సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. వాహనాలకు బ్లాక్ ఫిల్మ్, స్టిక్కర్ల దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాల పాటు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇన్నాళ్లూ అనధికారికంగా పోలీసు, ఆర్మీ, ప్రెస్, ఎమ్మెల్యేల పేరిట స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలను చూసీచూడనట్లు వదిలేసిన ట్రాఫిక్ పోలీసుల్లో జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంతో కదలిక వచ్చింది.
చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం
వాహనాలపై బ్లాక్ ఫిల్మ్ వాడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జడ్‌ప్లస్ కేటగిరి వారు తప్ప ఎవరూ వాహనాలపై బ్లాక్ ఫిల్మ్ వాడొద్దని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహనం లోపల విజిబులిటీ సరిగా ఉండాలన్నారు. వాహనాలపై అనుమతి లేకుండా బ్లాక్ ఫిల్మ్ వేయొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment