
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యకు పోలీసులు జరిమానా విధించారు. చై కారుకు బ్లాక్ ఫిలిం ఉండటంతో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం అతడి వాహనాన్ని ఆపి రూ.700 జరిమానా విధించారు. ఆ సమయంలో నాగచైతన్య కారులోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్ రామ్, మంచు మనోజ్ కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్ములను తొలగించి మోటారు వాహనాల చట్టం నిబంధనల ఉల్లంఘన కింద వారికి రూ.700 చొప్పున చలాన్లు విధించిన విషయం తెలిసిందే!
వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక సోదాలు నిర్వహిస్తూ కారు అద్దాలకు టింటెడ్ ఫిలిం అమర్చుకొని వెళ్తున్న వాహనదారులకు జరిమానాలు విధిస్తూ అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింలను తొలగిస్తున్నారు.
చదవండి: మిత్ర శర్మ నాకు రూ.5 లక్షలు ఇస్తానని చెప్పింది: స్రవంతి
ఈ వారం థియేటర్, ఓటీటీలో రచ్చ చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్
Comments
Please login to add a commentAdd a comment