గ్రేటర్ నోయిడా వేదికగా ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్ వర్షం, తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యేలా కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే మూడు రోజులు రద్దయ్యాయి. కనీసం టాస్ కూడా పడలేదు. ఆటగాళ్లు హోటల్ రూమ్‌లకే పరిమితమయ్యారు.
గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో డ్రైనేజీ సదుపాయం సరిగ్గా లేకపోవడం కారణంగా వర్షం పడకపోయినా తొలి రెండు రోజుల ఆట రద్దైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా రెండు రోజుల ఆట కూడా జరిగే ఆస్కారం లేదు.
ఆఫ్ఘనిస్తాన్‌లో క్రికెట్‌కు ఆతిథ్యం ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో భారత్ వారికి గ్రేటర్ నోయిడా మైదానాన్ని హోం గ్రౌండ్‌గా ఆఫర్ చేసింది. బీసీసీఐ వారి ముందు కాన్పూర్, బెంగళూరు, నోయిడా వేదికలను ఛాయిస్‌గా ఉంచితే వారే నోయిడాను ఎంచుకున్నారు. కాబుల్ నుంచి ఢిల్లీ.. ఢిల్లీ నుంచి నోయిడా దగ్గర కావడమే ఇందుకు కారణం.
ఏది ఏమైనా వర్షం, సరైన డ్రైనేజీ సదుపాయం లేకపోవడం కారణంగా నోయిడాలో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ రద్దయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌లు రద్దైన పలు సందర్భాలు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
1890లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది
1938లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది
1970లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- టెస్ట్ మ్యాచ్‌ను వన్డేగా మార్చారు
1989లో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్- టెస్ట్ మ్యాచ్‌ను వన్డేగా మార్చారు
1990లో ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్- ఐదో రోజు వన్డే మ్యాచ్ ఆడారు
1998లో పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే- కనీసం జట్లు కూడా ప్రకటించలేదు
1998లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్- మూడో రోజు మ్యాచ్‌ను రద్దు చేశారు
Comments
Please login to add a commentAdd a comment