు చేసుకోవడం దారుణమని షాహిద్ అఫ్రిది మండిపడగా, ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. "పాక్ క్రికెట్‌ను న్యూజిలాండ్ చంపేసింది" అంటూ కోపంగా ఉన్న ఎమోజీలతో ట్వీట్ చేశాడు. కాగా, సిరీస్ రద్దవ్వడంపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. "సిరీస్ రద్దు పాక్ క్రికెట్ బోర్డుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలుసు. పీసీబీ అద్భుతంగా ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఆ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ తెలిపారు. ఇదిలా ఉంటే, పాక్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు ఆడాల్సి ఉండింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ పర్యటన జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా నేడు రావల్పిండి వేదికగా తొలి వన్డే జరగాల్సింది. On a HOAX threat you have called-off the tour despite all assurances!! @BLACKCAPS do you understand the IMPACT of your decision? — Shahid Afridi (@SAfridiOfficial) September 17, 2021 చదవండి: కోహ్లి వారసుడిగా రోహిత్‌తో పోలిస్తే అతనైతేనే బెటర్.. ఎందుకంటే..? -
భయపెట్టే బోయింగ్‌కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు?
అతి పెద్ద విమానాలకు మరో పేరుగా స్థిరపడిన బోయింగ్ విమనాలు మళ్లీ భారత గగనతలంలో ప్రయాణానికి రెడీ అయ్యాయి. రెండున్నరేళ్ల నిషేధం తర్వాత బోయింగ్ ఫ్లైట్లను నడిపేందుకు విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులు ఇచ్చింది. ప్రమాదాల జరగడం వల్లే జంబో విమానాల తయారీకి బోయింగ్ సంస్థ పెట్టింది పేరు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన విమానాలు ఏవియేషన్ సెక్టార్లో రాజ్యమేళాయి. అయితే బోయింగ్ 737 మ్యాక్స్ విమానంతో కథ అడ్డం తిగిరింది. యూరప్, అమెరికా, ఏషియా అని తేడా లేకుండా బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. దీంతో వరుసగా ఒక్కో దేశం ఈ విమానలను కమర్షియల్ సెక్టార్ నుంచి తొలగించాయి. భారత్ సైతం 2019 మార్చిలో బోయింగ్ విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఎప్పటి నుంచి రెండున్నరేళ్ల నిషేధం తర్వాత ఇటీవల బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడుపుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో స్పైస్ జెట్ సంస్థ సెప్టెంబరు చివరి వారం నుంచి బోయింగ్ విమానాలు నడిపేందుకు రెడీ అవుతోంది. మరోవైపు దుబాయ్ ఇండియా మధ్య సర్వీసులు అందిస్తున్న సంస్థలు సైతం బోయింగ్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విమానాలపై ఉన్న నిషేధాన్ని ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాలు ఎత్తేయగా తాజగా ఆ జాబితాలో ఇండియా చేరింది. చైనా ఇప్పటికీ నిషేధాన్ని కొసాగిస్తోంది. పారదర్శకత ఏదీ బోయింగ్ విమానాల కమర్షియల్ ఆపరేషన్స్‌కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ అనుమతులు ఇవ్వడంపై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అనుమతులు ఇవ్వడం, రద్దు చేయడం అనేది డీజీసీఏ సొంత వ్యవహారం కాదంటున్నారు. ఏ కారణాల చేత అనుమతులు రద్దు చేశారు ? విమానంలో ఏ లోపాలను గుర్తించారు ? వాటిని ఆ సంస్థ సవరించిందా లేదా ? అనే వివరాలు ప్రజల ముందు ఉంచకుండా ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం సరికాదంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బోయింగ్ విమానాలు తిరిగి అందుబాటులోకి రావడాన్ని కొందరు స్వాగతిస్తున్నారు. చదవండి: బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు -
అఫ్గన్ సంక్షోభం: గుండెల్ని పిండేసే దృశ్యం!
కాబూల్: అఫ్గన్ తాలిబన్ల స్వాధీనంలోకి వచ్చినప్పటినుంచి అనేక హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్నాయి. తాజాగా తల్లిదండ్రులనుంచి తప్పిపోయిన 7 నెలల చిన్నారి ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. కాబూల్ ఎయిర్ పోర్టులో సోమవారం నాటి అల్లకల్లోల పరిస్థితుల్లో సంబంధిత కుటుంబం నుంచి ఈ పసివాడు మిస్ అయి ఉంటాడని భావిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణ తరువాత అఫ్గన్ పౌరుల్లో తీరని భయం నెలకొంది. ప్రాణభయంతో పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌లో అనేక భయంకరమైన దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా పలువుర్నికలవర పెడుతున్నాయ. ముఖ్యంగా దేశం విడిచి ఎలాగైనా పారిపోవాలన్న ఆతృతలో కాబూల్ విమానాశ్రయానికి వందలాది మంది క్యూకట్టారు. ఈ తొక్కిసలాట గందరగోళానికి తోడు గాలిలో నుండి ఇద్దరు వ్యక్తులు ఆకాశం నుండి కిందపడిపోయిన దృశ్యాలు అత్యంత బాధాకరంగా నిలిచాయి. ఇపుడు ఒక ప్లాస్టిక్ క్రేట్లో చిన్నారి ఏడుస్తున్న దృశ్యాలు నెటిజన్లు కలచి వేస్తున్నాయి. సోమవారం నాటి గందరగోళంలో ఈ చిన్నారి తల్లిదండ్రుల నుండి విడిపోయినట్టుగా భావిస్తున్నారు. అశ్వక న్యూస్ ఏజెన్సీ ప్రకారం కాబూల్‌లో పీడీ-5 వీరు నివసిస్తున్నట్టుగా తెలుస్తోంది. బిడ్డను కనుగొనడంలో కుటుంబానికి సహాయం చేయనుందని పేర్కొంది. (Ashraf Ghani: భారీ నగదుతో పారిపోయాడు: రష్యా) మరోవైపు దీనిపై నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఫ్గానిస్తాన్ ప్రజలను రక్షిస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చడంలో తాలిబన్ల వైఫల్యం అంటూ ఒకరు, ఇది తాలిబన్ల వైఫ్యలం, పిల్లలను రక్షించలేని విజయం విజయం కాదంటూ మరికొరు మండి పడుతున్నారు. చదవండి : Afghanistan:ప్రపంచంలోని అతిపెద్ద లిథియం నిక్షేపం తాలిబన్ల చేతుల్లోకి! Afghanistan crisis: గుండె బద్దలవుతోంది: బాలీవుడ్ హీరోయిన్ A couple living in PD-5 #Kabul blame that their 7 Months Baby went missing from Kabul Airport yesterday during the chaos. Up to this instance they couldn’t find him. @AsvakaNews trying to help them find their baby through missing announcements on social media. pic.twitter.com/TDsJEXUXAR — Aśvaka - آسواکا News Agency (@AsvakaNews) August 17, 2021 -
పేదల కోసం ఛారిటీ మ్యాచ్ అన్నారు.. బ్యాట్లతో తలలు పగులగొట్టుకున్నారు
లండన్: ఇంగ్లండ్‌లో జరిగిన ఓ ఛారిటీ క్రికెట్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య చిన్నపాటి ఘర్షన రక్తసిక్తంగా మారింది. ఇరు జట్ల క్రికెటర్ల మధ్య మాటామాటా పెరిగి చివరికి బ్యాట్లతో తీవ్రంగా కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్లకు తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లో వైద్యం అవసరమైన పేదల కోసం షెహజాద్ అక్రమ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఓ ఛారిటీ మ్యాచ్‌ని మైడ్‌స్టోన్‌లోని మోటే క్రికెట్ క్లబ్లో నిర్వహించారు. అయితే మంచి ఉద్దేశంతో నిర్వహించిన ఈ మ్యాచ్ చివరికి రక్తసిక్తంగా మారడం చర్చనీయాంశంగా మారింది. గొడవకి కారణం ఏంటనే విషయం వెలుగులోకి రానప్పటికీ.. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Disgraceful scenes during a charity match which had to be abandoned after a fight between the two teams. The violence erupted at the end of a game at Mote Park Cricket Club in Maidstone during a tournament raising money for those in need of medical treatment in Pakistan pic.twitter.com/uGOYPuc3z2 — Saj Sadiq (@Saj_PakPassion) July 20, 2021 వీడియో కనిపించిన దృష్యాల ప్రకారం.. బ్యాట్స్‌మెన్ ఓ ఫీల్డర్‌పై దాడికి దిగినట్లు తెలుస్తోంది. దాంతో.. ఇరుజట్ల ఆటగాళ్లు బాహాబాహీకి దిగినట్లు స్పష్టమవుతోంది. అనంతరం రెండు గ్రూప్‌ల ఆటగాళ్లు బ్యాట్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ కనిపించారు. మధ్యలో అంపైర్లు, మ్యాచ్ నిర్వాహకులు వారిని కట్టడి చేసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. గొడవ సద్దుమణిగే సమయానికి ఇద్దరు ఆటగాళ్లు దెబ్బలకి తాళలేక కిందపడిపోయి కనిపించారు. దీంతో మ్యాచ్ అర్ధంతరంగా రద్దైంది. కాగా, ఈ గొడవ విషయమై మ్యాచ్ నిర్వహకుడు షెహజాద్ స్పందిస్తూ.. ఇది ఫైనల్ మ్యాచ్ అని, మరో రెండు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందన్న దశలో కొందరు గ్రౌండ్లోకి వచ్చి గొడవ స్టార్ట్ చేశారని, ఓ ఇద్దరు ముగ్గురు బ్యాట్లతో ఆటగాళ్లని తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నాడు. మొత్తంగా ఛారిటీ మ్యాచ్ ఉద్దేశాన్ని నాశనం చేశారని నిరాశ వ్యక్తం చేశాడు. అయితే గొడవకు అసలు కారణం ఏంటన్నది తనకు కూడా తెలియదని అతను చెప్పడం విశేషం. -
పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది.. అయినా కుంగిపోలేదు
లుథియానా జిల్లా టూసా గ్రామానికి చెందిన సత్విందర్ కౌర్‌కు... అందరి అమ్మాయిల్లానే వయసు రాగానే తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. టీచర్‌గా పనిచేస్తోన్న మంచి వరుడు దొరకడంతో 2009 ఫిబ్రవరి 23న పెద్దల సమక్షంలో కోటి ఆశలతో పెళ్లి చేసుకుంది సత్విందర్. ఆ ఆశలన్నీ మూణ్ణాళ్ల ముచ్చటేనని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వివాహం అయిన కొద్దిరోజులకే భర్త విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 2010లో జార్జియా వెళ్లి అక్కడ నుంచి ఉక్రెయిన్‌కు మారాడు. అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో విదేశీ విద్యార్థుల కో ఆర్డినేటర్‌గా పనిచేసేవాడు. అతను మాత్రమే వెళ్లి తనను ఎందుకు తీసుకెళ్లలేదో సత్విందర్‌కు అర్థం కాలేదు. అలా ఐదేళ్లు గడిచిపోయాయి. 2015 జూలై 20 న ఇండియాకు భర్త తిరిగి వస్తున్నారని ఎంతో ఆత్రుతగా ఎదురు చూసింది సత్విందర్. సంవత్సరాల తరువాత విదేశాల నుంచి వచ్చిన భర్త కుటుంబంతో అయిష్టంగా వ్యవహరిస్తూ.. మనం వేరే ఇంటికి అద్దెకు వెళ్దాం అని చెప్పి కిరాయికి ఇల్లు తీసుకుని అక్కడకు మకాం మార్చాడు. నెల తరువాత ‘‘నేను ఇప్పుడు ఉక్రెయిన్ వెళ్తున్నాను. మూడు నెలల తరువాత నిన్ను తీసుకెళ్తాను’’ అని చెప్పి తిరిగి వెళ్లిపోయాడు. కానీ చెప్పినట్లుగా సత్విందర్ను తీసుకెళ్లలేదు. తన భర్త తనని మోసం చేసాడని తెలుసుకున్న సత్విందర్ 2016లో ఎన్ఆర్ఐ సెల్లో ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో ఆమె భర్త విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. దీంతో కొన్ని వాయిదాల తరువాత పదివేల రూపాయల జీవన భృతితో కోర్టు విడాకులు ఇస్తూ తీర్పు ఇచ్చింది. విడాకులు మంజూరు అయ్యేంత వరకూ సత్విందర్.. తనలాగా భర్తచేతిలో మోసపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఎంతోమంది అమ్మాయిల సాధక బాధలను దగ్గర నుంచి గమనించేది. చిన్న చిన్న అమ్మాయిల జీవితాలు రోడ్డున పడడం వారు న్యాయం కోసం సంవత్సరాలపాటు కోర్టుల చుట్టూ తిరగడం, సత్విందర్‌కు కూడా అటువంటి ప్రత్యక్ష అనుభవం ఉండడంతో తనలాంటి వారికి సాయపడాలనుకున్నారు. అబ్ నహీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ.. భర్తల చేతిలో మోసపోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలను ఆదుకోవాలని నిర్ణయించుకుని 2016లో ‘అబ్ నహీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ’ పేరున స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా మోసపోయిన అమ్మాయిలు, మహిళలకు సాయం చేయడం ప్రారంభించారు. కోర్టులు, పోలీసు స్టేషన్స్ దగ్గర తనకు ఎదురైన అమ్మాయిలను, ఇంకా ఫేస్బుక్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా మరికొంతమంది బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకుని ఎన్ఆర్ఐ సెల్స్, జాతీయ మహిళ కమిషన్ నిర్వహించే సెమినార్స్‌కు వారిని ఆహ్వానించి అక్కడ వాళ్లకు న్యాయం ఎలా అందుతుందో వివరించేవారు. ప్రభుత్వ పెద్దలను సంప్రదించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా గురుద్వారాలను సంప్రదించి బాధిత మహిళ వివరాలు తెలుసుకుని వారికి కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇప్పటిదాకా 700 మంది మహిళలకు సాయపడ్డారు. ఎన్జీవోని సంప్రదించిన 40 మంది పురుషులకు సత్విందర్ సాయపడడం విశేషం. ‘‘నా భర్త నన్ను మోసం చేసినప్పుడు చాలా బాధపడ్డాను. కానీ కొన్నిరోజులకు నన్ను నేను తమాయించుకుని ధైర్యంగా పోరాడాలనుకున్నాను. ఈ క్రమంలోనే నాలా కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారిలో ధైర్యం నింపుతూ.. సాయం చేయాలనుకున్నాను. ఎన్జీవో స్థాపించి నేను చేయగలిగిన సాయం చేస్తున్నాను. సాయం కోసం నా దగ్గరకు వచ్చేవారిలో 65 ఏళ్ల లోపు మహిళలు 22 మంది ఉన్నారు. వీళ్లంతా దశాబ్దాలుగా తమ భర్తల కోసం ఎదురు చూస్తున్నారు. పంజాబ్, హర్యాణ రాష్ట్రాల్లోనే దాదాపు 32 వేల మంది బాధిత మహిళలు ఉన్నారు. వీరిలో చాలా మందికి సరైన న్యాయం అందడం లేదు. కొన్ని సందర్భాల్లో మోసం చేసిన భర్తల పాస్‌పోర్టులు రద్దుచేయించడం, ప్రపంచ నలుమూలల్లో ఏదేశం లో ఉన్నా ఇండియాకు రప్పించి న్యాయం చేస్తున్నాం. ఇప్పటిదాక 20 జంటలను కౌన్సెలింగ్ ద్వారా కలిపాము’’ అని సత్విందర్ వివరించారు. -
18 ఏళ్లకే భర్త వదిలేస్తే.. ఐస్ క్రీం అమ్మకం నుంచి నేడు ఎస్సై
తిరువనంతపురం: యుక్త వయసు వచ్చిందంటే చాలు.. చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రుల ఆలోచన అమ్మాయి పెళ్లి గురించే ఉంటుంది. ఆమె ఇష్టానికి, ఆశలకు, ఆశయానికి పెళ్లి పేరిట సంకెళ్లు వేస్తారు. ఇక దురదృష్టం కొద్ది కట్టుకున్న వాడు వదిలేస్తే.. కొన్ని చోట్ల కన్నవారు కూడా ఆదరించరు. అలాంటి సందర్భాల్లో చాలా మంది ఆడవారు మరణమే శరణం అనుకుంటారు. కానీ కొందరు మహిళలు మాత్రం ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి.. తాను కన్నీరు పెట్టిన చోటే సగర్వంగా తలెత్తుకుని నిలబతారు.. పది మందికి ఆదర్శంగా నిలుస్తారు. ఈ కోవకు చెందిన వారే కేరళకు చెందిన అని శివ. 18వ ఏట భర్త వదిలేస్తే.. చేతిలో ఆరు నెలల బిడ్డతో రోడ్డున పడ్డ శివ.. నేడు అదే చోట ప్రొబేషనరీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ వివరాలు.. కేరళకు చెందిన అని శివ 18వ ఏట డిగ్రీ ఫస్టియర్ చదువుతుండగా.. ఆమెకు ఇష్టం లేకపోయిన బలవంతంగా పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ఐపీఎస్ కావాలనే ఆమె కలకు అక్కడితో శుభం కార్డు పడింది. వైవాహిక జీవితం కూడా సవ్యంగా సాగలేదు. బిడ్డ పుట్టిన ఆరు నెలలకు భర్త ఆమెను వదిలేశాడు. ఆదరించాల్సిన కన్నవారు.. దూరం పెట్టారు. దాంతో తన నానమ్మకు సంబంధించిన చిన్న రేకుల షెడ్డులో బిడ్డతో కలిసి జీవించసాగింది అని శివ. ఇక బతుకుతెరువు కోసం ఏ పని దొరికినా చేసేది. వర్కాలా శివగిరి ఆశ్రమ ప్రాంతంలో నిమ్మ రసం, ఐస్‌క్రీములు మొదలు హస్తకళలకు చెందిన పలు వ్యాపారాలు చేసింది. కానీ అన్నింట్లో అపజయమే. ఇలా ఉండగా ఓ సారి ఆమెను గమనించిన ఓ వ్యక్తి.. చదువుకోమని సూచించి.. ఆర్థిక సాయం చేశాడు. ఆ తర్వాత ఆ అజ్జాత వ్యక్తి సూచన మేరకు ఎస్సై జాబ్‌కు అప్లై చేసి.. కొలువు సంపాదించింది. ఈ క్రమంలో కేరళ పోలీసు డిపార్ట్మెంట్ ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది. ‘‘నిజమైన ఆత్మవిశ్వాసానికి, మనో స్థైర్యానికి ప్రతీకగా నిలిచారు అని శివ. 18వ ఏట భర్త ఆమెను రోడ్డున పడేశాడు. కుటుంబం ఆమె గురించి పట్టించుకోలేదు. కానీ ఆమె వీటన్నింటిని తట్టుకుని నేను ఎస్సై ఉద్యోగం సాధించింది’’ అని ప్రశంసిస్తూ ట్వీట్ చేయడంతో ఆమె స్టోరి తెగ వైరలయ్యింది. ఈ సందర్భంగా అని శివ మాట్లాడుతూ.. ‘‘నా గురించి తెలిసి ఎవరెవరో నన్న ప్రశంసిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు. వర్కాలా పోలీస్ స్టేషన్లో నాకు పోస్టింగ్ ఇచ్చారని కొన్ని రోజుల క్రితమే తెలిసింది. ఎక్కడైతే నేను కన్నీరు కార్చానో.. ఎవరి మద్దతు లేకుండా నా బిడ్డ జీవితం కోసం పోరాడానో.. నేడు అక్కడే ఎస్సైగా విధులు నిర్వహిస్తాను అని తలుచుకుంటేనే చాలా గర్వంగా అనిపిస్తుంది. నా భావాలను వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదు’’ అన్నారు. చదవండి: స్వయంగా బావిలోకి దిగి శవాన్ని వెలికి తీసిన ఎస్ఐ -
నిలువనీడ లేక.. చేరదీసేవారు లేక!
నిర్మల్: మిట్ట మధ్యాహ్నం.. ఎర్రటిఎండ.. నెత్తిన మూటలు, కాలినడకన, ఖాళీ కడుపున వచ్చి ఓ చెట్టు నీడన ముక్కుతూ, మూలుగుతూ గడుపుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఊరికాని ఊరిలో పడరాని పాట్లు పడుతున్నారు. జీవన మలిసంధ్యవేళ సంచార జీవనం గడుపుతున్నారు. ఇదీ నిర్మల్‌లో ఓ వృద్ధదంపతుల దయనీయస్థితి. నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామానికి చెందిన అల్లకుంట లక్ష్మి, లక్ష్మయ్య అనే వృద్ధ దంపతులకు సంతానం లేదు. సొంత ఇల్లు కూడా లేదు. అదే ఊరిలో ఓ గదిలో అద్దెకుండేవారు. లక్ష్మయ్య ఊళ్లోవారి బర్రెలను కాస్తుండగా, లక్ష్మి వ్యవసాయపనులకు వెళ్లేది. వయసు పైబడటంతో ఆయన ఇంటి పట్టునే ఉంటున్నాడు. నెలనెలా వచ్చే రూ.రెండు వేల పింఛన్‌తోనే ఆ దంపతులు ఇన్నాళ్లు బతుకు వెళ్లదీస్తూ వచ్చారు. ఇటీవల గ్రామంలో కరోనా కేసులు పెరగడంతో యజమాని ఈ వృద్ధ దంపతులుంటున్న గదిని ఖాళీ చేయించాడు. దీంతో తమ బట్టలను సంచులలో సర్దుకుని, వాటిని నెత్తిన పెట్టుకుని రోడ్డెంటా బయలుదేరారు. మూడు నెలలుగా పింఛన్ వస్తలేదు... రెండు, మూడు రోజులు ఆ ఊళ్లో, ఈ ఊళ్లో గడిపా రు. లక్ష్మి బంధువుల ఇళ్లలో వారం ఉన్నారు. అక్కడా పరిస్థితి బాగా లేక మళ్లీ బయటకు వచ్చా రు. ఇరవై రోజుల క్రితం నిర్మల్ బస్టాండ్ చేరుకున్నారు. అక్కడే ఉంటూ.. ఎవరైనా అన్నదానం చేస్తే తింటూ పూట గడుపుతున్నారు. బస్టాండ్ అధికారులు గురువారం బయటకు పంపించడంతో మళ్లీ రోడ్డున పడ్డారు. ఎండలో ప్రధాన రహదారి వెంట నడుస్తూ.. చివరకు ఆర్అండ్బీ విశ్రాంతి భవనం వద్ద ఓ చెట్టు కింద ఆగారు. ‘సుట్టాలున్నా.. మా అసుంటి ముసలోళ్లను ఎన్నాళ్లు ఉంచుకుంటరు బిడ్డా..’అని లక్ష్మి వాపోతోంది. మూణ్నెళ్లుగా పింఛన్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అందరూ ఉన్నా.. అనాథగానే! వర్ధన్నపేట: భర్త ఉన్నాడు.. బంధువులు ఉన్నారు.. దత్తపుత్రుడు ఉన్నాడు. అయినా ఆమె ఎవరూలేని అనాథలా జీవితం గడుపుతోంది.. అనారోగ్యంతో లేవలేని స్థితిలో బతుకుపోరు సాగిస్తోంది. కరోనా అనుమానంతో ఎవరూ దగ్గరకు రావడంలేదు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట 11వ వార్డుకు చెందిన గబ్బెట విజయ, వెంకటేశ్వర్లు దంపతులు. వెంకటేశ్వర్లు విశ్రాంత ఉపాధ్యాయుడు. సంతానం లేకపోవడంతో విజయను వదిలేసిన ఆయన మరో పెళ్లి చేసుకుని వరంగల్‌లో కాపురం ఉంటున్నాడు. విజయ ఒంటరిగా వర్ధన్నపేటలో ఉంటూ కొన్నేళ్ల క్రితం ఓ బాలుడిని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసింది. వారం క్రితం విజయ అస్వస్థతకు గురికాగా దత్తపుత్రుడు ఆమెను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. మొదట ఆమెను అక్కాచెల్లెళ్లు తీసుకెళ్లారు. కానీ జ్వరం తగ్గకపోవడంతో కరోనా సోకిందనే అనుమానంతో వర్ధన్నపేటలోని ఇంట్లో వదిలేశారు. అప్పటి నుంచి ఆమె లేవలేని స్థితిలో తిండి, నీరు లేక నీరసించింది. గురువారం ఆమె స్థితిని గమనించిన ఇరుగుపొరుగువారు ఆమె భర్తకు ఫోన్ చేయగా తాను కరోనా బారిన పడినందున మీరే ఆస్పత్రిలో చేర్చాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక మునిసిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఇక స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులకు చెబితే హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్‌చేస్తే తప్ప తాము తీసుకెళ్లలేమని చేతులెత్తేశారు. స్థానిక యువకులు మంచినీరు, ఆహారం ఇవ్వాలని ప్రయత్నిం చారు. ఆమె నీళ్లూ తాగలేని పరిస్థితిలో ఉంది. -
ముళ్లపొదల నుంచి ఏడుపులు.. అసలేం జరిగింది..?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తొమ్మిది నెలలు మోసి, పాలిచ్చి పెంచిన తల్లి..కుమారులకు భారమైంది. రెండు కాళ్లు కదపలేక వృద్ధాప్యంతో బాధపడుతున్న తల్లిపై ఏ మాత్రం కనికరం చూపకుండా ముళ్లపొదల్లో పారవేసి వదిలించుకున్నారు. మనసున్న కొందరు మహిళలు ఆ మార్గంలో వెళుతూ గమనించి ఆదుకోగా ప్రభుత్వ ఆస్పత్రిలో అనాథలా గడుపుతోంది. వివరాలు.. తిరుళ్లూరు జిల్లా పొన్నేరి సమీపం కున్నమంజేరి గ్రామానికి చెందిన కొందరు మహిళలు సమీపంలోని చెరువుకు వెళుతుండగా మార్గమధ్యంలోని ముళ్లపొదల నుంచి మహిళ ఏడుపులు, మూలుగుల శబ్దం వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా రెండు కాళ్లు అచేతన స్థితిలో సుమారు 80 ఏళ్ల వృద్ధురాలు పడిఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. వారంతా కలిసి వృద్ధురాలిని ముళ్లపొదల్లో నుంచి మోసుకొచ్చి పోలీసుల సమాచారం ఇచ్చారు. ఆమెను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మనలి చెక్కోడుకు చెందిన ఆ వృద్ధమహిళ కాంతిమతి పోలీసులకు తనగోడు చెప్పుకున్నారు. తనకు భర్త రాధాకృష్ణన్, రవి, శంకర్ అనే ఇద్దరు కుమారులున్నారు. కుమారులిద్దరూ కూలీపనులకు వెళుతుంటారు. కుమారులు తనను సరిగా చూసుకునేవారు కాదు. తనను పోషించడం భారంగా భావించారు. చిన్నకుమారుడు శంకర్ మాయమాటలతో గురువారం రాత్రి మోటార్‌సైకిల్‌పై తీసుకొచ్చి జనసంచారం లేని ప్రాంతంలోని ముళ్లపొదల్లో తోసివేసి వెళ్లిపోయాడని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. వృద్ధురాలు కాంతిమతి కుటుంబం గురించి మరిన్ని వివరాలు చెప్పలేకపోవడంతో సమాచారం రాబట్టేందుకు పోలీసులు శ్రమపడుతున్నారు. పూర్తి సమాచారం రాబట్టిన తరువాత కుమారులపై ఎలాంటి చర్య తీసుకోవాలో నిర్ణయిస్తామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. మనసు మార్చుకుని కుమారులు వస్తారు, అక్కున చేర్చుకుంటారని ఆ అమాయక తల్లి ఆశగా ఎదురుచూస్తోంది. చదవండి: దోషం పోతుందని బిడ్డను బలిచ్చిన తల్లి కేసులో కొత్త విషయాలు దారుణం: ప్రియుడి కామవాంఛకు ఐదేళ్ల కుమార్తె బలి -
చేతులేత్తి మొక్కుతా.. వదిలేయండి: ఎంపీ మాధవ్
సాక్షి, హిందూపురం: ‘మీకు చేతులేత్తి మొక్కుతా.. ద్విచక్రవాహనాలను స్టేషన్లో ఎండ పెట్టకుండా వదిలేయండి’ అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సీఐలు బాలమదిలేటి, మన్సూరుద్దీన్‌లతో అన్నారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించారంటూ పోలీసులు భారీ ఎత్తున వాహనాలను సీజ్ చేసి పోలీసుస్టేషన్లలో ఉంచారు. అవి ఎండకు ఎండి వానకు తడిసి చెడిపోయే స్థితికి చేరుకున్నాయి. దీనిపై సాక్షిలో కథనం కూడా ప్రచురితమైంది. చదవండి: దశలవారీ మద్యనిషేధంపై కసరత్తు షురూ.. ఈ క్రమంలో గురువారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరైన పోలీసు అధికారులతో ఎంపీ మాట్లాడారు. ఆయా వాహనదారులకు కోర్టు ద్వారా స్టేషన్ జరిమానాలు విధించి వదిలేయాలని కోరారు. ఎక్కువ రోజులు ఎండ పడితే పెట్రోల్ ఉన్న వాహనాల నుంచి మంటలు ఎగిసి.. బెంగళూరు నగరంలో జరిగినట్లుగా ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాహనాదారులకు ఇబ్బంది కలగకుండా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ కూడా పోలీసులకు సూచించారు. చదవండి: 'ఆయన హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదు' -
అమానుషం: భర్తను ఇంట్లోంచి గెంటేసిన భార్య
సాక్షి, సిరిసిల్ల: ఇంట్లో చనిపోతే అరిష్టమని మూఢత్వం పెనవేసుకున్న కార్మికక్షేత్రం సిరిసిల్లలో మరో అమానుషం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య తాళి బంధం కాదనుకుంది. పేగు బంధంతో కొడుకు అక్కున చేర్చుకున్నా.. చచ్చిపోయే వృద్ధున్ని ఇంట్లోకి తీసుకురావద్దని అద్దింటి యజమాని కర్కశత్వం అడ్డుకట్ట వేసింది. ఓ నేతన్న బతికుండగానే శవంలా మారిన ఈ అమానుష సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం గాంధీనగర్‌కు చెందిన కోడం భూమయ్య(65) నేతకార్మికుడు. భార్య బాలలక్ష్మి కొడుకు దేవదాస్, కూతరు జ్యోతిలను పోషించేవాడు. అతడి ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే కొడుకు, కూతురుకు పెళ్లిల్లు చేశాడు. బాలలక్ష్మి ఐదేళ్ల క్రితం కొడుకు, కొడలు, వారి పిల్లలతో గొడవపడి వారిని ఇంట్లోంచి వెళ్లగొట్టగా వేరే కాపురం ఉంటున్నారు. ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్న దేవదాస్ భార్యాపిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం వరకు భూమయ్య ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే బాలలక్ష్మి గొడవపడి ఇంట్లోంచి వెళ్లగొట్టింది. తాము ఉంటున్న ఇల్లు తన పుట్టింటి వారు ఇచ్చిందని దీనిపై భర్తకు, పిల్లలకు ఏలాంటి హక్కులు లేవని తేల్చిచెప్పి ఒక్కతే ఇంట్లో పిండిగిర్నీ నడిపిస్తూ బతుకుతుంది. భూమయ్య కూడా చేతనైనన్ని రోజులు అక్కడ ఇక్కడా పనిచేస్తూ..కాలం వెళ్లదీసిండు. కొద్ది రోజులుగా ఆరోగ్యం సహకరించడం లేదు. ఈక్రమంలో స్థానిక గాంధీనగర్ హనుమాన్ ఆలయం వద్ద వారం రోజులుగా ఎండకు ఎండుతూ..వానకు నానుతూ..పడి ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న కొడుకు నాలుగురోజుల క్రితం తానుంటున్న అద్దె ఇంటికి తీసుకెళ్లి సపరిచర్యలు చేస్తుండగా..భూమయ్య చనిపోతే అరిష్టంగా పేర్కొంటూ..ఇంట్లో ఉండొద్దని యజమాని హుకుం జారీచేశాడు. దీంతో దేవదాస్ తన తండ్రి బాగోగులు చూడలేకుండా అయ్యాడు. ఈక్రమంలోనే భూమయ్య గుడివద్ద అచేతన స్థితిలో వారం రోజులుగా పడి ఉంటున్నాడు.. పరిమళించిన మానవత్వం.. సిరిసిల్ల ధర్మాసుపత్రిలో వైద్యం అందిస్తున్న దృశ్యం.. హనుమాన్ ఆలయం వద్ద చేతకాకుండా పడిఉన్న భూమయ్యను స్థానిక సామాజిక కార్యకర్త దీకొండ అశోక్ మంగళవారం ఆలయ దర్శనానికి వచ్చి గమనించాడు. వెంటనే వివరాలు తెలుసుకున్నాడు. భూమయ్య పరిస్థితిని చూసి జాలేసి స్థానిక జిల్లాసుపత్రిలో చేర్పించగా..సిబ్బంది చికిత్స చేస్తున్నారు. బతికుండగానే భర్తను ఇంట్లోకి రానివ్వని భార్య, మూఢాచారాలతో అమానవీయంగా ఇంట్లోకి రానివ్వని అద్దె ఇంటి యజమాని నిర్వాకంపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తాయి.