
కారు అద్దాలపై బ్లాక్ ఫిల్మ్‌లు, నంబర్ ప్లేట్ సరిగా లేకపోవటం, వాహనం కొనుగోలు చేసిన నెల తర్వాత కూడా టీఆర్ నంబర్‌తో తిరగడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలను నగర ట్రాఫిక్ పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ నెల 18 నుంచి మరో విడత స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈసారి కారు అద్దాలపై బ్లాక్ ఫిల్మ్‌లు, నంబర్ ప్లేట్ సరిగా లేకపోవటం, వాహనం కొనుగోలు చేసిన నెల తర్వాత కూడా టీఆర్ నంబర్‌తో తిరగడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలను నేర కార్యకలాపాలకు దోహదపడేవిగానూ పరిగణిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఐపీసీ సెక్షన్ 188, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఎఫ్ సెక్షన్ 21 ప్రకారం చార్జిషీట్లు దాఖలు చేసి, న్యాయస్థానంలో హాజరుపరుస్తామని హెచ్చరించారు. సంబంధిత వాహనాలను గుర్తిస్తే 90102 03626కు ఫిర్యాదు చేయాలన్నారు. (క్లిక్: అక్కడ ట్రాఫిక్ జామ్.. ఇలా వెళ్లండి)