special drive
-
ఎస్బీఐలో అకౌంట్ ఉందా..?
న్యూఢిల్లీ: ఎలాంటి లావాదేవీలు లేకుండా ఇనాపరేటివ్‌గా మారిన ఖాతాలను పునరుద్ధరించేందుకు ఎస్బీఐ దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. వరుసగా రెండేళ్ల పాటు ఎలాంటి లావాదేవీ లేని సేవింగ్స్, కరెంట్ ఖాతాలను ఇనాపరేటివ్‌గా (నిర్వహణలో లేని) బ్యాంకులు పరిగణిస్తుంటాయి. ఈ ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేసుకోవాలంటే తాజా కేవైసీ పూర్తి చేయాలి.లావాదేవీల నిర్వహణతో ఖాతాలు ఇనాపరేటివ్‌గా మారకుండా చూసుకోవచ్చన్నది ఈ కార్యక్రమం ద్వారా తాము ఇచ్చే కీలక సందేశమని ఎస్బీఐ తెలిపింది. జన్‌ధన్ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచడం, కస్టమర్లు నిరంతరం లావాదేవీలు నిర్వహించేలా చూసేందుకు మళ్లీ కేవైసీ చేయాల్సిన అవసరాన్ని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి ముందు ఎస్బీఐ తమ బిజినెస్ కరస్పాండెంట్లకు గురుగ్రామ్‌లో ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఇన్ ఆపరేటివ్ అకౌంట్ యాక్టివేషన్ ప్రాముఖ్యత గురించి పాల్గొనేవారికి అవగాహన కల్పించడంపై ఈ వర్క్‌షాప్ దృష్టి సారించింది. -
అమ్మమాట.. అంగన్వాడీ బాట..
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు ‘అమ్మ మాట–అంగన్వాడీ బాట’నినాదంతో వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని పంచాయతీరాజ్ గ్రామీ ణ అభివృద్ధి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. సచివాలయంలో బుధవారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో అంగన్వాడీ కేంద్రాలు, మహిళా భద్రత, దత్తత, చైల్డ్ కేర్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ తరగతులను బోధించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ము ఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని ప్రత్యేకంగా ఆహా్వనించినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు పంపి ణీ చేస్తున్న సరుకులు, సేవల నాణ్యతను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నా రు. కొన్ని కేంద్రాలకు నాసిరకం కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు సరఫరా అయిన నేపథ్యంలో.. వాటి కట్టడి కోసం జిల్లాస్థాయి క్షేత్రస్థాయి అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నాసిరకం సరుకులు సరఫరా అయితే అంగన్వాడీ టీచర్లు తిరస్కరించాలని సూచించారు.సరుకుల నాణ్యతను పరిశీలించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు కేంద్రాలను సందర్శించి తనిఖీ చేసి నివేదిక సమరి్పంచాలని మంత్రి ఆదేశించారు. అంగన్వాడీలోని చిన్నారులకు త్వరలో యూనిఫాంలు అందజేస్తామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా అంగన్వాడీ చిన్నారులకు యూనిఫాంలు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధిస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు.మహిళలు చిన్నారులపై దాడులు, అఘాయిత్యాలు జరిగితే తక్షణమే స్పందించేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. యునిసెఫ్ సౌజన్యంతో రూపొందించిన న్యూట్రీíÙయన్ చాంపియన్ పుస్తకాన్ని, న్యూట్రీషియన్ కిట్లను మంత్రి సీతక్క ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సమీక్షలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు. -
కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి వరకు స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్: కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి సెల్ఫీ దిగుతూ ఓ యువకుడు మృతి చెందిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాదాపూర్ ట్రాఫిక్ సీఐ నర్సింహ్మ, లా అండ్ ఆర్డర్ సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం అర్థరాత్రి దాటే వరకు ఇక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేసిన 23 మందికి చలానా విధించారు. రెండో సారి పట్టుబడితే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. రాత్రి సమయంలో దుర్గం చెరువు అందాలను తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి కేబుల్ బ్రిడ్జిపైకి జనం తండోపతండాలుగా వస్తున్నారు. వీకెండ్, సెలవు దినాల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేయడం, బర్త్ డేలు జరుపుకోవడం, సెల్ఫీలు దిగడం సరికాదని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. వాహనాలను బ్రిడ్జి బయట పార్కింగ్ చేసి రెండు వైపులా ఉన్న పాత్ వేలోనే సందర్శకులు ఉండాలని పేర్కొంటున్నారు. -
17 వరకు ధరణి స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూమి సమస్యలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌ను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 17వ తేదీ వరకు డ్రైవ్‌ను కొనసాగించాలంటూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా, ఇంకా మిగిలిపోయిన దరఖాస్తులను క్లియర్ చేయడమే లక్ష్యంగా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీసీఎల్ఏ సూచించారు. ఇది ఫస్ట్ ఎయిడ్ మాత్రమే: కోదండరెడ్డి, సునీల్ ధరణి పోర్టల్ విషయంలో తాము ఇప్పటివరకు ఫస్ట్ ఎయిడ్ (ప్రాథమిక చికిత్స) మాత్రమే ఇస్తున్నామని, అసలు ట్రీట్మెంట్ను ఇంకా ప్రారంభించలేదని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, భూమి సునీల్ తెలిపారు. సోమవారం సచివాలయంలోని మీడియా పాయింట్లో వారు విలేకరులతో మాట్లాడారు. గతంలో పేరుకుపోయిన దరఖాస్తుల పరిష్కారం కోసమే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ డ్రైవ్‌ను ప్రభుత్వం మరో వారం రోజులు పొడిగించిందని చెప్పారు. అయితే ధరణి దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం నిరంతరం జరగాల్సిందేనన్నారు. గతంలో కలెక్టర్లు మాత్రమే ఈ దరఖాస్తులను పరిష్కరించేవారని, ఇప్పుడు తహశీల్దార్, ఆర్డీవోల స్థాయిలో అధికార వికేంద్రీకరణ జరపడమే కాకుండా, పరిష్కారానికి నిర్దేశిత టైంలైన్ విధించామని తెలిపారు. ధరణి పోర్టల్ విషయంలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని, చట్టాలు, వ్యవస్థ, సాంకేతికతలో మార్పులు తీసుకు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న అవకాశాల పరిధిలో సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. ధరణి పోర్టల్‌కు సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారంపై ప్రభుత్వానికి నివేదికలిస్తామని, ఆ మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని అన్నా రు. ప్రస్తుతం చేపడుతున్నవి తాత్కాలిక చర్య లు మాత్రమేనని, 2, 3 నెలల్లో శాశ్వత పరిష్కారాలు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని మాజీ ఎంపీ సంతోశ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, నిషేధిత జాబితాలోని భూములను కూడా రాత్రికి రాత్రి బదలాయించుకున్నారని కోదండరెడ్డి ఆరోపించారు. -
ఇలాగైతే ఎప్పటికయ్యేనో?
సాక్షి, హైదరాబాద్: ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం నిర్వహిస్తోన్న స్పెషల్ డ్రైవ్ ఈనెల 9వ తేదీ(శనివారం) తర్వాత కూడా కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 1వ తేదీ నుంచి నిర్వహిస్తోన్న స్పెషల్ డ్రైవ్‌లో కేవలం 31 శాతం దరఖాస్తులు మాత్రమే క్లియర్ అయిన నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు కార్యాచరణ కొనసాగుతుందని రెవెన్యూ, ధరణి పునర్మి ర్మాణ కమిటీ వర్గాలు చెపుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న 2,46,536 దరఖాస్తులకు గాను ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 76,382 దరఖాస్తులను క్లియర్ చేయగా, మరో 1,70,154 దరఖాస్తులపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, 9 రోజుల తర్వాత పెండింగ్‌లో ఒక్క దరఖాస్తు కూడా ఉండకూడదని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఉండడం, రికార్డుల పరిశీలనలో జాప్యం జరుగుతుండడంతో పాటు 8, 9 తేదీల్లో సెలవులు రావడంతో ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో ఈనెల 9 తర్వాత కూడా ఈ డ్రైవ్‌ను కొనసాగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. 6 శాతం.... 85 శాతం జిల్లాల వారీగా పరిశీలిస్తే పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారంలో జగిత్యాల ముందంజలో ఉంది. ఇక్కడ 85 శాతం దరఖాస్తులపై రెవెన్యూ వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో 69 శాతం దరఖాస్తులు క్లియర్ అయ్యాయి. నారాయణపేట (65), పెద్దపల్లి (65), భద్రాద్రి కొత్తగూడెం (62), వరంగల్ (56), జనగామ (56), రాజన్న సిరిసిల్ల (52), సిద్ధిపేట, హనుమకొండ (51) జిల్లాల్లో 50 శాతానికి పైగా దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ఇక, అత్యల్పంగా మహబూబ్‌నగర్ జిల్లాలో కేవలం 6 శాతమే పరిష్కారం కాగా, కరీంనగర్లోనూ 6 శాతం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 7, రంగారెడ్డిలో 9 శాతం దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయి. మాడ్యూళ్ల వారీగా చూస్తే కీలకమైన రెండు మాడ్యూళ్లలో దరఖాస్తుల క్లియరెన్స్ నత్తనడకనే సాగుతున్నట్టు అర్థమవుతోంది. టీఎం15 కింద ల్యాండ్ మ్యాటర్స్ సమస్యల పరిష్కారానికి గాను 40,605 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా 43 శాతం అంటే 17,372 దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయి. ఇంకా 23,233 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరో కీలకమైన టీఎం 33 మాడ్యూల్లో 1,01,132 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, 27,047 దరఖాస్తులు పరిష్కారం చేయగా, 74,085 పెండింగ్‌లోనే ఉండడం గమనార్హం. ఇది నిరంతర ప్రక్రియ: ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి ‘ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ఆగదు. స్పెషల్ డ్రైవ్ కోసం ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లోనూ ఇదే విషయాన్ని పేర్కొన్నాం. ఈనెల 9వ తేదీ తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల కోడ్ వచ్చినా దీనిపై ఎలాంటి ప్రభావం ఉండదు. రెవెన్యూ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ కొందరు ధరణి దరఖాస్తుల పరిశీలనలో పాలు పంచుకుంటారు. -
అక్రమాల డ్రెడ్జింగ్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) నిత్యం వివాదాల మయంగా మారుతోంది. ఎప్పటికప్పుడు తప్పులు చేస్తూ.. సంస్థ పరువును బంగాళాఖాతంలో కలిపేసేలా వ్యవహారాలు జరుగుతున్నాయి. కీలకమైన పోస్టు ఎంపిక విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ సర్టిఫికెట్లతో సంస్థ ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టిన జీవైవీ విక్టర్ అదే సంస్థను కోట్లాది రూపాయల నష్టాల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. నిండా మునిగిన తర్వాత తేరుకున్న ఉన్నతాధికారులు విక్టర్ని విధుల నుంచి తప్పించారు. తాజాగా ఓ ఉన్నతాధికారి పోస్టును కూడా అదేమాదిరిగా కట్టబెట్టారు. ఇప్పుడు ఆయన నియామకంపైనా వివాదం ముదురుతోంది. షిప్పులో డెక్ కేడెట్‌గా చేరి.. సదరు వ్యక్తి 1987లో ఎస్సీ కోటా స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా షిప్పులో డెక్ కేడెట్‌గా డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో చేరారు. 2009లో డీజీఎంగా పదోన్నతి పొంది.. పట్టుమని పది నెలలైనా పని చెయ్యకుండా డీసీఐకు రాజీనామా చేసేశారు. డీసీఐ ప్రత్యర్థి సంస్థగా చెప్పుకునే మెర్కటర్ సంస్థలో డీజీఎం ఆపరేషన్స్‌గా జాయిన్ అయ్యారు. రెండున్నర సంవత్సరాలు పనిచేసి.. తిరిగి 2012లో డీసీఐకి వచ్చేశారు. ఈ సమయంలో డీసీఐలో తిరిగి చేరినప్పుడు విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల్ని సమర్పించారు. ఇక్కడే ఆయన బండారంబట్టబయలయ్యింది. బీ‘కామ్’గా అబద్ధాలు 2020 ఆగస్టులో ఉన్నతాధికారి పోస్టుకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సదరు అధికారి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హిందు రిలీజియన్‌గా దరఖాస్తులో పేర్కొన్నారు. అయితే.. సదరు అధికారి ఆ సమయంలో విశాఖలోని యూనియన్ చాపల్ బాప్టిస్ట్ చర్చ్‌కి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రిస్టియన్‌గా ఉంటూ ఉద్యోగం కోసం చేసిన దరఖాస్తులో మాత్రం హిందూగా పేర్కొన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా.. 2012లోనే బీకామ్ పాసైనట్టు అప్లికేషన్‌తో పాటు సర్టిఫికెట్ సమర్పించారు. దీనిపైనా విమర్శలు వచ్చిన నేపథ్యంలో బీకామ్ సర్టిఫికెట్ కూడా నకిలీదని తేలినట్టు తెలిసింది. డిగ్రీ కూడా చేయని వ్యక్తిని.. కేవలం ఇంటర్ విద్యార్హత ఉన్న వ్యక్తికి ఉన్నతాధికారి హోదాను కట్టబెట్టేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోపాటు తాను పనిచేసిన మెర్కటర్ సంస్థ డీసీఐకి అనుబంధ సంస్థగా దరఖాస్తులో పేర్కొన్నారు. కానీ.. సదరు సంస్థ డీసీఐకు పూర్తి ప్రత్యర్థి సంస్థ. ఇలా.. విద్యార్హత నుంచి ప్రతి అంశాన్ని తప్పుగా చూపిస్తూ.. కీలక బాధ్యతల్ని దక్కించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీసీఐకి నష్టం చేకూర్చారంటూ ఫిర్యాదుల వెల్లువ సదరు ఉన్నతాధికారి డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కి రాజీనామా చేసి మెర్కటర్ సంస్థలో చేరిన తర్వాత డీసీఐకి నష్టం వాటిల్లేలా వ్యవహరించినట్టు కొందరు ఉద్యోగులు ఆధారాలు సేకరించారు. డీసీఐలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పోటీ సంస్థ అయిన మెర్కటర్ సుమారుగా రూ.800 కోట్ల విలువైన పనులను డీసీఐ కంటే 5 శాతం వరకు అధికంగా కోట్ చేసి దక్కించుకుంది. దీనివెనుక సదరు అధికారి హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా.. ఓవైపు జీఎంగా పనిచేస్తూనే మరోవైపు లీగల్ సెల్ బాధ్యతల్ని కూడా పర్యవేక్షించిన సదరు అధికారి రూ.50 కోట్ల విలువైన ఆర్బిట్రేషన్‌ను మెర్కటర్‌కు దక్కేలా చేశారనీ.. ఈ విధంగా లబ్ధి చేకూర్చడం వల్లే.. మెర్కటర్ సంస్థ సదరు ఉన్నతాధికారికి డీజీఎం బాధ్యతలు అప్పగించిందని తెలుస్తోంది. ఇలా ప్రతి విషయంలోనూ సదరు అధికారికి సంబంధించిన నియామకం వెనుక అక్రమాల జాబితాలను జత చేస్తూ కేంద్ర పోర్టులు మంత్రిత్వ శాఖతో పాటు సీబీఐకి కూడా కొందరు ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. -
మాయమవుతున్న రూ.కోట్ల విలువైన పీడీఎస్ బియ్యం
సాక్షి, హైదరాబాద్/మెదక్: ‘మెదక్‌లోని పౌరసరఫరాల సంస్థ మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్‌కు ఎఫ్‌సీఐ నుంచి వచ్చిన బియ్యంలో 362 టన్నుల మేర తేడా వచ్చింది. అంటే రూ.3 కోట్ల విలువైన 18 లారీల బియ్యం లెక్క దొరకడం లేదు. వీటితో పాటు 700 బేల్స్ గన్నీ బ్యాగులు లేవు. 320 టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్ఆర్కే) చెడిపోయాయి. మొత్తంగా ఈ మెదక్ ఎంఎల్ఎస్ పాయింట్లో జరిగిన అక్రమాల విలువ సుమారు రూ.6 కోట్లు. ఆకస్మిక తనిఖీలో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి..’పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ సోమవారం రాష్ట్ర స్థాయి అధికారుల వాట్సాప్ గ్రూప్‌లో స్వయంగా పోస్ట్ చేసిన వివరాలు ఇవి. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఎంఎల్ఎస్ పాయింట్లలో వ్యక్తిగతంగా తనిఖీలు నిర్వహించి శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని ఆయన ఆ మెసేజ్‌లో స్పష్టం చేశారు. నిఘా కరువు..రికార్డుల్లేవు రైస్ మిల్లుల నుంచి సీఎంఆర్ కింద బియ్యం ఎఫ్‌సీఐ గోడౌన్లకు చేరతాయి. ఇక్కడి నుంచి ప్రజా పంపిణీ పథకం (పీడీఎస్) కింద ఎంఎల్ఎస్ పాయింట్లకు వెళతాయి. అక్కడి నుంచే జిల్లాల్లోని అన్ని రేషన్ దుకాణాలకు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు సరఫరా అవుతాయి. అయితే ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సరైన నిఘా, రికార్డుల వ్యవస్థ ఉండటం లేదు. రాష్ట్రంలో 171 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా, చాలాచోట్ల అధికారులు లేరు. ఔట్ సోర్సింగ్ కింద నియామకమైన డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో)ల పర్యవేక్షణలో నడుస్తున్నాయి. సెపె్టంబర్ 8న సంస్థ చైర్మన్ మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్‌ను తనిఖీ చేసినప్పుడు రెండేళ్లుగా అక్కడ స్టాక్ పాయింట్ ఇన్చార్జి లేడని, కేవలం డీఈవో ద్వారానే కోట్ల రూపాయల విలువైన బియ్యం పంపిణీ, సరఫరా ప్రక్రియ కొనసాగుతోందని తేలింది. అక్కడున్న 1,520 బ్యాగుల సన్నబియ్యం తినడానికి పనికిరాకుండా పోవడాన్ని కూడా గుర్తించారు. గోదాముల నుంచే మొదలు.. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం వచ్చే సమయంలోనూ భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్లతో మిల్లర్లు కుమ్మౖMð్క బియ్యం లోడ్లను పక్కదారి పట్టిస్తున్నట్లు ఇప్పటికే పలు సంఘటనల్లో బయటపడింది. గత ఏప్రిల్ మొదటి వారంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల ఎఫ్‌సీఐ గోదాం నుంచి సుల్తానాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్‌కు 5 లారీల్లో బియ్యం పంపించారు. కానీ 420 బస్తాల చొప్పున ఉన్న 3 లారీలు మాత్రమే గోదాంకు చేరాయి. మిగతా 2 లారీలు కాట్నపల్లి వద్ద ఉన్న ఓ రైస్ మిల్లులో అన్లోడ్ అయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లేఖ ద్వారా తెలియజేశారు. సంస్థ ప్రధాన కార్యాలయానికి సంబంధం లేకుండా పెద్దపల్లిలో సీఎంఆర్‌కు అదనంగా 30 వేల టన్నుల బియ్యం తీసుకున్నట్లు తేలిందని కూడా వివరించారు. ఈ ఘటనపై మరింత లోతైన విచారణ జరపాలని కోరారు. ఇక ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు బియ్యం పంపించే క్రమంలో కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని స్పష్టమవుతోంది. ఎంఎల్ఎస్ పాయింట్లలో కూడా భారీ మొత్తంలో బియ్యం మాయం అవుతున్నాయి. మెదక్‌తో పాటు రామాయంపేట, తూప్రాన్ ఎంఎల్ఎస్ పాయింట్లలో 10 వేల క్వింటాళ్లకు పైగా పీడీఎస్, సన్న బియ్యం లెక్క తేలకుండా పోయినట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ స్టాక్ పాయింట్ల ఇన్చార్జిలపై కేసులు కూడా నమోదయ్యాయి. పట్టించుకోని అధికారులు తనిఖీల్లో బయటపడుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు విని్పస్తున్నాయి. 171 ఎంఎల్ఎస్ పాయింట్లలో కనీసం 150 చోట్ల అక్రమాలు జరుగుతున్నాయని, జిల్లా స్థాయిల్లోని అధికార యంత్రాంగం అండతో బియ్యం య థేచ్ఛగా గాయబ్ అవుతున్నాయని సంస్థకు చెందినవారే అంగీకరించడం గమనార్హం. -
210 మంది చిన్నారులకు విముక్తి
సాక్షి, హైదరాబాద్: తప్పిపోయిన పిల్లలు, బాల కార్మికులుగా మారిన చిన్నారులను కనిపెట్టేందుకు జూలై 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్–9 స్పెషల్ డ్రైవ్ రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, కూడళ్లు, ఇటుక బట్టీలు, ఖార్ఖానాలు తదితర ప్రాంతాల్లో ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరు రోజుల్లో మొత్తం 210 మంది చిన్నారుల జాడను అధికారులు గుర్తించారు. వీరిలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 125 మంది, వికారాబాద్‌లో 14, ఆదిలాబాద్‌లో 12, నిజామాబాద్‌లో 8, వరంగల్‌లో 11, నల్లగొండలో 9, నారాయణపేట్‌లో 8 మంది, భూపాలపల్లిలో ఏడుగురు, కామారెడ్డిలో ఇద్దరు, మహబూబాబాద్‌లో ఇద్దరు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు, మెదక్‌లో నలుగురు, భద్రాద్రి కొత్తగూడెంలో నలుగురు, ఆసిఫాబాద్‌లో ఇద్దరు చొప్పున చిన్నారుల జాడను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఏటా జూలైలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ స్పెషల్ డ్రైవ్‌లో పోలీసులతోపాటు మహిళా, శిశు సంక్షేమం, ఆరోగ్య, వైద్య, కార్మిక, రెవెన్యూ శాఖల నుంచి అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. -
గిరిజనులకు అదనపు ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల గిరిజన కుటుంబాలకు ప్రతియేటా రూ.151 కోట్ల మేర అదనపు ‘ఉపాధి’ చేకూర్చేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ఆయా కుటుంబాలన్నింటినీ ఉపాధి హామీ పథకంలో ఏటా 150 రోజుల చొప్పున పనులు పొందే వారి జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఉపాధి హామీ చట్టం ప్రకారం.. సాధారణ కుటుంబాలకు ఏటా గరిష్టంగా వంద రోజుల చొప్పున పనులు కల్పిస్తున్నప్పటికీ, అటవీ భూహక్కు పట్టాదారులకు కుటుంబానికి ఏటా 150 రోజులు పనులు కల్పించే వెసులుబాటు ఉంది. దీంతో.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్ఓఎఫ్ఆర్ లబ్దిదారులు మొత్తం 1,82,316 కుటుంబాలు ఉండగా.. నెలరోజుల క్రితం వరకు ఈ సంఖ్య 72,646 కుటుంబాలు మాత్రమే 150 రోజుల పనిదినాలు పొందేందుకు అర్హత ఉన్న జాబితాల్లో పేర్లు నమోదు చేసుకున్నాయి. నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్.. ఈ నేపథ్యంలో.. అర్హత ఉన్న మిగిలిన కుటుంబాలను కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. ఆయా గిరిజన గ్రామాల్లో పనిచేసే ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లే తమ పరిధిలోని ఆయా అర్హులను గుర్తించి, వారి వివరాలను మండల కేంద్రంలో అప్డేట్ చేస్తారు. గత 15 రోజులుగా ఫీల్డ్ అసిస్టెంట్లే ఆయా లబ్ది దారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 54,424 కుటుంబాలను కొత్తగా 150 రోజుల పనిదినాలు పొందేందుకు అర్హుల జాబితాలోకి తీసుకొచ్చారు. ఇంకా 55,246 కుటుంబాలను ఈ పరిధిలోకి తీసుకురావాల్సి ఉందని.. ఈ నెలాఖరుకల్లా అర్హులందరినీ ఈ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వివరించారు. ఇక ప్రస్తుతం గరిష్టంగా ఏటా వంద రోజుల చొప్పున ఉపాధి హామీ పథకం పనులు పొందుతున్న ఆయా కుటుంబాలు అదనంగా 50 రోజుల ఉపాధి పొందితే ఒక్కో పనిదినానికి గరిష్టంగా రూ.272 చొప్పున రూ.13,600ల వరకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. -
పట్టణ ప్రాంతాల్లోనూ వేగంగా భూ సర్వే
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో భూముల సర్వే జోరుగా జరుగుతున్న నేపథ్యంలో పట్టణాల్లో కూడా వేగవంతం చేయాలని జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్షపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో 15 లక్షల ఎకరాలను సర్వే చేయాల్సి ఉందని సబ్ కమిటీ పేర్కొంది పట్టణ ప్రాంతాల్లో 5.5 లక్షల ఎకరాలు వ్యవసాయ భూమి కాగా మిగిలిన 9.44 లక్షల ఎకరాలు పట్టణ ప్రాంతంగా ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి 38.19 లక్షల ఆస్తుల సర్వేను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించింది. జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకం అమలుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై సమీక్షించింది. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లంతో పాటు పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొలిదశలో 2 వేల గ్రామాల్లో మే 20వ తేదీలోగా సర్వే పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కమిటీ స్పష్టం చేసింది. డ్రోన్ సర్వే, మ్యాపింగ్, గ్రౌండ్ ట్రూతింగ్, రికార్డుల వివాదాల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటివరకు సిద్ధమైన 1,94,571 భూహక్కు పత్రాలను ఈ కేవైసీ ద్వారా వివాదాలకు తావు లేకుండా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ యజమానుల నుంచి అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. 10,409 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై ప్రక్రియ పూర్తి ఈ నెలాఖరు నాటికి 10,409 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై ప్రక్రియ పూర్తి కానుంది. 7,158 గ్రామాల్లో డ్రోన్ ఫొటోలు తీసుకుని 3,758 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 2,611 గ్రామాల్లో సర్వే పూర్తయిందని, 2,391 గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల పరిశీలన ముగిసిందని చెప్పారు. సర్వే ప్రక్రియలో జాప్యం లేకుండా ముందుగానే రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నామని, 4 లక్షలకు పైగా రికార్డులకు మ్యుటేషన్ అవసరమని గుర్తించినట్లు వెల్లడించారు. జూన్ నాటికి రాష్ట్రంలో డ్రోన్ ఫ్లై ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. 25.8 లక్షల సర్వే రాళ్లు సర్వే పూర్తయిన గ్రామాల కోసం 25.8 లక్షల సర్వే రాళ్లు సిద్ధంగా ఉన్నట్లు మైనింగ్ అధికారులు తెలిపారు. 18.9 లక్షల సర్వే రాళ్లను ఇప్పటికే సరఫరా చేయగా మరో 12.3 లక్షల రాళ్లు ఆయా గ్రామాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రోజుకు 50 వేల సర్వే రాళ్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సర్వే ముగిసిన గ్రామాల్లో రాళ్లను పాతే ప్రక్రియ మే 20వ తేదీలోగా పూర్తవుతుందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 30.11 లక్షల ఆస్తులను వెరిఫై చేశామని, అందులో 36.32 లక్షల నిర్మాణాలు ఉన్నట్లు పురపాలక శాఖ అధికారులు పేర్కొన్నారు. సర్వే కోసం మాస్టర్ ట్రైనర్ల ద్వారా అన్ని జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. సమావేశంలో సీసీఎల్ఏ జి.సాయిప్రసాద్, అటవీ దళాల అధిపతి వై.మధుసూదన్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి, సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థజైన్, ఎంఏయూడీ కమిషనర్ కోటేశ్వరరావు, డీఎంజీ వి.జి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
న్యూగ్రాండ్ విటారా ఎక్స్పీరియన్స్ డ్రైవ్: థ్రిల్ అయిన కస్టమర్లు
హైదరాబాద్: దేశీయ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన ఎస్యూవీ ఆల్ న్యూ గ్రాండ్ విటారాతో ‘‘ఎక్స్పీరియన్స్ డ్రైవ్’’ను నిర్వహించింది. సుమారు 300 మందికి పైగా కస్టమర్లు ర్యాలీలో పాల్గొని ఆల్ న్యూ గ్రాండ్ విటారా సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ డ్రైవ్‌లో వినియోగదారులు గ్రాండ్ విటారా అద్భుతమైన అనుభవం, సామర్థ్యాలతో పులకించి పోయారనీ, ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నెక్సా డీలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సుజుకీ పేటెంట్ కలిగి ఆల్‌గ్రిప్ సెలెక్ట్ ట్రిమ్ ధర రూ.16.89 లక్షలు ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ డ్రైవ్ ద్వారా గ్రాండ్ విటారాకు సుమారు 100 బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ వెల్లడించింది. ఈ వేరియంట్ లీటరుకు 19.38 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. -
రూ. 232 కోట్లు ఎగ్గొట్టి ‘పరుగులు’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2,17,930 రవాణా వాహనాలు మూడు నెలలకోసారి చెల్లించాల్సిన త్రైమాసిక పన్ను ఎగ్గొట్టి రహదారులపై యథేచ్ఛగా పరుగులు తీస్తున్నాయి. ఏకంగా రూ. 232 కోట్లను కొన్ని నెలలుగా చెల్లించకుండానే దర్జాగా దూసుకెళ్తున్నాయి. వాటిలో కనిష్టంగా 3 నెలల కాలపరిమితి నుంచి గరిష్టంగా 18 నెలల వరకు పన్ను చెల్లించాల్సిన వాహనాలు వేలల్లోనే ఉన్నాయి. కొన్నిచోట్ల కోవిడ్ కాలం నుంచి కూడా పన్ను చెల్లించని వాహనాలు భారీగానే ఉన్నట్లు అంచనా. హైదరాబాద్‌లోనే అధికం.. త్రైమాసిక పన్ను ఎగ్గొట్టి తిరుగుతున్న 2.17 లక్షల వాహనాల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌లోనే లక్షకుపైగా ఉన్నాయి. ఈ క్రమంలో చాలాకాలం తర్వాత అధికారులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల రవాణా కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ పన్ను ఎగవేత వాహనాలపై సమీక్ష నిర్వహించారు. ఒకవైపు లక్ష్యానికి మించిన ఆదాయాన్ని ఆర్జించడంపట్ల ప్రశంసిస్తూనే పన్ను ఎగవేత వాహనాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్‌లోని మూడు జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన రవాణా వాహనాలను తనిఖీ చేయాలని అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. గ్రేటర్లో ఆటోలు మినహా... సాధారణంగా వ్యక్తిగత వాహనాలకు ఒకసారి జీవితకాల పన్ను చెల్లిస్తే చాలు. కానీ రవాణా వాహనాలకు మాత్రం ప్రతి 3 నెలలకోసారి త్రైమాసిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాహనాల సామర్థ్యం మేరకు దీనిని నిర్ణయిస్తారు. వెయిట్ గ్రాస్ వెహికల్ (డబ్ల్యూజీవీ) ప్రకారం వాహనం బరువుకు అనుగుణంగా త్రైమాసిక పన్ను కనిష్టంగా రూ. 535 నుంచి గరిష్టంగా రూ. 15,000 వరకు ఉంటుంది. గతంలో ఇచ్ఛిన ఎన్నికల హామీ మేరకు జీహెచ్ఎంసీలోని సుమారు 1.4 లక్షల ఆటోలను ఈ త్రైమాసిక పన్ను జాబితా నుంచి ప్రభుత్వం మినహాయించింది. మిగతా అన్ని రకాల రవాణా వాహనాలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ జాబితాలో స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులు, లారీలు, క్యాబ్‌ల వంటి వాహనాలు ఉన్నాయి. కోవిడ్ కాలంలో పన్ను చెల్లించని రవాణా వాహనదారులు... కోవిడ్ ఆంక్షలను సడలించాక చాలా వరకు చెల్లించారు. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆర్టీఏ అధికారులు అప్పట్లో ఉదారంగా వ్యవహరించడం కూడా ఇందుకు కారణమైంది. ఎంవీఐలకు పన్ను వసూలు టార్గెట్లు! ఈ నెలాఖరు నాటికి బకాయిలు వసూలు చేయాల ని రవాణా కమిషనర్ అధికారులను మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. అలాగే వారికి టార్గెట్లు విధించారని తెలియవచ్చింది. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలోప్రతి ఎంవీఐకి రూ. 6 లక్షల చొప్పున టార్గెట్ విధించగా ప్రస్తుతం దాన్ని రూ. 7 లక్షలకు పెంచారని సమాచారం. ఈ లెక్కన ఆర్టీఏ కార్యాలయాల్లో పౌరసేవలు అందించే ఎంవీఐలు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా రోజుకు పన్ను చెల్లించని 5 వాహ నాలను జఫ్తు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అ లాగే ఎన్ఫోర్స్మెంట్ విధుల్లో ఉన్నవారు రోజుకు 10 వాహనాలను జఫ్తు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అయితే జఫ్తు చేసిన వాహనాలను నిలిపేందుకు సరైన పార్కింగ్ సదుపాయం లేక ఇబ్బందులకు గురవుతున్నట్లు ఓ ఎంవీఐ పేర్కొన్నారు. స్వచ్ఛందంగా ముందుకొస్తేనే ఊరట... త్రైమాసిక పన్ను పెండింగ్ జాబితాలో ఉన్న వాహన యజమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్ను చెల్లిస్తే అపరాధ రుసుము ఉండదని అధికారులు చెబుతున్నారు. తనిఖీల్లో పట్టుబడితే మాత్రం 200 శాతం వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బ్లాంక్ డీడీలతో దళారుల వసూళ్లు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా సీజ్ చేసిన వాహనాలపై పెనాల్టితో సహా కట్టాల్సిన బకాయిల మొత్తానికి డీడీ తీసుకురావాలని అధికారులు చెబుతుండటంతో దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. వారు అప్పటికే వివిధ మొత్తాలతో బ్యాంకుల నుంచి తెచ్చిన ఖాళీ డీడీలు చూపి ఒక్కో డీడీపై ‘సర్విస్ చార్జీ’గా రూ.200 వసూలు చేస్తున్నారు. దీంతో ఆరొందల నుంచి రూ.1200 వరకు ఆ రూపంలో అదనపు భారం పడుతోంది. కళ్లముందే ఈ దందా జరుగుతున్నా రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. -
నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్.. కవర్ చేస్తే కటకటాలే!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంచరిస్తున్న ట్రాఫిక్ ఉల్లంఘనులు నానాటికీ రెచి్చపోతున్నారు. జరిమానాలు తప్పించుకోవడానికి నిఘా నేత్రాలు, ట్రాఫిక్ కెమెరాలకు తమ నంబర్ ప్లేట్లు చిక్కకుండా ఉండేందుకు వాటిని ‘కవర్’ చేస్తున్నారు. దీనికోసం మాసు్కలు తదితరాలు తొడగటం, వంచేయడం, విరిచేయడం చేస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ఉల్లంఘనుల్లో మార్పు రాకపోవడం, నేరగాళ్లు సైతం ఇదే బాటపట్టడంతో ట్రాఫిక్ కాప్స్‌తో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్స్ మూసేసిన వారిపై పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నంబర్ ప్లేట్‌ను మాసు్కతో కవర్ చేసిన యువకుడిని రెయిన్‌బజార్ పోలీసులు రెండు రోజుల క్రితం పట్టుకున్నారు. ఇతడికి న్యాయస్థానం ఎనిమిది రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. చలాన్లు తప్పించుకోవడానికే.. - నంబర్ ప్లేట్లు మూసేయడం అనేది ప్రధానంగా ఈ–చలాన్లను తప్పించుకోవడానికే అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది తమ చేతిలో ఉన్న డిజిటల్ కెమెరాలతో ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలను నంబర్ ప్లేట్లతో సహా చిత్రీకరిస్తున్నారు. వీటితో పాటు సీసీ కెమెరాల ద్వారా సేకరించిన ఫొటోల ఆధారంగా కమాండ్ అండ్ కంట్రోల్ సిబ్బంది ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. - ఈ విధానంలో వాహనాల నంబర్, దాని ఆధారంగా సేకరించే చిరునామా కీలకం. తమ వాహనాలకు సంబంధించిన నంబర్ ప్లేట్లను వివిధ రకాలుగా కవర్ చేయడం, వంచేయడం, విరిచేయడం చేస్తున్న వాహనచోదకులు వాటి రిజిస్ట్రేషన్ నంబర్లు ట్రాఫిక్ కెమెరాలకు చిక్కుకుండా చేస్తున్నారు. కొందరు నేరగాళ్లు సైతం నంబర్ ప్లేట్లు కనిపించకుండా చేసి నేరాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇలా జరిగిన కొన్ని నేరాలను కొలిక్కి తేవడానికి పోలీసులు అనేక వ్యయప్రయాసలకోర్చాల్సి వస్తోంది. వాహనం వెనుకవే ఎక్కువగా.. వాహనాల నంబర్ ప్లేట్స్ ఎదుటి వారికి, సీసీ కెమెరాలకు చిక్కకుండా కవర్ చేయడం అనేది తేలికపాటి వాహనాల కంటే ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. రోడ్లపై ఈ తరహా నంబర్ ప్లేట్‌ను పోలీసులు గుర్తించి ఆపడానికి ప్రయతి్నస్తే బైక్స్ మాదిరిగా తేలికపాటి వాహనాలు తప్పించుకునిపోలేవు. ఈ నేపథ్యంలోనే వీళ్లు ఆ తరహా చర్యల జోలికి వెళ్లట్లేదు. ద్విచక్ర వాహనాల్లోనూ 90 శాతం వెనుక వైపు నంబర్ ప్లేట్‌కే రూపురేఖలు లేకుండా చేస్తున్నారు. సాధారణంగా ఉల్లంఘనల్ని వాహనం వెనుక నుంచే ఫొటోలు తీస్తుండటంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఇలా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఉల్లంఘలకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడం మొదలెట్టారు. మాస్క్ మాటున మస్కా కొట్టాలని.. ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన వాహన చోదకుడిపై కొన్నాళ్లుగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. రెయిన్‌బజార్ పోలీసులు పెట్టిన కేసులో మాత్రం వాహన చోదకుడికి ఎనిమిది రోజుల శిక్షపడింది. నంబర్ ప్లేట్ ఉల్లంఘనలో ఇంత శిక్షపడటం ఇదే తొలిసారి అని ఇన్స్పెక్టర్ నైని రంజిత్‌కుమార్ గౌడ్ ‘సాక్షి’కి తెలిపారు. బాలాపూర్‌నకు చెందిన సయ్యద్ షోయబ్ అక్తర్ అలీకి ఈ శిక్షపడిందని వివరించారు. ఈ తరహా ఉల్లంఘనులపై పోలీసులు ఐపీసీలోని 420 (మోసం), 186 (ప్రభుత్వ అధికారుల విధులు అడ్డుకోవడం) సహా మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్ ఈ నెల 2 నుంచి 9 వరకు చేపట్టిన డ్రైవ్‌లలో నంబర్ ప్లేట్ సరిగా లేకపోవటం, టాంపరింగ్, స్పష్టత లేకుండా చేయడం వంటి 2,925 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశామని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 27,467 విత్ అవుట్ హెల్మెట్ కేసులు, 509 మందిపై 39 (బీ) పెట్టీ కేసులు, 264 మందిపై 41 సీపీ యాక్ట్ (వెహికిల్ లిఫ్టింగ్), 441 మంది వాహనదారులై ట్రిపుల్ రైడింగ్ కేసులు నమోదు చేశామని వివరించారు. -
ఈ నెలలో ప్రతి శనివారం పాస్‌పోర్టు ప్రత్యేక డ్రైవ్
రాంగోపాల్‌పేట్: పాస్‌పోర్టు దరఖాస్తుదారుల అపాయింట్మెంట్ల కోసం సుదీర్ఘ సమయం పడుతుండటంతో డిసెంబర్ నెలలోని అన్ని శనివారాల్లో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోని 5 పీఎస్కేలు, 14 పీవోపీఎస్కేల్లో ఈ డ్రైవ్‌లు కొనసాగుతాయని తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా దరఖాస్తుదారులకు 3200 అపాయింట్మెంట్లు అందించినట్లు తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినందుకు విదేశాంగ శాఖ అధికారులు, పోలీస్, పోస్టల్ శాఖలకు దరఖాస్తుదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
పోలీసుల స్పెషల్ డ్రైవ్.. రాత్రి బైకులు ఆపి ఫింగర్ ప్రింట్ టెస్టులు!
బనశంకరి: సిలికాన్ సిటీ బెంగళూరులో రాత్రి సమయంలో చోరీలకు తెగబడే దొంగలకు అడ్డుకట్టవేయడానికి నగర పోలీసులు కొత్త పథకం రూపొందించారు. రాత్రి సమయంలో గస్తీలు, వాహనాల తనిఖీల సమయంలో అనుమానితులు, వాహనదారుల వేలిముద్రలు, వాహనాల నంబర్లు పరిశీలనకు నాంది పలికారు. ఇందులో నేరపూరిత చరిత్ర ఉంటే అక్కడే వాహనాలను లాక్ చేస్తారు. వాహన సమాచారం కూడా డేటా బేస్‌లో వస్తుంది కాబట్టి దొంగ వాహనమైతే సీజ్ చేస్తారు. తద్వారా రాత్రి వేళల్లో దొంగలకు, అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట పడుతుందని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. క్షణాల్లో తేలిపోతుంది పోలీసులు గస్తీ, నాకాబందీ సమయాల్లో జనం వేలిముద్రలను తమ మొబైల్ఫోన్లో సీసీటీఎన్ఎస్ అప్లికేషన్లో పరిశీలిస్తారు. సాధారణ పౌరులైతే ఏమీ ఉండదు. నేరాల్లో భాగస్వామి అయితేనే అతని నమోదైన కేసుల వివరాలు లభ్యమౌతాయి. అదుపులోకి తీసుకుని విచారణ చేపడతారు. సరైన కారణాలు లేకపోతే తగిన చర్యలు తీసుకుంటారు. అలాగే వాహనం నంబరును బట్టి చోరీ చేసిన వాహనమా, నేరాల్లో ఉపయోగించారా, లేదా అనేది కూడా యాప్ ద్వారా నిర్ధారిస్తారు. సీఐ, ఎస్ఐలకు శిక్షణ గత రెండు నెలలనుంచి వివిధ పోలీస్స్టేషన్లలో మల్లోకి తీసుకువచ్చారు. ప్రతిపోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐలకు శిక్షణ అందించి ఉపకరణాలు అందజేశారు. నిత్యం తలా 20 మందిని తనిఖీ చేయడం తప్పనిసరి. దశలవారీగా నగరవ్యాప్తంగా విస్తరిస్తారు. పోలీసులు ప్రజలు వేలిముద్రలు తీసుకుంటే వ్యక్తిగత సమాచారం చోరీకి గురి అవుతుందనే భయం వద్దని, కేవల వేలిముద్రలు స్కాన్ అవుతాయని, రహస్య సమాచారం సేకరణ జరగదని పోలీసులు తెలిపారు. జరగబోయే నేరాలను అడ్డుకోవచ్చు రాత్రి సమయంలో దొంగలు, నేర చరిత్ర కలవారి ఆచూకీ కనిపెట్టి, జరగబోయే నేరాలను తప్పించడానికి సీసీటీఎన్ఎస్ డేటా ద్వారా రాత్రి సమయంలో తనిఖీలు చేపడుతున్నట్లు తూర్పు విభాగం అదనపు పోలీస్ కమిషనర్ సుబ్రమణ్యేశ్వరరావ్ తెలిపారు. -
ఊళ్లోనే పరిష్కారం.. దసరా తర్వాత ‘ధరణి’ సమస్యలపై స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఎదుర్కొంటున్న ‘ధరణి’ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి సంబంధించి ఇంతకుముందు ప్రకటించిన రెవెన్యూ సదస్సులు కార్యరూపం దాల్చని నేపథ్యంలో.. నేరుగా గ్రామ, మండల స్థాయిలో స్పెషల్ డ్రైవ్‌లను చేపట్టాలని భావిస్తోంది. ధరణికి సంబంధించి 10 లక్షలకుపైగా ఫిర్యాదులు రావడంతో.. వీటన్నింటినీ ఎలా పరిష్కరించాలన్న దానిపై తర్జనభర్జన పడుతోంది. వచ్చే నెల (అక్టోబర్) రెండో వారంలో ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టంగానే చెప్తున్నా.. సిబ్బంది లేమి, క్షేత్రస్థాయిలో పరిష్కార వ్యవస్థలు లేకపోవడం వంటి అవరోధాలు కనిపిస్తున్నాయి. తొలి నుంచీ సమస్యలే.. రాష్ట్రంలో వ్యవసాయ భూముల క్రయ, విక్రయ లావాదేవీలను పూర్తి పారదర్శకంగా జరిపేందుకు వీలుగా ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. కానీ పోర్టల్‌లో భూముల వివరాల నమోదుకు అనుసరించిన విధానం, సాంకేతిక సమస్యలతో తలనొప్పులు మొదలయ్యాయి. భూమి విస్తీర్ణం నమోదు నుంచి నిషేధిత జాబితాలోని భూముల వరకు ఎన్నో సమస్యలు తలెత్తడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరణికి సంబంధించి ఏ చిన్న అంశాన్ని అయినా ఆన్లైన్లో పరిష్కరించే అవకాశం కేవలం జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉండటం, ఆన్లైన్ దరఖాస్తులను వివిధ దశల్లో పరిశీలించడం క్లిష్టతరంగా మారడంతో ఫిర్యాదులు పేరుకుపోతూనే ఉన్నాయి. ధరణి పోర్టల్ గ్రీవెన్సులు (ఫిర్యాదులు) పది లక్షలు దాటాయని అధికారిక గణాంకాలే చెప్తున్నాయి. ఈ ఏడాది జూలై 5న ధరణిపై సమీక్షించిన సీఎం కేసీఆర్.. పది రోజుల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి, సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు. కానీ ఇది అమల్లోకి రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా.. కేవలం పైలట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట జిల్లా ములుగులో మాత్రమే రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. తర్వాత విషయం అటకెక్కింది. తమ సమస్యలు పరిష్కరించాలని రైతుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ దీనిపై దృష్టిపెట్టింది. గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించాలని.. ఇందుకోసం దసరా తర్వాత ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని భావిస్తోంది. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించాలని యోచిస్తోంది. పుట్టెడు సమస్యలు.. పిడికెడు సిబ్బంది.. ధరణి పోర్టల్ సమస్యలకు గ్రామ స్థాయిలోనే పరిష్కారం లభిస్తుందని భూచట్టాల నిపుణులు కూడా చెప్తున్నారు. గ్రామ స్థాయికి వెళ్లి సమస్యలను తెలుసుకుని.. మండల, రెవెన్యూ డివిజన్ల స్థాయిలో వాటిని పరిశీలన జరపాలని, జిల్లా కలెక్టర్ స్థాయిలో పరిష్కరించేందుకు నిర్ణీత కాలవ్యవధి ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో సిబ్బంది కొరత అవరోధంగా మారే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీఆర్వోల వ్యవస్థను ప్రభుత్వమే రద్దు చేయడం, ఉన్న వీఆర్ఏలు 60 రోజుల నుంచి సమ్మెలో ఉండటం, తహసీల్దార్లు తమ కార్యాలయాలను వదిలి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. క్షేత్రస్థాయిలో ధరణి ఫిర్యాదులను విచారించే వ్యవస్థ లేకుండా పోయిందని అంటున్నాయి. మరోవైపు రెవెన్యూ శాఖలో ఇప్పటికే పని ఒత్తిడి పెరిగిందని.. సిబ్బంది లేరని, పదోన్నతులు కల్పించడం లేదని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరించాకే.. ధరణి సదస్సులపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇక ధరణి సమస్యల పరిష్కారం జిల్లా కలెక్టర్ల చేతుల్లో ఉండటమూ ఇబ్బందిగా మారిందని.. కలెక్టర్లకు ఉండే పని ఒత్తిడి కారణంగా పరిష్కారంలో జాప్యం జరుగుతోందని విమర్శలు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో సరైన ఏర్పాట్లు చేయకుండా ముందుకెళితే ‘ధరణి’ తేనెతుట్టెను కదిపినట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్థాయిలో ఎలా? సీఎం కేసీఆర్ మాత్రం ధరణి సమస్యలను త్వరగా పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో దసరా తర్వాత ధరణి సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ గ్రామస్థాయికి వెళుతుందా? వెళ్లినా దరఖాస్తుల స్వీకరణ వరకే పరిమితం అవుతుందా? అక్కడే పరిశీలన, పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందా? ప్రభుత్వం దీనిపై ఏ రూపంలో కార్యాచరణ తీసుకుంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇస్తుందని అధికారులు అంటున్నారు. -
Hyderabad: అక్రమ పార్కింగ్‌లపై స్పెషల్ డ్రైవ్‌లు
సాక్షి, హైదరాబాద్: సెల్లార్లనూ వ్యాపారాలకు అద్దెకు ఇచ్చేసి సరైన పార్కింగ్ వసతి లేకుండా సాగుతున్న వాణిజ్య భవనాలపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ విభాగం దృష్టి పెట్టింది. బుధవారం నుంచి వీటిపై ప్రత్యేక డ్రైవ్స్ చేపడుతున్న అధికారులు పక్షం రోజుల పాటు అవగాహన కల్పించనున్నారు. ఆపై కేవలం అక్రమ పార్కింగ్ చేసిన వాహన చోదకులకే కాదు.. అలాంటి భవనంలో వ్యాపారం చేస్తున్న వ్యాపారి, దాన్ని అద్దెకు ఇచ్చిన యజమాని పైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ► నగరంలోని అనేక వాణిజ్య సముదాయాలు, భవనాలకు సరైన పార్కింగ్ వసతి ఉండట్లేదు. నిర్మాణంలో ఉన్నప్పుడు సెల్లార్‌ను పార్కింగ్ ప్రాంతంగా చూపించి అనుమతి పొందుతున్నారు. ఆపై దాన్ని కూడా అద్దెకు ఇచ్చేయడమో, వ్యాపార, ఇతర అవసరాలకు వాడుకోవడమో చేస్తున్నారు. ఫలితంగా ఆయా భవనాలు, సముదాయాలకు వచ్చే వినియోగదారులు తప్పనిసరి పరిస్థితుల్లో తమ వాహనాలను రోడ్లపై ఆపాల్సి వస్తోంది. కేవలం వాణిజ్య లావాదేవీలు జరిగే భవనాలే కాదు అనేక ఆస్పత్రులదీ ఇదే తీరు. ఇప్పటి వరకు తప్పు ఎవరిదైనా శిక్ష మాత్రం వాహనచోదకులకే పడుతూ వచ్చింది. రహదారి పైనో, క్యారేజ్ వేలోనో, ఫుట్‌పాత్ మీదో వాహనాన్ని అక్రమంగా పార్క్ చేశారంటూ ట్రాఫిక్ జరిమానా విధించడమో, ఆ వాహనాన్ని టోవింగ్ చేసి మరో చోటకు తరలించడమో చేస్తున్నారు. ► ఈ కారణంగా వస్తువులు ఖరీదు చేయడానికో, సేవలు పొందడానికో వచ్చిన వినియోగదారుడి పైనే భారం పడుతోంది. దీన్ని గమనించిన సిటీ ట్రాఫిక్ విభాగం అధికారులు సమగ్ర విధానం రూపొందించారు. ఈ తరహా ఉల్లంఘనల విషయంలో వాహన చోదకుల కంటే పార్కింగ్ వసతులు కల్పించని, ఉన్న వానిటీ దుర్వినియోగం చేస్తున్న వారి పైనే ఎక్కువ బాధ్యత ఉందని నిర్ణయించారు. దీన్ని అమలులోకి తీసుకువస్తూ ప్రత్యేక డ్రైవ్స్ ప్రారంభించారు. ట్రాఫిక్ పోలీసు బృందాలు పక్షం రోజుల పాటు ఆయా ప్రాంతాల్లోని వాణిజ్య భవనాలు, మాల్స్ వద్ద అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాతి నుంచి వాహనచోదకుడితో పాటు సరైన పార్కింగ్ వసతి లేకుండా అద్దెకు ఇస్తే భవన యజమాని, పార్కింగ్‌ను వాణిజ్య అవసరాలకు మార్చేస్తే ఆ వ్యాపారిపై కేసులు నమోదు చేయనున్నారు. (క్లిక్: వీల్ క్లాంప్లు మళ్లీ వచ్చాయ్.. ఇష్టారాజ్యంగా పార్కింగ్ కుదరదు) -
Number Plates: దొరికితే వదిలేదే లే!
సాక్షి, కర్నూలు: పోలీసులు తనిఖీ చేస్తున్నారట.. ఫొటో తీసి నంబర్ ప్లేట్ ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఏం చేద్దాం.. ప్లేట్‌ను వంచేద్దాం లేదా చివర్లను విరగ్గొడదాం లేదా ప్లేటే తీసేద్దాం అప్పుడెలాంటి జరిమానాలు రావు. ప్రస్తుతం కొంతమంది వాహనదారులు చేస్తున్న ఆలోచన ఇదీ. ప్రమాదాల నియంత్రణకు చర్యలు రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు పోలీసులు విస్తృతంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాఅంతటా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. అయినప్పటికీ కొందరు యథేచ్ఛగా రహదారి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇందులో ఎక్కువశాతం ద్విచక్ర వాహన చోదకులే ఉంటున్నారు. వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను విస్మరించిన వారికీ నష్టాలు తప్పవని తనిఖీల సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. ఇలాంటి వాహనాలు చోరీకి గురైనప్పుడు గుర్తింపు అసాధ్యంగా మారుతోంది. రోడ్డు ప్రమాదం జరిగిన సందర్భంలో వాహన చోదకుడు నష్టపోతే ఫిర్యాదు చేయడం కూడా ఇబ్బందికరమే. జిల్లాలో సుమారు 10 శాతం మేర వాహనాలు నంబర్ ప్లేట్ లేకుండా రాకపోకలు సాగిస్తున్నట్లు పోలీసుల అంచనా. నంబర్ ప్లేట్ లేకపోయినా, రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోయినా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. విరిగిందన్న సాకుతో.. ప్రస్తుతం వాహనాలన్నింటికీ హైసెక్యురిటీ నంబర్ ప్లేట్ బిగిస్తున్నారు. పలు కారణాల వల్ల ఈ నంబర్ ప్లేట్లు విరిగిపోతున్నాయి. ఫలితంగా వాహన నంబర్లను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. దీన్ని అనుకూలంగా మార్చుకుని కొందరు కావాలనే వాటిని తొలగించడం, నంబర్ గుర్తించకుండా ప్లేట్‌ను విరగ్గొట్టడం చేస్తున్నారు. దీనివల్ల నిబంధనలు అతిక్రమించినప్పుడు వాహనాలకు జరిమానా విధించాలన్నా, కేసులు సమోదు చేయాలన్నా అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వాహనాలన్నీ విధిగా నంబర్ ప్లేట్ కలిగి ఉండాలని అధికారులు ఆదేశిస్తున్నారు. హైసెక్యురిటీ నంబర్ ప్లేట్ ఉండి విరిగిపోయినా, దెబ్బతిన్నా వాటిస్థానంలో కొత్త ప్లేట్ బిగించుకోవాలని సూచిస్తున్నారు. మోటారు వాహన చట్టం నిబంధనలకు లోబడి సిరీస్, అంకెలు అన్నీ ఒకే పరిమాణంలో ఉండాలి లేకుంటే జరిమానాలు విధిస్తున్నారు. చదవండి: (వెయ్యేళ్ల చరిత్ర.. 31 నుంచి వరసిద్ధుని బ్రహ్మోత్సవం) నంబర్ ప్లేట్‌తోనే వాహనం గుర్తింపు రిజిస్ట్రేషన్ ఆధారంగా ఏర్పాటు చేసుకునే నంబర్ ప్లేట్‌తోనే వాహనాన్ని గుర్తించడం సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని విస్మరిస్తున్న పలువురు వాహన చోదకులు ఉల్లంఘనుల జాబితాలో చేరుతున్నారు. కనీస నిబంధనలు పాటించక చిక్కుల్లోకి వెళ్తున్నారు. నంబర్ ప్లేట్ రహితంగా, ఇష్టారీతిన నంబర్ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకుని వాటిపై ప్రయాణిస్తూ తనిఖీల్లో పట్టుబడుతున్నారు. వందల సంఖ్యలో జనాలు ఈ జాబితాలో చేరుతుండటం గమనార్హం. వారం రోజుల వ్యవధిలో ఉల్లంఘనలకు పాల్పడిన 7,932 మందిపై ఈ–చలానాలు విధించి రూ.21.26 లక్షలు జరిమానా వసూలు చేశారు. వారంలో కనీసం వందకు పైగా నంబర్ ప్లేట్ లేని వాహనాలు తనిఖీల్లో పోలీసులకు పట్టుబడుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా కట్టడి చేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక తనిఖీలు ప్రారంభించింది. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో సుమారు 75 ద్విచక్ర వాహనాలు నంబర్ ప్లేట్లు లేకుండా పట్టుబడ్డాయి. అలాగే ఇష్టారీతిన నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకున్నవి 150 దాకా పట్టుకున్నారు. నిర్దేశిత వ్యవధి దాటినప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలు కూడా తనిఖీల్లో పట్టుబడుతున్నాయి. కనిష్టంగా వెయ్యి జరిమానా.. నంబర్ ప్లేట్ లేకపోవడం, సరిగా అమర్చుకోకపోవడం, రిజిస్ట్రేషన్ అయినప్పటికీ అక్షరాలు, అంకెలు కనిపించకుండా మార్పులు చేయడం, వెనుకవైపు ప్లేట్‌ను తీసివేయడం, ప్లేట్‌ను వంపు చేయడం తదితర అంశాలు తనిఖీల్లో వెలుగుచూస్తున్నాయి. ఉల్లంçఘనలకు పాల్పడిన వారికి కనిష్టంగా వెయ్యి జరిమానా విధిస్తున్నారు. నంబర్ ప్లేట్ లేకపోయినా, రాంగ్ రూట్లో ప్రయాణించినా సిగ్నల్ జంపింగ్ చేసినా, రికార్డులు అందుబాటులో లేకపోయినా, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ పత్రం లేకపోయినా రూ.1000, లైసెన్స్ లేకపోతే రూ.500, హెల్మెట్ లేకపోతే రూ.100, నోఎంట్రీకి రూ.2 వేలు జరిమానా విధిస్తున్నారు. ప్రజల్లో మార్పు తేవడమే లక్ష్యం ప్రజల్లో మార్పు తేవడమే లక్ష్యంగా వాహనదారులపై జిల్లాలో స్పెషల్ డ్రైవ్ ప్రారంభించాం. నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా, రిజిస్ట్రేషన్ లేకుండా వాహనం రోడ్డుపైకి వచ్చినా పోలీసులు వాటిని జప్తు చేస్తారు. ఇష్టారీతిన నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోకుండా తనిఖీల్లో పట్టుబడితే పోలీసులు చర్యలు తీసుకుంటారు. – ఎస్పీ, సిద్ధార్థ్ కౌశల్ -
ఆపరేషన్ పరివర్తన్ విజయవంతం
నెల్లూరు(క్రైమ్): నాటు సారారహిత గ్రామాలే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్–2 జిల్లాలో విజయవంతమైంది. ప్రభుత్వ ఆదేశాలతో ఏప్రిల్ 15వ తేదీ నుంచి రెండునెలలపాటు ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో సెబ్ జేడీ కె.శ్రీలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సారా తయారీ, విక్రయ, అక్రమరవాణా అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించారు. పక్కా ప్రణాళికతో ఆయా ప్రాంతాల్లో సెబ్, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేసి నాటు సారాను స్వాధీనం చేసుకోవడంతోపాటు బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. మరోవైపు కార్డన్ సెర్చ్‌లు చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నాటుసారా నిర్మూలనతోపాటు వ్యాపారుల్లో మార్పు తీసుకొచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహించారు. సారాకు బానిసలు కావొద్దని యువతకు సూచించారు. తమ ప్రాంతాల్లో సారా తయారీకి ఒప్పుకోమని గ్రామస్తులతో ప్రమాణాలు చేయించారు. సారా వ్యాపారం మానుకున్న వారికి ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తామని ఇచ్చిన హామీలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 81 కేసులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఇప్పటివరకు 81 కేసులు నమోదు చేసి 79 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 238 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 23 వేల లీటర్ల బెల్లపుఊటను ధ్వంసం చేశారు. 75 కేజీల బెల్లం, రెండు వాహనాలను సీజ్ చేశారు. కొందరు సారా తయారీదారులకు బెల్లం సరఫరా చేసిన ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేశారు. వారిపై పీడీ యాక్ట్ తొలిసారిగా ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. పదేపదే నేరాలకు పాల్పడుతున్న బోగోలు మండలం కప్పరాళ్లతిప్పకు చెందిన సముద్రాల దుర్గారావు, మేకల హరీష్‌పై పీడీ యాక్ట్ పెట్టి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. అధికారుల చర్యలతో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైంది. ఉక్కుపాదం మోపాం ఆపరేషన్ పరివర్తన్–2లో భాగంగా సారా తయారీ, విక్రయాలపై రెండునెలలపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. నిందితులపై కేసులు నమోదుచేయడంతోపాటు తొలిసారిగా ఇద్దరిపై పీడీ యాక్ట్‌లు నమోదు చేశాం. ఆత్మకూరు ఉప ఎన్నిక పూర్తయింతే వరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయి. మత్తు పదార్థాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెంచాం. ఈ తరహా నేరాలు జరుగుతన్నట్లు ప్రజలు గుర్తిస్తే డయల్ 100 లేదా స్థానిక పోలీసులు, సెబ్ «అధికారులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటాం. – శ్రీలక్ష్మి, సెబ్ జేడీ -
బ్లాక్ ఫిల్మ్‌లు, నంబర్ ప్లేట్లపై నజర్; 18 నుంచి స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలను నగర ట్రాఫిక్ పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ నెల 18 నుంచి మరో విడత స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈసారి కారు అద్దాలపై బ్లాక్ ఫిల్మ్‌లు, నంబర్ ప్లేట్ సరిగా లేకపోవటం, వాహనం కొనుగోలు చేసిన నెల తర్వాత కూడా టీఆర్ నంబర్‌తో తిరగడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను నేర కార్యకలాపాలకు దోహదపడేవిగానూ పరిగణిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఐపీసీ సెక్షన్ 188, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఎఫ్ సెక్షన్ 21 ప్రకారం చార్జిషీట్లు దాఖలు చేసి, న్యాయస్థానంలో హాజరుపరుస్తామని హెచ్చరించారు. సంబంధిత వాహనాలను గుర్తిస్తే 90102 03626కు ఫిర్యాదు చేయాలన్నారు. (క్లిక్: అక్కడ ట్రాఫిక్ జామ్.. ఇలా వెళ్లండి) -
రోడ్లపై నిలిపివేసే వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
-
Hyderabad: రోడ్లపై వాహనాలను వదిలేస్తే ఇక ఉండవు అంతే..
సాక్షి, హైదరాబాద్: రోడ్లపై రోజుల తరబడి వాహనాలను వదిలేస్తున్నారా..? అయితే మీ వాహనం పోలీస్ స్టేషన్‌కే పరిమితం కానుంది. రోడ్లపై వదిలేసే వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రోడ్లపై ఇష్టానుసారం వదిలివెళ్లే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనుమానాస్పదంగా, నిర్లక్ష్యంగా ఉన్న వందలాది వాహనాలను ట్రాఫిక్ క్రేన్ల ద్వారా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఆ వాహనాలకు సంబంధించి ఎవరూ క్లెయిమ్ చేయకుంటే హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని 39బి కింద వేలం వేస్తామని చెప్పారు. రాబోయే కొన్ని రోజులపాటు ఈ డ్రైవ్ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. చదవండి: (బెంగాల్ సీఎం లేఖ.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ) -
హైదరాబాద్ లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్
-
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్, దొరికారో అంతే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. వాహనాలకు బ్లాక్ ఫిల్మ్, స్టిక్కర్ల దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాల పాటు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇన్నాళ్లూ అనధికారికంగా పోలీసు, ఆర్మీ, ప్రెస్, ఎమ్మెల్యేల పేరిట స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలను చూసీచూడనట్లు వదిలేసిన ట్రాఫిక్ పోలీసుల్లో జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంతో కదలిక వచ్చింది. చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం వాహనాలపై బ్లాక్ ఫిల్మ్ వాడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జడ్‌ప్లస్ కేటగిరి వారు తప్ప ఎవరూ వాహనాలపై బ్లాక్ ఫిల్మ్ వాడొద్దని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహనం లోపల విజిబులిటీ సరిగా ఉండాలన్నారు. వాహనాలపై అనుమతి లేకుండా బ్లాక్ ఫిల్మ్ వేయొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. -
జలమండలి అధికారుల బస్తీ బాట
సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా జలమండలి అధికారులు బస్తీబాట పడుతున్నారు. బస్తీలు, కాలనీలనే తేడా లేకుండా క్షేత్ర స్థాయిలో తమ సిబ్బందితో కలిసిపర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటున్నారు. వీలైనంతమేర ఆయాసమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతొ జలమండలి అధికారులు గడయిర 15 రోజులుగా ఈ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. రోజుకో బస్తీ, రోజుకోకాలనీ చొప్పున ఆయా సెక్షన్లలోని సిబ్బందితో పాటు మేనేజర్లు, సిబ్బంది అంతా తిరుగుతూ స్థానికుల సమస్యలు తెలుసుకుంటున్నారు. బంజారాహిల్స్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలినంగర్, తట్టికాన సెక్షన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ మొదలైంది. నల్లాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం, డ్రెయినేజీ సమస్యలు, కలుషిత నీటి సరఫరా తదితర సమస్యలను స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆయా సెక్షన్లలోని సిబ్బంది అధికారులు ఎంపిక చేసిన బస్తీల్లో నిత్యం పర్యటిస్తూ సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారం చూపుతున్నారు. కొన్ని అక్కడే.. మరికొన్ని ఉన్నతాధికారుల నివేదనలో... స్పెషల్ డ్రైవ్‌లో వెలుగుచూస్తున్న కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు జలమండలి జీఎం హరిశంకర్ తెలిపారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని కొన్ని సమస్యలను బస్తీవాసులు, కాలనీవాసులు అధికారులు దృష్టికి తెస్తుంటే వాటికి మాత్రం వెంటనే కాకుండా ప్రతిపాదనలు రూపొందించి వాటికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పరిష్కరిస్తామంటూ స్థానికులకు హామీ ఇస్తున్నారు. ♦ తట్టికాన సెక్షన్ పరిధిలో 15 బస్తీలు, ఫిలింనగర్ సెక్షన్‌పరిధిలో 13 బస్తీలు, జూబ్లీహిల్స్ సెక్షన్ పరిధిలో రెండు బస్తీలు, బంజారాహిల్స్ సెక్షన్ పరిధిలో 8 బస్తీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా సెక్షన్ల పరిధిలో నాలుగైదు బస్తీల్లో ఈ పర్యటనలు పూర్తయ్యాయి. స్థానికులను కలుపుకొని... నిత్యం ప్రజాప్రతినిధులు సమస్యల మీద ఆయా బస్తీలు, కాలనీల్లో తిరుగుతుంటారు. ఈ సారి అధికారులు ఎవరు ఫిర్యాదు చేసినా, చేయకపోయినా నేరుగా సమస్య ఉన్న ప్రాంతాలకే వెళ్లి వారితో మాట్లాడి ఆయా సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్థానికంగా ఉండే నేతలను వెంటబెట్టుకొని ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను గుర్తిస్తున్నారు. ♦ ఆయా సెక్షన్లలో పని చేసే మేనేజర్లకు సైతం క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడ సమస్యలున్నాయో తెలుస్తుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. తద్వారా త్వరితగతిన సమస్యలు పరిష్కారమవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. పాత పైపుల స్థానంలో... చాలా చోట్ల డ్రెయినేజీ పైపులు దెబ్బతినగా మరికొన్ని చోట్ల మ్యాన్‌హోళ్లు లీకవుతున్నాయి. 20 నుంచి 30 సంవత్సరాల క్రితం వేసిన పైపులు అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా వేసినవే. ప్రస్తుతం పరిమితికి మించి వినియోగంలో ఉన్నాయని పలువురు బస్తీవాసులు ఫిర్యాదు చేస్తున్నారు. పాత పైపుల స్థానంలో కొత్తవి వేయాలని అధికారులకు సూచిస్తున్నారు. -
ఏపీలో టీనేజర్ల కోసం వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్
-
డ్రంకెన్ డ్రైవ్: వారంలో రూ.కోటిన్నర జరిమానా
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు భద్రత, ప్రమాదాల నియంత్రణ, డ్రంకెన్ డ్రైవ్‌లు, పెండింగ్ చలాన్ల వసూళ్లపై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి 12వ తేదీ మధ్య రాచకొండ పరిధిలో 40,620 కేసులను నమోదు కాగా.. ట్రాఫిక్ ఉల్లంఘనలు, డ్రంకెన్ డ్రైవ్ కలిపి సుమారు రూ.కోటిన్నర జరిమానా విధించారు. ఇందులో అత్యధికంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై 26,475 కేసులు నమోదు కాగా.. రూ.48,98,900 ఫైన్లు విధించారు. ఇద్దరికి జైలు శిక్ష రాచకొండ కమిషరేట్ పరిధిలో వారం రోజుల్లో 49 డ్రంకెన్ డ్రైవ్ కేసులను నమోదయ్యాయి. రూ.4,38,500 జరిమానా విధించారు. 176 మందిని కోర్టులో హాజరుపరచగా ఇద్దరికి జైలు శిక్ష పడింది. అత్యధికంగా వనస్థలిపురంలో 10 కేసులు నమోదయ్యాయి. ద్విచక్ర వాహనాలదారులపై 38 కేసులు బుక్కవగా.. త్రీవీలర్స్పై 2, ఫోర్ వీలర్ వాహనాదారులపై 9 కేసులు నమోదయ్యాయి. 54 రోడ్డు ప్రమాదాలు.. 10 మంది దుర్మరణం.. కమిషనరేట్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 54 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయి. వీటిలో పది మంది దుర్మరణం చెందగా.. 50 మందికి గాయాలయ్యాయి. తీవ్రత వారీగా చూస్తే 10 కేసులు ఘోరమైన ప్రమాదాలు కాగా.. 44 సాధారణ రోడ్డు ప్రమాదాలున్నాయి. ఆయా డేటాను విశ్లేషించగా మానవ తప్పిదాలు, రహదారి ఇంజనీరింగ్ లోపాలతోనే జరిగాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, వాహనాలు వాటంతటవే ప్రమాదాలకు గురికావడం కారణాలని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ డి.శ్రీనివాస్ తెలిపారు. ఏ విభాగంలో ఎన్ని కేసులంటే.. విభాగం కేసుల సంఖ్య జరిమానా (రూపాయల్లో) హెల్మెట్ లేకుండా 26,475 48,98,900 సీట్‌బెల్ట్ లేకుండా 129 12,900 డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా 837 4,11,500 అదనపు ప్రయాణికులు 28 7,200 ఎక్స్ట్రా ప్రొజెక్షన్ 415 41,500 అతివేగం 2,023 20,23,000 సిగ్నల్ జంప్ 96 96,000 ప్రమాదకర డ్రైవింగ్ 14 14,000 సెల్‌ఫోన్ డ్రైవింగ్ 96 96,000 -
ఏ పంట వేస్తే ఎంత లాభం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరి సాగును తగ్గించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రైతులను సన్నద్ధం చేసేలా.. వారిని ప్రత్యా మ్నాయ పంటలవైపు మళ్లించేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని వ్యవసాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో వరి కోత లన్నీ పూర్తవుతాయని, యాసంగికి ఏర్పాట్లు జరుగుతుండ గానే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వరికి బదులు ఇతర పంటలు వేయాల్సిన ప్రాధాన్యం గురించి చెప్పాలని నిర్ణయిం చింది. ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి నిర్వహించాలో ఇంకా ఖరారు కాలేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలతో లాభాలు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నిర్వహించే సద స్సుల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవ డం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరి స్తారు. మద్దతు ధర, మార్కెట్లో డిమాండ్ వంటి అంశాలను తెలియజెప్పి రైతులకు భరోసా కల్పించాలని నిర్ణయించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం దేశంలో మినుములకు బాగా డిమాండ్ ఉంది. దేశంలో ఆహార భద్రతను అంచనా వేసే సెంట్రల్ పూల్ వ్యవస్థ ఉంది. దాని ప్రకారం అవసరమైనన్ని మినుములు సెంట్రల్ పూల్‌లో లేవు. కాబట్టి మినుములను కొనుగోలు చేయాలని కేంద్రం రాష్ట్రానికి సూచించింది. మద్దతు ధరకే కాకుండా, అవసరమైతే మార్కెట్లో ఎంత ధర ఉంటే అంత ధరకు మినుములు కొనుగోలు చేయాలని ఆదేశించింది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,300 కాగా, ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారులు రూ.7 వేల వరకు కొంటున్నారు. ఈ నేపథ్యంలో రూ.7 వేలైనా సరే కొనాలని కేంద్రం ఆదేశించింది. అంటే ఇక నుంచి మార్క్‌ఫెడ్ కూడా రూ.7 వేలు లేదా మార్కెట్లో అప్పుడున్న ధరలను బట్టి మినుములు కొనుగోలు చేస్తుంది. ఒకవేళ మద్దతు ధర కంటే మార్కెట్లో ధర తక్కువుంటే, మద్దతు ధరకు కొనుగోలు చేస్తారు. కాగా, ప్రత్యామ్నాయ పంటల సాగుకు అయ్యే ఖర్చు, రాబడిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ నివేదిక తయారు చేసింది. వరి బదులు ఏయే పంటలు సాగు చేస్తే ఎంత లాభం వస్తుందనే దానిపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం సహకారంతో పంటల వారీగా పెట్టుబడి, లాభాల తీరును నివేదికలో పొందుపర్చింది. ప్రత్యామ్నాయ పంటల్లో ఆవాలకు ఎక్కువ లాభాలు వస్తున్నట్లు నివేదిక చెబుతోంది. ఆ తర్వాత అధిక లాభాలు వచ్చే వరుసలో మినుములు, శనగ, నువ్వుల పంటలున్నాయి. అతి తక్కువ లాభం వచ్చే కేటగిరీలో కుసుమ పంట ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జోన్లవారీగా పంటలు... జోన్ల వారీగా ఏ పంటలను సాగు చేయాలనే దానిపై వ్యవసాయశాఖ గతంలోనే అంచనాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం ఆయా జోన్లలోని రైతులను స్పెషల్ డ్రైవ్‌లో సన్నద్ధం చేస్తారు. ఉత్తర తెలంగాణ జోన్ కింద ఉన్న ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో వరికి బదులు వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ సాగు చేయించాలని నిర్ణయించారు. సెంట్రల్ తెలంగాణ జోన్ కింద సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో వరి స్థానంలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ సాగు చేయిస్తారు. దక్షిణ తెలంగాణ జోన్లో మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నారాయణపేట జిల్లాలను చేర్చారు. ఈ జిల్లాల్లో వరికి బదులుగా వేరుశనగ, పొద్దు తిరుగుడు, శనగ, పెసర పంటలు వేసేలా రైతులను సన్నద్ధం చేస్తామని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆయా జిల్లాల్లో మిగిలిన ప్రత్యామ్నాయ పంటలను కూడా రైతులకు సూచిస్తారు. -
AP: డెంగీ కట్టడికి స్పెషల్ డ్రైవ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డెంగీ కేసులను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డెంగీ జ్వరాల బారిన పడిన వారికి ఓ వైపు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ.. కేసుల నియంత్రణకు కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ చర్యల ఫలితంగా కేసుల నమోదు క్రమంగా తగ్గుతూ వస్తోంది. నియంత్రణ చర్యలను మరింత ముమ్మరంగా కొనసాగించేందుకు 13 జిల్లాలకు 13 మంది సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా వైద్య, ఆరోగ్య శాఖ నియమించింది. వీరు తమకు కేటాయించిన జిల్లాల్లోని గ్రామాలు, పట్టణాలను ర్యాండమ్‌గా ఎంపిక చేసి డ్రై డే, ఇంటింట సర్వే, ఫాగింగ్ తదితర కార్యక్రమాలు సక్రమంగా చేపడుతున్నారా లేదా అన్నది పరిశీలించి లోటుపాట్లను ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. తదనుగుణంగా తదుపరి చర్యలు ఉండేలా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. మూడు రోజులు డ్రై డే డెంగీ కారక దోమల నివారణకు ప్రస్తుతం ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం అమలవుతోంది. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది తమ పరిధిలోని ప్రజలకు దోమల నివారణపై చైతన్యం కల్పిస్తున్నారు. ఆ రోజు నీటి నిల్వలున్న బాటిళ్లు, టైర్లు, ప్లాస్టిక్ కుండీలు, ట్యాంకులను శుభ్రం చేసుకోవడంపై ప్రజలకు అవగాహన కలి్పస్తారు. ఈ కార్యక్రమాన్ని ఒక్క రోజులో ప్రభావవంతంగా చేపట్టడానికి వీలు పడటం లేదు. దీంతో మూడు రోజులపాటు (శుక్ర, శని, ఆది) ఈ కార్యక్రమం చేపడుతున్నారు. తద్వారా సచివాలయాల పరిధిలోని అన్ని ఇళ్లకు సిబ్బంది కచ్చితంగా వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 14,986 సచివాలయాల పరిధిలో 1.62 కోట్ల గృహాల వారికి అవగాహన కల్పిస్తారు. ఇప్పటివరకూ 2,92,283 గృహాల్లో దోమలు గుడ్లు పెట్టినట్టు గుర్తించి నిర్మూలించారు. 3,006 నీళ్ల ట్యాంక్‌లను శుభ్రం చేయించారు. ఏఎన్ఎంలు తమ పరిధిలో ఎక్కడైనా మురుగు కాలువలు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే వెక్టర్ కంట్రోల్ హైజీన్ యాప్ ద్వారా పంచాయతీ, మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ ఏఎన్ఎంలు 1,60,453 సమస్యలను లేవనెత్తారు. వీటిలో 1,14,464 సమస్యలు పరిష్కారం కాగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు డెంగీ నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టేలా రాష్ట్ర స్థాయిలో స్పెషాలిటీ వైద్యులతో 6 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్(ఆర్ఆర్టీ)లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్టోబర్ 25 నుంచి 31 వరకూ రాష్ట్రంలో 193 డెంగీ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క విశాఖపట్నంలోనే 43, తూర్పు గోదావరిలో 38, గుంటూరులో 20 చొప్పున.. మూడు జిల్లాల్లోనే ఎక్కువ కేసులు ఉన్నాయి. శ్రీకాకుళంలో 19, ప్రకాశం జిల్లాలో 16 మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లో కేసుల నమోదు తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో కేసుల నమోదుపై ప్రభుత్వం ఎంటమలాజికల్ స్టడీ చేపడుతోంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న విశాఖపట్నం, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు, మిగిలిన జిల్లాల్లోని ఆరు ప్రాంతాల్లో ఎంటమలాజికల్ స్టడీ ఇప్పటికే ప్రారంభమైంది. మరోవైపు మురుగు నీటి కుంటలు, కాలువల్లో దోమ లార్వాలను తినే 24.75 లక్షల గంబూషియా చేప పిల్లలను వదిలారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 24 సెంటినల్ సర్వైలెన్స్ ఆస్పత్రులు ఉండేవి. వీటిలోనే డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసేవారు. ప్రభుత్వం వీటి సంఖ్యను 54కు పెంచింది. ఈ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 58,949 డెంగీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నిర్వహణ, డెంగీ బారిన పడిన వారికి వైద్యం, మందులు ఈ ఆస్పత్రుల్లో అందిస్తున్నారు. విష జ్వరాలను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంది. ప్రతి కేసూ సూక్ష్మ పరిశీలన రాష్ట్రంలో నమోదవుతున్న డెంగీ, మలేరియా ప్రతి కేసును సూక్ష్మంగా పరిశీలిస్తున్నాం. కేసు నమోదు కావడానికి కారణాలేమిటనేది అన్వేషించి నివారణ చర్యలు చేపడుతున్నాం. కేసులు నమోదైన ప్రాంతాలను వైద్యుల బృందం పరిశీలించి మునిసిపల్, పంచాయతీరాజ్ అధికారుల సమన్వయంతో నివారణ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అవసరమైనన్ని టెస్టింగ్ కిట్లు, మందులు అందుబాటులో ఉంచాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకూ నమోదైన కేసులు ఇలా.. జిల్లా కేసుల సంఖ్య శ్రీకాకుళం 120 విజయనగరం 177 విశాఖపట్నం 899 తూర్పు గోదావరి 506 పశ్చిమ గోదావరి 221 కృష్ణా 153 గుంటూరు 565 ప్రకాశం 134 నెల్లూరు 46 చిత్తూరు 98 వైఎస్సార్ 27 కర్నూలు 181 అనంతపురం 154 మొత్తం 3,281 -
‘స్పెషల్’కు టీకాల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా టీకాల ప్రత్యేక డ్రైవ్‌కు ఆటంకం ఏర్పడింది. ఆరు రోజుల పాటు ఉధృతంగా కొనసాగిన ప్రత్యేక వ్యాక్సినేషన్ వేగం తగ్గింది. వ్యాక్సిన్ల కొరతే దీనికి కారణమని, కేంద్రం నుంచి సరిపడా వ్యాక్సిన్లు సరఫరా కావడం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరుకల్లా కోటి టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. వ్యాక్సిన్ల కొరతతో అది నెరవేరే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నాయి. ప్రస్తుతమున్న టీకాలతో సాధారణ స్థాయిలో వ్యాక్సినేషన్ కొనసాగిస్తామని వెల్లడించాయి. ప్రత్యేక డ్రైవ్ కోసం రాష్ట్రానికి 50 లక్షల టీకాలు పంపించాలని కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిపాయి. రోజుకు ఏడు లక్షలు ఇచ్చేలా.. కరోనా మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వేగంగా వ్యాక్సినేషన్ చేపట్టాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 18ఏళ్లు పైబడి, వ్యాక్సిన్ తీసుకునే అర్హత ఉన్న 2.80 కోట్ల మందికి టీకాలు వేయాలని వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు 2.29 కోట్ల డోసులు వేయగా.. అందులో మొదటి డోస్ 1.66 కోట్ల మందికి, రెండు డోసులు 62.72 లక్షల మందికి ఇచ్చారు. ఇంకా పెద్ద సంఖ్యలోనే మొదటి, రెండో డోస్ టీకాలు తీసుకోవాల్సిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో వేగంగా టీకాలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ నుంచి నెలాఖరు వరకు కరోనా టీకాల ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో 7,319 బృందాలను ఏర్పాటు చేసింది. పట్టణాలు, పల్లెలు, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా డ్రైవ్ మొదలుపెట్టింది. 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దాదాపు 29.42 లక్షల మందికి టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు. ఇందులో అత్యధికంగా ఈ నెల 18న ఏకంగా 6.36 లక్షల డోసులు ఇచ్చామని.. 21న 5.32 లక్షల డోసులు, 17న 5.27 లక్షల డోసులు వేశామని వెల్లడించారు. రోజుకు ఏడు లక్షల టీకాలు వేసేలా ఏర్పాట్లు చేశామని.. వ్యాక్సిన్ల కొరతతో ఆటంకం ఏర్పడిందని తెలిపారు. పిల్లల టీకాపై అస్పష్టత 12–18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఈ నెల 15వ తేదీ నుంచే టీకాలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. కానీ ఇప్పటివరకు దానిపై ఎటువంటి స్పష్టత రాలేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు మాత్రమే సరఫరా అవుతున్నాయి. పిల్లల టీకాలకు సంబంధించి ఆయా కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. దీంతో పిల్లల టీకాలు రాలేదని.. ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్న సమాచారం కూడా లేదని అధికారులు చెప్తున్నారు. -
వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లో ఏపీ మరో రికార్డు
-
నేడు ఏపీలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్
-
ఏపీలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్
సాక్షి, అమరావతి: ఏపీలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారికి తొలి డోసు, రెండో డోసు అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కోసం 2500కి పైగా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15 లక్షల కోవిషీల్డ్, కోవాగ్జిన్ డోసులను అధికారులు అందుబాటులో ఉంచారు. ఏపీలో ఇప్పటివరకు 2.93 కోట్ల మందికి వ్యాక్సినేషన్ జరిగింది. విజయవాడ: పడమట 45 వార్డు సచివాలయంలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్, జిల్లా వైద్య శాఖాధికారిణి డాక్టర్ సుహాసిని తదితరులు పరిశీలించారు.ఈ సందర్భంగా మీడియాతో జేసీ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోందన్నారు. 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ తొలి డోసు అందిస్తున్నామన్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోసు ఇస్తున్నామన్నారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌కి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. స్పెషల్ డ్రైవ్‌పై వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా ముందుగానే ప్రజలకి సమాచారమిచ్చి టైం స్లాట్ కేటాయించాం. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1.30 లక్షల మందికి ఈ స్పెషల్ డ్రైవ్ లో వ్యాక్సిన్ వేయనున్నామని తెలిపారు. థర్డ్ వేవ్ ముప్పుని దృష్డిలో ఉంచుకుని ఉపాధ్యాయులు, విద్యా శాఖ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్, మెడికల్, ఐదేళ్ల చిన్నారుల తల్లులు, గర్భిణులకు ఇప్పటికే నూరుశాతం వ్యాక్సిన్ వేశామని, వ్యాక్సినేషన్‌తోనే థర్డ్ వేవ్ నుంచి రక్షణ ఉంటుందని జేసీ శివశంకర్ పేర్కొన్నారు. ఇవీ చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే అవినీతి బాగోతం: నిగ్గు తేలుతున్న నిజాలు ఘనంగా ఎంపీ బాలశౌరి కుమారుడి నిశ్చితార్థం.. హాజరైన చిరంజీవి -
ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్
-
Hyderabad: రేపటి నుంచి వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్‌డ్రైవ్ ఈ నెల 23 నుంచి 10– 15 రోజులపాటు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. శనివారం బీఆర్కేఆర్ భవన్లో వ్యాక్సినేషన్ స్పెషల్‌డ్రైవ్ నిర్వహణపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలోని మొత్తం 4,846 కాలనీ లు, మురికివాడలు తదితర ప్రాంతాలతో పాటు కంటోన్మెంట్ పరిధిలోని 360 ప్రాంతాల్లో స్పెషల్‌డ్రైవ్ కొనసాగుతుందన్నారు. వందశాతం కోవిడ్ టీకాలు వేసిన నగరంగా హైదరాబాద్‌ను మార్చడం దీని లక్ష్యమని పేర్కొన్నారు. టీకాలు వేసేందుకు జీహెచ్ఎంసీలో 150, కంటోన్మెంట్ ఏరియాలో 25 వాహనాలు వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రతి వాహనంలో ఇద్దరు టీకా వేసే సిబ్బంది, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారన్నారు. ప్రతి కాలనీలో ఇద్దరు వ్యక్తులతో కూడిన మొబిలైజేషన్ టీమ్స్ టీకాలు తీసుకోని వారిని ముందుగానే గుర్తించి, వ్యాక్సిన్ వేసే తేదీ, సమయాన్ని తెలియజేయడంతో పాటు టీకా వేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుందన్నారు. సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ పర్యవేక్షణకు జీహెచ్ఎంసీలోని 12 సర్కిళ్లకు 12 మంది జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: King Cobra: 13 అడుగుల గిరినాగు -
కోవిడ్‌తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 కోట్లు
న్యూఢిల్లీ: కోవిడ్-19తో మృతి చెందిన 101 మంది జర్నలిస్టుల కుటుంబాలకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.5.05 కోట్లను సాయంగా మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూ ర్వకంగా సమాధానమిచ్చారు. కోవిడ్ బాధిత జర్నలిస్టుల కుటుంబాలను గుర్తించి, సాయం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నా మన్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖకు అందిన దరఖాస్తులకు జర్నలిస్ట్ సంక్షేమ పథకం(జేడబ్ల్యూఎస్) నిబంధనలకు లోబడి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేశామన్నారు. చదవండి: Women's Hockey: కన్నీరు మున్నీరైన అమ్మాయిలు, అనునయించిన మోదీ -
ఏపీ : దిశా యాప్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు
-
దిశ యాప్‌పై అవగాహనకు ప్రత్యేక డ్రైవ్
సాక్షి, అమరావతి/ఒంగోలు: రాష్ట్రంలో మహిళా భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్ రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో విద్యార్థినులు, యువతులు, మహిళలు అందరూ ‘దిశ’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, వినియోగించుకునేలా ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతం సవాంగ్ జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, సబ్ డివిజన్ అధికారులు, సీఐలు, ఎస్సైలు, దిశ పోలీస్ స్టేషన్ల అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మహిళా పోలీసులు, మహిళా పోలీసు అధికారులు దిశ యాప్‌పై మహిళలకు అవగాహన కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకు, గ్రామ/వార్డు వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణ తర్వాత వీరంతా తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి వారి ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయడంతోపాటు అత్యవసర సమయాల్లో యాప్‌ను వినియోగించడంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. దీంతోపాటు పాఠశాలలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహించి దిశ యాప్‌పై అవగాహన కల్పించాలని చెప్పారు. మహిళలపై వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే తక్షణం స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత గడువులోగా దోషులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్పందన, ఏపీ పోలీస్ సేవా యాప్, దిశ యాప్, సైబర్‌మిత్ర, వాట్సాప్‌ల ద్వారా వచ్చిన సమాచారం మేరకు కేసులు నమోదు చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను డీజీపీ పునరుద్ఘాటించారు. తమ పరిధి కానప్పటికీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీలు రవిశంకర్ అయ్యన్నార్, హరీష్‌కుమార్ గుప్తా, శంకర బత్ర బాగ్చి, ఐజీ నాగేంద్రకుమార్, దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకాశం ఎస్పీ ‘మ్యాపింగ్’ ఐడియా అమలు డీజీపీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో గల అనుమానాస్పద శివారు ప్రాంతాలను, గతంలో అవాంఛనీయ ఘటనలు జరిగిన ప్రదేశాలను, నేరాలు జరగడానికి ఆస్కారం ఉండే ప్రదేశాలను గుర్తించి, మ్యాపింగ్ చేయడం ద్వారా ఆయా ప్రదేశాల్లో ప్రత్యేక బీట్లు ఏర్పాటు చేసి, నిరంతరం నిఘా ఉంచాలన్నారు. తద్వారా నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్టేందుకు అవకాశం కలుగుతుందని వివరించారు. ఈ ‘మ్యాపింగ్’ ఐడియా పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన డీజీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు యూనిట్లలోనూ దీనిని అమలు చేయాలని ఆదేశించారు. చదవండి: వైద్య విద్యార్థులకు మరో శుభవార్త.. ఏపీ: ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు -
రేపు ఏపీ లో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్
-
దోస్త్: నేటి నుంచి వచ్చే నెల 2 వరకు స్పెషల్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా నవంబర్ 27 నుంచి వచ్చే నెల 2 వరకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) కన్వీనర్ ప్రొ. ఆర్.లింబాద్రి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ల కోసం ఇప్పటివరకు దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు. ప్రత్యేక కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు వచ్చే నెల 4న సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల 4 నుంచి 7 వరకు సంబంధిత కాలేజీల్లో సీసీఓటీపీ, తాత్కాలిక కేటాయింపు లేఖ, ఇతర అమసరమైన ప్రతాలను తీసుకెళ్లి రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని సీటు పొందనివారు, రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇవ్వనివారు, సీటు పొంది కాలేజీ కన్ఫర్మ్ కాని విద్యార్థులు ఈ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్‌కు అర్హులని తెలిపారు. -
కోవిడ్‌పై 10 రోజులు ప్రత్యేక డ్రైవ్
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్ డెస్కులు ఉండాలి. 15 రోజుల్లో ఈ ఏర్పాటు జరిగి తీరాలి. ప్రతి హెల్ప్ డెస్క్ వెనక పూర్తి వివరాలతో పోస్టర్ ఉండాలి. ఆ డెస్కులో రోజంతా సేవలందించేలా ఇద్దరు ఆరోగ్యమిత్రలు ఉండాలి. హెల్ప్ డెస్కులను గమనించేలా సీసీ కెమెరాలు ఉండాలి. వాటిని జేసీలు పర్యవేక్షించాలి. దేశానికి సంబంధించిన సర్వే చూస్తే, కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా 10 శాతం కేసుల్లో మళ్లీ కొత్తగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కిడ్నీ, బ్రెయిన్, చెవికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. అందుకే పోస్టు కోవిడ్ అనారోగ్య సమస్యలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. ఆ మేరకు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశాం. సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో వచ్చే పది రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కోవిడ్ వస్తే ఏం చేయాలన్న దానిపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలన్నారు. 104 నంబర్‌కు ఫోన్ చేయడం, తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరుచూ శుభ్రంగా కడుక్కోవడం వంటి వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. ఈ నాలుగింటిపై స్కూళ్లు తెరిచాక పిల్లలకు అవగాహన కల్పించడం చాలా అవసరమని స్పష్టం చేశారు. ‘స్పందన’లో భాగంగా కోవిడ్–19 నివారణ చర్యలు, తీసుకోవాల్సిన అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు, సూచనలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అవగాహన కల్పించాలి ► కోవిడ్ తగ్గాక కూడా కనీసం 6 వారాల నుంచి 8 వారాల పాటు రోగులు జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించాలి. 104 నంబరుపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలి. ఆ నంబరుకు ఫోన్ చేస్తే 30 నిమిషాల్లో బెడ్ కేటాయించాలి. ► దాదాపు 200కు పైగా ఉన్న కోవిడ్ ఆస్పత్రుల్లో ఆహార నాణ్యత, శానిటేషన్, వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు.. ఈ 4 అంశాలపై డ్రైవ్ కంటిన్యూ కావాలి. ఆరోగ్యమిత్రల పనితీరుపై ఎస్ఓపీ ► హెల్ప్ డెస్కులలో ఆరోగ్యమిత్రలు కేవలం కూర్చోవడమే కాకుండా, వారు ఏం చేయాలన్న దానిపై ఒక నిర్దిష్ట ఎస్ఓపీ ఖరారు చేయండి. తాము రోగులకు ఏ రకంగా సహాయం చేయాలన్న దానిపై ఆరోగ్యమిత్రలకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ► వీరు ఎవరి నుంచీ లంచం ఆశించకుండా చూడాలి. ఎవరైనా లంచం అడిగితే, ఎవరికి ఫిర్యాదు చేయాలో, ఆ నంబర్‌ను పోస్టర్‌పై ప్రదర్శించాలి. మనం ఒక రోగిగా ఆస్పత్రికి వెళ్తే, ఎలాంటి సహాయ, సహకారాలు కోరుకుంటామో అవన్నీ ఆరోగ్యమిత్రలు చేయాలి. ► ప్రతి ఆరోగ్యమిత్ర ప్రతి రోజూ.. ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, మందుల అందుబాటు, వైద్య సేవలపై జిల్లా వైద్యాధికారికి నివేదిక ఇవ్వాలి. ► ఈ విధంగా ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో సేవలందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లు, జేసీలు, ఆరోగ్య శాఖ కార్యదర్శిదే. కోవిడ్ రికవరీలో ఏపీ తొలి స్థానం ► రాష్ట్రంలో ఇప్పుడు రోజూ దాదాపు 70 వేల పరీక్షలు చేస్తున్నాం. మరోవైపు పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా తగ్గింది. నిన్న (19వ తేదీ) పాజిటివిటీ రేటు 4.76 శాతం మాత్రమే. గత వారంలో ఇది 5.5 శాతంగా నమోదైంది. ► ప్రతి 10 లక్షల మందిలో 1,33,474 మందికి వైద్య పరీక్షలు చేస్తూ, దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. రికవరీ రేటు 94.5 శాతంతో రాష్ట్రమే తొలి స్థానంలో ఉంది. -
రైతుకు భరోసా
-
రైతు నేస్తం
-
చదువుల విప్లవం
-
కరోనాపై అపోహలు-వాస్తవాలు
-
అంతా ఖాళీ
-
వజ్ర సంకల్పం
-
గోదారోళ్ల పందెం కొళ్ళు
-
నేరాలను అదుపులో పెట్టేందుకు స్పెషల్ డ్రైవ్
సాక్షి, కృష్ణా : నేరాలను అదుపులో పెట్టేందుకు కృష్ణా జిల్లా పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. గంజాయి అమ్మకాలు, వ్యభిచార గృహాలు, పేకాట స్థావరాలు, రౌడీ షీటర్లు, ఆకతాయిలు, జులాయి గ్యాంగ్‌ల ఆటకట్టించేందుకు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. పోలీసులు బృందాలుగా విడిపోయి తెల్లవారుజాము నుంచే మెరుపుదాడులు నిర్వహించి అనుమానిత ప్రాంతాల్లో నిర్భంధ తనిఖీలు నిర్వహించారు. శివారు ప్రాంతాల్లోని కాలనీలను చుట్టుముట్టి దిగ్బంధనం చేశారు. ఇటీవలే కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా అని ఆరా తీశారు. ఆధార్, ఇతర ఐడెంటీ కార్డులను పరిశీలించి ప్రతి ఒక్కరి డేటాను సేకరించారు. సరైన గుర్తింపు పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు. కాగా, అనుమానితులను అదుపులోకి తీసుకొని నేరప్రవృత్తి మానుకోవాలని పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. -
బూజు దులిపారు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో పనికిరాని చెత్తనంతా నాలాల్లో పారబోయడం ఓ అలవాటు. అందుకే వానొచ్చినప్పుడల్లా రోడ్లు చెరువులవుతాయి. రోడ్లపై మోకాలి లోతు నీళ్లు చేరతాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం.. నాలా (వరద కాలువ)ల్లోనే వ్యర్థపు సామగ్రి వేస్తుండటం. ఈ పనికి రాని చెత్తలో పరుపులు, దుప్పట్ల నుంచి నిర్మాణ వ్యర్థాల దాకా అనేక రకాలున్నాయి. గ్రేటర్‌వాసులు తమకు పనికి రాదనుకున్న చెత్తనంతా నాలాల్లోనే పారబోస్తున్నారు. ఇక, ప్లాస్టిక్ వ్యర్థాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘గ్రేటర్’ ఐడియా నగరంలో రోజు రోజుకూ పెరిగిపోతోన్న ఈ సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ కొత్త ఆలోచన చేసింది. ప్రజలు వ్యర్థాలను ఎక్కడ వదిలించుకోవాలో తెలియక, పాత సామాన్లు కొనేవారి దాకా వెళ్లలేక, సమీపంలోనే ఉన్న నాలాల్లో వేస్తున్నారని గుర్తించింది. ప్రజల చెంతకే వెళ్లి.. ఈ వ్యర్థాలను సేకరిస్తే..?. ఈ క్రమంలోనే పది రోజుల పాటు రీసైక్లథాన్ పేరిట ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు నిరుపయోగ వస్తువుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్ల పరిధిలో వెరసి 360 ప్రాంతాల్లో వీటిని స్వీకరించే కార్యక్రమం చేపట్టారు. ఆసక్తి కలిగిన అధికారులు ప్రజల వద్దకే వాహనాల్లో వెళ్లి.. మైకుల ద్వారా ప్రచారం చేసి ‘మీ ఇంటి దగ్గర్లోనే వాహనం ఉంది. పనికి రాని సామాన్లు తెచ్చి అందులో వేయండి’అంటూ పిలుపునిచ్చారు. పనికొచ్చేవి రీసైక్లింగ్.. మొత్తానికి అధికారుల పిలుపునకు ప్రజలు స్పందించారు. అంతోఇంతో అవగాహన కలిగిన వారు పాత సామాన్ల బూజు దులిపి తెచ్చిచ్చారు. సమీపంలోని సేకరణ కేంద్రాల్లోనూ ఇచ్చారు. పది రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 235 మెట్రిక్ టన్నుల సామగ్రి పోగు పడింది. వీటిని జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించారు. ఇందులో పనికొచ్చే వాటిని రీసైక్లింగ్ చేయనున్నారు. జీహెచ్ఎంసీ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల నాలాల్లో పడే వ్యర్థాలు తగ్గనున్నాయని భావిస్తున్నారు. ఫర్నిచర్, చిరిగిన దుస్తులు, ప్లాస్టిక్.. సేకరణ కేంద్రాలకు అందిన నిరుపయోగ వస్తువుల్లో ఎక్కువ మొత్తంలో విరిగిన ఫర్నిచరే ఉంది. ఆ తర్వాత పాత, చిరిగిన దుస్తులు, దుప్పట్లు వంటివి ఉన్నాయి. ప్లాస్టిక్ కూడా పెద్ద పరిమాణంలోనే ఉంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సైతం 6 మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నాయి. గ్రేటర్ పరిధి లోని ఆరుజోన్లలో ఎల్బీనగర్ ప్రజలు ఈ కార్యక్రమానికి బాగా స్పందించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ జోన్ నిలిచింది. వ్యర్థాల సేకరణకు స్థానిక జోనల్, డిప్యూటీ కమిషనర్లు సైతం ఎంతో కృషి చేశారు. 3–4 నెలలకోసారి అమలు.. పది రోజుల్లో వెరసి 235 మెట్రిక్ టన్నుల నిరుపయోగ వస్తువులు పోగుపడ్డాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు అలవాటుపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఇకముందూ కొనసాగిస్తామని, ప్రతి 3–4 నెలలకోసారి నిర్వహిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్ తెలిపారు. త్వరలో నాలాల్లో సమస్యగా మారిన డెబ్రిస్ (నిర్మాణ, కూల్చి వేతల వ్యర్థాల) సేకరణకు 10 రోజుల స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. -
రూ.కోటి దాటిన స్పెషల్ డ్రైవ్ జరిమానాలు
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ హైదరాబాద్ అమలులో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్ఎంసీ... ప్రజలు, దుకాణదారులు, వివిధ సంస్థల నిర్వాహకుల్లో తగిన మార్పు కనిపించకపోవడంతో జరిమానాల బాట పట్టింది. ‘స్వచ్ఛ’ కార్యక్రమాల అమలుపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించింది. అయినా ఉల్లంఘనలకు పాల్పడితే పెనాల్టీలు విధించాలని నిర్ణయించింది. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మే 24 నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు నెలల్లోనే రూ.కోటికి పైగా జరిమానాలు విధించింది. రోడ్లపై, నాలాల్లో చెత్త వేయడం, భవన నిర్మాణ వ్యర్థాలు పారబోయడం, బహిరంగంగా చెత్తను తగలబెట్టడం, బహిరంగ మల, మూత్ర విసర్జన తదితర ఉల్లంఘనలకు పాల్పడిన వారికి ఈ పెనాల్టీలు వేసింది. మొత్తం 8,475 పెనాల్టీల ద్వారా రూ.1,03,31,620 వసూలు చేసింది. టాప్ 5 సర్కిళ్లు ఇవీ... చందానగర్‌లో 518 పెనాల్టీల ద్వారా రూ.16.90 లక్షలు, శేరిలింగంపల్లిలో 312కు గాను రూ.13.90 లక్షలు, ఖైరతాబాద్‌లో 627కు రూ.8.41 లక్షలు, జూబ్లీహిల్స్‌లో 462కు రూ.6.85 లక్షలు, మూసాపేట్లో 350కు రూ.5.15 లక్షలు వసూలు చేసినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. -
ఈ బైక్... చాలా కాస్ట్లీ గురూ..
బంజారాహిల్స్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు బీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా వరకు బైక్ రేసింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కేబీఆర్‌పార్కు చౌరస్తాలో బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు చేపట్టిన తనిఖీల్లో 10 బైక్‌లు మితిమీరిన వేగంతో దూసుకెళ్తూ పట్టుబడ్డారు. ఇందులో ఆరు స్పోర్ట్స్ బైక్స్ ఉన్నట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో ఇన్స్పెక్టర్ ముత్తు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి రేసింగ్‌లకు పాల్పడుతున్న 17 వాహనాలను సీజ్ చేశారు. ఇందులో ఒక కారుతో పాటు 16 బైక్‌లు ఉన్నాయి. తొమ్మిది స్పోర్ట్స్ బైక్స్ కావడం గమనార్హం. ఆదివారం జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పంజగుట్ట ట్రాఫిక్ ఏసీపీ కోటేశ్వర్రావు వివరాలు వెల్లడించారు. మోటారు వాహనాల చట్టం కింద రైడర్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆయా బైక్‌లపై నమోదైన కేసుల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైడింగ్‌కు పాల్పడ్డ వారిలో కొందరికి లైసెన్సులు లేవని మరికొన్నింటికి నంబర్‌ప్లేట్ లేదని ఇంకొన్ని మాడిఫైడ్ సైలెన్సర్లతో తిరుగుతున్నట్లు తెలిపారు. నిందితులకు బేగంపేటలో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా పట్టుబడిన వారిలో మలక్‌పేట, టోలిచౌకీ, హిమాయత్‌నగర్ ప్రాంతాలకు చెందిన యువకులు ఉన్నట్లు తెలిపారు. ఈ బైక్... చాలా కాస్ట్లీ గురూ బంజారాహిల్స్: ఈ బైక్ ఖరీదు రూ.17 లక్షలు, 1300 సీసీ సామర్థ్యం, సింగిల్ సీట్, గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. లీటర్‌కు 5 కిలోమీటర్ల మైలేజీ, మాడిఫైడ్ సైలెన్సర్ల ఖరీదుకే రూ.1.50 లక్షలు, చెవులు దద్దరిల్లే శబ్ధం. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు శనివారం అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లపై చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పట్టుకున్న ఈ బైక్ మలక్‌పేట్‌కు చెందిన యువ వ్యాపారి సమీర్ అహ్మద్దిగా గుర్తించి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహి ల్స్ రోడ్ నెం.2 కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు వారాంతాల్లో మాత్రమే సదరు యువకుడు ఈ బైక్‌ను బయటికి రేసింగ్‌లో పాల్గొంటాడు. ఒక్కసారి ఈ బైక్ రోడ్డెక్కిందంటే పెట్రోల్ కోసం రూ. 7 వేలు ఖర్చు చేయాల్సిందే. మోటారు వాహనాల చట్టానికి విరుద్దంగా రైడింగ్ చేస్తున్న ఈ బైక్‌ను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. -
అక్రమార్కులకు ముచ్చెమటలు
మరోసారి స్పెషల్ డ్రైవ్ మొదలైంది. అక్రమాల పునాదులు కదులుతున్నాయి.. ఇన్నాళ్లూ టీడీపీ ప్రభుత్వ హయాంలో కళ్లముందే తప్పు జరుగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయతతో చేతులు ముడుచుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులు.. మరోసారి జూలు విదిల్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మితమవుతున్న భవనాలపై ఉక్కుపాదం మోపారు. గెడ్డను ఆక్రమించేసి అడ్డంగా ఐదంతస్తులు నిర్మించేస్తున్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ భవనంపై సమ్మెటపోటు పడటంతో.. జీవీఎంసీ రెండో విడత డ్రైవ్ ప్రారంభించింది. బీపీఎస్ దరఖాస్తుల ఆధారంగా అక్రమ భవనాలను గుర్తించి వాటిని కూలగొట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: బుల్డోజర్లు కదులుతుంటే.. అక్రమార్కుల గుండెలదిరాయి... అనధికార నిర్మాణాల్ని జేసీబీలతో కూలగొడుతుంటే.. వెన్నులో వణుకుపుట్టింది. సమ్మెటలతో నిర్మాణాల్ని ఛిద్రం చేస్తుంటే.. కబ్జాదారులకు చెమటలు పట్టాయి. టీడీపీ ఎమ్మెల్యేల అండతో నిబంధనలంటే లెక్కలేనితనంతో విచ్చలవిడిగా పెరిగిన అనధికార నిర్మాణాలపై జీవీఎంసీ స్పెషల్ డ్రైవ్ మరోసారి మొదలైంది. ఐదేళ్ల కాలంలో పుట్టగొడుగుల్లా వెలిసిన అక్రమ నిర్మాణాలను గుర్తిస్తున్న సిబ్బంది వాటిని కూలగొడుతున్నారు. కమిషనర్ జి.సృజన ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన టౌన్‌ప్లానింగ్ అధికారులు.. జూన్ 26 నుంచి 8 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి వార్డులోనూ జల్లెడ పడుతూ.. అనధికార భవనాలపై చర్యలు తీసుకున్నారు. 8 రోజుల వ్యవధిలో 79 భవనాలను కూలగొట్టారు. నిరంతర ప్రక్రియగా.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, నిబంధనలకు తుంగలో తొక్కుతూ టీడీపీ హయాంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. తాజాగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌కు చెందిన 5 అంతస్తుల నిర్మాణాన్ని శనివారం నేలమట్టం చేశారు. కోర్టు స్టే ఇవ్వడంతో కూల్చివేతల్ని సాయంత్రం నిలిపేశారు. కేవలం ఈ ఒక్క భవనమే కాకుండా శనివారం జీవీఎంసీ పరిధిలో 8 అక్రమ నిర్మాణాల్ని పడగొట్టేశారు. జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలతో మరోసారి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించిన టౌన్‌ప్లానింగ్ సిబ్బంది.. దీన్ని నిరంతర ప్రక్రియగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. బీపీఎస్ దరఖాస్తుల ఆధారంగా.. పారదర్శంగా ఈ డ్రైవ్ చేపట్టాలని టౌన్‌ప్లానింగ్ అధికారులు నిర్ణయించారు. ఎవరిపైనా కక్షపూరితంగా వ్యవహరించకుండా నిబంధనలకు తిలోదకాలిచ్చి చేపట్టిన నిర్మాణాలపైనే ఉక్కుపాదం మోపాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్(బీపీఎస్)ను ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. జీవీఎంసీ పరిధిలో అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు 5,238 దరఖాస్తులు వచ్చాయంటే.. ప్లాన్‌కు విరుద్ధంగా ఎన్ని అంతస్తులు నిర్మిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఇప్పటి వరకు 267 భవనాలకు అప్రూవల్ ఇచ్చారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఈ దరఖాస్తుల ఆధారంగా డ్రైవ్ కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి జోన్‌లోనూ అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏసీపీ)లకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ఏసీపీ తన జోన్ పరిధిలో రోజుకు 5 నుంచి 10 బీపీఎస్ దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇందులో బీపీఎస్ నిబంధనలననుసరించి ఉన్న భవనాలకు అనుమతులు మంజూరు చేయనున్నారు. మిగిలిన భవనాల్ని కూల్చివేసేందుకు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ రకంగా టౌన్‌ప్లానింగ్ సిబ్బంది అనధికార భవనాలపై అధికారికంగా ఉక్కుపాదం మోపనున్నారు. ప్లాన్‌కు విరుద్ధంగా ఎక్కడ అనధికార నిర్మాణం కనిపించినా, దాని వెనుక ఎంతటివారున్నా వెనుకాడకుండా కూలగొట్టాలని నిర్ణయించారు. పారదర్శకంగా వ్యవహరిస్తాం.. అనధికార నిర్మాణం ఎక్కడ ఉన్నా.. అది ఎవరిదైనా ఉపేక్షించే ప్రసక్తేలేదు. కమిషనర్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ మళ్లీ ప్రారంభించాం. తొలిరోజున 8 భవనాలపై చర్యలకు ఉపక్రమించాం. దీంతో పాటు ఇప్పటికే కొన్ని భవనాలకు నోటీసులు జారీ చేశాం. వారు ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారు. దానికి సంబంధించిన విచారణ సోమవారం జరగనుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించి బీపీఎస్ వెరిఫికేషన్‌లో తిరస్కరణకు గురైన ప్రతి అదనపు అంతస్తు, భవనాన్ని కూలగొడతాం. నియమాల్ని అనుసరించి పారదర్శకంగా వ్యవహరిస్తాం. –ఆర్జె విద్యుల్లత, జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ -
నిబంధనలు తూచ్ అంటున్న పోలీసులు
సాక్షి, నెల్లూరు(క్రైమ్): ‘వాహనాలు నడిపే వ్యక్తులు హెల్మెట్ ధరించాలి. అందరూ విధిగా నిబంధనల మేరకు వాహనాలకు నంబర్ ప్లేట్లు పెట్టుకోవాలి. ట్రాఫిక్ రూల్స్‌ను ఎవరూ ఉల్లంఘించినా ఉపేక్షించం’ చెబుతున్న పోలీసులు పౌరులకు భారీగా జరిమానా విధిస్తున్నారు. కానీ ఆ రూల్స్‌ను మాత్రం పోలీసులే బ్రేక్ చేస్తున్నారు. నిబంధనలు ఎదుటి వారికే కానీ.. తమకు కాదంటున్నారు. సాక్షాత్ జిల్లా పోలీసు బాస్ హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలు తమకు ఒకలా? పోలీసు సిబ్బందికి మరోలా ఉంటాయా అంటూ జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారు. మృతుల్లో అధిక శాతం మంది ద్విచక్ర వాహన చోదకులే. ప్రమాదంలో తలకు తీవ్రగాయమై మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు. మితిమీరిన వేగం, నిబంధనల ఉల్లంఘన, హెల్మెట్ ధరించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా గుర్తించి వాటిని ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గతేడాది డిసెంబర్ నుంచి జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పోలీసు సిబ్బంది నిత్యం రహదారులపై మాటేసి ఉల్లంఘనల పేరిట వాహన చోదకులపై ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వివిధ ఉల్లంఘనలకు సంబంధించి 1,35,212 కేసులు నమోదు చేసి సుమారు రూ.2 కోట్ల మేర జరిమానాలు విధించారు. మరికొందరు పోలీసు సిబ్బంది నిర్దేశిత లక్ష్యాలను అధిగమించేందుకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హెల్మెట్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్స్ ఉంటే పొల్యూషన్ లేదని, అన్నీ ఉంటే మితిమీరిన వేగం అని, ఏదో ఒకటి సాకుగా చూపిస్తూ జరిమానాలు విధిస్తున్నారు. పలువురు వాహన చోదకులు ఇదేమిటని ప్రశ్నిస్తే వారిపై అదనంగా మరో రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా నంబరు ప్లేట్లు సరిగా లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ కేసులు నమోదు చేసే ఖాకీలు మాత్రం యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. నిబంధనలు ఎదుటి వారికే కాని తమకు కాదన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఎస్పీ హెచ్చరికలు బేఖాతర్ నిబంధనల అమలు సొంత ఇంటి నుంచే జరిగి అందరికీ మార్గదర్శకులుగా నిలవా లని ఎస్పీ భావించారు. అందులో భాగంగా గతేడాది డిసెంబర్ మొదటి వారంలో జిల్లాలో పనిచేస్తూ ద్విచక్ర వాహనాలు వినియోగిస్తున్న సిబ్బంది అందరూ విధిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయరాదని ఆదేశించారు. వీటిని పాటించని వారికి ఆబ్సెంట్ వేస్తామని హెచ్చరించారు. సిబ్బంది అందరూ విధిగా హెల్మెట్ ధరిస్తున్నారో లేదో పరీక్షించి ప్రతి రోజు నివేదిక అందజేయాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. కొద్ది రోజులు సిబ్బంది ఎస్పీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారు. కాలక్రమేణా హెచ్చరికలను బేఖాతరు చూస్తూ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. అధికారులు సైతం పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద జిల్లా పోలీసుల తీరు చట్టాలు, నిబంధనలకు తాము అతీతులమని తమ చేష్టల ద్వారా నిరూపిస్తున్నారు. -
56 చలాన్లు : రూ.9675 బకాయి
హిమాయత్‌నగర్: సర్వీస్ రోడ్‌పై వాహనాల పార్కింగ్ చేస్తుండటంపై ట్రాఫిక్ పోలీసులు మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హిమాయత్‌నగర్ ప్రధాన రోడ్ స్వాగత్ గ్రాండ్ వద్ద ఏపీ29 బిఎల్2385 ద్విచక్ర వాహనానికి 56 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకుగాను రూ.9675 బకాయిలున్నట్లు గుర్తించిన ఎస్సై కృష్ణంరాజు వాహనాన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించాడు. -
అబ్బూరి ఛాయాదేవి అంతరంగం
-
దేశవ్యాప్తంగా 50 చోట్ల సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: రూ.1,139 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసిన కేసులో సీబీఐ భారీ డ్రైవ్ చేపట్టింది. మంగళవారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో 12 రాష్ట్రాల్లోని 18 నగరాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 61 చోట్ల సోదాలు చేపట్టింది. ఎస్బీఐ, సెంట్రల్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకులు చేసిన ఫిర్యాదుల మేరకు నమోదైన 17 కేసులకు సంబంధించిన వివిధ వాణిజ్య సంస్థల డైరెక్టర్లు, ప్రమోటర్లకు చెందిన ఇళ్లు, సంస్థలపై దాడులు జరిగాయి. పరారైన వజ్రాల వ్యాపారి జతిన్‌కి చెందిన ముంబైలోని విన్సమ్ గ్రూప్, తాయల్ గ్రూప్‌నకు చెందిన ఎస్కే నిట్, ఢిల్లీ కేంద్రంగా పనిచేసే నఫ్తోగజ్, ఎస్ఎల్ కన్జ్యూమర్, పంజాబ్‌లోని ఇంటర్నేషనల్ మెగా ఫుడ్‌పార్క్, సుప్రీం టెక్స్ మార్ట్ తదితరాలు లక్ష్యంగా సోదాలు చేపట్టినట్లు సీబీఐ తెలిపింది. గృహ రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడిన భువనేశ్వర్‌లోని యూనియన్ బ్యాంక్ శాఖ అధికారులపై మూడు కేసులు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. ఢిల్లీ, ముంబై, థానే, లూ«థియానా, వల్సాద్, పుణే, గయ, గుర్గావ్, చండీగఢ్, భోపాల్, సూరత్, కోలార్ తదితర నగరాల్లో చేపట్టిన ఈ సోదాల్లో 300 మంది అధికారులు పాల్గొన్నారని తెలిపింది. సీబీఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా నేతృత్వంలో చేపట్టిన తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని సీబీఐ పేర్కొంది. రూ.640 కోట్ల మేర మోసం జరిగి ఉంటుందని అంచనా వేసిన అధికారులు సోదాల తర్వాత ఈ మొత్తం రూ.1,139 కోట్ల వరకు ఉంటుందని తేల్చారు. ఈ మేరకు జితిన్ మెహతాపై 16వ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎగ్జిమ్ బ్యాంకును రూ.202 కోట్ల మేర మోసం చేసినట్లు ఇతనిపై ఇప్పటికే పలు కేసులున్నాయి. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న ముంబైలోనూ అధికారులు సోదాలు కొనసాగించారు. -
అంతే స్పీడ్‌గా..
సాక్షి, సిటీబ్యూరో: ఏటా రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రమాదాల్లో అత్యధికం అతివేగం కారణంగానే చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు, తద్వారా మృతుల సంఖ్యను తగ్గించాలనే లక్ష్యంతో డీజీపీ కార్యాలయం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలను నిరోధించడంలో భాగంగా ఓవర్ స్పీడ్‌పై స్పెషల్ డ్రైవ్స్ చేపట్టేందుకు పోలీసు విభాగం సన్నాహాలు చేస్తోంది. ఇందుకుగాను ప్రత్యేకంగా రాడార్ టెక్నాలజీతో పని చేసే 30 స్పీడ్ లేజర్ గన్లను కొనుగోలు చేశారు. వీటి వినియోగంపై ఆయా జిల్లాలు, కమిషనరేట్ల సిబ్బందికి డీజీపీ కార్యాలయంలో బుధవారం నుంచి శిక్షణ ఇస్తున్నారు. వీటితో కలిపి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న స్పీడ్ లేజర్ గన్స్ సంఖ్య 58కి చేరింది. వీటిని ‘ఎంపిక చేసిన’ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మోహరించి తనిఖీలు చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా రహదారులు, వాటి స్థితిగతులపై అధ్యయనం చేసిన మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్టీహెచ్) నిర్ణీత వేగపరిమితులను విధించింది. వీటి ప్రకారం జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలు, ఔటర్ రింగ్రోడ్లపై గరిష్టంగా గంటకు 100 కిమీ వరకు ప్రయాణించవచ్చు. ఇది వాహనాలను బట్టి మారుతుంటుంది. మిగిలిన రహదారుల్లో గరిష్ట వేగం గంటకు 60 కిమీ మించకూడదు. జనసమ్మర్థ ప్రాంతాల్లో ఇది 40 కిమీ, విద్యాసంస్థలు ఉండే ప్రాంతాల్లో 20 కిమీ దాటకూడదు. వీటికి తోడు నగరంలో ట్యాంక్‌బండ్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో వేగ పరిమితులు విధించారు. వీటికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో సూచికలు అందుబాటులో ఉంచినా వాహనచోదకులు పట్టించుకోవట్లేదు. ఫలితంగా అత్యధిక వాహనాలు ఓవర్స్పీడింగ్తో వెళ్లి ప్రమాదాలకు లోనుకావడం, ప్రమాదకారకాలుగా మారడం జరుగుతోంది. ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌స్పాట్స్‌గా పేర్కొంటారు. గత రెండేళ్లుగా వీటిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసు విభాగం శాస్త్రీయంగా కారణాలను గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు కారణమవుతున్న ఇంజినీరింగ్ లోపాలు, ఆక్రమణలు తదితరాలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కేవలం ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు గుర్తించినా, ఆయా ప్రాంతాల్లో వినియోగించేందుకు స్పీడ్ లేజర్ గన్స్ అవసరమైన సంఖ్యలో లేవు. రాష్ట్రం మొత్తమ్మీద కేవలం 28 మాత్రమే అందుబాటులో ఉండటంతో కొత్తగా 30 గన్స్‌ను సమీకరించుకుంది. రాడార్ పరిజ్ఞానంతో పని చేసే వీటి వినియోగంపై డీజీపీ కార్యాలయం కేంద్రంగా క్షేత్రస్థాయి ట్రాఫిక్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. వీటిని ఓవర్ స్పీడ్ కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంట్లున్న జిల్లాలు, కమిషనరేట్లకు అందించనున్నారు. ఆయా యూనిట్స్‌కు చెందిన వారు వీటి వినియోగం కోసం ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేస్తారు. ఈ బృందాలు ఒక్కో రోజు ఒక్కో బ్లాక్‌స్పాట్ వద్ద కాపుకాసి మితిమీరిన వేగంతో వచ్చే వాహనాలను గుర్తిస్తాయి. తొలుత ఈ ఉల్లంఘనులకు చలాన్లు జారీ చేయకుండా కొన్ని రోజుల పాటు అవగాహన కల్పించాలని, ఆ తర్వాతే చలాన్లు విధించాలని డీజీపీ కార్యాలయం ఆదేశించింది. మాన్యువల్..ఆటోమెటిక్.. ఈ స్పీడ్ లేజర్ గన్స్‌ను మాన్యువల్‌గానూ, ఆటోమేటిక్ మోడ్‌లోనూ వినియోగించే అవకాశం ఉంది. అంటే... ఎంపిక చేసిన ప్రాంతంలో ఉండే ట్రాఫిక్ సిబ్బంది అటుగా వచ్చే వాహనాల్లో అతివేగంగా వెళ్తున్న వాటిని గుర్తించి ఫొటోలు తీయడం ద్వారా చర్యలు తీసుకుంటారు. ఆటోమెటిక్ విధానంలో ఓ ప్రాంతంలో స్పీడ్ గన్ను ఏర్పాటు చేసి వదిలేస్తే దాని ముందు నుంచి ప్రయాణించే వాటిలో నిర్ణీత వేగం దాటిన వాహనాలను లేజర్ గన్నే గుర్తించి ఫొటోలు తీస్తుంది. సదరు ప్రాంతంలో వేగ పరిమితి ఎంత? ఎంత వేగం దాటితే ఫొటో తీయాలి? తదితర అంశాలను గన్‌లో పొందుపరిచేందుకు ఆస్కారం ఉంది. దీనికి అనుసంధానించి ఉండే ట్యాబ్ ఈ–చలాన్ సర్వర్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. గన్ క్యాప్చర్ చేసిన ఫొటోల్లో ఏది సక్రమంగా ఉంది? ఏది అస్పష్టంగా ఉంది? అనేవి సరిచూసే సిబ్బంది పక్కాగా ఉన్న ఫొటోలనే సర్వర్‌కు అప్లోడ్ చేస్తారు. ఈ సర్వర్ ఆర్టీఏ డేటాబేస్‌లోని వివరాల ఆధారంగా సదరు ఉల్లంఘనుడి వాహనం నంబర్‌తో ఈ–చలాన్ జనరేట్ చేస్తుంది. దీన్ని అతడి చిరునామాకు పోస్టులో పంపిస్తారు. రహదారులపై తనిఖీలు చేపట్టే ట్రాఫిక్ పోలీసుల చేతిలో ఉండే పీడీఏ మిషన్లలోనూ ఈ డేటా నిక్షిప్తం చేస్తారు. ఫలితంగా ఓవర్ స్పీడింగ్ చేసి, ఈ–చలాన్ చెల్లించని వారిని గుర్తించి పట్టుకునేందుకు ఆస్కారం ఉంటుంది. భవిష్యత్‌లో మరిన్ని ఏర్పాటు ‘నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఒకప్పుడు ప్రమాదాలకు నెలవుగా ఉండేది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు ఓవర్ స్పీడే ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. దీంతో ప్రాథమికంగా ఎనిమిది స్పీడ్ లేజర్ గన్స్ ఖరీదు చేసి ఔటర్‌పై మోహరించారు. ఫలితంగా వాహనాల గరిష్ట వేగం తగ్గడంతో పాటు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలోని ఓవర్‌స్పీడింగ్ బ్లాక్‌స్పాట్స్ అన్నింటి వద్దా ఈ గన్స్‌తో డ్రైవ్స్ చేయాలని నిర్ణయించాం. భవిష్యత్‌లో ఈగన్స్ సంఖ్యను భారీగా పెంచడానికీ కసరత్తు చేస్తున్నాం’ –ఓ పోలీసు ఉన్నతాధికారి -
హమారా భరోసా
-
అర్ధరాత్రి ఆగడాలపై నజర్
సాక్షి, సిటీబ్యూరో: అర్ధరాత్రి రహదారులపైకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్న వాహనచోదకులపై నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా కొన్నింటిని కట్టడి చేసే ఉద్దేశంతో శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా 9864 కేసులు నమోదు చేసి 1031 వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. శాంతిభద్రతల విభాగం అధికారుల సాయంతో నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో కొందర నేరగాళ్లు, అనుమానితులతో పాటు చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అర్ధరాత్రి సమయాల్లో నెంబర్ ప్లేట్లు లేకుండా, అడ్డదిడ్డమైన నెంబర్ప్లేట్స్తో, హారన్లు, సైలెన్సర్ల ద్వారా వాయు కాలుష్యానికి కారణమవుతూ సంచరిస్తున్న వాహనాలతో పాటు ట్రిపుల్ రైడింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్, రేసింగ్‌లపై ట్రాఫిక్ పోలీసులు దాడులు చేపట్టారు. ఇందులో భాగంగా కొందరు అనుమానితులు సైతం చిక్కారు. మారేడ్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు టివోలీ చౌరస్తా వద్ద చేపట్టిన డ్రైవ్‌లో ఎనిమిది చైన్ స్నాచింగ్ కేసులతో సంబంధం ఉన్న మహ్మద్ అజీజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని బేగంపేట శాంతిభద్రతల విభాగం ఠాణాకు అప్పగించారు. అలాగే టోలిచౌకీలోని బాపుఘాట్ వద్ద లంగర్‌హౌస్ ట్రాఫిక్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఫహీమ్, మహ్మద్ అబ్దుల్ అలీం, షేక్ సాజిద్ అనే అనుమానితులను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు తార్నాక స్ట్రీట్ నెం.1లో చేపట్టిన తనిఖీలో ఓ మైనర్ బుల్లెట్ నడుపుతూ పోలీసులకు చిక్కాడు. వాహనాన్ని పరిÔశీలించగా నకిలీ నెంబర్ ప్లేట్ తగిలించినట్లు గుర్తించిన పోలీసులు దీనిపై ఆరా తీయగా ఉస్మానియా వర్శిటీ పరిధిలో చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో కేసును శాంతిభద్రతల విభాగానికి అప్పగించారు. నమోదైన కేసులు ఇలా... ఉల్లంఘన కేసులు సక్రమంగాలేనినెంబర్ప్లేట్ 6261 నెంబర్ ప్లేట్ లేకుండా 1853 హారన్/సైలెన్సర్ న్యూసెన్స్ 662 ట్రిపుల్ రైడింగ్ 938 డేంజరస్డ్రైవింగ్ 150 మొత్తం 9864 పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు 1031 శాంతిభద్రతల విభాగానికి అప్పగించినవి: 255 -
మార్పు కోసం..
-
కురుక్షేత్రం 23rd February 2019
-
కురుక్షేత్రం 22nd February 2019
-
కురుక్షేత్రం 21st February 2019
-
మారణహోమం
-
వెండితెర 2018
-
దాగని కుట్ర!
-
4 గంటలు.. 143 కేసులు..
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు భద్రత ఉల్లంఘనలపై బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనాయణ్‌రెడ్డి నేతృత్వంలో నాలుగు గంటల పాటు జరిగిన ఈ తనిఖీల్లో మొత్తం 143 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఏడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం 11 నుంచి రెండు గంటల పాటు, మధ్యాహ్నం 1.30 నుంచి మరో రెండు గంటల పాటు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. వీటిలో హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న 44 మంది ద్విచక్ర వాహనచోదకులు, రాంగ్‌సైడ్‌లో వాహనాలు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న 60 మంది, ఆటో పైలెటింగ్‌కు పాల్పడుతున్న 26 మంది, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న ఏడుగురితో పాటు టు వీలర్‌పై ముగ్గురు ప్రయాణిస్తున్న నేపథ్యంలో మరో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన వారిపై కేసు పెట్టడంతో పాటు ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఉల్లంఘనులకు చెక్ చెప్పడం, ప్రమాదాలు తగ్గించడానికి ఉద్దేశించిన ఈ స్పెషల్ డ్రైవ్స్ కొనసాగుతాయని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనాయణ్‌రెడ్డి తెలిపారు. -
కొత్త ఓట్ల నమోదు,సవరణకు అవకాశం
-
34 గ్రామాల నీటిలో బ్యాక్టీరియా
సాక్షి, అమరావతి బ్యూరో: నగరంలో డయేరియా వ్యాధికి గురై 30 మందికిపై మృత్యువాత పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తహసీల్దార్, ఎంపీడీవో, పంచాయతీ విస్తరణాధికారులతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు ఏర్పడ్డారు. ఏప్రిల్ 10, 11, 12 తేదీలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 3124 శాంపిల్స్ సేకరించారు. హైడ్రోజన్ సల్ఫైడ్ వైల్ ద్వారా నీటి నమూనాలను పరిక్షించారు. అందులో 34 శాంపిల్స్ సురక్షితం కాదని గుర్తించారు. ఈ నీటిలో బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం నీటిని సూపర్ క్లోరినేషన్ చేశారు. పెదకూరపాడు, వినుకొండ, వెల్దుర్తి, మాచవరం, కారంపూడి మండలాలలో ఈ సమస్య ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 177 గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతుందని, రూ.10.23 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. నీటి సమస్య రానివ్వం గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాం. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. కొన్ని గ్రామాల్లో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ట్యాంకర్ల సంఖ్యను పెంచుతున్నాం. పైపులైన్లకు మరమ్మతులు చేపడుతున్నాం.– భాను వీరప్రసాద్, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్, గుంటూరు -
రైళ్లలో హిజ్రాల ఆగడాలకు చెక్
సాక్షి, బెంగళూరు: రైళ్లలో ప్రయాణికుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న హిజ్రాల ఆటలకు బెంగళూరు రైల్వే డివిజన్ చెక్ చెప్పింది. ఇటీవల కాలంలో రైళ్లలో హిజ్రాల ద్వారా వేధింపులకు గురవుతున్నట్లు ప్రయాణికుల నుంచి బెంగళూరు డివిజన్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో గత మూడు నెలలుగా డివిజన్ అధికారులు అనేక డ్రైవ్‌లు నిర్వహించి ఆకతాయి హిజ్రాల పని పట్టినట్లు సమాచారం. మూడు నెలల నుంచి ఇప్పటివరకు 135 డ్రైవ్‌లు నిర్వహించి 100 మంది హిజ్రాలను విచారించారు. 182 టోల్‌ఫ్రీ ద్వారాఫిర్యాదుల వెల్లువ.. రైల్వే భద్రతా సిబ్బంది (ఆర్పీఎఫ్) అధికారి ఒకరు మాట్లాడుతూ... ఇటీవల ప్రయాణికుల నుంచి హిజ్రాలపై చాలా ఫిర్యాదులు అందాయని తెలిపారు. 182 టోల్‌ఫ్రీ ద్వారా చాలా మంది ప్రయాణికులు హిజ్రాల చేష్టలపై ఫిర్యాదులు చేసినట్లు చెప్పారు. ఏదొక స్టేషన్లో కొందరు హిజ్రాలు రైల్లోకి ఎక్కి పురుషు ప్రయాణికుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. డబ్బులు ఇవ్వని ప్రయాణికులన మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు 182 టోల్‌ఫ్రీ ద్వారా చాలా మంది ప్రయాణికులు తమకు ఫిర్యాదులు చేశారని తెలిపారు. ఇటీవల కాలంలో సమాజంలో ఎంతో విస్తృతమైన సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రయాణికులు హిజ్రాలపై ఫిర్యాదులు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారానే రైల్వే మంత్రికి కూడా ప్రయాణికులు నేరుగా ఫిర్యాదులు చేస్తున్నట్లు చెప్పారు. ఒక ప్రయాణికుడి జేబులో ఇద్దరు హిజ్రాలు చేతులు పెట్టి బలవంతంగా డబ్బులు లాక్కున్నట్లు ఇటీవల తమకు ఒక ఫిర్యాదు అందిందని చెప్పారు. గతంలో ప్యాసెంజర్ రైళ్లలో మాత్రమే ప్రయాణించే హిజ్రాలు ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని స్పష్టంచేశారు. ఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్న స్టేషన్లలో దిగకుండా హిజ్రాలు తప్పించుకుని తిరుగుతున్నారని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు బెంగళూరు కంటోన్మెంట్, హిందూపూరు, బయపనహళ్లి, యశ్వంతపుర, తుమకూరు తదితర రైల్వేస్టేషన్లలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించామని తెలిపారు. అంతేకాకుండా రామనగరం–చన్నపట్న, నిద్వాంద–తుమకూరు, గౌరిబిదనూరు–హిందూపూరు, దొడ్డబళ్లాపుర–గౌరిబిదనూరు, బయపనహళ్లి–కృష్ణరాజపురం రైల్వే సెక్షన్లలోనూ డ్రైవ్‌లు నిర్వహించామని చెప్పారు. ఏప్రిల్ వరకు ఈ డ్రైవ్‌లను కొనసాగిస్తామన్నారు. రూ. 18,200 జరిమానా వసూలు.. ప్రత్యేక డ్రైవ్‌లలో పట్టుబడిన హిజ్రాలను రైల్వే కోర్టుల ఎదుట ప్రవేశపెట్టారు. ఇందులో రెండు కేసులు మినహా అన్ని కేసుల విచారణలను కోర్టు పూర్తి చేసి జరిమానాలు విధించింది. మొత్తం 100 మందిని విచారించిన కోర్టు రూ. 18,200 జరిమానాలను విధించి హిజ్రాల నుంచి వసూలు చేసింది. హిజ్రాలపై నమోదైన సెక్షన్ల మేరకు రూ. 100 నుంచి రూ. 300 వరకు జరిమానాను వసూలు చేశారు. -
చౌటుప్పల్‌లో కార్డన్ సెర్చ్
చౌటుప్పల్ (మునుగోడు) : చౌటుప్పల్ మండల కేంద్రంలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి నాయకత్వంలో 150మంది పోలీసులు 10బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న బుడిగ జంగాల కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వ్యక్తిగత గుర్తింపు కార్డులు, వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. తెల్లవారుజామున పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి తనిఖీలు చేస్తుండడంతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులంతా ఇండ్లల్లోకి ఎందుకు వచ్చారో తెలియక మొదట ఆందోళన చెందారు. గంజాయి స్వాధీనం పోలీసుల కార్డన్ సెర్చ్‌లో కుంబ శ్రీరాములు ఇంట్లో అరకిలో గంజాయి లభించింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ధైర్యంగా గంజాయిని ఇంట్లో నిలువచేసుకోవడం పట్ల పోలీసులు విస్తుపోయారు. శ్రీరాములును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అదే విధంగా సరైన పత్రాలు లేని 42ద్విచక్రవాహనాలు, 1కారు, 3ఆటోలు, 1సిలిండర్ పట్టుబడ్డాయి. కాలనీ పరిసరాల్లో మద్యం అమ్మే ముగ్గురు బెల్టు షాపు దుకాణాదారులను అదుపులోకి తీసుకున్నారు.అదే విధంగా మరో ఐదుగురు అనుమానితులను సైతం అదుపులోకి తీసుకున్నారు. నేరస్తులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకే : డీసీపీ ఈ ప్రాంతంలో ఇటీవల దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులు మండల కేంద్రంలోనే సంచరిస్తున్నారన్న సమాచారం తమకు అందింది. అందులో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించామని భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణకు కార్డన్ సెర్చ్ దోహదపడుతుందన్నారు. పాత, కొత్త నేరస్తుల గుండెల్లో గుబులు పుడుతుందని తెలిపారు. ప్రజలంతా సరైన ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, వాహనాల ఒర్జినల్ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్డన్ సెర్చ్‌లు నిరంతరం కొనసాగుతూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమకు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఏసీపీలు రామోజు రమేష్, శ్రీనివాసాచార్యులు, స్థానిక సీఐ వెంకటయ్య, ఎస్సై చిల్లా సాయిలు, వివిధ మండలాల సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేటలో 40 ద్విచక్రవాహనాలు.. సూర్యాపేటక్రైం : జిల్లా కేంద్రంలోని అన్నాదురైనగర్‌లో మంగళవారం తెల్లవారు జామున డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ శంకర్ ఆధ్వర్యంలో 150మంది సిబ్బందితో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ పాల్గొని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రకాశ్‌జాదవ్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన భద్రత, రక్షణ కల్పించడం, దొంగతనాలు నివారించడం, అక్రమకార్యకాలపాలు, సంఘ వ్యతిరేక చర్యలను అడ్డుకోవడం, అనుమానిత వ్యక్తుల గుర్తింపు, శాంతి భద్రతల రక్షణ, సంఘ వ్యతిరేక కార్యకలాపాల అదుపు చేయడము కోసమే జిల్లా వ్యాప్తంగా నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్డన్‌సెర్చ్ నిర్వహించేటప్పుడు ప్రజలు ఆందోళన చెందవద్దని, పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమానిత వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలపాలన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 40 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
బీఎస్ఎఫ్లో ఇంటిదొంగల కలకలం
న్యూఢిల్లీ : దేశ భద్రతలో కీలక పాత్ర పోషించే సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో ఇంటిదొంగల వ్యవహారం కలకలం రేపుతున్నది. శత్రుదేశాల ఏజెంట్లు, అసాంఘిక శక్తులతో కుమ్మక్కైన కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల వెలుగుచూడటంతో అధికారులు అంతర్గత నిఘాను పటిష్టం చేశారు. విలాసవంమైన జీవనం గడుపుతూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై కన్నేసి ఉంచాలని, వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఈమేరకు 2017 సంవత్సరానికి గానూ అనుమానితుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇటీవలే బంగ్లాదేశ్ సరిహద్దులో ఉగ్రవాదులకు సహకరిస్తోన్న బీఎస్ఎఫ్ కమాండింగ్ అధికారిని సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అతని వద్ద నుంచి 45 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2.5 లక్షల సిబ్బంది కల్గిన బీఎస్ఎఫ్ ప్రతిష్టను కాపాడటం కోసమే ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతియడానికి కాదని స్పష్టం చేశారు. -
హెల్మెట్ లేకపోతే అరకిలోమీటర్ నడవాల్సిందే!
