
అక్కినేని కొత్త కోడలు శోభిత (Sobhita) గురించి కొత్తగా చెప్పేదేముంది. నటిగా ఇదివరకే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. హీరో నాగచైతన్యని(Naga Chaitanya) పెళ్లాడిన తర్వాత టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఎందుకంటే గతంలో చైతూ, హీరోయిన్ సమంతని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు.
సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే నాగచైతన్య నటుడిగానే కాకుండా రెస్టారెంట్, రేసు ట్రాక్ లాంటి వ్యాపకాలు ఉన్నాయి. హైదరాబాద్ లోనే ఇతడికి సోయూ అనే రెస్టారెంట్ ఉంది. అప్పుడప్పుడు రేసు ట్రాక్ పైనా రయ్ రయ్ మని దూసుకుపోతూ ఉంటాడు. తాజాగా అలా చెన్నైలో రేస్ సర్క్యూట్ కి వెళ్లాడు.
(ఇదీ చదవండి: 'కోర్ట్'లో ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది.. ఎవరీ 'జాబిలి'?)
కాకపోతే ఈసారి ఒక్కడ కాదు, భార్య శోభితని కూడా తోడు తీసుకెళ్లాడు. ఆమెని కూడా కారులో కూర్చొనబెట్టి రేసులోకి దింపాడు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలని శోభిత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. పలువురు సెలబ్రిటీలు ఈ పిక్స్ పై కామెంట్స్ పెడుతున్నారు.
సినిమాల విషయానికొస్తే నాగచైతన్య.. ఈ మధ్యే 'తండేల్'తో (Thandel Movie) హిట్ కొట్టాడు. ప్రస్తుతం 'విరూపాక్ష' దర్శకుడు తీస్తున్న హారర్ మూవీలో నటిస్తున్నాడు. శోభిత అయితే ఒకటి రెండు సినిమాలు చేస్తూ కాస్త బిజీగా ఉంది.
(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా)
Comments
Please login to add a commentAdd a comment