Afghanistan Vs New Zealand
-
అత్యంత చెత్త రికార్డు.. 91 ఏళ్ల చరిత్రలో తొలిసారి?
టెస్టు క్రికెట్లో తమ ఉనికిని చాటుకోవాలనుకున్న అఫ్గానిస్తాన్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. నోయిడా వేదికగా న్యూజిలాండ్‌తో జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. భారీ వర్షం కారణంగా నోయిడాలోని మైదానం ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది.దీంతో అయిదో రోజు ఆట కూడా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు శుక్రవారం ప్రకటించారు. దీంతో కనీసం టాస్ పడకుండానే ఈ టెస్టు మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది. ఈ క్రమంలో ఒక్క బంతి కూడా పడని అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ టెస్టు పలు అరుదైన రికార్డుల జాబితాలో చేరింది.ఆసియాలో తొలిసారి..టెస్టు క్రికెట్ హిస్టరీలో బంతి పడకుండా రద్దయిన ఎనిమిదో మ్యాచ్‌గా ఈ నోయిడా టెస్టు రికార్డులకెక్కింది. 1890లో మొట్టమొదటి సారి ఇలా జరిగింది. మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దయింది. ఆ తర్వాత 1930లో ఆస్ట్రేలియా- ఇంగ్లండ్, 1970లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్, 1989లో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్, 1990లో ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్, 1998లో పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే, 1998లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టులు కనీసం టాస్ పడకుండానే రద్దు అయ్యాయి.ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్-అఫ్గానిస్తాన్ టెస్టు మ్యాచ్ ఈ జాబితాలోకి చేరింది. ఇక ఆసియాలో వర్షం కారణంగా రద్దు అయ్యిన తొలి టెస్టు మ్యాచ్ మాత్రం అఫ్గాన్-న్యూజిలాండ్ మ్యాచే కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆసియాలో ఈ విధంగా ఎప్పుడు జరగలేదు. ఆసియాలో 91 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ విధంగా ఎప్పుడు జరగలేదు.చదవండి: Cristiano Ronaldo Followers: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా -
అంతా అనుకున్నట్టే.. న్యూజిలాండ్- అఫ్గాన్ టెస్టు రద్దు
అందరూ ఊహించిందే జరిగింది. నోయిడా వేదికగా అఫ్గానిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ ఐదో రోజు ఆట కూడా వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఈ చారిత్రత్మక టెస్టు మ్యాచ్ కనీసం టాస్ పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. "నోయిడాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు చేయబడింది. ఐదవ రోజు ప్రారంభంలోనే అంపైర్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కోసం బ్లాక్ క్యాప్స్ శ్రీలంకకు పయనం కానున్నారు అని న్యూజిలాండ్ క్రికెట్ ఎక్స్‌లో రాసుకొచ్చింది.కాగా ఈ సిరీస్ వాస్తవానికి సెప్టెంబర్ 9న ప్రారంభమవ్వాల్సింది. కానీ కుండపోత వర్షం వల్ల మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. అయితే తొలి రెండు రోజులు పగలు సమయంలో పెద్దగా వర్షం కురవనప్పటకి.. మైదానాన్ని గ్రౌండ్ స్టాప్ సిద్దం చేయలేకపోయారు. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో సరైన మౌళిక సదుపాయాలు లేకపోవడమే అందుకు కారణం. గ్రౌండ్లో కురిసిన నీరు బయటకు వెళ్లేందుకు అసలు డ్రైనేజీ వ్యవస్థ, మైదానాన్ని సన్నద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేవు. ఆ తర్వాత మరింత వర్షాలు కురవడంతో గ్రౌండ్ మొత్తం చిన్నపాటి చెరువులా తయారైంది. ఆఖరి మూడు రోజులు కనీసం ఆటగాళ్లు హోటల్ నుంచి స్టేడియం కూడా రాలేదు. అంటే నోయిడా మైదానంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఆర్ధం చేసుకోవచ్చు. చివరికి టాస్ పడకుండానే అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. టెస్టు క్రికెట్లో తమ ఉనికిని చాటుకోవాలని భావించిన అఫ్గానిస్తాన్‌కు నిరాశే ఎదురైంది.చదవండి: IPL 2025: రోహిత్ ముంబై ఇండియన్స్‌తోనే కొనసాగాలి.. ఎందుకంటే? -