ఆగ్రా : హెల్మెట్ లేకుండా ప్రయాణించే ద్విచక్రవాహనదారులకు ఉత్తరప్రదేశ్ పోలీసులు వింత శిక్షలను విధిస్తున్నారు. ఎన్ని ఫైన్లు విధించినా ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో మార్పురాకపోవడంతో ఆగ్రా పోలీసులు వినూత్న కార్యాచరణను రూపోందించారు. హెల్మెట్ లేకుండా పట్టుబడ్డ వారిని, బైక్ తో సహా 500 మీటర్లు(అరకిలోమీటర్) నడవాలని సూచిస్తున్నారు. ఈ విధానంపై ఇప్పటికే పలు ప్రచార కార్యక్రమాలను చేపట్టిన పోలీసులు గత బుధవారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఈ చర్యతో వారి ఆరోగ్యం బాగుండటమే కాకుండా బైకర్స్‌లో మార్పు వస్తుందని, ఇది శిక్ష కాదని ఆగ్రా సీనియర్ ఎస్పీ అమిత్ పథక్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇప్పటికే హెల్మెట్ ధరించినవారికే పెట్రోల్ పోయాలని ఆదేశించిన పోలీసులు.. రోడ్డుభద్రతా ప్రమాణాలపై పాఠశాల, కాలేజీల్లో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఆగ్రాలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ ప్రమాదాలను తగ్గించేందు పోలీసులు కృషి చేస్తున్నారు. -
సలామ్ ఢీ డాగ్స్
-
మూవీ మ్యాటర్స్
-
ఈ వారం స్పెషల్ డ్రైవ్ కేసులు 7,166
అనంతపురం సెంట్రల్: జిల్లాలో వారం రోజులుగా చేపట్టిన స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన 7,166 మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. ఇందులో మైనర్లు 294 మంది ఉన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన 195మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. సెల్‌ఫోన్‌డ్రైవింగ్, డ్రైవింగ్‌లైసెన్స్‌లు లేకుండా నడిపిన, త్రిబుల్‌రైడింగ్, అధికలోడ్‌తో వెళ్లేవారిని గుర్తించి కేసులు నమోదుచేశామన్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడుపుతున్న 1600 మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. 10వేలమంది కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుశాఖ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ రోడ్డు ప్రమాదాలు అక్కడక్కడ జరుగుతుండడం బాధాకరమన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చునని తెలిపారు. ప్రజలు సహకరించాలని, వాహనాలు నడిపే సమయంలో ఓసారి ఆలోచించాలని కోరారు. -
ఖాకీ సైన్యంలో అశ్వికా దళం
-
మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక డ్రైవ్
- వారంలోపు 1.55 లక్షల నిర్మాణాలు పూర్తి చేయాలి – ప్రతిరోజూ 21,700 నిర్మించాలి – అధికారులకు కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశం అనంతపురం అర్బన్: జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. వారంలోపు 1,55,834 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికావాలన్నారు. ప్రతి రోజూ 21,700 నిర్మించాలన్నారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా సంబంధిత అ«ధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం మరుగుదొడ్ల నిర్మాణంపై ఆయన కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, డీఆర్డీఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పక్కా ప్రణాళిక రూపొందించి మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓ, ఈఓఆర్డీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, ఏపీఓ, ఏపీఎం, ఏఈఓలను భాగస్వాములను చేయాలన్నారు. ఒక్కో అధికారికి రెండు లేదా మూడు గ్రామ పంచాయతీలను అప్పగించాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని, పూర్తి బాధ్యత వీరిపైనే ఉంటుందన్నారు. ఈనెల 8న ప్రతి పంచాయతీలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ఆవశ్యకతను తెలియజేయాలన్నారు. 9న నిర్మాణానికి అవసరైన ఇటుకులు, సిమెంట్, ఇసుక, తదితర సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని, 10వతేదీ నుంచి పనులు ప్రారంభించాలన్నారు. రోజూ 21,700 నిర్మాణాలు పూర్తవ్వాలన్నారు. వీటి పురోగతిపై ప్రతి రోజూ టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తానన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు, డీఈలు కూడా తమ పరిధిలో రెండు లేదా మూడు పంచాయతీల బాధ్యత తీసుకొని నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. పూర్తయిన వాటిని జియోట్యాగింగ్ చేసి, అప్లోడ్ చేయాలన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరేరాంనాయక్, డీఆర్డీఏ, డ్వామా పీడీలు వెంకటేశ్వర్లు, నాగభూషణం, జెడ్పీ సీఈఓ సూర్యానారాయణ, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫిట్నెస్ మంత్ర 30th July 2017
-
ఫిట్నెస్ మంత్ర 29th July 2017
-
తాగి తోలితే జైలుకే..
– ఐపీసీ సెక్షన్లతో కేసు నమోదు – పట్టుబడిన వాహనాలు కోర్టులో అప్పగింత కర్నూలు: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. డీజీపీ నండూరి రామ్మోహన్రావు ఆదేశాల మేరకు జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ విస్తృతం చేసేందుకు కార్యచరణ సిద్దం చేశారు. ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర నేతృత్వంలో కర్నూలులో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టారు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందు బాబులు పట్టుబడితే మోటారు వాహనాల యాక్ట్ అమలు చేసేవారు. వాహనాలు కూడా ట్రాఫిక్ స్టేషన్లో ఉంచుకొని కోర్టులో అపరాధ రుసుం చెల్లించిన వెంటనే ఎవరి వాహనాలు వారికి అప్పగించే వారు. అయితే కొత్తగా ఐపీసీ సెక్షన్లు కూడా మద్యం బాబులపై అమలు చేయనున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి మద్యం బాబులకు సినిమా చూపించే కార్యచరణను సిద్ధం చేశారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే ఇకపై వాహనాలను నేరులో కోర్టులో హాజరు పరుచనున్నారు. మద్యం సేవించిన వ్యక్తిపై చార్జీషీటు నమోదు చేస్తారు. వాయిదాలకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో పట్టుబడిన మద్యం బాబుల నుంచి రూ.2వేలు అపరాద రుసుం కింద వసూలు చేసేవారు. అయితే కొత్తగా అమలు చేయనున్న ఐపీసీ సెక్షన్లతో జైలు శిక్షతో పాటు రూ.5 వేల వరకు అపరాధ రుసుం విధించే అవకాశం ఉంది. ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు నగరంలోని ముఖ్య కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించారు. ఆర్ఎస్ఐలు జయప్రకాష్, ప్రతాప్, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వెంకటేశ్వరరావు, పరహత్ఖాన్ నేతృత్వంలో ఒక బృందం, ఆయా స్టేషన్ల పరిధిలోని ఎస్ఐల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా కార్యచరణ రూపొందించారు. నంద్యాల, ఆదోని, ఆత్మకూరు, డోన్ వంటి ముఖ్య పట్టణాల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేందుకు కార్యచరణ సిద్దమైంది. -
బడి బస్సులపై రవాణా శాఖ కొరఢా
- రెండవ రోజు కొనసాగిన తనిఖీలు - సామర్థ్య పరీక్షలు చేయించుకోని 25 బస్సులు సీజ్ కర్నూలు : కళాశాలలు, పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే బస్సులపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. రెండవ రోజు మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. ఇన్చార్జి డీటీసీ బసిరెడ్డి ఆదేశాల మేరకు ఎంవీఐలు శేఖర్‌రావు, వరప్రసాద్, ఏఎంవీఐలు రాణి, కె.వి.ఎల్.ఎన్.ప్రసాద్, శ్రీనివాసులు తదితరులు కర్నూలులో తనిఖీలు చేపట్టారు. ఆదోని, డోన్, నంద్యాల, ఆత్మకూరు ప్రాంతాల్లో కూడా ఆ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు పది బస్సులు, రెండవ రోజు 15 బస్సులను సీజ్ చేశారు. సర్టిఫికెట్లు సరిగా లేకపోవడం, అనుమతులు, సామర్థ్య పరీక్షలు చేయించుకోకపోవడం, బస్సులో విద్యార్థులకు సరైన వసతులు కల్పించకపోవడం వంటి కారణాలపై వాహనాలను సీజ్ చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్
విజయనగరం టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాన కూడళ్లు, రహదారుల వద్ద నిఘా పెంచింది. మద్యం మత్తులో డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా రాకపోకలు సాగిస్తున్నవారిపై కేసులు నమోదు చేయడంతో పాటు భవిష్యత్‌లో అలా చేయకుండా అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి సుమారు 44 లక్షల రూపాయల అపరాధ రుసుం వసూలు చేశారు. ఇటీవల కంటోన్మెంట్ వద్ద మద్యం మత్తులో స్కూల్ విద్యార్థులను ఢీకొన్న ఆటో డ్రైవర్ నమ్మి రమణకు రూ. 3 వేల జరిమానతో పాటు రెండు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. రాత్రి వేళల్లో కూడా .. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రాత్రి వేళల్లో కూడా పోలీసులు గస్తీ కాస్తున్నారు.ఫేస్‌వాష్ పేరుతో పలు స్టేషన్ల పరిధిలో ఉన్న హైవేలపై వచ్చే లారీలను నిలుపుదల చేసి డ్రైవర్ల ముఖం కడిగించిన తర్వాత లారీలను పంపిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్నట్లైతే నేరుగా జైలుకే పంపిస్తున్నారు. పగటి పూట అవగాహన ప్రతి పోలీస్ అధికారి పగటి పూట ఆయా ప్రధాన జంక్షన్లలో మద్యం మహమ్మారి వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు. అలాగే భవిష్యత్‌లో మద్యం సేవించి డ్రైవింగ్ చేయనని ప్రమాణం చేయిస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత వాహన తనిఖీలు చేపట్టి మద్యంబాబులు పట్టుబడితే కేసులు నమోదు చేసి నేరుగా జైలుకు పంపిస్తున్నారు. -
ఓటరు నమోదుకు స్పెషల్ డ్రైవ్
విజయనగరం కంటోన్మెంట్: ఓటరు నమోదుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డీఆర్వో శ్రీలత చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 18–21 ఏళ్లలోపు యువతను గుర్తించి ఓటు నమోదు చేసేందుకు జూలై 1 నుంచి 31 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రస్థాయి నుంచి బీఎల్ఓల వరకు అధికారులు ప్రజల ఇంటికి వెళ్లి ఓటర్లను తొలగించడం, కొత్త ఓటర్లను చేర్చడం లాంటి పనులు చేయాలన్నారు. ఈ మేరకు ఈ మధ్య కాలంలో విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. వివిధ కాలేజ్‌ల ప్రిన్సిపాల్స్‌కు కూడా ఓటరు నమోదుపై ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల సెల్ విభాగం పర్యవేక్షకురాలు వైఆర్కే వాణి, టీడీపీ తరుపున ఐవిపి రాజు, వైఎస్సార్ సీపీ తరపున ఎస్‌వివి రాజేష్, ఎం. అప్పలనాయుడు, బీఎస్పీ తరుపున ఆర్జి శివప్రసాద్, సీపీఎం తరుపున రెడ్డి శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
బేజారువాడ
-
హైదరాబాద్‌లో బైక్ రేస్‌లు:9 బైక్‌లు సీజ్
-
బినామీలను ఏరేద్దాం!
రేషన్ డీలర్లపై స్పెషల్ డ్రైవ్ సాక్షి, హైదరాబాద్: చౌక ధరల దుకాణాల సంస్కరణలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. బినామీ రేషన్ దుకాణాల వల్ల ప్రజాపంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై ఆ శాఖ యంత్రాంగం నిఘా పెట్టింది. దీనిలో భాగంగా బినామీ డీలర్లను గుర్తించే పనిలో ఆ శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని రంగంలోకి దింపింది. బినామీ రేషన్ డీలర్ల ఏరివేత పైలెట్ ప్రాజెక్టును గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రేషన్ షాపుల్లో చేపట్టనున్నారు. పౌరసరఫరాల కమిషనర్ సి.వి.ఆనంద్ తెలిపిన వివరాల మేరకు, బినామీల ఏరివేతకు ఆయా ఏసీఎస్ఓ ఆఫీసులకు చెందిన ఏరియా ఇన్స్పెక్టర్లు అన్ని రేషన్ షాపుల్లో తనిఖీలు చేస్తారు. డీలర్‌కు జారీ చేసిన ఫారం బితో పాటు, షాపు నిర్వహణ తీరు తెన్నులను పరిశీలిస్తారు. వారు డీలర్లకు ఇచ్చిన పత్రాలను తమ ఆఫీసులోని పత్రాలతో సరిపోలుస్తారు. ఈ పని పది రోజుల్లో పూర్తి చేస్తారు. ఈపాస్ మిషన్‌లో డీలర్ వ్యాపారం చేస్తున్నాడా, లేదా అని నిర్ధారణ చేసే సౌకర్యం కల్పించనున్నారు. ఈ మేరకు కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రేషన్ షాపుల పనితీరుపై గురువారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా డీసీఎస్ ఓలు, ఏసీఎస్ఓలు, పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమీక్ష జరి పారు. కాగా 6 నెలలుగా రేషన్ తీసుకోని లబ్ధిదారుల కార్డులను రద్దు చేయనున్నారు. -
బంజారాహిల్స్‌లో స్పెషల్ డ్రైవ్
► రేసింగ్‌లకు పాల్పడుతున్న పలువురు అరెస్ట్ ► 13 స్పోర్ట్ బైక్స్ స్వాధీనం హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ.. ఇతర వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న పలువురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 13 స్పోర్ట్స్ బైక్‌లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. అదుపులో తీసుకున్న వారిలో పలువురు మైనర్లు ఉన్నారు. వారందరికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు బంజారాహిల్స్ సీఐ విద్యాసాగర్ తెలిపారు. -
జిమ్‌లపై త్వరలో స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్: త్వరలోనే వ్యాయామశాలపై ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. రెండు నెలల్లోగా ప్రతి జిమ్‌లో ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ ఉండితీరాలని తెలిపారు. లేదంటే కఠినచర్యలుంటాయని హెచ్చరించారు. తమ కమిషనరేట్ పరిధిలోని జిమ్‌లకు ఈ మేరకు సర్క్యులర్ జారీ చేశామన్నారు. ప్రతి జిమ్ యజమాని తమ కమిషనరేట్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. స్త్రీ, పురుషులకు వేర్వేరు జిమ్ ఇన్స్ట్రక్టర్లను నియమించుకోవాలని తెలిపారు. -
మాటే మంత్రం..
-
పంచతంత్రం 17th February 2017
-
కృష్ణానదిలో దొంగలు పడ్డారు..!
-
ధర్డ్ డిగ్రీ చదువులు
-
సాక్షి ఆరోగ్యమస్తు
-
డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే జైలుకే..
►కనీసం రెండు రోజులైనా తప్పనట్లే... ►న్యాయ విభాగంతో పోలీసుల భేటీ ►నగరంలోని స్థితిగతులపై వివరణ ►నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహణ సాక్షి, సిటీబ్యూరో: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా దూసుకుపోదాం...ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే రూ.వందో, రూ.రెండొందలో ఇచ్చి వచ్చేద్దాం...అనుకుంటున్నారా? ఇకపై అలా కుదరదు. మంగళవారం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చిక్కితే వారిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. కోర్టులు కనీసం రెండు రోజుల జైలుశిక్ష విధించనున్నాయి. సోమవారం నగర ట్రాఫిక్ పోలీసులు– న్యాయ విభాగం మధ్య జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంఎస్‌జే రాధారాణి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నగరంలోని ట్రాఫిక్ కోర్టుల న్యాయమూర్తులు, ట్రాఫిక్ విభాగం అధికారులు పాల్గొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌లకు సంబంధించి మంగళవారం నుంచి ఆర్టీఏ అధికారులతో కలిసి ఆటోలు, ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ చేయనున్నట్లు డీసీపీ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఇదీ నగరంలోని సీన్... గత ఏడాది ఆఖరి నాటికి నగరంలోని వాహనాల సంఖ్య 50 లక్షలు దాటింది. అయితే సిటీలో ఉన్న డ్రైవింగ్ లైసెన్సుల సంఖ్య 20 లక్షలకు మించట్లేదు. మొత్తం వాహనాల్లో టూ వీలర్స్ సంఖ్య 45 లక్షల వరకు ఉండగా... ఈ తరహా లైసెన్సులు కేవలం 10 లక్షలే జారీ అయ్యాయి. మరోపక్క గత ఏడాది ప్రమాదాల్లో మృతుల సంఖ్య 371గా ఉండగా... వీరిలో 190 మంది వరకు ద్విచక్ర వాహనచోదకులే ఉన్నారు. వీరిలో 80 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్సులు లేకుండానే వాహనాలతో రోడ్లపైకి వచ్చి మృత్యువాతపడ్డారు. ఈ గణాంకాలను న్యాయ విభాగానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన ట్రాఫిక్ విభాగం అధికారులు సిటీలోని పరిస్థితుల్ని కళ్లకు కట్టారు. మరోపక్క గత నెల 22న పాతబస్తీలోని షంషేర్‌గంజ్ ప్రాంతంలో ఓ ఆటో జంగయ్య ప్రాణాలు తీసింది. శనివారం తాడ్బంద్ చౌరస్తా ప్రాంతంలో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదం ఇద్దరు విద్యార్థుల్ని బలిగొంది. ఈ రెండు ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లకు లైసెన్స్ లేదు. యాక్సిడెంట్స్ వీడియోలను న్యాయమూర్తులకు చూపించిన ట్రాఫిక్ పోలీసులు వాస్తవాలను వారి దృష్టికి తీసుకువెళ్ళారు. విదేశాల్లో అయితే ఇలా... నగర ట్రాఫిక్ విభాగం అధికారులు లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై ఏడాదిన్నరగా అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. వీరికి న్యాయస్థానాలు రూ.1000 వరకు జరిమానాలు విధిస్తున్నాయి. లైసెన్స్ లేని వాహనచోదకులపై ఇతర దేశాల్లో తీసుకుంటున్న చర్యల్నీ ఈ సమావేశంలో చర్చించారు. అమెరికా, దుబాయ్‌ల్లో ఇలా చిక్కిన వారు విదేశీయులైతే వారిని స్వదేశాలకు బలవంతంగా తిప్పిపంపుతారు. జరిమానాలు సైతం 10 వేల నుంచి 20 వేల డాలర్లు, ఏడాది నుంచి రెండేళ్ళ వరకు జైలు శిక్షలు విధిస్తారు. భారత మోటారు వాహనాల చట్టం ప్రకారమూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ చిక్కిన వారికి గరిష్టంగా మూడు నెలల జైలు శిక్ష విధించే ఆస్కారం ఉంది. ఈ వివరాలను న్యాయ విభాగానికి వివరించిన ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నుంచి ఇలాంటి వాహనచోదకులకు కనీసం రెండు రోజుల జైలు శిక్ష విధించాలని కోరారు. దీనికి న్యాయమూర్తులు అంగీకరించారని డీసీపీ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. కాగా జైలుశిక్ష పడిన వారి వివరాలు ఆధార్ సంఖ్యతో సహా డేటాబేస్ ఏర్పాటు చేస్తామంటున్నారు. పాస్‌పోర్ట్, వీసాలతో పాటు ప్రభుత్వ, కొన్ని ఇతర ఉద్యోగాలకు పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి. కాబట్టి వాహనదారులు జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ వెరిఫికేషన్ నివేదికతో పాటు డేటాబేస్‌లో సరిచూడటం ద్వారా సదరు వ్యక్తికి ఈ శిక్ష పడిందని పోలీసులు సంబంధిత శాఖకు నివేదించనున్నారు. దీని ఆధారంగా జైలుకు వెళ్ళిన ఉల్లంఘనులకు పాస్‌పోర్ట్, వీసా, ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. లెర్నింగ్ లైసెన్స్‌తో కుదరదు ‘సిటీలో అనేక మంది వాహనచోదకులు లెర్నింగ్ లైసెన్స్ తీసుకుంటున్నారు. దీన్ని దగ్గర పెట్టుకుని ఎవరికి వారు వాహనాలు నడుపుతూ రోడ్లపైకి వస్తున్నారు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం. లెర్నింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తి తనంతట తానుగా వాహనం నడుపకూడదు. ఓ వ్యాలిడ్ లైసెన్స్ కలిగిన వారి పర్యవేక్షణలోనే నడపాలి. ద్విచక్ర వాహనమైతే లెర్నింగ్ లైసెన్స్ కలిగిన వారి వెనుక, తేలికపాటి వాహనమైతే ఆ వాహనంలో వ్యాలిడ్ లైసెన్స్ హోల్డర్ ఉండాల్సింది. లెర్నింగ్ లైసెన్స్ కలిగిన వారి వాహనాలకు కచ్చితంగా ‘ఎల్’ బోర్డ్ ఉండాలి. వీటిలో ఏది లేకపోయినా అది లైసెన్స్ లేకుండా వాహనం నడపటంతో సమానమే’. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ -
స్ప్రింక్లర్ల పంపిణీపై స్పెషల్‌డ్రైవ్
అనంతపురం అగ్రికల్చర్ : నెల రోజుల్లోగా కనీసం ఐదు వేల హెక్టార్లకు స్ప్రింక్లర్లు (తుంపర) సెట్లు ఇవ్వడానికి వీలుగా స్పెషల్‌డ్రైవ్ చేపట్టి అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు, డీడీలు సేకరించాలని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) పీడీ ఎం.వెంకటేశ్వర్లు ఆదేశించారు. స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో శనివారం ఏపీడీలు ఆర్.విజయశంకరరెడ్డి, జి.చంద్రశేఖర్, ఎంఐడీసీ సత్యనారాయణమూర్తితో కలిసి ఎంఈ ఇంజనీర్లు, ఎంఐఏవోలు, కంపెనీ డీసీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హంద్రీ–నీవా, హెచ్చెల్సీ కాలువ పరివాహక ప్రాంతాల్లో నీటి వసతి కలిగిన రైతులకు తక్షణం 50 శాతం రాయితీతో స్ప్రింక్లర్లు సెట్లు అందజేస్తామన్నారు. ప్రధానంగా ఉరవకొండ, గుంతకల్లు, రాప్తాడు తదితర నియోజక వర్గాల పరిధిలో హంద్రీ–నీవా కాలువలకు నీళ్లు వదలడంతో స్ప్రింక్లర్లు సెట్లు ఉపయోగపడుతాయన్నారు. రైతులు తమ వాటాగా రూ.9,850 డీడీ రూపేణా చెల్లిస్తే 25 పైపులు, ఐదు గన్స్ ఇస్తామన్నారు. డీడీ కట్టిన ఐదు రోజుల్లోగా పొలాల్లో బిగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 17,071 హెక్టార్లకు సరిపడా డ్రిప్ యూనిట్లు ఇచ్చామన్నారు. మంజూరైన రైతులకు పది రోజుల్లోపు వంద శాతం యూనిట్లు అమర్చి ట్రయల్‌రన్ నిర్వహించాలని ఆదేశించారు. బిజినెస్ ఆఫ్ క్వాంటిటీ (బీవోక్యూ) పూర్తయిన దరఖాస్తులకు సంబంధించి రైతుల చేత డీడీలు కట్టించాలన్నారు. సెల్ ద్వారా సమాచారం ఇస్తే సరిపోదని, రైతులను కలిసి విషయం చెప్పి డీడీలు కట్టించాలన్నారు. లేదంటే రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రిప్ నిర్వహణ, ఫర్టిగేషన్ తదితర అంశాల గురించి రైతులకు విస్తృత ప్రచారం కల్పించి ప్రోత్సహించడానికి వీలుగా ప్రతి పంచాయతీకి ఒక ఉద్యాన రైతును ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడానికి వారంలోగా జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామంలోని మిగతా రైతులకు అవగాహన కల్పించే ఆసక్తి, సేవాతత్పరత కలిగిన మంచి రైతును ఎంపిక చేసి వారి పేర్లు, ఫోన్ నెంబర్లు వారంలోగా అందజేయాలన్నారు. ఎంపీఈఓలను అనుసంధం చేసి క్షేత్రస్థాయిలో ఉద్యాన రైతులకు మెరుగైన సేవలు అందజేయడానికి అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. -
హాలీవుడ్ ఎటాక్
-
సినిమా 2016 : హీరో నెం.1
-
20 నుంచి అక్రమ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు
నెల్లూరు (టౌన్): జిల్లాలో అక్రమంగా తిరుగుతున్న వాహనాలపై రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి ప్రత్యేక తనిఖీలను నిర్వహించనున్నట్లు రవాణా శాఖ ఉప రవాణా కమిషనర్ శివరామ్‌ప్రసాద్ తెలిపారు. రవాణా శాఖ కార్యాలయంలో జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో పనిచేస్తున్న మోటార్ వాహనాల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పన్ను చెల్లించని 10 వేల వాహనాలకు షోకాజ్ నోటీసులను జారీ చేయనున్నట్లు చెప్పారు. జాతీయ రహదారిపై వెంకటాచలం, కావలి ప్రాంతాల్లో నెలకు రెండుసార్లు రాత్రి వేళ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా కాంట్రాక్ట్ క్యారేజీలు, ఓవర్‌లోడ్ వాహనాలు, డ్రంకెన్ డ్రైవ్‌పై తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. త్రైమాసిక పన్ను చెల్లించని వాహనాలపై వారంలో రెండు పట్టణాల్లో బృందాలుగా తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరుతో పాటు కావలి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఉదయగిరి, తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తామని చెప్పారు. ఫైనాన్స్ సీజ్ చేసిన వాహనాలకు కూడా త్రైమాసిక పన్ను చెల్లించాలని ఇప్పటికే నోటీసులను జారీ చేసినట్లు చెప్పారు. పన్ను చెల్లించని వాహనదారులు తక్షణమే ఆయా కార్యాలయాల్లో పన్ను చెల్లించాలని, లేని పక్షంలో రెండింతల అపరాధ రుసుముతో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు తనిఖీలు కొనసాగుతాయన్నారు. మోటార్ వాహనాల అధికారులు సీతారామిరెడ్డి, ఆదినారాయణ, బాలమురళీకృష్ణ, మురళీమోహన్, రామకృష్ణారెడ్డి, జయప్రకాష్, జకీర్, మాధవరావు, అసిస్టెంట్ మోటార్ వాహనాల అధికారులు కరుణాకర్, పూర్ణచంద్రరావు, రవికుమార్, ప్రభాకర్, ఏఓలు విజయ్‌కుమార్, సాయి, కిషోర్ పాల్గొన్నారు. -
హోటళ్లపై ప్రత్యేక డ్రైవ్
హైదరాబాద్: తమ సర్కిల్ పరిధిలోని హోటళ్లపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తున్నామని జీహెచ్ఎంసీ దక్షిణ మండలం సర్కిల్-5ఎ,బీ డిప్యూటీ కమిషనర్లు డాక్టర్ ఎన్.యాదగిరిరావు తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ... చార్మినార్ మక్కా మసీదు సమీపంలోని నిమ్రా హోటల్లో అపరిశుభ్రత నెలకొందని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 3వ తేదీన తనిఖీలు చేపట్టామన్నారు. నిమ్రా హోటల్‌ను తనిఖీలు చేయగా అపరిశుభ్రతతో పాటు నాణ్యత లోపించిన తినుబండారాలు లభ్యమైనట్లు వెల్లడించారు. అన్ని హోటళ్లపై ప్రత్యేక డ్రై వ్ చేపట్టి సమస్యలున్న వాటిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడ హోటళ్లల్లో అపరిశుభ్రత, తినుబండారాల్లో నాణ్యత లోపించినట్లు ఉంటే తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. -
స్వర వాణి
-
ప్లాస్టిక్‌పై స్పెషల్ డ్రైవ్
► పలు దుకాణాల్లో తనిఖీలు.. క్యారీబ్యాగులు సీజ్ ► ఇద్దరు వ్యాపారులకు రూ.5 వేల చొప్పున జరిమానా కోల్‌సిటీ : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్లాస్టిక్ క్యారీబ్యాగుల నిషేధంపై సోమవారం శానిటేషన్ విభాగం అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. స్థానిక లక్ష్మినగర్, మేదరిబస్తా, కళ్యాణ్‌నగర్, తిరుమల్‌నగర్ తదితర ప్రాంతాలలోని దుకాణాలను శానిటరీ ఇన్స్పెక్టర్లు పవన్‌కుమార్, రవీందర్‌తోపాటు సిబ్బంది ఆడేపు శ్రీనివాస్, ఈసూబ్, రాజు, సుగుణాకర్, తిరుపతి, మల్లేష్ తనిఖీలు నిర్వహించారు. లక్ష్మినగర్‌లోని జయశ్రీ కిరాణంలో లభించిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను సీజ్ చేసి, యజమాని రాజేందర్‌కు రూ.5వేల జరిమానా విధించా రు. తిరుమల్‌నగర్‌లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు విక్రరుుంచే మరో గోదాంలో ఉన్న బ్యాగులను సీజ్ చేశారు. దుకాణం యజమాని భాస్కర్‌కు రూ.5వేలు జరిమానా విధించారు. సీజ్ చేసిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ క్యారీబ్యాగులను వినియోగించడం నిషేధమన్నారు. ప్లాస్టిక్ వస్తువులను విక్రరుుంచాలంటే ముందుగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వ్యాపారస్తులు నెలనెలా లెసైన్‌స ఫీజు చెల్లించి రెన్యువల్ చేరుుంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ విక్రయాల నిషేధంపై నిరంతరం తనిఖీలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే వ్యాపారస్తులందరికీ నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసులు తీసుకున్న వ్యాపారస్తులు వాటిని ఉల్లంఘించి విక్రయాలు జరుపుతుండడంతో జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించారు. అప్పటికీ విక్రయాలు నిలుపుదల చేయకపోతే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ఆదాయంపై దాగుడు మూతలు
• ఓవైపు పడిపోతోందనే ఆందోళన.. మరోవైపు పెంచుకునే అవకాశాలు • నోట్ల రద్దును అనుకూలంగా మలుచుకుంటే భారీ ఆదాయం • పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పెరిగిన వసూళ్లు • అన్ని శాఖల్లో బకారుుల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం పడిపోతోందని ఓ వైపు ఆందోళన వ్యక్తమవుతున్నా.. ప్రస్తుత పరిణామాలను అనువుగా మలుచుకుంటే ఆదాయం పెంచుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 24వ తేదీ వరకు ప్రభుత్వ ఫీజులు, చార్జీలు, పన్నులు, జరిమానాలన్నీ పాత కరెన్సీతో చెల్లించవచ్చంటూ కేంద్రం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలతో పాటు వివిధ కార్పొరేషన్లు తమ బిల్లులు, పన్నులు, బకారుుల వసూలు కు చేపట్టిన ప్రచారం విజయవంతమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆస్తి పన్ను, నల్లా బిల్లులు, ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో రూ.200కోట్లకు పైగా సమకూరారుు. రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజుల్లో గ్రామ పంచాయతీల్లో రూ.32 కోట్ల పన్నులు, పాత బకారుులు వసూలయ్యారుు.కార్పొరేషన్లు, మున్సిపాలిటీలన్నింటా పన్నుల వసూలు కోట్లలోకి చేరింది. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో వసూళ్లు రూ.7.55 కోట్లు దాటారుు. కరెంటు బిల్లుల చెల్లింపులకు సైతం పాత నోట్లు తీసుకుంటుండడంతో ఎస్డీపీసీఎల్ పరిధిలో ఈ నెల 11 నుంచి శుక్రవారం వరకు రూ.851 కోట్ల బిల్లులు వసూలయ్యారుు. సాధారణ రోజులతో పోలిస్తే వసూలు రెట్టింపు స్థారుుకి చేరిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోనూ బిల్లుల వసూలు వేగం పుంజుకుంది. ఈ పరిస్థితిని వినియోగించుకునేందుకు వాణి జ్య పన్నుల శాఖ కూడా రూ.1,194 కోట్ల బకారుుల వసూలుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. అందులో గత వారంలో రూ.184 కోట్లు వసూలైనట్లు అధికారులు ప్రకటించారు. డీలర్లు, బకారుుదారులకు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం పంపించి.. పెద్ద నోట్లు వినియోగించుకునేలా ఈ విభాగం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. వ్యాట్‌కు పెట్రోల్‌తో ఊరట రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా వ్యాట్ ద్వారా దాదాపు రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుం ది. నోట్ల రద్దుతో వ్యాపారాలన్నీ స్తంభించడంతో ఈ ఆదాయం తగ్గుతుందనే ఆందోళన వ్యక్తమైంది. కానీ పెట్రోల్ బంకుల్లో పాత పెద్ద నోట్లను వినియోగించే అవకాశమివ్వడంతో కొంత ఊరట లభిస్తోంది. నోట్ల రద్దు ప్రకటించిన తొలి మూడు రోజుల్లోనే 110 శాతం పెట్రోల్, 98 శాతం డీజిల్ అమ్మకాలు పెరిగారుు. రాష్ట్రానికి వచ్చే వ్యాట్‌లో సింహభాగం పెట్రోలియం, మద్యం అమ్మకాల ద్వారానే సమకూరుతుం ది. దీంతో ఈ నెలలో వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారుు. ప్రచారం లేకనే తగ్గిన రిజిస్ట్రేషన్లు నోట్ల రద్దు నిర్ణయం ప్రధానంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని దెబ్బతీసింది. 9, 10 తేదీల్లో పాత నోట్ల వినియోగంపై స్పష్టత లేకపోవటంతో ఈ శాఖపై ప్రభావం చూపింది. ఈ శాఖలో రోజుకు సగటున రూ.15 కోట్ల ఆదాయం వస్తుంది. నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన వెంటనే ఇది రూ.90లక్షలకు పడిపోరుుంది. తర్వాత క్రమంగా పెరిగింది. పెద్ద నోట్లతో చెల్లించగలిగే విషయంపై ప్రచారం చేస్తే ఈనెలలో రిజిస్ట్రేషన్ల ఆదాయానికి ఢోకా ఉండదనే అభిప్రాయాలున్నారుు. అరుుతే స్థిరాస్తి వ్యాపారం, నిర్మాణం రంగం కుదేలయ్యే పరిస్థితులు ఉండడంతో భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ల ఆదాయం బాగా తగ్గిపోతుందనే అంచనాలున్నారుు. -
ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్‌పై దృష్టి
• నేటి నుంచి 24 వరకు హెచ్ఎండీఏ స్పెషల్ డ్రైవ్ • ఫీజు కింద పాత కరెన్సీని ఆమోదించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: దాదాపు ఎనిమిది నెలల నుంచి నిరీక్షిస్తున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ పై హెచ్ఎండీఏ పూర్తి స్థారుులో దృష్టి సారించింది. ఈ నెల 16 నుంచి 24 వరకు పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. దీనిలో భాగంగా అధికారులు ఆయా తేదీల్లో క్షేత్రస్థారుు పరిశీలన చేయనున్నారు. ఫీజు చెల్లింపునకు పాత కరెన్సీని కూడా ఆమో దించి తద్వారా ఆదాయం పెంచుకునేందుకు హెచ్ఎండీఏ ఈ స్పెషల్‌డ్రైవ్ చేపట్టింది. ఆన్లైన్లో ఆర్కిటెక్ట్ వద్ద అప్డేట్ చేసిన షార్ట్ ఫాల్ డాక్యుమెంట్లను పరిశీలించి అర్హత ఉన్న వాటికి త్వరితగతిన క్లియరెన్స చేయ నున్నారు. దాదాపు హెచ్ఎండీఏకు వచ్చిన లక్షా 15వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో కేవలం వెరుు్యకి మాత్రమే ఇప్పటివరకు మోక్షం కలిగించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌తో పెండింగ్‌లో ఉన్న దాదాపు లక్షా 14 వేల దరఖాస్తుల్లో అర్హతలున్న వారికి క్లియరెన్స ఇవ్వడంపై హెచ్ఎండీఏ కమిషనర్ చిరం జీవులు దృష్టి సారించారు. గడిచిన ఎనిమిది నెలలుగా దరఖాస్తుల టెక్నికల్ స్క్రూటినీ, టైటిల్ వెరిఫికేషన్‌కు మాత్రమే పరిమితమైన అధికారులు తదుపరి చర్యలకు ఉపక్రమించ లేదు. దీంతో లక్షా 14 వేల దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉండిపోయారుు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎల్ఆర్ఎస్ దర ఖాస్తుల పరిశీలన ప్రక్రియను పరిశీలించి క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని చిరంజీవి నిర్ణరుుంచారు. ‘ఆయా జోనల్స్తో పాటు సర్కిళ్ల ఏసీపీలు దరఖాస్తులను పరిశీలించి సైట్ విజిట్ చేస్తున్నారు. అరుునా ప్రొసీ డింగ్స ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగు తోంది. ఏసీపీలు ప్రాసెస్ చేసినవి, షార్ట్ ఫాల్ ఉన్న దరఖాస్తులే 15 వేలకు పైగా ఉన్నారుు. వీరందరి నుంచి ఫీజు కట్టించి, ప్రొసీడింగ్‌స జారీ చేస్తాం. సిబ్బంది కొరత ఉన్నా అనుకున్న సమయానికి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి అర్హత గల వారికి అనుమతిస్తామని’ చిరంజీవి చెప్పారు. -
అమెరికా ఎన్నికలపై హల్ చల్
-
ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
– 40మంది మైనర్లు అదుపులోకి.. మహబూబ్‌నగర్ క్రైం : పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో శనివారం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పట్టణంలో పలు చోట్ల ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు నడుపుతున్న మైనర్లపై ప్రత్యేక దష్టి సారించారు. 13నుంచి 17ఏళ్ల వయస్సు కలిగిన అబ్బాయిలు త్రిబుల్ రైడింగ్ చేస్తూ 40మంది పట్టుపడ్డారు. అదేవిధంగా ఉదయం పూట మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 5మందిపై కేసులు నమోదు చేశామని, వాహనాలను సీజ్ చేశామని ఎస్ఐ శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం వారిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. తనిఖీలు రోజూ కొనసాగుతాయని అన్నారు. -
దుకాణం మూసేసినా.. పన్ను కట్టాల్సిందే!
* పాత బకాయిల వసూలుకు వాణిజ్యపన్నుల శాఖ నిర్ణయం * వచ్చే నెల 1 నుంచి స్పెషల్ డ్రైవ్ * పేరుకుపోయిన మొండి బకాయిలు రూ.5,200 కోట్లు * మూతపడ్డ పరిశ్రమలు, సంస్థలపై సర్కార్ దృష్టి * వసూళ్లపై సీటీవోలకు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: మూతపడ్డ సంస్థల నుంచి రావలసిన వేల కోట్ల రూపాయల పాత బకాయిలను వసూలు చేయాలని వాణిజ్యపన్నుల శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పాత బకాయిల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 వేలకు పైగా ఉన్న సంబంధిత సంస్థలు, వ్యక్తుల నుంచి దాదాపు పదేళ్ల నుంచి రూ.5,200 కోట్లు బకాయిల రూపంలో రావలసి ఉందని ప్రాథమికంగా లెక్క తేల్చారు. ఈ మేరకు మూతపడ్డ సంస్థలు, పరిశ్రమలతో పాటు దేశంలోని వివిధ కంపెనీలతో లావాదేవీలు జరిపి చేతులెత్తేసిన డీలర్ల వివరాలను సర్కిళ్ల వారీగా సంపాదించేందుకు ఇప్పటికే సీటీవోలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కమిషనర్లు సర్కిళ్లలోని సీటీవోల ద్వారా బకాయిలు వసూలు చేయాల్సి ఉంటుంది. కాగా రూ.5,200 కోట్ల బకాయిల్లో కేవలం హైదరాబాద్ నుంచే సుమారు రూ.4వేల కోట్ల వరకు రావలసి ఉందని సమాచారం. వ్యాట్‌కు ముందు.. తరువాత... దేశవ్యాప్తంగా 2005 ఏప్రిల్ నుంచి విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అమలులోకి వచ్చింది. అంతకు ముందు అమ్మకపు పన్ను వసూలు చేసేవారు. అయితే అమ్మకం పన్ను స్థానంలో వ్యాట్ అమలైన సమయంలో అప్పటి వరకు ఉన్న బకాయిల గురించి అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోలేదు. కొందరు డీలర్లు కూడా వ్యాట్ పరిధిలోకి రావడం ఇష్టం లేక వ్యాపారాలను మూసేసినట్లు ప్రకటించి, బకాయిలు చెల్లించలేదు. వ్యాట్ అమలులోకి వచ్చిన తరువాత కూడా కొన్ని పరిశ్రమలు, సంస్థలు తమ లావాదేవీల విషయంలో పారదర్శకంగా వ్యవహరించకుండా పన్ను ఎగవేతకే ప్రాధాన్యమిచ్చాయి. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన పరిశ్రమలు, సంస్థల ద్వారా లావాదేవీలు జరిపిన వేలాది మంది డీలర్లు కూడా మూతపడ్డ కంపెనీ (క్లోజ్డ్ కేస్) ఖాతాలో చేరిపోయారు. మూతపడ్డ, ఖాయిలా పరిశ్రమల విషయంలో వాణిజ్యపన్నుల శాఖ చూసీచూడనట్లుగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాట్‌కు ముందు, తరువాత ఇప్పటి వరకు మూతపడ్డ కేసుల ఖాతాలో రూ. 5,200 కోట్ల మేర పన్ను బకాయిలు పేరుకుపోయాయి. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ పాత బకాయిలపై అధికారులు సమీక్షించి, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాల వల్ల రావలసిన బకాయిలు మరో రూ. 4,000 కోట్ల వరకు ఉన్నప్పటికీ, వచ్చే నెల నుంచి స్పెషల్ డ్రైవ్ ద్వారా పాత బకాయిలను వసూలు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తాం: కమిషనర్ వాణిజ్యపన్నుల శాఖకు వ్యాట్, ఇతర పన్నుల రూపంలో రావలసిన మొండి బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. మూతపడ్డ వ్యాపారాలు, సంస్థలు, కంపెనీలకు సంబంధించి బకాయిలు ఉన్నవారు వెంటనే సంబంధిత సీటీవోలను సంప్రదించి, పన్నులు చెల్లించాలని సూచించారు. లేని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం కింద తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా వెనకాడబోమన్నారు. -
‘ఆటోమెటిక్’ బ్రేక్
సీఎండీ కార్యాలయం నుంచి ఆదేశాలు ట్రాన్స్ఫార్మర్లకు భారమంటూ కొర్రీలు ఆటోమెటిక్ స్టార్లర్లు తొలగింపుకు స్పెషల్‌డ్రైవ్ రైతుల్లో నిరసన జగిత్యాల అగ్రికల్చర్/సారంగాపూర్: ఇన్నాళ్లు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. దీంతో రైతులు వ్యవసాయ బావుల వద్ద జాగారాలు చేసేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రభుత్వం వ్యవసాయరంగానికి రోజుకు రెండు విడతల్లో తొమ్మిది గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తోంది. మధ్యాహ్నం ఆరుగంటలు, రాత్రి 3గంటలు ఇస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయమోటార్లకు రైతులు బిగించుకున్న ఆటోమెటిక్ స్టార్టర్లను తొలగించే పనిలో పడింది. ట్రాన్స్ఫార్మర్లపై భారం పడుతోందని అన్నదాతలపై ఒత్తిడిపెంచుతోంది. తొలగించుకోకుంటే ఏకంగా కేసుల నమోదు సిద్ధమవుతున్నారు ట్రాన్స్‌కో అధికారులు. ఈ మేరకు సీఎండీ కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. సెల్ఫ్స్టార్టర్ అంటే.. ఫ్యూజ్ బాక్స్‌లో ఆటోమెటిక్ స్టార్టర్ ఉంటుంది. మనిషి అవసరం లేకుండా కరెంట్ రాగానే విద్యుత్ మోటార్ సెల్ఫ్స్టార్టర్తో దానికదే ఆన్ అవుతుంది. దీంతో రైతులు రోజుకు రెండు మూడుసార్లు పొలం దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కేవలం బావిలో నీళ్లు ఉంటే చాలూ. ఆటోమెటిక్ స్టార్టర్ ధర కంపెనీలను బట్టి రూ.200–500 లోపే ఉంటుంది. ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో వ్యవసాయ బావి, బోరు ఉన్న ప్రతీ రైతు ఆటోమెటిక్ స్టార్టర్‌ను అవసరానికి మించి ఉపయోగిస్తున్నారు. ఎందుకు వినియోగంలోకి వచ్చాయి? తెలుగుదేశం పాలనలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ఆటోమెటిక్ స్టార్టర్ల వినియోగం పెరిగింది. తరచూ విద్యుత్తు పోతుండడం, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. గంటలో లెక్కకు మించి ట్రిప్ కావడంతో రైతులు పొలాల వద్దే పడుకునేవారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఆటోమెటిక్స్టార్టర్లను వినియోగంలోకి విరివిగా తీసుకొచ్చారు. ఆ తరువాత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో వ్యవసాయానికి ఏడుగంటల విద్యుత్‌ను ఉచితంగా అందించడం, దానికి తగినట్లు వర్షాలు కురవడంతో విద్యుత్ వినియోగంతోపాటు పంటల సాగువిస్తీర్ణం రెండింతలు పెరిగింది. దీంతో ఆటోమెటిక్ స్టార్టర్ల వినియోగం మరింత పెరిగింది. ఆటోమెటిక్ స్టార్టర్లతో నష్టమేమిటంటే..? రైతులు తమ పంటపొలాల్లో ఎక్కువగా 3హెచ్‌పీ విద్యుత్ మోటార్లను వినియోగిస్తున్నారు. ఒక్క 3 హెచ్‌పీ మోటార్‌కు విద్యుత్ సరఫరా రాగానే 8ఆంప్స్ విద్యుత్‌ను తీసుకుంటుంది. ఆ తర్వాత అది 3నుంచి 4ఆంప్స్ వరకు వచ్చి ఆగిపోతుంది. విద్యుత్తు సరఫరా రాగానే ఆటోమెటిక్ స్టార్టర్ల ద్వారా మోటార్లు ఏకకాలంలో ఆన్కావడంతో సబ్‌స్టేషన్‌లో ఎక్కువ లోడ్ పడుతుంది.సబ్‌స్టేషన్‌లో బ్రేకర్ ఆన్‌చేయగానే 200 ఆంప్స్ విద్యుత్ సరఫరా అయ్యేలా టెక్నికల్‌గా ఏర్పాటుచేస్తారు. ఆటోమెటిక్ స్టార్టర్లతో ఒక్కసారిగా సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా ఆన్‌చేయగానే 400 నుంచి 500 ఆంప్స్ వినియోగం జరిగి బ్రేకర్లు ట్రిప్ కావడం, ట్రాన్స్ఫార్మర్ల మీద అధిక భారం పడి ఫ్యూజ్‌లు పోతాయి. కొన్నిసార్లు పవర్ ట్రాన్స్ఫార్మర్లకు పెద్దఎత్తున మరమ్మతు వస్తున్నట్లు అధికారుల వాదన. మామూలు స్టార్టర్లుమాత్రమే ఉండాలంటూ ఆదేశాలు వచ్చాయంటూ చెబుతున్నారు. రైతులకు విద్యుత్ పంపిణీ వ్యవస్థ, ఆటోమెటిక్ స్టార్టర్లు, మాములు స్టార్టర్లపై సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించాలని డిస్కం అధికారులు భావిస్తున్నారు. తొలగింపు షురూ... ఆటోమేటిక్ స్టార్టర్లను సాధ్యమైనంత తొందరగా రైతులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేకుంటే కేసులు పెట్టనున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు గ్రామాల్లో డప్పు చాటింపు వేయిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే సారంగాపూర్ మండలం కొల్వాయి గ్రామంలో 20, లక్ష్మీదేవిపల్లిలో 35 ఆటోమెటిక్ స్టార్టర్లు తొలగించారు. ఈక్రమంలో లక్ష్మీదేవిపల్లి రైతులకు, అధికారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఇది అన్యాయం –ఎండీ. ఇబ్రహీం, సారంగాపూర్ తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా అన్న మాటేగానీ సరఫరా ఏ మాత్రం బాగాలేదు. ఆటోమెటిక్ స్టార్టర్లు తొలగిస్తే రైతులు పొలాల వద్దే పడుకోవాల్సి వస్తుంది. తరచూ కరెంటు పోతుంది. సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. అవగాహన కల్పిస్తున్నాం –కృష్ణయ్య, ఎలక్ట్రికల్ డీఈ, జగిత్యాల సెల్ప్స్టార్టర్లపై రైతులకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం. సెల్ఫ్స్టార్లర్లతో పడే సమస్యలను విద్యుత్ అధికారులు రైతులకు వివరిస్తున్నారు. ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ప్రభుత్వానికి దాదాపు లక్షకు పైగా ఖర్చు వస్తుంది. అధికారులు ఆలోచించాలి –టి.జీవన్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే ఆటోమేటిక్ స్టార్టర్లు తొలగిస్తే రైతులు ఇబ్బందులు పడుతారు. రాత్రి పూట పొలాల వద్దకు వెళ్తే పాములు, ఇతర జంతువులతో ప్రమాదాల బారిన పడతారు. తరచూ విద్యుత్పోవడంతో అన్నదాతలు పొలాల వద్దే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఆలోచించాలి. -
బరిలో దిగిన బాస్..
