Did You Know Priyanka Chopra Wanted To Keep Abandoned Baby Girl But Her Mother Refused - Sakshi

Priyanka Chopra : 'అనాథ పాపను దత్తత తీసుకుందామనుకున్నా,కానీ'..

Published Wed, Apr 27 2022 1:33 PM | Last Updated on Wed, Apr 27 2022 2:57 PM

When Priyanka Chopra Wanted To Keep Abandoned Baby Girl But Her Mother Refused - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ప్రస్తుతం మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తుంది. 2018లో నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న ప్రియాంక ఇటీవలె స‌రోగ‌సి ద్వారా తల్లైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లోనే సెటిల్‌ అయిన ప్రియాంక తాజాగా తన బయోగ్రఫీలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.  'ఓరోజు ఇంట్లో చిన్న పాప ఏడుపు వినిపించింది.

వెళ్లి చూస్తే అమ్మ ఆ పాపను ఊయలలో వేసి ఆడిస్తుంది. ఎవరు అని అడగ్గా హాస్పిటల్‌ బయట కారు పార్కింగ్‌లో పాపను ఎవరో వదిలి వెళ్లారని, అక్కడ ఏడుస్తూ ఉండటంతో ఇంటికి తీసుకొచ్చానని అమ్మ నాకు చెప్పింది. వర్షం కురుస్తున్న సమయంలో చిన్న పాపను అలా వదిలేసి వెళ్లడం నాకు చాలా బాధనిపించింది. దీంతో ఆ పాపను దత్తత తీసుకొని నా దగ్గరే ఉంచుకుంటానని పట్టుబట్టగా అమ్మ అభ్యంతరం చెప్పింది.

సంతానం లేని దంపతులకు పాపను ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు అమ్మ పేర్కొంది. ఆరోజు జన్మాష్టమి. అదేరోజు వర్షంలోనే వాహనం నడుపుకుంటూ సంతానం లేని దంపతులకు పాపును ఇచ్చేసింది అమ్మ. ఆ సమయంలో వాళ్ల సంతోషం ,ఆనాటి సంఘటనల్ని ఎప్పటికీ మర్చిపోలేను' అంటూ  ప్రియాంక రాసుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement