Black Film
-
బ్లాక్ ఫిల్మ్‌లు, నంబర్ ప్లేట్లపై నజర్; 18 నుంచి స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలను నగర ట్రాఫిక్ పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ నెల 18 నుంచి మరో విడత స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈసారి కారు అద్దాలపై బ్లాక్ ఫిల్మ్‌లు, నంబర్ ప్లేట్ సరిగా లేకపోవటం, వాహనం కొనుగోలు చేసిన నెల తర్వాత కూడా టీఆర్ నంబర్‌తో తిరగడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను నేర కార్యకలాపాలకు దోహదపడేవిగానూ పరిగణిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఐపీసీ సెక్షన్ 188, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఎఫ్ సెక్షన్ 21 ప్రకారం చార్జిషీట్లు దాఖలు చేసి, న్యాయస్థానంలో హాజరుపరుస్తామని హెచ్చరించారు. సంబంధిత వాహనాలను గుర్తిస్తే 90102 03626కు ఫిర్యాదు చేయాలన్నారు. (క్లిక్: అక్కడ ట్రాఫిక్ జామ్.. ఇలా వెళ్లండి) -
హీరో నాగచైతన్య కారుకు పోలీసుల జరిమానా
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యకు పోలీసులు జరిమానా విధించారు. చై కారుకు బ్లాక్ ఫిలిం ఉండటంతో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం అతడి వాహనాన్ని ఆపి రూ.700 జరిమానా విధించారు. ఆ సమయంలో నాగచైతన్య కారులోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్ రామ్, మంచు మనోజ్ కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్ములను తొలగించి మోటారు వాహనాల చట్టం నిబంధనల ఉల్లంఘన కింద వారికి రూ.700 చొప్పున చలాన్లు విధించిన విషయం తెలిసిందే! వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక సోదాలు నిర్వహిస్తూ కారు అద్దాలకు టింటెడ్ ఫిలిం అమర్చుకొని వెళ్తున్న వాహనదారులకు జరిమానాలు విధిస్తూ అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింలను తొలగిస్తున్నారు. చదవండి: మిత్ర శర్మ నాకు రూ.5 లక్షలు ఇస్తానని చెప్పింది: స్రవంతి ఈ వారం థియేటర్, ఓటీటీలో రచ్చ చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ -
డైరెక్టర్ త్రివిక్రమ్ కారుకు జరిమానా
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు జరిమాన విధించారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అటుగా వెలుతున్న త్రివిక్రమ్ కారును అడ్డుకున్నారు. ఆయన కారును తనిఖీ చేసిన ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిలింను గుర్తించారు. దీంతో కారుకు ఫైన్ వేసి బ్లాక్ ఫిలింను తొలగించారు. ఆనంతరం ఆయనకు రూ. 700 జరిమానా విధించారు. చదవండి: టాలీవుడ్ హీరోయిన్‌పై మనసు పారేసుకున్న యంగ్ క్రికెటర్! కాగా వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు మనోజ్‌లకు కూడా ఇటీవల ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసి బ్లాక్ ఫిలిం తొలగించిన సంగతి తెలిసిందే. -
హీరో మంచు మనోజ్ కారుకు జరిమానా.. ఎందుకంటే?
Hyderabad Traffic Police Fined To Manchu Manoj Car: టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. హైదరాబాద్ టోలీచౌకిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంచు మనోజ్ కారుకు బ్లాక్ ఫిలిం ఉన్నట్లు గుర్తించారు. దీంతో మనోజ్ కారుకు రూ. 700 ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. అలాగే మనోజ్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం తెరను తొలగించారు. కాగా వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. చదవండి: అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లను అడ్డుకున్న పోలీసులు ఇటీవల యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కారును ఆపి సోదాలు నిర్వహించారు పోలీసులు. ఎన్టీఆర్ కారుకు బ్లాక్ ఫిలిం తెర ఉన్నందున మోటారు వాహనాల చట్టం నిబంధనల ఉల్లంఘన కింద రూ. 700 జరిమానా విధించారు. అనంతరం ఆయన కారుకు ఉన్న బ్లాక్ ఫిలిం తెరను తొలగించారు. అలాగే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కారులకు సైతం బ్లాక్ ఫిలిం తెరను తొలగించి చలానా విధించారు. చదవండి: స్టార్ హీరో కారును అడ్డుకున్న పోలీసులు, ఏం జరిగిందంటే? -
బ్లాక్ ఫిలిం ఉంటే బుక్కైపోతారు జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ప్రకారం కారు అద్దాలకు ఎలాంటి తెరలు ఏర్పాటు చేసినా, అద్దాలకు టింటెడ్ ఫిలింను ఏర్పాటు చేసుకున్నా కఠిన చర్యలు తప్పవని జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కె.ముత్తు హెచ్చరించారు. నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కారు అద్దాలకు టింటెడ్ ఫిలిం అమర్చుకొని వెళ్తున్న వాహనదారులకు జరిమానాలు విధించి అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింలను ఆయన తొలగింపజేశారు. కారులో ఎవరు వెళ్తున్నారు, ఎంత మంది వెళ్తున్నారు అనే దృశ్యాలు స్పష్టంగా కనిపించాలనే నిబంధన ఉన్నప్పటికీ కొంత మంది అవేవి పట్టించుకోకుండా నల్ల తెరలను ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా తిరుగుతున్నారని అలాంటి వారిని ఉపేక్షించమని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా శనివారం 93, ఆదివారం 82 వాహనాలను ఆపి బ్లాక్ ఫిలింలు తొలగింపజేశారు. ఆరు వాహనాలకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండగా వాటిని తొలగించారు. మీడియాకు సంబంధం లేకుండా ఆరు స్కూటర్లకు ప్రెస్ ఆని రాసి ఉందని వాటిని తొలగించామని తెలిపారు. (క్లిక్: ఐటీ కారిడార్లలో వజ్ర పరుగులు.. చార్జీలు ఎంతంటే?) -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్, దొరికారో అంతే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. వాహనాలకు బ్లాక్ ఫిల్మ్, స్టిక్కర్ల దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాల పాటు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇన్నాళ్లూ అనధికారికంగా పోలీసు, ఆర్మీ, ప్రెస్, ఎమ్మెల్యేల పేరిట స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలను చూసీచూడనట్లు వదిలేసిన ట్రాఫిక్ పోలీసుల్లో జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంతో కదలిక వచ్చింది. చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం వాహనాలపై బ్లాక్ ఫిల్మ్ వాడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జడ్‌ప్లస్ కేటగిరి వారు తప్ప ఎవరూ వాహనాలపై బ్లాక్ ఫిల్మ్ వాడొద్దని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహనం లోపల విజిబులిటీ సరిగా ఉండాలన్నారు. వాహనాలపై అనుమతి లేకుండా బ్లాక్ ఫిల్మ్ వేయొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. -
