గ్రేటర్ నోయిడా వేదికగా న్యూజిలాండ్-అఫ్గానిస్తాన్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు అయ్యే దిశగా సాగుతోంది. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట సైతం రద్దు అయింది. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి షాహీద్ విజయ్ సింగ్ పాఠిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలోని ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.
అంతేకాకుండా ప్రస్తుతం నోయిడాలో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. మైదానం మొత్తాన్ని గ్రౌండ్ స్టాప్ కవర్లతో కప్పిఉంచారు. ఈ క్రమంలోనే గురువారం జరగాల్సిన నాలుగో రోజు ఆటను అంపైర్‌లు రద్దు చేశారు. అయితే ఆఖరి రోజైన శుక్రవారం కూడా భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
దీంతో టెస్టు మ్యాచ్ మొత్తం తుడిచిపెట్టుకు పోయే సూచనలు కన్పిస్తున్నాయి. ఇదే విషయంపై ప్రముఖ ప్రెజెంటర్ ఆండ్రూ లియోనార్డ్ మాట్లాడుతూ.. రేపు కూడా వాతావారణం ఇలాగే ఉంటుంది. ఇది నిజంగా రెండు జట్లకు నిరాశ కలిగించే వార్త.
న్యూజిలాండ్ తమ ఆసియా పర్యటనను ప్రారంభించేందుకు భారత్‌కు వచ్చింది. ఈ టూర్‌లో అఫ్గాన్‌తో పాటు భారత్,శ్రీలంకతో టెస్టు సిరీస్‌లు కివీస్ ఆడనుంది. మరోవైపు అఫ్గానిస్తాన్ టెస్టు క్రికెట్ చాలా అరుదుగా ఆడుతుంది. కివీస్ వంటి బలమైన జట్టును ఎదుర్కొనేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. కానీ ప్రకృతి మాత్రం వారి ఆశలను అడియాశలు చేసింది. మళ్లీ రేపు కలుద్దాం అని పేర్కొన్నారు.
నిరాశలో అఫ్గాన్-కివీ ఫ్యాన్స్..
కాగా వాస్తవానికి ఈ చారిత్రత్మక టెస్టు మ్యాచ్ సోమవారం(సెప్టెంబర్ 9) ప్రారంభం అవ్వాలి. కానీ మ్యాచ్ కంటే ముందు కురిసిన కుండపోత వర్షాల వల్ల మైదానం చిత్తడిగా మారింది. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌లో కురిసిన నీరు బయటకు వెళ్లేందుకు అసలు డ్రైనేజీ వ్యవస్థ, మైదానాన్ని సన్నద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేవు.
దీంతో మైదానం రెడీ చేసేందుకు గ్రౌండ్ స్టాప్ తీవ్రంగా శ్రమించారు. అయితే సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. మంగళవారం రెండోరోజు ఆట జరిపించేందుకు మైదానంలో పదుల సంఖ్యలో గ్రౌండ్ సిబ్బంది కష్టపడ్డారు. ల్యాండ్‌స్కేప్ గడ్డి గడుల్ని తెచ్చి మైదానమంతా పరిచేందుకు చెమటోడ్చారు. ఫ్యాన్‌లు అమర్చి మైదానం ఎండేలా కృషి చేశారు.
కానీ ఔట్ ఫీల్డ్ మాత్రం చిత్తడి ఉండటంతో ఆటగాళ్లు భద్రత దృష్ట్యా అంపైర్‌లు రెండు రోజు ఆటను రద్దు చేశారు. మూడో రోజు కూడా మైదానం కూడా సిద్దం కాలేదు. దీంతో మూడో రోజు కూడా టాస్ పడకుండానే రద్దు అయింది.
అయితే ఎలాగైనా మైదాన్ని సిద్ద నాలుగు రోజు(గురువారం) 98 ఓవర్లు పాటు ఆటను నిర్వహించాలని అంపైర్‌లు భావించారు. కానీ మళ్లీ నోయిడాలో వర్షం రావడం, మైదానం ఔట్ ఫీల్డ్ తడిగా మారడంతో నాలుగో రోజు ఆటను కూడా రద్దు చేశారు. అయితే నోయిడా స్టేడియం పరిస్థితులపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు అధికారులు ఆంసతృప్తి వ్యక్తం చేశారు. తాము ఇంకెప్పుడూ నోయిడాకు రామంటూ అఫ్గాన్ క్రికెటర్లు సైతం వ్యాఖ్యానించారు.
చదవండి: ఒక్క బంతి కూడా పడకుండా రద్దైన టెస్ట్ మ్యాచ్‌లు
Comments
Please login to add a commentAdd a comment