ప్లాస్టిక్‌పై స్పెషల్ డ్రైవ్
► పలు దుకాణాల్లో తనిఖీలు.. క్యారీబ్యాగులు సీజ్
► ఇద్దరు వ్యాపారులకు రూ.5 వేల చొప్పున జరిమానా
కోల్‌సిటీ : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్లాస్టిక్ క్యారీబ్యాగుల నిషేధంపై సోమవారం శానిటేషన్ విభాగం అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. స్థానిక లక్ష్మినగర్, మేదరిబస్తా, కళ్యాణ్‌నగర్, తిరుమల్‌నగర్ తదితర ప్రాంతాలలోని దుకాణాలను శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పవన్‌కుమార్, రవీందర్‌తోపాటు సిబ్బంది ఆడేపు శ్రీనివాస్, ఈసూబ్, రాజు, సుగుణాకర్, తిరుపతి, మల్లేష్ తనిఖీలు నిర్వహించారు. లక్ష్మినగర్‌లోని జయశ్రీ కిరాణంలో లభించిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను సీజ్ చేసి, యజమాని రాజేందర్‌కు రూ.5వేల జరిమానా విధించా రు. తిరుమల్‌నగర్‌లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు విక్రరుుంచే మరో గోదాంలో ఉన్న బ్యాగులను సీజ్ చేశారు. దుకాణం యజమాని భాస్కర్‌కు రూ.5వేలు జరిమానా విధించారు.
సీజ్ చేసిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు. 50 మైక్రాన్‌ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ క్యారీబ్యాగులను వినియోగించడం నిషేధమన్నారు. ప్లాస్టిక్ వస్తువులను విక్రరుుంచాలంటే ముందుగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వ్యాపారస్తులు నెలనెలా లెసైన్‌స ఫీజు చెల్లించి రెన్యువల్ చేరుుంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ విక్రయాల నిషేధంపై నిరంతరం తనిఖీలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే వ్యాపారస్తులందరికీ నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసులు తీసుకున్న వ్యాపారస్తులు వాటిని ఉల్లంఘించి విక్రయాలు జరుపుతుండడంతో జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించారు. అప్పటికీ విక్రయాలు నిలుపుదల చేయకపోతే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.