నల్ల తెర చాటున కిడ్నాప్‌లు వ్యభిచారం
వాహనాల నల్ల అద్దాల మాటున చట్టవ్యతిరేక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ కార్ల నుంచి ఖరీదైన కార్లలో పలువురు నేరాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మద్యం అక్రమ రవాణా, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్, వ్యభిచారం, కిడ్నాప్‌లు, దొంగతనాలు, సెటిల్మెంట్లు, అవినీతి తదితర నేరాలకు బ్లాక్‌ఫిల్మ్ వేసిన కార్లు కీలకంగా మారాయి. ఇటీవల విజయవాడలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్ కేసు విచారణ సందర్భంగా పలు విషయాలు వెలుగులోకి రావడంతో అక్కడి పోలీసులు, రవాణా అధికారులు బ్లాక్ ఫిల్మ్‌లపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే జిల్లాలో అధికారులు మాత్రం ఈ విషయంలో ఇంకా మేలుకోలేదు. నెల్లూరు (టౌన్) : జిల్లాలో రవాణా శాఖ నిస్తేజంగా మారింది. ఎన్ఫోర్స్మెంట్లో ఘోరంగా విఫలమై ఈ శాఖ కనీస నిబంధనలు పాటించని వాహనాల తనిఖీల్లో వెనుకబడింది. ఆ శాఖ రూపొందించిన నిబంధనలతోపాటు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 1,26,095 కార్లున్నాయి. వీటిలో 1.19 లక్షల సొంత కార్లు ఉండగా, 7,095 మోటార్ క్యాబ్‌లున్నాయి. వివిధ కంపెనీలకు చెందిన కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే కారు తయారీలోనే ప్రింటింగ్ గ్లాస్‌కు 30శాతం ఉన్న ఫిల్మ్‌ను ఆయా కంపెనీల యాజమాన్యాలు బిగిస్తున్నాయి. ఆ తర్వాత కారు సైడ్ డోర్, వెనుక భాగంలో ఉన్న గ్లాసులకు ఎలాంటి ఫిల్మ్‌లు బిగించకూడదు. దేశంలో అల్లర్లు, కిడ్నాప్‌లు, హత్యలు, లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో సెంట్రల్ మోటార్ వెహికల్ చట్టాన్ని అమలు చేయాలని 2012లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ చట్టం ప్రకారం కారుకు ఎలాంటి ఫిల్మ్ బిగించకూడదు. ముప్పు ఉన్న వారు, వీఐపీలు తగిన కారణాలు చూపి పోలీసుల అనుమతితో బ్లాక్‌ఫిల్మ్‌ను ఉపయోగించుకోచ్చని సూచించింది. యథేచ్ఛగా వినియోగం ఇటీవలి కాలంలో కార్లకు యథేచ్ఛగా బ్లాక్ ఫిల్మ్‌ను వినియోగిస్తున్నారు. వాహనంలో ఉన్న వ్యక్తులు బయటకు స్పష్టంగా కనపడాలి. అయితే కొంతమంది కారు లోపలి భాగం కనపడకుండా ఫుల్బ్లాక్ ఫిల్మ్‌ను వినియోగిస్తున్నారు. జిల్లాలో ఎర్రచందనం, మద్యం అక్రమరవాణా, స్మగ్లింగ్, దొంగతనాలు, కిడ్నాప్‌లు, గంజాయి, వ్యభిచారం, సెటిల్మెంట్లు జోరుగా జరుగుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తనిఖీలు నిల్ బ్లాక్‌ఫిల్మ్ వినియోగంపై ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాల్లేవు. గతంలో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జిల్లాలో బ్లాక్ఫిల్మ్పైకొద్దిరోజులు హడావుడి చేసిన పోలీసు, రవాణా అధికారులు ఆ తర్వాత పూర్తిగా వదిలేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో బ్లాక్‌ఫిల్మ్‌తో పెద్ద మొత్తంలో కార్లు కనపడుతున్నాయి. ప్రధానంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పాండిచ్చేరి, విజయవాడ, తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు రోజూ వందలాది వాహనాలు వస్తుంటాయి. జిల్లాలో మెజార్టీ కార్లు అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్‌లు తగిలించి యథేచ్ఛగా తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లాలో బ్లాక్‌ఫిల్మ్‌తో తిరుగుతున్న కార్లపై తనిఖీలు నిర్వహించి వాటిని తొలగించి కేసులు నమోదు చేయాలని పలువురు కోరుతున్నారు. తనిఖీలు నిర్వహిస్తాం కరోనా కారణంగా వాహనాలను తనిఖీ చేయలేకపోయాం. వాహనాలకు కంపెనీల నుంచి ఏ ఫిల్మ్ వస్తుందో దాన్నే ఉంచాలి. వాటిని మార్చి బ్లాక్‌ఫిల్మ్‌లు అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా తనిఖీ నిర్వహించి అపరాధ రుసుమును విధిస్తాం. బ్లాక్‌ఫిల్మ్‌ను తొలగిస్తాం. – సుబ్బారావు, డీటీసీ నెల్లూరు -
టాలీవుడ్ యంగ్ హీరోకు ఫైన్
సాక్షి, హైదరాబాద్ : యంగ్ హీరో నాగశౌర్యకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. నాగశౌర్య ప్రయాణిస్తున్న కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవి రూ. 500ల ఫైన్ విధించారు. అనంతరం కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను పోలీసులు తొలగించారు. ఈ ఘటన మంగళవారం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లో చోటుచేసుకుంది. కాగా, భారత్‌లో కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడటంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల నాగశౌర్య ఓ బేబీ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం సొంత బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్.. వైజాగ్‌లో జరుగుతున్న సమయంలో ఆయన గాయపడ్డ సంగతి విదితమే. -
ఎమ్మెల్యే యాదయ్యకు రూ.500 జరిమానా
కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ అంటించి ఉండడంతో... హైదరాబాద్: కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ అంటించి ఉండ డంతో చేవెళ్ల కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు హైదరాబాద్‌లోని మాదా పూర్ ట్రాఫిక్ పోలీసులు రూ. 500 జరి మానా విధించారు. నానక్ రాంగూడ సమీపంలోని టోల్ గేట్ వద్ద గురువారం పెట్రోల్ వాహనాల ప్రారంభోత్సవ హడావుడి కొనసాగుతోంది. ఆ సమయంలో గచ్చిబౌలి వైపు నుంచి నానక్ రాంగూడ టోల్ గేట్ వైపునకు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ అంటించి ఉన్న ఎమ్మెల్యే కారు వెళ్లడాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ గమనించారు. దీంతో ట్రాఫిక్ పోలీసు లను శ్రీనివాస్ అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యే కారును ఎస్ఐ విజయ్ మోహన్ టోల్ గేట్లో ఆపేశారు. తాను ఎమ్మెల్యేనని యాదయ్య చెప్ప గా ఇక్కడ మీడియా ప్రతినిధులు ఉన్నారని వదిలిపెట్టడం కుదరదని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే యాదయ్యకు రూ.500 చలానా విధించి పంపించారు. అనంతరం యాదయ్య చేవెళ్లకు బయలుదేరి వెళ్లారు. -
బ్లాక్‌ఫిల్మ్ ఉంటే బాదుడే..!
సాక్షి, సిటీబ్యూరో: వాహనాలకున్న బ్లాక్ఫిల్్మను తొలగించడంపై నగర ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ఫిల్మ్‌ను తొలగించడంతో పాటు వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను కూడా వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నామని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నల్లద్దాలతో వెళ్లే కార్లు, బస్సులపై రూ.వెయ్యి జరిమానా విధించడమే కాకుండా అక్కడికక్కడే ఆ వాహనాలను ఆపి ట్రాఫిక్ సిబ్బంది వాటిని తొలగిస్తారన్నారు. ఈ వాహనాలపై కూడా ఈ చలాన్లు జారీ అవుతాయని, ఇప్పటికే చాలా మంది వాహనదారుల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని సూచించారు. కొందరు బ్లాక్‌ఫిల్మ్ స్థానంలో లైట్ కలర్ ఫిల్మ్ వాడుతున్నారని, ఇది కూడా వాడవద్దని హెచ్చరించారు. తమకు ఆర్టీఏ అనుమతి ఉందంటూ వాహనదారులను మభ్యపెట్టే ప్రయత్నం చేసి బ్లాక్ఫిల్్మను కార్లకు ఫిక్స్ చేస్తున్న కారు డెకార్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎండ రావద్దని షేడ్స్, కర్టెన్స్ వాడుతున్నారని, హై ఎండ్ కార్లలో బ్లాక్ స్క్రీన్ డ్రా చేసే అవకాశాలు ఉండడంతో ఈ విధంగా వ్యవహరించడం కూడా చట్టవిరుద్ధమన్నారు. ఆర్టీసీ, ప్రైవేట్ స్కూల్ బస్సులు కూడా విండో అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగించాలని ఆయన సూచించారు.