అనంతపురం సెంట్రల్: జిల్లాలో వారం రోజులుగా చేపట్టిన స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన 7,166 మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. ఇందులో మైనర్లు 294 మంది ఉన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన 195మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. సెల్‌ఫోన్‌డ్రైవింగ్, డ్రైవింగ్‌లైసెన్స్‌లు లేకుండా నడిపిన, త్రిబుల్‌రైడింగ్, అధికలోడ్‌తో వెళ్లేవారిని గుర్తించి కేసులు నమోదుచేశామన్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడుపుతున్న 1600 మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
10వేలమంది కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుశాఖ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ రోడ్డు ప్రమాదాలు అక్కడక్కడ జరుగుతుండడం బాధాకరమన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చునని తెలిపారు. ప్రజలు సహకరించాలని, వాహనాలు నడిపే సమయంలో ఓసారి ఆలోచించాలని కోరారు.
ఈ వారం స్పెషల్ డ్రైవ్ కేసులు 7,166
Published Sun, Sep 17 2017 10:46 PM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM
Advertisement