
సాక్షి, హైదరాబాద్: రోడ్లపై రోజుల తరబడి వాహనాలను వదిలేస్తున్నారా..? అయితే మీ వాహనం పోలీస్ స్టేషన్‌కే పరిమితం కానుంది. రోడ్లపై వదిలేసే వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రోడ్లపై ఇష్టానుసారం వదిలివెళ్లే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనుమానాస్పదంగా, నిర్లక్ష్యంగా ఉన్న వందలాది వాహనాలను ట్రాఫిక్ క్రేన్ల ద్వారా పోలీస్ స్టేషన్‌లకు తరలిస్తున్నారు. ఆ వాహనాలకు సంబంధించి ఎవరూ క్లెయిమ్ చేయకుంటే హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని 39బి కింద వేలం వేస్తామని చెప్పారు. రాబోయే కొన్ని రోజులపాటు ఈ డ్రైవ్ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment