![Chaitanya Comments On Divorce With Samantha](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/Chaitanya-Comments_0.jpg.webp?itok=CBxcrUlj)
టాలీవుడ్ హీరో నాగచైతన్య తన మాజీ భాగస్వామి సమంత గురించి మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. వారు వివాహబంధం నుంచి విడిపోయిన తర్వాత పలుమార్లు సమంత రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. కానీ, నాగచైతన్య ఇప్పటి వరకు విడాకుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. విడాకులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత ఆయన రియాక్ట్ అయ్యారు. సమంతతో విడిపోయిన తర్వాత చాలా నెగటివ్ కామెంట్లు వచ్చాయని ఆయన అన్నారు. తను, నేను ఇద్దరం ఆలోచించే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. అయినప్పటికీ చాలామంది నెగటివ్ కామెంట్లు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలో శోభితతో పెళ్లి గురించి కూడా ఆయన పంచుకున్నారు.
'సమంతతో విడాకుల తర్వాత సోషల్‌మీడియాలో ఎలాంటి పోస్ట్ షేర్ చేసినా కూడా నెగటివ్ కామెంట్లు వస్తున్నాయి. అవి ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని నేనూ చదవుతాను. సమంతతో విడిపోయిన తర్వాత ఇద్దరం కలిసే విడాకుల విషయాన్ని ప్రపంచానికి చెప్పాం. వ్యక్తిగత కారణాల వల్ల వేరువేరుగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ప్రకటించాం. ఎవరిదారిలో వారి జర్నీ కొనసాగుతుందని తెలిపాం. మా వ్యక్తిగత జీవితం విషయంలో కాస్త ప్రైవసీ ఇవ్వండి అంటూ అభ్యర్థించాము కూడా.. అయితే, మా విడాకులు ఇతరులకు వినోదంలా అయిపోయింది. ఎన్నో గాసిప్స్ వార్తలు వచ్చాయి. అలాంటి సమయంలో మళ్లీ నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే.. ఆ ఇంటర్వ్యూ నుంచి కూడా మరికొన్ని వార్తలు ప్రసారం అవుతాయి. అందుకే స్పందించలేదు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/2_164.jpg)
కానీ, కొన్ని సందర్భాల్లో పలు వేదికలపై ఈ విషయం గురించి అడిగారు. ఆ సమయంలో ఈ టాపిక్ గురించి వదిలేయండి అని కూడా రిక్వెస్ట్ చేశాను. అయినప్పటికీ అదే విషయంపై ప్రశ్నలు అడుగుతూ.. మళ్లీ ఆ గాయాన్ని గెలుకుతున్నారు. కానీ, మా నిర్ణయాన్ని ఎవరూ గౌరవించలేదు. మా విడాకుల వార్తలు, కామెంట్ల గురించి ఎవరూ ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. అలాంటి వార్తలు రాసే వారు ఇకనైన ఫుల్‌స్టాప్ పెట్టాలి. నా మీద నెగటివ్ కామెంట్లు చేసే వారు ఇకనైనా ఆపేయండి.. మీ భవిష్యత్ గురించి మంచిగా ఆలోచించండి.
విడాకులు అనేది నా జీవితంలో మాత్రమే జరగలేదు. సమాజంలో చాలామంది లైఫ్‌లో జరిగాయి. నేనేమైనా క్రిమినల్‌ను కాదు కదా.. నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. వెయ్యి సార్లు ఆలోచించే విడాకులు తీసుకున్నాం. మా జీవితంలో విడాకులు అనేది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు.. చాలారోజుల పాటు చర్చించిన తర్వాతే ఇద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని ఆయన అన్నారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_433.jpg)
నా లైఫ్‌లో నిజమైన హీరో ఆమె..
నటి శోభితాతో పెళ్లి విషయం గురించి ప్రకటించిన తర్వాత కూడా నెగటివ్‌గానే కామెంట్లు చేశారని చైతన్య అన్నారు. 'ఆమె నా జీవితంలోకి చాలా ఆర్గానిక్‌గానే ప్రవేశించింది. మా ఇద్దరి మధ్య మొదట ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే పరిచయం అయింది. అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది. కానీ, తన గురించి బ్యాడ్‌గా మాట్లాడటం చాలా తప్పు. నా పర్సనల్ లైఫ్ గురించి ఆమె చాలా మెచ్యూర్‌గా ఆలోచిస్తుంది. నా జీవితంలో నిజమైన హీరో శోభితానే..' అంటూ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment