Samanta
-
శోభిత పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమంత.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫొటోలు)
-
కౌంట్‌డౌన్ మొదలైంది..చైతూ- శోభిత పెళ్లి పనులపై సమంత పోస్ట్! (ఫొటోలు)
-
పెళ్లి కూతురి లుక్‌లో సమంత.. వీడియో వైరల్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'ఖుషి'. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ ఆఖరి షెడ్యూల్ తాజాగా ద్రాక్షారామ పరిసర ప్రాంతాల్లో మొదలైంది. ఇందులో భాగంగా ప్రస్తుతం విజయ్, సమంతలపై క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో గమనిస్తే అక్కడ అందరూ ఓ యాగం చేస్తున్నట్లు కనిపించారు. ఓ వైపు సమంత, విజయ్ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించగా.. మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ లాంటి స్టార్స్ కూడా ఆ షూట్లో కనిపించారు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'సలార్' టీజర్ విడుదల) 'ఖుషి'లోని కొన్ని సన్నివేశాల్లో విజయ్-సమంత భార్య భర్తలుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. సమంత 'ఖుషి' సెట్స్ నుంచి సెల్ఫీ తీసుకుని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా స్టోరీలో పోస్ట్ చేశారు. అందులో ఆమె మెడలో నల్లపూసలు కనిపించాయి. విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన వీడియోలో కూడా సేమ్ శారీలో సమంత కనిపించారు. ఇప్పటికే విడుదలైన 'నా రోజా నువ్వే...' పాటు సూపర్ హిట్ అందుకుంది. వచ్చే వారంలో రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. (ఇదీ చదవండి; జ్యువెల్లరీ యాడ్‌లో సితార.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) విభిన్న నేపథ్యాలు కలిగిన ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథ ఇది. ఈ సినిమాలో సమంత ముస్లిం యువతి పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది. విజయ్ - సామ్‌ల కెమిస్ట్రీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. @samantharuthprabhuoffl and @thedeverakonda perform a Pooja at the last schedule of their movie #Kushi ❤️ 🙏#samantha #samantharuthprabhu #nagachaitanya #samantharuthprabhufans #nagachaitanyafans #varundhawan #samantharuthprabhu #SamanthaRuthPrabhu #nagachaitanya pic.twitter.com/dI6z95LBrE — BTown Ki Billi South Cinema (@bkbsouthcinema) July 5, 2023 Look at this goddess🧿❤️@Samanthaprabhu2 #SamanthaRuthPrabhu #Kushi pic.twitter.com/N4kbCl0n8D — NARESH (@naresh__off_) July 4, 2023 -
సీనియర్ హీరోయిన్‌పై మనుసు పడిన రౌడీబాయ్
టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచాడు. ఇప్పుడిప్పుడే 'లైగర్' సినిమా గొడవల నుంచి బయటపడుతున్న ఈ యంగ్ హీరో తన నెక్స్ట్ సినిమా కోసం సీనియర్ హీరోయిన్ను తీసుకోవాలని దర్శక నిర్మాతలకు సలహా ఇచ్చాడట. ఇప్పటికే సమంత కాంబినేషన్లో ఖుషి సినిమా చేస్తున్న విజయ్ .. తర్వాత సినిమాకు కూడా సీనియర్ హీరోయిన్‌పైనే ఆసక్తి చూపుతున్నాడట. తాజాగా నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ పరశురాంతో కలిసి ఓ సినిమాను విజయ్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకోవాలని వారికి సూచించాడట. ఇదే టాపిక్ టాలీవుడ్లో తెగ వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. అందరి చర్చ దానిపైనే!) పూజానే ఎందుకు? పూరి డైరెక్షన్లో 'జనగణమన' సినిమాను తెరకెక్కించాలనుకున్న విజయ్‌కు 'లైగర్' షాక్ ఇవ్వడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇదే సినిమాలో పూజ హెగ్డేను హీరోయిన్గా కూడా ఓకే చేశారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ లేదు కాబట్టి.. పరుశురాం సినిమాతో తనను తీసుకోవాలని విజయ్ ప్లాన్ చేశాడట. ఈ విషయంపై మేకర్స్ కూడా ఓకే చెప్పారట. ఏదేమైనా సమంత తర్వాత మరో సీనియర్ హీరోయిన్‌తో నటించే అవకాశాన్ని విజయ్ దేవరకొండ పొందాడు. (ఇదీ చదవండి: మంచు మనోజ్- భూమా మౌనిక.. ఇంత ఫ్యాషన్‌గా ఎప్పుడైనా చూశారా?) -