వదలని వరుణుడు.. కివీస్-అఫ్గాన్ నాలుగో రోజు ఆట రద్దు
గ్రేటర్ నోయిడా వేదికగా న్యూజిలాండ్-అఫ్గానిస్తాన్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు అయ్యే దిశగా సాగుతోంది. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట సైతం రద్దు అయింది. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి షాహీద్ విజయ్ సింగ్ పాఠిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలోని ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.అంతేకాకుండా ప్రస్తుతం నోయిడాలో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. మైదానం మొత్తాన్ని గ్రౌండ్ స్టాప్ కవర్లతో కప్పిఉంచారు. ఈ క్రమంలోనే గురువారం జరగాల్సిన నాలుగో రోజు ఆటను అంపైర్లు రద్దు చేశారు. అయితే ఆఖరి రోజైన శుక్రవారం కూడా భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో టెస్టు మ్యాచ్ మొత్తం తుడిచిపెట్టుకు పోయే సూచనలు కన్పిస్తున్నాయి. ఇదే విషయంపై ప్రముఖ ప్రెజెంటర్ ఆండ్రూ లియోనార్డ్ మాట్లాడుతూ.. రేపు కూడా వాతావారణం ఇలాగే ఉంటుంది. ఇది నిజంగా రెండు జట్లకు నిరాశ కలిగించే వార్త.న్యూజిలాండ్ తమ ఆసియా పర్యటనను ప్రారంభించేందుకు భారత్‌కు వచ్చింది. ఈ టూర్లో అఫ్గాన్‌తో పాటు భారత్,శ్రీలంకతో టెస్టు సిరీస్‌లు కివీస్ ఆడనుంది. మరోవైపు అఫ్గానిస్తాన్ టెస్టు క్రికెట్ చాలా అరుదుగా ఆడుతుంది. కివీస్ వంటి బలమైన జట్టును ఎదుర్కొనేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. కానీ ప్రకృతి మాత్రం వారి ఆశలను అడియాశలు చేసింది. మళ్లీ రేపు కలుద్దాం అని పేర్కొన్నారు.నిరాశలో అఫ్గాన్-కివీ ఫ్యాన్స్.. కాగా వాస్తవానికి ఈ చారిత్రత్మక టెస్టు మ్యాచ్ సోమవారం(సెప్టెంబర్ 9) ప్రారంభం అవ్వాలి. కానీ మ్యాచ్ కంటే ముందు కురిసిన కుండపోత వర్షాల వల్ల మైదానం చిత్తడిగా మారింది. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో కురిసిన నీరు బయటకు వెళ్లేందుకు అసలు డ్రైనేజీ వ్యవస్థ, మైదానాన్ని సన్నద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేవు.దీంతో మైదానం రెడీ చేసేందుకు గ్రౌండ్ స్టాప్ తీవ్రంగా శ్రమించారు. అయితే సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. మంగళవారం రెండోరోజు ఆట జరిపించేందుకు మైదానంలో పదుల సంఖ్యలో గ్రౌండ్ సిబ్బంది కష్టపడ్డారు. ల్యాండ్‌స్కేప్ గడ్డి గడుల్ని తెచ్చి మైదానమంతా పరిచేందుకు చెమటోడ్చారు. ఫ్యాన్లు అమర్చి మైదానం ఎండేలా కృషి చేశారు.కానీ ఔట్ ఫీల్డ్ మాత్రం చిత్తడి ఉండటంతో ఆటగాళ్లు భద్రత దృష్ట్యా అంపైర్లు రెండు రోజు ఆటను రద్దు చేశారు. మూడో రోజు కూడా మైదానం కూడా సిద్దం కాలేదు. దీంతో మూడో రోజు కూడా టాస్ పడకుండానే రద్దు అయింది. అయితే ఎలాగైనా మైదాన్ని సిద్ద నాలుగు రోజు(గురువారం) 98 ఓవర్లు పాటు ఆటను నిర్వహించాలని అంపైర్లు భావించారు. కానీ మళ్లీ నోయిడాలో వర్షం రావడం, మైదానం ఔట్ ఫీల్డ్ తడిగా మారడంతో నాలుగో రోజు ఆటను కూడా రద్దు చేశారు. అయితే నోయిడా స్టేడియం పరిస్థితులపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు అధికారులు ఆంసతృప్తి వ్యక్తం చేశారు. తాము ఇంకెప్పుడూ నోయిడాకు రామంటూ అఫ్గాన్ క్రికెటర్లు సైతం వ్యాఖ్యానించారు.చదవండి: ఒక్క బంతి కూడా పడకుండా రద్దైన టెస్ట్ మ్యాచ్‌లు -
ఒక్క బంతి కూడా పడకుండా రద్దైన టెస్ట్ మ్యాచ్‌లు
గ్రేటర్ నోయిడా వేదికగా ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్ వర్షం, తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యేలా కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే మూడు రోజులు రద్దయ్యాయి. కనీసం టాస్ కూడా పడలేదు. ఆటగాళ్లు హోటల్ రూమ్లకే పరిమితమయ్యారు. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో డ్రైనేజీ సదుపాయం సరిగ్గా లేకపోవడం కారణంగా వర్షం పడకపోయినా తొలి రెండు రోజుల ఆట రద్దైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా రెండు రోజుల ఆట కూడా జరిగే ఆస్కారం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో క్రికెట్‌కు ఆతిథ్యం ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో భారత్ వారికి గ్రేటర్ నోయిడా మైదానాన్ని హోం గ్రౌండ్‌గా ఆఫర్ చేసింది. బీసీసీఐ వారి ముందు కాన్పూర్, బెంగళూరు, నోయిడా వేదికలను ఛాయిస్‌గా ఉంచితే వారే నోయిడాను ఎంచుకున్నారు. కాబుల్ నుంచి ఢిల్లీ.. ఢిల్లీ నుంచి నోయిడా దగ్గర కావడమే ఇందుకు కారణం. ఏది ఏమైనా వర్షం, సరైన డ్రైనేజీ సదుపాయం లేకపోవడం కారణంగా నోయిడాలో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ రద్దయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌లు రద్దైన పలు సందర్భాలు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.1890లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది1938లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది1970లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- టెస్ట్ మ్యాచ్‌ను వన్డేగా మార్చారు1989లో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్- టెస్ట్ మ్యాచ్‌ను వన్డేగా మార్చారు1990లో ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్- ఐదో రోజు వన్డే మ్యాచ్ ఆడారు1998లో పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే- కనీసం జట్లు కూడా ప్రకటించలేదు1998లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్- మూడో రోజు మ్యాచ్‌ను రద్దు చేశారుచదవండి: Afg vs NZ: మొన్న అలా.. ఇప్పుడిలా! ఖేల్ ఖతం? -
Afg vs NZ: మొన్న అలా.. ఇప్పుడిలా! ఖేల్ ఖతం?
అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్‌ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టుకు అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షం కారణంగా మూడో రోజు ఆట కూడా.. కనీసం టాస్ పడకుండానే ముగిసిపోయింది. కాగా 2017లో టెస్టు హోదా సంపాదించిన అఫ్గన్ జట్టు.. తటస్థ వేదికలపై తమ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో తొలిసారిగా టెస్టు ఆడేందుకు వేదికగా భారత్‌ను ఎంచుకుంది.సోమవారమే మొదలు కావాలి.. కానీభారత క్రికెట్ నియంత్రణ మండలిని సంప్రదించి తమ రాజధాని కాబూల్‌కు దగ్గరగా ఉన్న గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియానికి విచ్చేసింది. ఇందులో భాగంగా.. షెడ్యూల్ ప్రకారం అఫ్గన్- కివీస్ జట్ల మధ్య సోమవారం నుంచి టెస్టు మ్యాచ్ మొదలుకావాలి.. కానీ రెండు రోజుల పాటు ఆటగాళ్లు మైదానంలో దిగే పరిస్థితి లేకపోయింది. ఆట ముందుకు సాగడమే గగనమైంది.తొలి రెండు రోజులు వాన చినుకు జాడ లేకపోయినా... మైదానం మాత్రం ఆటకు సిద్ధం కాలేదు. గత రెండు వారాల క్రితం నోయిడాలో కురిసిన భారీ వర్షాల కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తం తడిగా మారింది. నీరు బయటకు వెళ్లేందుకు గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో అసలు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యమయ్యే దుస్థితి అదే విధంగా... మైదానాన్ని ఆటకు వీలుగా ఆరబెట్టే పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యమయ్యే దుస్థితి తలెత్తింది. కేవలం నోయిడా స్టేడియంలో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే అఫ్గనిస్తాన్ జట్టుకు భంగపాటు ఎదురవుతోంది. రెండోరోజు ఆట జరిపించేందుకు మంగళవారం మైదానంలో పదుల సంఖ్యలో గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది.ల్యాండ్‌స్కేప్ గడ్డి గడుల్ని తెచ్చి మైదానమంతా పరిచేందుకు చెమటోడ్చినా అవుట్‌ఫీల్డ్ పొడిబారలేదు. ఫ్యాన్లు అమర్చి మైదానం ఎండేలా కృషి చేసినా ఫలితం శూన్యం. దీంతో కనీసం మూడో రోజైనా పరిస్థితి మెరుగపడుతుందని అఫ్గన్- న్యూజిలాండ్ జట్ల ఆటగాళ్లు, అభిమానులు ఎదురుచూశారు.ఇప్పుడిక వర్షంఅయితే, ఈరోజు వర్షం కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. వాన కురుస్తున్న కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తం కవర్లతో కప్పేశారు గ్రౌండ్స్‌మెన్. దీంతో మూడో రోజు కూడా ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక మరో రెండు రోజుల పాటూ నోయిడాలో భారీ వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అఫ్గన్- కివీస్ టెస్టు మొదలుకాకుండానే ముగిసిపోయే దుస్థితి నెలకొంది.చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్ రషీద్.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్ ఖాన్! -
అయ్యో పాపం!.. అఫ్గనిస్తాన్ జట్టుకు ఏమిటీ ‘పరీక్ష’?
న్యూజిలాండ్‌తో తొలిసారిగా టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన అఫ్గనిస్తాన్ జట్టుకు వరుసగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో సరైన వసతిలేని కారణంగా రెండో రోజు ఆట కూడా రద్దైపోయింది. ఒక్క బంతి కూడా పడకుండానే మంగళవారం నాటి ఆట ముగిసిపోయింది. దీంతో ఇరుజట్ల ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తితో స్టేడియం నుంచి నిష్క్రమించినట్లు సమాచారం.కారణం ఇదేకాగా స్వదేశంలో మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితిలేని కారణంగా అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తటస్థ వేదికలను ఎంచుకుంటోంది. ఈ క్రమంలో తొలిసారిగా కివీస్‌తో టెస్టు ఆడేందుకు భారత్‌లోని గ్రేటర్ నోయిడా మైదానాన్ని ఎంచుకుంది. ఇందుకు సంబంధించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి కూడా ఆమోదం రావడంతో అఫ్గన్ జట్టు నోయిడాకు చేరుకుంది.ఇక షెడ్యూల్ ప్రకారం సోమవారమే(సెప్టెంబరు 9) అఫ్గన్- కివీస్ ఏకైక టెస్టు ఆరంభం కావాల్సి ఉంది. అయితే, గత రెండు వారాలుగా కురిసిన భారీ వానల కారణంగా నోయిడా స్టేడియం అవుట్ ఫీల్డ్ మొత్తం తడిసిపోయింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు గ్రౌండ్స్‌మెన్ ఎంతగా కష్టపడినా ఫలితం లేకపోయింది. ఈ స్టేడియంలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. కాబట్టి మళ్లీ ఎండకాస్తే తప్ప గ్రౌండ్ ఆరే పరిస్థితి లేదు. అయితే, రెండురోజులుగా నోయిడాలో వర్షం లేకపోయినా.. వాతావరణం మాత్రం పొడిగా లేదు. అయినప్పటికీ సూపర్ ఫ్యాన్లతో ఆరబెట్టేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ఈ క్రమంలో నిన్నటితో పోలిస్తే కాస్త పరిస్థితి మెరుగైనా ఆట మొదలుపెట్టేందుకు అనుకూలంగా లేకపోయింది. రెండో రోజు కూడా టాస్ పడకుండానేఈ నేపథ్యంలో టాస్ పడకుండానే అఫ్గన్- న్యూజిలాండ్ తొలిరోజు ఆట ముగిసిపోయింది. దీంతో రెండో రోజు నుంచి అరగంట ఎక్కువసేపు మ్యాచ్ నిర్వహిస్తామని అంపైర్లు తెలిపారు. అయితే, ఈ రోజు(మంగళవారం) కూడా అదే పరిస్థితి ఎదురైంది. అవుట్‌ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ ఆడే పరిస్థితి లేదని అంపైర్లు ఆటను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ అధికారులు, ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. కివీస్‌కు నష్టమేమీ లేదు.. కానీనోయిడా స్టేడియం మేనేజ్మెంట్ వల్ల తమ చారిత్రాత్మక మ్యాచ్‌కు అవరోధాలు ఎదురవుతున్నాయని.. మరోసారి ఇక్కడకు రాబోమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-2025 సైకిల్లో ఈ మ్యాచ్ భాగం కాదు కాబట్టి న్యూజిలాండ్‌కు పెద్దగా వచ్చే నష్టమేమీలేదు. అయితే, వరల్డ్ టెస్టు చాంపియన్‌తో టెస్టు ఆడి.. సత్తా చాటాలని భావించిన అఫ్గన్ ఆటగాళ్లకే తీవ్ర నిరాశ ఎదురైంది.చదవండి: Ind vs Ban T20Is: టీమిండియాకు శుభవార్త -
Afg vs NZ: ‘చెత్తగా ఉంది.. ఇంకోసారి ఇక్కడకు రాబోము’
న్యూజిలాండ్‌తో తమ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌కు అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నోయిడా స్టేడియంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. కనీస వసతులు కూడా లేవంటూ పెదవి విరిచారు. ఇలాంటి చోట ఇంకోసారి అడుగు కూడా పెట్టబోమంటూ ఘాటు విమర్శలు చేశారు.తటస్థ వేదికలపైకాగా తమ దేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేదు కాబట్టి తాము ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై ఆడుతోంది అఫ్గన్ జట్టు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదంటే భారత్ వేదికగా ప్రత్యర్థి జట్లకు ఆతిథ్యం ఇస్తోంది. ఇందులో భాగంగా గతంలో గ్రేటర్ నోయిడాలోని షాహిద్ విజయ్ పాతిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను హోం గ్రౌండ్‌గా చేసుకుని పలు మ్యాచ్‌లు ఆడింది అఫ్గన్ జట్టు. వర్షం కురవనేలేదు.. అయినా..ఈ క్రమంలో న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్టుతో తొలిసారి టెస్టు ఆడేందుకు సిద్ధమైన మరోసారి నోయిడాకు విచ్చేసింది. అయితే, సోమవారం(సెప్టెంబరు 9) మొదలుకావాల్సిన అఫ్గన్- కివీస్ మ్యాచ్‌కు ప్రతికూల పరిస్థితులు అడ్డుపడ్డాయి. ఫలితంగా ఇరుజట్ల మధ్య మొదలుకావాల్సిన ఏకైక టెస్టు తొలి రోజు ఆట పూర్తిగా రద్దయ్యింది. నిజానికి సోమవారం ఏమాత్రం వర్షం కురవనేలేదు. కానీ కొన్నిరోజుల పాటు కురిసిన కుండపోత వర్షాల వల్ల నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం చిత్తడిగా మారింది. మ్యాచ్ ఆడేందుకు గ్రౌండ్ ఏమాత్రం అనుకూలంగా లేదు.ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ లేదుదీంతో ఆటగాళ్లు మైదానంలో దిగే అవకాశమే లేకపోవడంతో పలుమార్లు స్టేడియాన్ని పరిశీలించిన ఫీల్డు అంపైర్లు కుమార ధర్మసేన, షర్ఫుద్దౌలా చేసేదేమి లేక తొలిరోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ ఏదీ ఇక్కడ లేకపోవడంతో మైదానం తడారిపోయేందుకు ఎండకాయాల్సిందే! కాబట్టి.. దీని కారణంగా మ్యాచ్‌పై ఎన్నిరోజులు ప్రభావం పడుతుందో స్పష్టంగా చెప్పడం కష్టం.చెత్తగా ఉంది.. ఇంకోసారి ఇక్కడకు రాబోముఈ నేపథ్యంలో అఫ్గన్ బోర్డు అధికారులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ‘‘ఇక్కడి పరిస్థితి చెత్తగా ఉంది. ఇంకోసారి ఇక్కడకు రాకూడదని నిశ్చయించుకున్నాం. ఇక్కడ కనీస వసతులు లేవు. మా ఆటగాళ్లు కూడా నిరాశకు లోనయ్యారు. నిజానికి.. గతంలో మేము ఇక్కడకు వచ్చినపుడు కూడా పరిస్థితి ఇలాగే ఉంది.మాకు సొంతగడ్డ లాంటిదిఅందుకే ముందుగానే సంబంధిత అధికారులతో మాట్లాడాము. మాకు ఎలాంటి ఇబ్బంది కలగబోదని స్టేడియం వాళ్లు హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గతంలో కంటే ఏమాత్రం అభివృద్ధి చెందలేదు’’ అని అసహనం వ్యక్తం చేశారు. కాగా ఈ మ్యాచ్ షెడ్యూల్ ఖరారు కాగానే.. అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది బీసీసీఐ, ఏసీబీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ తమకు సొంతగడ్డ లాంటిదని.. ఇక్కడ తాము ఆడబోయే మ్యాచ్‌కు మంచి వేదికను ఏర్పాటు చేయాలని కోరాడు. అయితే, పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటంతో అతడు కూడా నిరాశకు లోనైనట్లు తెలుస్తోంది. కాగా 2017లో టెస్టు హోదా పొందిన అఫ్గనిస్తాన్ ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి మూడింట గెలిచి.. ఆరింట ఓడిపోయింది. ఇక న్యూజిలాండ్‌తో అఫ్గన్ ఆడుతున్న తొలి టెస్టు ఇదే! చదవండి: ముషీర్ ఖాన్‌కు బీసీసీఐ బంపరాఫర్.. టీమిండియాలో చోటు? -