స్పెషల్ డ్రైవ్‌తో హడలెత్తించిన ఎస్పీ దుగ్గల్ 23 కేసులు నమోదు, భారీగా జరిమానా ఆదిలాబాద్ క్రైం : ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ స్వయంగా బరిలోకి దిగారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌరస్తాలో ఎస్పీ స్వయంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి హడలెత్తించారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు వాహనాలు తనిఖీ చేశారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించారు. లెసైన్సు, వాహన ధ్రువపత్రాలు, ఇన్సురెన్స్లేని వాహనాలకు జరిమానా విధించడంతోపాటు అసలే పత్రాలు లేని 23 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియమాలు పాటించి, రోడ్డు ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగస్వాములు కావాలని కోరారు. వాహనాలు అతివేగంగా నడపకూడదని, ఎదురుగా వాహనాలు వచ్చే సమయంలో ఓవర్‌టేకింగ్ చేయకూడదని సూచించారు. హెల్మెట్ ధరించడం తప్పని సరిచేస్తూ భారీ జరిమానాలు విధించేందుకు స్పెషల్‌డ్రైవ్‌లు నిర్వహిస్తామన్నారు. వాహనదారులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో పట్టణ సీఐలు వెంకటస్వామి, సత్యనారాయణ, ఎస్సైలు వేణుగోపాల్‌రావు, రాజలింగు, శ్రీనివాస్ ఉన్నారు. -
పత్తాలేని స్పెషల్ డ్రైవ్
సంగారెడ్డి మున్సిపాలిటీ: పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుకు ఈ నెల 2నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని మున్సిపల్ అధికారులు చెప్పినా ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. వర్షకాలంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటుందని, అంటువ్యాధుల తీవ్రంగా ఉటుందని అందుకు స్పెషల్ డ్రైవ్ చేసి పరిస్థితి చక్కదిద్దాల్సిందిగా ఇటీవల నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో సభ్యులు సూచించారు. ఆందుకు అనుగుణంగానే వార్డుల వారీగా ప్రతి రోజు రెండు వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ ఈనెల 2 నుంచి ప్రారంభిస్తామని ఇన్చార్జి కమిషనర్ పేర్కొన్నారు. కాని ఇంత వరకు ఏవార్డులో కూడా పారిశుద్ధ్య నివారణకు గాను చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోయింది. దీంతో పట్టణంలో పారిశుద్ధ్యం సమస్య తీవ్రంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ప్రధానంగా మురుగు( స్లమ్) కాలనీల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉందంటున్నారు. ఇప్పటికే పట్టణంలోని సంజీవ్‌నగర్‌కు చెందిన ఒక వ్యక్తి డెంగ్యూ బారిన పడి మృతి చెందిన సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవడంలో వైద్య సిబ్బంది, మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమైనట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ప్రధాన రహదారిపై ఉన్న మోర్ సూపర్ మార్కెట్ పక్కన మటన్, చికెన్ వ్యాపారులు వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేస్తుండడంతో కాలనీలో దుర్గంధం వస్తుందని, దీనికితోడు రాత్రిళ్లు దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మురుగు కాల్వలు సైతం లేకపోవడంతో వరద, డ్రైనేజీ నీరు ఇళ్ల మధ్యనే నిల్వ ఉంటున్నట్లు కాలనీకి చెందిన సుశీల తెలిపారు. ఈ విషయంపై కాలనీకి చెందిన తాము పలుమార్లు కమిషనర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదులు చేసినా తమ సమస్యను పరిష్కరించడంలేదన్నారు.. ఇప్పటికే వర్షం కారణంగా బురుద మయం కావడంతో పాటు నడువలేని పరిస్థితి నెలకొందన్నారు. మీరైన పట్టించుకోరూ.. తమ కాలనీలో నెలకొన్న కనీస సమస్యలను మీరైన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నా. తాము పలుమార్లు మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్లకు విన్నవించినా స్పందించలేదు. ఎమ్మెల్యేకు సైతం తెలిపాం. మురుగుకాల్వలను నిర్మించాలని కోరాం.. అయినా స్పందించలేదు. మీరైన దళిత కాలనీపై దృష్టి పెట్టాలి. - సుశీల,కాలనీవాసి సంజవ్నగర్ -
పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్
సంగారెడ్డి మున్సిపాలిటి: పారిశుద్ధ్యంపై దృష్టి సారించకుంటే వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఇప్పటికైన అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తేగాని సమస్య పరిష్కారం కాదని మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి పేర్కొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్య చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. సర్వసభ్య సమావేశం శనివారం స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు . కాగా వార్డుల అభివృద్ధి కోసం నిధులను కేటాయించడంలో పాలకవర్గ సభ్యులు పక్షపాతం చూపుతున్నారని ప్రతిపక్ష బీజేపీ సభ్యులు అరోపించారు. వార్డు కౌన్సిలర్లు బిపాష, మల్లేశం, జహెనాథ్బేగం, యాకూబ్అలీ, ఆరీఫ్‌లు పారిశుద్ధ్య సమస్యపై తీవ్రంగా స్పదించారు. అధికారులు ప్రతి రోజు వివిధ వార్డులను పరిశీలించాలని, వార్డుకు ముగ్గురు చొప్పున పారిశుద్ధ్య కార్మికులను కేటాయించాలని సభ్యులు సూచించారు. ఈ విషయమై ఇన్చార్జి కమిషనర్ స్పందిస్తూ తాను ఇప్పటికే పారిశుద్ధ్య సమస్యపై దృష్టి పెట్టినట్లు తెలతిపారు. అగస్టు1 నుంచి 14 వరకు స్పెషల్ డ్రైవ్ చేపడుతామని తెలిపారు . 20వ వార్డు కౌన్సిలర్ ప్రదీప్ కరెంట్ ఆఫీస్ వెనుకవైపున రోడ్డు గుంతలు పడినందున వాటిని పూడ్చి వేయాలని సూచించారు. 19వ వార్డు కౌన్సిలర్ పద్మ కల్వకుంటలో బోర్‌వేసి 8 నెలలైనా ఇప్పటి వరకు మోటర్‌ను బిగించడం లేదన్నారు. తన వార్డులో ఎప్పుడు డ్రైనేజీలను క్లీన్ చేయడం లేదని, కార్మికులను అడిగితే మాత్రం తమకు రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న పట్టించుకోరా? అంటూ తమనే నిలదీస్తున్నారని తెలిపారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మొదట ఆఎస్ఐకి బకాయిపడిన డబ్బులను చెల్లించామని, అందువల్లే వేతనాలు చేల్లించడంతో జాప్యం జరిగిందని కమిషనర్ వివరణ ఇచ్చారు. పట్టణంలో దోమలు బెడద అధికంగా ఉందని మొదటి నుంచి ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకోవడం లేదని వార్డు కౌన్సిలర్లు అధికారులను నిలదిశారు. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైనందున దోమల నివారణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. 15వ వార్డు కౌన్సిలర్ జహినబ్బేగం తన వార్డు అభివృద్ధిపై పక్షపాతం చూపుతున్నారని అరోపించారు. కనీసం మీడియా అయిన తమ వార్డు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకోచ్చి పరిష్కరించేలా చూడాలని కోరారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో దరఖాస్తులు పెరిగిపోతున్నాయని అందుకు వివాదాలు లేని వాటికి అనుమతులు ఇవ్వాలని కౌన్సిలర్లు కోరగా తాను నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన లేఅవుట్లలో వచ్చిన దరఖాస్తులకు మాత్రం అనుమతులు ఇస్తున్నామని కమీషనర్ వివరణ ఇచ్చారు. జనరల్ ఫండ్‌లో కేవలం 15 వార్డులకు మాత్రమే నిధులు పెట్టారు మిగతా వాటికి ఎందుకు పెట్టలేదని 30వ వార్డు కౌన్సిలర్ సునీల్ అధికారులను ప్రశ్నించారు. ప్రతి వార్డుకు రెండు లక్షల చొప్పున జనరల్ ఫండ్ నుంచి వివిధ అవసరాల కోసం కేటాయించడం జరుగుతుందని చెర్‌పర్సన్ తెలిపారు. ఇప్పటికే రూ.7.50 కోట్లకు సంబంధించిన టెండర్ల పక్రియ పూర్తి చేసి వర్క్ అర్డర్లు ఇచ్చామన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. కాగా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి వారికి వచ్చిన పనులను రద్దు చేయాలని సభ్యులు తెలుపగా డిప్యూటి ఇంజనీర్ పర్యవేక్షణలో కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. రంజాన్ పర్వదినం సందర్బంగా ఈద్గా వద్ద భారీ ఏర్పాట్లు చేసినందుకు గాను ఎంఐఎం కౌన్సిలర్లు మున్సిపల్ చెర్‌పర్సన్ విజయలక్ష్మి, ఇన్చార్జి కమిషనర్ వేంకటేశ్వర్లను, డిప్యూటి ఇంజనీర్, ఎఈలను ఈసందర్బంగా సన్మానించారు. -
14 మంది బాలకార్మికుల గుర్తింపు
జహీరాబాద్ టౌన్: పలు శాఖల అధికారులు కలసి గురువారం పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బాలకార్మికులను గుర్తించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి రత్నం, కార్మికశాఖ అధికారి యాదయ్య, సీడబ్ల్యూసీ సభ్యుడు మహరాజ్, డీసీపీయూ సభ్యుడు గోపాల్, ఏఎస్ఐ మల్లయ్య తదితర శాఖల అధికారులు అశోక్, మోతిరాం, సత్తిరెడ్డి తదితరులు పట్టణంలోని హోటళ్లు, వ్యాపార సంస్థలను తనిఖీలు నిర్వహించారు. 14 మంది బాలకార్మికులను గుర్తించి వారిని సంగారెడ్డిలోని దివ్యదిశ హోంకు తరలించారు. ఈ సందర్బంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి రత్నం మాట్లాడుతూ 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టడం నేరమన్నారు. పిల్లలను పనుల్లో పెట్టుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
విజనరీ లెజెండ్
-
డాన్ ఫాలోయింగ్
-
హెల్మెట్ టార్గెట్ గా స్పెషల్ డ్రైవ్
చాంద్రాయణగుట్ట బండ్లగూడ ప్రధాన రహదారిపై ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీసులు సోమవారం ఉదయం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగింది. ఫలక్‌నుమా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వి.చంద్రకుమార్ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించని, లెసైన్స్ లేని వాహనదారులు, నంబర్ ప్లేట్లు లేని వాహనదారులను ఈ సందర్భంగా గుర్తించి ఛలానాలు విధించారు. మొత్తం 160 హెల్మెట్ ధరించని వాహణదారులపై కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ చంద్రకుమార్ తెలిపారు. ఇందులోనే 10 నంబర్ ప్లేట్ లేని వాహనాలు, 20 సరిగ్గా నంబర్లు రాయని వాహనాలపై కూడా కేసులు నమోదు చేశారు. పగటి పూట కూడా స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్‌లను కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. -
ఆటో సమ్మె వాయిదా
- స్పెషల్ డ్రైవ్ నిలిపివేతకు ఆర్టీఏ అధికారుల అంగీకారం - ఆటో సంఘాలతో చర్చలు సఫలం - డ్రైవింగ్ లెసైన్సులకు నెల గడువు సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ, పోలీసుల స్పెషల్ డ్రైవ్‌కు వ్యతిరేకంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి నిర్వహించతలపెట్టిన నిరవధిక బంద్‌ను ఆటో సంఘాల జేఏసీ వాయిదా వేసుకుంది. ఆటో సంఘాల ప్రతినిధులతో రవాణా, పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం రెండు విడతలుగా జరిపిన చర్చలు సఫలం కావడం, స్పెషల్ డ్రైవ్ నిలిపివేసేందుకు అధికారులు అంగీకరించడంతో సమ్మె ప్రతిపాదనను వాయిదా వేసుకుంటున్నట్లు ఆటో సంఘాల జేఏసీ నాయకులు బి.వెంకటేశం, వి.కిరణ్, మారయ్య, సత్తిరెడ్డిలు తెలిపారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఈ నెల 16 నుంచి జప్తు చేసిన ఆటోలను తిరిగి డ్రైవర్లకు అప్పగించేందుకు కూడా రవాణాశాఖ అంగీకరించినట్లు పేర్కొన్నారు. రవాణాశాఖ అదనపు కమిషనర్ బి.వెంకటేశ్వర్లు, హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్, డీసీపీ (ట్రాఫిక్) రంగనాథ్, ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి జీపీఎన్ ప్రసాద్ ఆటో సంఘాలతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగియడంతో నగరంలోని లక్షా 30 వేల ఆటోలు యథావిధిగా సాగనున్నాయి. లెసైన్సు లేకుండా ఆటోలు నడిపితే పర్మిట్లు రద్దు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. ఆటోడ్రైవర్లు డ్రైవింగ్ లెసైన్సు తీసుకునేందుకు నెల రోజుల గడువు విధించారు. అలాగే లెసైన్సులు లేవనే కారణంగా ఆటోలను జప్తు చేయడం, పర్మిట్లను రద్దు చేయడం వంటి చర్యలు మాత్రం ఉండబోవు. రవాణా, పోలీసు అధికారులతో జరిగిన చర్చల్లో 15 ఆటో సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇతర జిల్లాల ఆటోలపై కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్ మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర పొరుగు జిల్లాల నుంచి వచ్చి నగరంలో తిరిగే ఆటోరిక్షాలపైన మాత్రం స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని జేటీసీ రఘునాథ్ తెలిపారు. తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల, సంగారెడ్డి, షాద్‌నగర్, తదితర ప్రాంతాల నుంచి ఆటోలను నగరానికి తరలిస్తున్నందువల్ల వాటిని నియంత్రించేందుకు డ్రైవ్ కొనసాగుతుందన్నారు. డ్రైవింగ్ లెసైన్సులు తీసుకొనేందుకు నెల రోజుల గడువు విధించిన నేపథ్యంలో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసి లెర్నింగ్ లెసైన్సులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. -
డ్రంకన్ డ్రైవ్‌లో 23 మందిపై కేసులు
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 23 మందిపై జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో 17 కార్లు, ఆరు బైక్‌లు ఉన్నాయి. శనివారం రాత్రి 11 నుంచి ఆదివారం తెల్లవారుజాము 2 గంటల వరకు ఏకకాలంలో 12 చోట్ల డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. 12 మంది ఇన్స్పెక్టర్లు, 24 మంది ఎస్ఐలు, 120 మంది పోలీసులు బృందాలుగా విడిపోయి ప్రశాసన్‌నగర్, రోడ్ నెం.45, ఫిలింనగర్, వీఎల్సీసీ, ఓహిరీస్ హోటల్, స్టార్ ఆస్పత్రి, కల్పా స్కూల్, బంజారాహిల్స్ రోడ్ నెం.14 వసంత భవన్, సత్యసాయి నిగమాగమం, వెంకటగిరి టీ జంక్షన్, పెద్దమ్మ దేవాలయం తదితర ప్రాంతాల్లో డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. మోతాదుకి మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. -
బైక్ రేసింగ్‌లపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
బైక్ రేసింగ్‌లపై జూబ్లీహిల్స్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు ఏకకాలంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి నేతృత్వంలో రెండు ప్లటూన్ల పోలీసు బలగాలు, 20 మంది పోలీసులు పది పికెట్లు ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుతో పాటు కేబీఆర్ పార్కు వరకు బైక్ రేసింగ్‌లపై దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ పోలీసులు అదుపు తప్పిన వేగంతో దూసుకుపోతున్న 35 స్పోర్ట్స్బైక్లను స్వాధీనం చేసుకున్నారు. 50 మంది యువకులపై కేసులు నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన యువకులందరికీ ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరంతా పబ్‌లలో, కాఫీ షాప్‌లలో మద్యం సేవించి బయటకు వచ్చి నిర్మానుష్యమైన రోడ్లమీద పందెం కాస్తూ బైక్‌లపై దూసుకుపోతున్నట్లు పోలీసులు తెలిపారు. -
ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
-10 ఆటోలు సీజ్ మాయత్‌నగర్: నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న ఆటోలపై అధికారులు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించారు. గురువారం నగరంలోని కింగ్‌కోఠి షాలిమార్ జంక్షన్ వద్ద నారాయణగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలాజీ నేతృత్వంలో తనిఖీలను నిర్వహించారు. ఆటోల మీటర్‌కు సంబంధించిన సర్టిఫికెట్లు, సీల్స్ బ్రేక్ అండ్ ట్యాంపరింగ్, డ్రైవింగ్ లెసైన్స్, సీబుక్, ప్రయాణికుల సంఖ్య, చార్జీల వసూలు తదితర అంశాలను తనిఖీ చేశారు. సుమారు వంద ఆటోలను తనిఖీ చేసి... నిబంధనలను పాటించని 10 ఆటోలను సీజ్ చేశారు. -
డ్రైవరే టార్గెట్!
ఉల్లంఘనల నమోదులో కొత్త ప్రక్రియ పదేపదే వైలేషన్స్ చేసే వారి గుర్తింపు కోసమే తప్పుడు ‘నెంబర్లు’ చెప్పకుండా ఓటీపీ విధానం సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై నిత్యం ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతున్న ట్రాఫిక్ విభాగం అధికారులు ఆయా వ్యక్తుల పైనే కేసులు నమోదు చేస్తున్నారు. తద్వారా ఒకటి కంటే ఎక్కువసార్లు చిక్కిన వారిని గుర్తించడం తేలికవుతోంది. దీంతో ఆయా వివరాలను కోర్టుకు సమర్పించి ట్రాఫిక్ పోలీసులు జరిమానాతో పాటు జైలు శిక్ష పడేలా, శిక్షాకాలం పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. రహదారులపై ఉల్లంఘనలకు పాల్పడే వారిని పట్టుకుంటున్న క్షేత్రస్థాయి ట్రాఫిక్ పోలీసులు... ఈ వాహనం నెంబర్ ఆధారంగా జరిమానా విధిస్తున్నారు. దీంతో పదేపదే చిక్కుతున్న వాహనాల డేటాబేస్ రూపొందుతోంది. అయితే అసలు తప్పు వాటిని డ్రైవ్ చేసిన వ్యక్తులదని తెలిసినా పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని గుర్తించడం సాధ్యం కావడట్లేదు. దీంతో ఎన్నిసార్లు ఉల్లంఘనలకు పాల్పడినా ఒకే తరహాలో జరిమానా విధిస్తున్నారు. ‘డ్రంకన్ డ్రైవింగ్’ను స్ఫూర్తిగా తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనల నమోదును వాహనం నుంచి డ్రైవర్ ఆధారంగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్నిచోట్ల అమలవుతున్న ఈ విధానం త్వరలో నగర వ్యాప్తంగా అమలులోకి రానుంది. దీని ఆధారంగా రూపొందే డేటాబేస్ ద్వారా రిపీటెడ్ వైలేటర్స్ను గుర్తించడం, ఆర్టీఏ, న్యాయస్థానాల సహకారంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ కాప్స్ సన్నాహాలు పూర్తి చేశారు. పీడీఏ మిషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు... ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పుస్తకాలను వాడట్లేదు. ఉల్లంఘనులకు జరిమానా విధించడం, వారి నుంచి క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా ఆ మొత్తాన్ని వసూలు చేయడం తదితరాలన్నీ చేతిలో ఇమిడిపోయే పీడీఏ మిషన్లు ద్వారానే నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు తాజాగా తీసుకున్న ‘డ్రైవర్’ నిర్ణయంతో ఈ పీడీఏ మిషన్లలో కొన్ని అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాహనచోదకుడి వద్ద ఒరిజినల్ డ్రైవింగ్ లెసైన్స్ ఉంటే దాన్ని రీడ్ చేసే పరిజ్ఞానం జోడించారు. ఉల్లంఘనుడి వద్ద ఉన్నది జిరాక్సు ప్రతి అయితే ఆ వివరాలు మాన్యువల్‌గా ఫీడ్ చేయనున్నారు. ప్రతి ఉల్లంఘనుడు తన డ్రైవింగ్ లెసైన్స్‌తో పాటు మరో గుర్తింపు కార్డును చూపించడం కచ్చితం చేయనున్నారు. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ తదితరాల్లో ఏదో ఒకటి అదనంగా చూపించాల్సిన విధానం అమలులోకి తీసుకువస్తున్నారు. ఈ వివరాలను సైతం పీడీఏ మిషన్లలో ఫీడ్ చేయడం ద్వారా ఉల్లంఘనులకు సంబంధించిన డేటాబేస్ రూపొందించనున్నారు. ఫోన్ నెంబర్ సైతం కచ్చితం.. సిటీలో పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్ల సంఖ్య సైతం భారీగానే ఉంది. ఆయా వాహనచోదకులకు పోలీసులు ఎస్సెమ్మెస్‌ల రూపంలో రిమైండర్స్ ఇస్తున్నారు. దీనికి అవసరమైన ఫోన్ నెంబర్లను వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో ఆర్టీఏ అధికారులకు ఇచ్చింది తీసుకుంటున్నారు. అయితే ఆయా వాహనాలు చేతులు మారిపోవడం, అసలు యజమాని దగ్గరే ఉన్నా ఆయన ఫోన్ నెంబర్లు మార్చేయడంతో ఈ సమాచారం వారికి చేరట్లేదు. మరోపక్క అత్యవసర సమయాల్లో వాహనచోదకుడిని సంప్రదించడానికీ అవకాశం ఉండట్లేదు. వీటిని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు వైలేషన్స్‌ను డ్రైవర్ కేంద్రంగా నమోదు చేయడంతో పాటు వారి నుంచి ఫోన్ నెంబర్లనూ కచ్చితంగా తీసుకోనున్నారు. నెంబర్ ‘మార్చకుండా.... ఈ రకంగా ట్రాఫిక్ పోలీసులు కోరినప్పుడు ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగానో, అనివార్యకారణాల నేపథ్యంలోనే తప్పు నెంబర్లు చెప్పే అవకాశం ఉంది. ఏవో పది అంకెల నెంబర్ చెప్పి తప్పించుకోవడానికీ ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ అధికారులు ఫోన్ నెంబర్ల సేకరణలో వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) విధానం అమలు చేస్తున్నారు. ఉల్లంఘనుడు ట్రాఫిక్ పోలీసులకు తన ఫోన్ నెంబర్ చెప్పిన వెంటనే దాన్ని అధికారులు పీడీఏ మిషన్‌లో నమోదు చేస్తారు. ఈ వెంటనే పీడీఏలు కనెక్ట్ అయి ఉండే సర్వర్ నుంచి సదరు ఉల్లంఘనుడు చెప్పిన నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని సైతం ఉల్లంఘనుడు అందుకుని, చెప్తేనే అసలు నెంబర్ చెప్పినట్లు నిర్థారిస్తారు. ఈ నూతన విధానంతో పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించడం తేలికవుతుందని ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. అలా రూపొందే రిపీటెడ్ వైలేటర్స్ డేటాబేస్ ఆధారంగా ఆర్టీఏ ద్వారా లెసైన్స్ సస్పెండ్ చేయించడం, కొన్ని రకాలైన ఉల్లంఘనుల్ని కోర్టు ద్వారా జైలుకు తరలించడం తదితర కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. -
ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
రసూల్‌పురా : ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని నార్త్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ ముత్యంరెడ్డి అన్నారు. మారేడుపల్లి ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేని 150 మంది వాహనదారులు, లెసైన్స్ లేని 25 మంది ద్విచక్ర వాహనదారులు పట్టుపడ్డారు. వీరికి జరిమానా విధించారు. సుమారు 500ల మంది వాహనదారులకు హెల్మెట్ వాడకంపై కౌన్సెలింగ్ ఇచ్చారు. రూ.100, రూ.150 రూపాయల చొప్పున జరిమానా విధించి వారి వివరాలను డేటాబేస్‌లో పొందుపరిచారు. మరోసారి పట్టుబడితే ట్రాఫిక్ ఉల్లంఘన చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సైలు అమానుల్లా, శ్రీనివాస్‌రావులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కుక్కలకూ కు.ని.
♦ స్పెషల్ డ్రైవ్‌గా సంతాన నిరోధక ఆపరేషన్లు ♦ ఆరు నెలల్లో 70 శాతం లక్ష్యం ♦ పెంపుడు కుక్కల రిజిస్ట్రేషన్ తప్పనిసరి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో వీధి కుక్కలకు అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇందులో భాగంగా సంతాన నిరోధక ఆపరేషన్లతో వీధి కుక్కల పునరుత్పత్తి కట్టడి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం నగరంలో ఆరు లక్షలకు పైగా వీధి కుక్కలు ఉండగా, స్పెషల్ డ్రైవ్ ద్వారా ఆరు నెల ల్లో వాటిలో 70 శాతం కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించా రు. ఇందులో జీహెచ్ఎంసీ వెటర్నరి విభాగంతో పాటు రాష్ట్ర పశు సంవర్థక శాఖ సేవలను కూడా వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. నగరంలో ఎనిమల్ కేర్ సెంటర్లను ఐదు నుంచి తొమ్మిదికి పెంచాలని నిర్ణయించారు. మంగళవారం జీహెచ్ఎంసీలో కమిషనర్ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర పశుసంవర్థక శాక డెరైక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, నారాయణగూడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సీనియర్ అధికారి డాక్టర్ సంపత్‌కుమార్, జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు తదితరులు పాల్గొని పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. జంటకు నాలుగువేల ఉత్పత్తి ఒక కుక్కల జంట ఏడేళ్లలో 4 వేల కుక్కలు ఉత్పత్తి సేస్తుంది. కుక్క జీవిత కాలం 8 నుంచి 11 సంవత్సరాలు కాగా, ప్రతి ఎనిమిది నెలలకు ఒకసారి నాలుగు నుంచి ఆరు పిల్లలకు జన్మనిస్తోంది. నగరంలో ఉన్న సుమారు ఐదున్నర లక్షల వీధి కుక్కల్లో పునరుత్పత్తి రేటు అధికంగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. ప్రైవేటులో ఆపరేషన్లు ప్రైవేటు సంస్థల ద్వారా కూడా కుక్కలకు సంతాన నిరోధక ఆపరేషన్ నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 11 మంది ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్లు, 24 మంది ప్రైవేటు డాక్టర్లు 102 డాగ్ క్యాచర్లు ఉన్నారు. ప్రస్తుతం ప్రైవేటు డాక్టర్లతో పాటు వెటర్నరీ ఆసుపత్రుల్లో కూడా వీధి కుక్కలకు ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయించారు. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ నగరంలోని వంద శాతం వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయనున్నటు కమిషనర్ డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ ద్వారా ఏటా లక్ష కుక్కలకు ఆపరేషన్లు నిర్వహిస్తున్నామన్నారు. రెబిస్ రహిత నగరంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని రెబిస్ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి జీహెచ్ఎంసీతో కలిసి పనిచేసేందుకు సిద్దమేనని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందుకుగాను కనీసం 20 మంది డాక్టర్లను ఇతర జిల్లాల నుంచి డిప్యూటేషన్‌పై నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రేబిస్ కేసులు తగ్గుముఖం జీహెచ్ఎంసీ పరిధిలో గత రెండేళ్లలో రేబిస్ వ్యాధితో ఒక్కరు కూడా మరణించలేదని నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ సంస్థ నివేదికలో స్పష్టం చేసింది. గత రెండేళ్లలో 61,749 మంది కుక్క కాటుకు గురైనట్లు వారు పేర్కొన్నారు. ఇంటి కుక్కలకు లెసైన్స్ తప్పని సరి ఇంటి కుక్కలకు లెసైన్స్ తప్పనిసరి చేశారు. జీహెచ్ఎంసీలో రూ. 50 చొప్పున చెల్లించి ప్రత్యేక నంబర్ లెసైన్స్ పొందాల్సి ఉంటుందని, లెసైన్స్‌లేని కుక్కలను జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. -
గ్రేటర్ వార్ 18th January 2016
-
గ్రేటర్ వార్
-
మిమిక్రీ మేళా 9th January 2016
-
జల్లి పట్టు
-
డాక్యుమెంట్లు లేకున్నా ఓకే...
హెల్మెట్ లేకుంటే కుదరదు మారేడుపల్లి వాహన దారులు హెల్మెట్ పెట్టుకునేలా చేసేందుకు మారేడ్ పల్లి పోలీసులు కొత్త రకం ప్లాన్ వేశారు. వాహన్ డాక్యుమెంట్లు లేకున్నా అంతగా పట్టించుకోని పోలీసులు.. హెల్మెట్ లేకుండా దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితిలో వదలటం లేదు. హెల్మెట్ లేకుండా పోలీసులకు దొరికితే హెల్మెట్ కొనుక్కుంటావా లేక భారీ ఎత్తున ఫైన్ వేయమంటావా అంటూ.. వాహన దారులకే ఛాయిస్ ఇస్తున్నారు. అప్పటికప్పుడు హెల్మెట్ కొనుక్కుంటే చలాన్ ఉండదని చెబుతున్నారు. అంతే కాదు. వాహన దారుని వెంట.. ఓ కానిస్టేబుల్ ను పంపించి హెల్మెట్ తీసుకున్న తరువాతే వదిలేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి జేబీఎస్, ఏఓసీ గేట్, కార్ఖానా, తదితర ప్రాంతంలో మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పై స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నారు. కొన్ని రోజులుగా చేపట్టిన ఈ డ్రైవ్‌లో భారీగా చలాన్లు విధించడమే కాకుండా వేల మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. రోజుకు వందల సంఖ్యలో కరపత్రాలను వాహనదారులకు ఇస్తు కౌన్సిలింగ్ చేస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నా హెల్మెట్ వాడకంపై ప్రజల్లో పూర్తిగా అవగాహన రావడం లేదని ట్రాఫిక్ పోలీసులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు హెల్మెట్ వాడకంపై మరింత కఠినంగా వ్యవహరించండి అనడంతో పోలీసులు స్పెషల్ డ్రైవ్ లో మరింత వేగం పెంచారు..ఉదయం సాయంత్రం ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు టీంలుగా ఏర్పడి వాహనదారులకు కౌన్సిలింగ్ తో పాటు వారికి చలాన్లు విదిస్తున్నారు. నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ స్థాయి అధికారి కూడా ఈ డ్రైవ్ లో పాల్గొంటూ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మొదటి సారి పట్టుపడితే రూ.100, రెండో సారి పట్టుబడితే.. రూ.300 ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. -
2015 టాలివుడ్ రివ్యూ
-
మళ్లి కూయవే గువ్వా..?
-
సారా రహిత జిల్లా నల్లగొండ
-
మిమిక్రీ మేళా 5th December 2015
-
కొడితే కొట్టాలి...
-
కల్తీ స్వాహా
-
సుశీలతో లెజెండ్స్
-
3 విక్రమ్
-
ముసుగేసి ముంచబోతున్నారా?
-
పల్స్ రేట్
-
గణేష్ శోభాయాత్ర
-
సిరివెన్నెల
-
హెల్మెట్ ధరించడంపై స్పెషల్ డ్రైవ్
-
ప్రజాకవి కాళోజీ
-
గోపాల గోపాల
-
వినూత్న స్పెషల్ డ్రైవ్‌లో 153 మందికి జరిమానా
మారేడుపల్లి (హైదరాబాద్): పోలీసులు సిగ్నల్ వద్ద లేరుగా.. మనల్నెవరూ చూడరనుకుని వెళ్లే వారికి తాజాగా ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇస్తున్నారు. సిగ్నళ్ల వద్ద పోలీసులు లేకున్నా నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా బాదుడు మాత్రం తప్పదు. నార్త్ జోన్ పరిధిలోని జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించి సెల్ మాట్లాడుతూ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్‌తో పాటు ట్రిపుల్ రైడింగ్ చెస్తున్న 153 మందికి జరిమానా విధించారు. జూబ్లీ బస్టాండ్ వద్ద గల స్వీకార్ ఉపకార్ సిగ్నల్ వద్ద మఫ్టీలో కొంత మంది సిబ్బందిని రూల్ బ్రేకర్స్ కోసం ఏర్పాటు చేశారు. పోలీసులు. నిబంధనలను పట్టించుకోకుండా వాళ్లు అటు వెళ్లగానే వెర్లైస్సెట్లో వారి వాహనం నంబరు వివరాలను మఫ్టీలో అక్కడే ఉన్న కానిస్టేబుల్.. మరో సిగ్నల్ వద్ద ఆ రూట్లో రెడీగా ఉన్న ఎస్ఐ స్థాయి అధికారి చెబుతాడు. దీంతో ఆయన వారిని పట్టుకునిచలాన్ రాస్తారు. విదేశాల్లో కనిపించే ఈ విధానాన్ని స్పెషల్ డ్రైై వ్ సందర్భంగా మంగళవారం నార్త్ జోన్ లోని మహంకాళి, మారేడుపల్లి, బేగంపేట, తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్టేషన్ల పరిధిలో చేపట్టి.. నిబంధనలను అతిక్రమించిన 153 మంది వాహనదారులకు జరిమానాలు విధించారు. పట్టుబడ్డ వారిలో నలుగురు ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఉన్నారు. -
స్పెషల్ ఎడిషన్ : వందనం
-
అంతరంగాలు
-
గాంధీ నడిచిన నేల
-
తెరలోక సుందరి
-
సాక్షి లివ్ వెల్ ఎక్స్పో
-
స్టోరీ మారింది