టెస్టు క్రికెట్‌లో తమ ఉనికిని చాటుకోవాలనుకున్న అఫ్గానిస్తాన్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. నోయిడా వేదికగా న్యూజిలాండ్‌తో జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. భారీ వర్షం కారణంగా నోయిడాలోని మైదానం ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది.
దీంతో అయిదో రోజు ఆట కూడా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు శుక్రవారం ప్రకటించారు. దీంతో కనీసం టాస్ పడకుండానే ఈ టెస్టు మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది. ఈ క్రమంలో ఒక్క బంతి కూడా పడని అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ టెస్టు పలు అరుదైన రికార్డుల జాబితాలో చేరింది.
ఆసియాలో తొలిసారి..
టెస్టు క్రికెట్ హిస్టరీలో బంతి పడకుండా రద్దయిన ఎనిమిదో మ్యాచ్‌గా ఈ నోయిడా టెస్టు రికార్డులకెక్కింది. 1890లో మొట్టమొదటి సారి ఇలా జరిగింది. మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దయింది.
ఆ తర్వాత 1930లో ఆస్ట్రేలియా- ఇంగ్లండ్, 1970లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్, 1989లో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్, 1990లో ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్, 1998లో పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే, 1998లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టులు కనీసం టాస్ పడకుండానే రద్దు అయ్యాయి.
ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్-అఫ్గానిస్తాన్ టెస్టు మ్యాచ్ ఈ జాబితాలోకి చేరింది. ఇక ఆసియాలో వర్షం కారణంగా రద్దు అయ్యిన తొలి టెస్టు మ్యాచ్ మాత్రం అఫ్గాన్-న్యూజిలాండ్ మ్యాచే కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆసియాలో ఈ విధంగా ఎప్పుడు జరగలేదు. ఆసియాలో 91 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ విధంగా ఎప్పుడు జరగలేదు.
చదవండి: Cristiano Ronaldo Followers: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా
Comments
Please login to add a commentAdd a comment