Afg vs NZ Day 1: ఒక్క బంతి పడకుండానే ముగిసిన ఆట
అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌కు మొదటిరోజే ఆటంకం కలిగింది. వర్షం తాలూకు ప్రభావం కారణంగా ఒక్క బంతి పడకుండానే తొలి రోజు ఆట ముగిసిపోయింది. ఫలితంగా మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించాలనుకున్న ఇరుజట్లకు చేదు అనుభవమే మిగిలింది.మూడింట విజయాలుకాగా 2017లో టెస్టు జట్టు హోదా పొందిన అఫ్గనిస్తాన్... ఇప్పటి వరకు సంప్రదాయ ఫార్మాట్లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడింది. టీమిండియాతో ఒకటి, ఐర్లాండ్‌తో రెండు, బంగ్లాదేశ్‌తో రెండు, వెస్టిండీస్‌తో ఒకటి, జింబాబ్వేతో రెండు, శ్రీలంకతో ఒక టెస్టులో పాల్గొంది. వీటిలో జింబాబ్వే, ఐర్లాండ్, బంగ్లాదేశ్‌లపై ఒక్కో మ్యాచ్‌లో గెలుపొందింది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆడేందుకు సిద్ధమైంది.ఆటగాళ్ల క్షేమమే ముఖ్యంతమదేశంలో ఇందుకు అనుకూల పరిస్థితులు లేని నేపథ్యంలో భారత్ వేదికగా కివీస్‌తో పోటీకి అన్నిరకాలుగా సన్నద్ధమైంది. గ్రేటర్ నోయిడాలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో సోమవారం ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, గత రెండు వారాలుగా నోయిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అవుట్‌ఫీల్డ్ మొత్తం పూర్తిగా తడిచిపోయింది. ఈరోజు కాస్త ఎండగానే ఉన్నా.. అవుట్‌ఫీల్డ్ మాత్రం పూర్తిగా ఆరలేదు.రోజుకొక అరగంట ఎక్కువ?గ్రౌండ్స్‌మెన్ తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ నిర్వహిస్తే.. ఫీల్డింగ్ సమయంలో ఆటగాళ్లు జారిపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతను దృష్ట్యా తొలిరోజు ఆట రద్దు చేస్తున్నట్లు అంపైర్లు కుమార్ ధర్మసేన, షర్ఫూద్దౌలా తెలిపారు. రేపటి నుంచి నాలుగురోజుల పాటు మ్యాచ్‌ను నిర్వహిస్తామని వెల్లడించారు.అనూహ్య పరిస్థితుల్లో తొలిరోజు ఆట రద్దైన కారణంగా మిగిలిన నాలుగు రోజులు అరగంట ఎక్కువసేపు ఆట కొనసాగిస్తామని తెలిపారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు ఆట మొదలవుతుందని పేర్కొన్నారు. కాగా స్టార్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ గాయం కారణంగా కివీస్‌తో టెస్టుకు దూరమయ్యాడు.న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టుహష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మత్ షా, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, అఫ్సర్ జజాయ్, ఇక్రం అలిఖిల్, బహీర్ షా మహబూబ్, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షామ్స్ ఉర్ రహమాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, జహీర్ ఖాన్ పక్తీన్, కైస్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నిజత్ మసూద్.అఫ్గన్‌తో టెస్టు మ్యాచ్‌కు న్యూజిలాండ్ జట్టుటామ్ లాథమ్(వికెట్ కీపర్), టిమ్ సౌతీ(కెప్టెన్), డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, అజాజ్ పటేల్, మ్యాచ్ హెన్రీ, టామ్ బ్లండెల్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, విలియం ఒరూర్కీ. The buildup is 🔛!While we wait for the start of the game, check out these glimpses of the current scenes in Greater Noida. 👍#AfghanAtalan | #GloriousNationVictoriousTeam pic.twitter.com/aLC5SZGoaW— Afghanistan Cricket Board (@ACBofficials) September 9, 2024 -
కివీస్‌తో టెస్టుకు అఫ్గన్ జట్టు ప్రకటన.. రషీద్ లేకుండానే!
న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. హష్మతుల్లా షాహిద్ కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో మొత్తంగా పదహారు మంది సభ్యులకు చోటిచ్చిన్నట్లు తెలిపింది. ఇందులో ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లు రియాజ్ హసన్, షామ్స్ ఉర్ రహమాన్, ఖలీల్ అహ్మద్‌లను తొలిసారి జట్టుకు ఎంపికచేసినట్లు పేర్కొంది. నోయిడా వేదికగా.. రషీద్ ఖాన్ లేకుండానేఅయితే, గాయం కారణంగా స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మాత్రం ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడు.కాగా భారత్ వేదికగా అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య సెప్టెంబరు 8 నుంచి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే కివీస్ ఆటగాళ్లు భారత్‌కు చేరుకున్నారు. అఫ్గన్‌తో జరుగనున్న మొట్టమొదటి టెస్టులో విజయమే లక్ష్యంగా సన్నాహకాలు ముమ్మరం చేశారు.ఈ క్రమంలో అఫ్గన్ బోర్డు సైతం ఆచితూచి జట్టును ఎంపిక చేసుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తొలి టైటిల్ గెలిచిన న్యూజిలాండ్‌ను ఢీకొట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, వంటి టాప్ బ్యాటర్లతో పాటు.. స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ తదితరులు అఫ్గన్‌కు కీలకం కానున్నారు. రహ్మనుల్లా గుర్బాజ్‌కు నో ప్లేస్అదే విధంగా ఓపెనింగ్ బ్యాటర్లు అబ్దుల్ మాలిక్, బహీర్ షా, వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇక్రం అలిఖిల్, అఫ్సర్ జజాయ్లతో బ్యాటింగ్ విభాగం సిద్ధమైంది. ఇక అజ్మతుల్లాతో పాటు ఆల్‌రౌండర్ల విభాగంలో షాహిదుల్లా కమల్, షామ్స్ ఉర్ రహమాన్ చోటు దక్కించుకున్నారు. ఇక రషీద్ ఖాన్ గైర్హాజరీలో కైస్ అహ్మద్, జియా ఉర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్, జాహీర్ ఖాన్ స్పిన్దళంలో చోటు దక్కించుకోగా.. ఫాస్ట్ బౌలర్లలో నిజత్ మసూద్ ఒక్కడికే ఈ జట్టులో స్థానం దక్కింది. అయితే, రహ్మనుల్లా గుర్బాజ్‌కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. కాగా అఫ్గనిస్తాన్ ఇప్పటి వరకు మొత్తంగా తొమ్మిది టెస్టు మ్యాచ్‌లు ఆడి కేవలం మూడింట గెలిచింది.న్యూజిలాండ్‌తో గ్రేటర్ నోయిడాలో ఏకైక టెస్టుకు అఫ్గన్ జట్టుహష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, అఫ్సర్ జజాయ్, ఇక్రం అలిఖిల్, బహీర్ షా మహబూబ్, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షామ్స్ ఉర్ రహమాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, జహీర్ ఖాన్ పక్తీన్, కైస్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నిజత్ మసూద్.