
టాలీవుడ్ జంట నాగచైతన్య (Naga Chaitanya)- శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. ప్రముఖ మ్యాగజైన్ వోగ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇన్‌స్టాగ్రామ్‌లోనే తమ ప్రేమ మొదలైందని వెల్లడించారు. తాజాగా ఎవరు సారీ చెప్తారు? పెళ్లి తర్వాత వంట ఎవరు చేసిపెడ్తున్నారు? వంటి విషయాలను అన్నింటినీ వోగ్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
సారీ ఎవరు చెప్తారు?
తప్పు ఎవరిదైనా సరే ఎవరు సారీ చెప్తారు? అన్న ప్రశ్నకు శోభిత తనే క్షమాపణలు చెప్తానంది. అది విని ఆశ్చర్యపోయిన చై.. నువ్వసలు సారీలు, థాంక్స్ నమ్మవు కదా అన్నాడు. అందుకామె ప్రేమలో క్షమాపణలు, కృతజ్ఞతలకు చోటు లేదు అని పేర్కొంది. దాంతో నవ్వేసిన చైతూ.. తనే సారీ చెప్తానని ఒప్పుకుంటూనే మొదటగా ప్రేమను వ్యక్తపరిచింది కూడా తానే అని ఒప్పుకున్నాడు.
నీకది లేదులే.. చై సెటైర్లు
ఎవరు బాగా వంట చేస్తారంటే తామిద్దరికీ వంట రాదన్నారు. కాకపోతే ప్రతిరోజు షూట్ నుంచి ఇంటికి రాగానే చై.. హాట్ చాక్లెట్ చేసిస్తాడంది శోభిత. అది వంట కిందకు రాదని, అది ప్రతి ఒక్కరికీ ఉండే కనీస నైపుణ్యం. కానీ నీకు లేదులే అని సెటైర్ వేశాడు. సినిమాలు చూడటం ఇష్టమని చై అంటుంటే.. చైను చూస్తూ ఉండిపోవడం నాకిష్టం అని పేర్కొంది శోభిత. చై 100 సినిమాలు చూస్తే నేను ఐదు చూసుంటానంది. వాదనల్లో ఎవరు గెలుస్తారన్న ప్రశ్నకు ఎప్పుడూ చైతూయే గెలుస్తాడంది.
అదే శోభిత హాబీ
శోభిత ఎక్కువ సరదాగా ఉంటుంది. నాకు ఫేమస్ పాటల హుక్ స్టెప్స్ నేర్పిస్తూ ఉంటుంది. అది తనకు హాబీ.. కాకపోతే అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రం ప్రాణం పోయినట్లే చేస్తుంది. కాస్త అస్వస్థతకు గురైనా అసలు ఓర్చుకోలేదు. నీరసంతో కింద పడిపోతుంది అన్నాడు నాగచైతన్య.
చదవండి: బిగ్‌బాస్ నుంచి నాగార్జున తప్పుకోవాలి.. రానా బెటర్: సోనియా
Comments
Please login to add a commentAdd a comment