హైదరాబాద్: మానవత్వం మంట కలిసే సంఘటన శనివారం భోలక్‌పూర్‌లో చోటు చేసుకుంది. మానవత్వ విలువలను కాలరాస్తూ ఓ కిరాతక తల్లి తాను జన్మనిచ్చిన బిడ్డకు ఒక రోజు కూడా కాకముందే పేగు బంధాన్ని తెంచుకుంది. అత్యంత హృదయ విదారక సంఘటన భోలక్‌పూర్‌లో జరిగింది.
వివరాలు.. భోలక్‌పూర్ డివిజన్ బంగ్లాదేశ్ మార్కెట్ సమీపంలోని సిద్దిఖ్ నగర్‌లో అఫ్సర్ ఫయిం ఇంటి ప్రహరీ గేటు తీసి ఎవరూ చూడని సమయంలో ఇంటి ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి అప్పుడే పుట్టిన మగ శిశువును వదిలి వెళ్లారు. అనంతరం పసికందు రోదిస్తుండటంతో.. గమనించిన ఇంటి యాజమానులు సాయంత్రం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.