ఫ్యామిలీ మ్యాన్ 2 ని మించే సీన్స్ లో కనిపించనున్న సమంత
-
సమంత ట్వీట్ కి అఖిల్ రిప్లై అదుర్స్
-
అది నన్ను హర్ట్ చేసింది: సమంత
2016 నుంచి ఏకంగా ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన బ్లాక్‌బెర్రీ ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో తాజాగా సొంత ఓఎస్ ఫోన్లు పని చేయవంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బ్లాక్ బెర్రీ ఫోన్ పదిహేనేళ్లపాటు కోట్ల మంది యూజర్లను అలరించింది. ఈ మేరకు ఇక తమ ఫోన్ల శకం ముగింసిందని ప్రకటించడంతో చాలా మంది వినయోగదారులు నిరాశకు గురయ్యారు. ఇదే తరహాలో టాలీవుడ్ హిరోయిన్ సమంత కూడా ఈ విధంగా ప్రకటించడం తనను కూడా చాలా బాధించింది అని చెబుతోంది. (చదవండి: ‘టైం కి డ్రోన్ రాకపోయుంటే నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి’) ఈ బ్లాకెబెర్రీ ఫోన్లు 2000 సంవత్సరం ప్రారంభంలో చాలా ప్రజాదరణ పొందిన వ్యక్తులు వినియోగించేవారు. పైగా వాటిని "క్రాక్బెర్రీస్" అని పిలిచేవారు. అంతేకాదు కిమ్ కర్దాషియాన్, బరాక్ ఒబామా లాంటి ప్రముఖులు ఈ ఫోన్లనే వాడేవాళ్లు. పెద్ద కీబోర్డు, మధ్యలో ఐబాల్.. కీ సెటప్‌తో ప్రత్యేకంగా ఆకర్షించేవి. అలాంటి ఫోన్లు శకం ముగియడంతో సమంత ఈ బ్లాక్బెర్రీఫోన్లకు చాలా బాధగా వీడ్కోలు పలుకుతున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పైగా ఈ విషయం నన్ను ఎందుకింత బాధించిందో తనకు తెలియదు అని ఇన్‌స్టాలో పేర్కొంది. (చదవండి: షాకింగ్ వీడియో: విధులకు గైర్హాజరు అవ్వడంతో నర్సు పై దాడి) Even though I haven't used it since 2010, I'm sad that my @BlackBerry is now an actual relic of the past. pic.twitter.com/Idvg6OQeuA — Ray Price (@_RayPrice) January 6, 2022 -
బిజీ బిజీగా మన స్టార్ హీరోయిన్లు..
హీరోలు ఒకేసారి ఒకటీ రెండు సినిమాలు మాత్రమే చేస్తుంటారు. హీరోయిన్లు ఏకకాలంలో నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తారు హీరోయిన్లు. ఉదయం ఓ సినిమా – మధ్యాహ్నం మరో సినిమా – సాయంత్రం ఇంకో సినిమా.. ఇలా ఆ సెట్‌కీ ఈ సెట్‌కీ తిరుగుతూ షూటింగ్ చేస్తుంటారు. ప్రస్తుతం మన స్టార్ హీరోయిన్లు చేసున్న సినిమాల వివరాలు చూద్దాం. కాజల్ అగర్వాల్: చిరంజీవితో ‘ఆచార్య’, మంచు విష్ణుతో ‘మోసగాళ్లు’, హిందీలో జాన్ అబ్రహామ్‌తో ‘ముంబై సాగా’, తమిళంలో కమల్‌తో ‘భారతీయుడు 2’, దుల్కర్ సల్మాన్ తో ‘హే సినామికా’, ‘గోస్టీ’ చిత్రాలు చేస్తున్నారు. రకుల్ ప్రీత్: నితిన్ తో ‘చెక్’, క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా, తమిళంలో శివ కార్తికేయన్‌తో ‘అయలాన్’, కమల్‌హాసన్‌తో ‘ఇండియన్ 2’, హిందీలో ‘అటాక్, సర్దార్ అండ్ గ్రాండ్సన్, మే డే, థ్యాంక్‌గాడ్’ సినిమాలు చేస్తున్నారు. తమన్నా: గోపీచంద్‌తో ‘సీటీమార్’, నితిన్‌తో ‘అంధా ధున్ రీమేక్, సత్యదేవ్‌తో ‘గుర్తుందా శీతాకాలం’, వెంకటేశ్‌తో ‘ఎఫ్3’, హిందీలో నవాజుద్దిన్ సిద్దిఖీ ‘బోల్ చుడియా’ సినిమాలు చేస్తున్నారు. శ్రుతీహాసన్ : పవన్ కల్యాణ్‌తో ‘వకీల్ సాబ్’, ప్రభాస్‌తో ‘సలార్’, తమిళంలో విజయ్ సేతుపతితో ‘లాభం’ సినిమాలు చేస్తున్నారు. సమంత: గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా, తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాదువాక్కుల రెండు కాదల్’ సినిమాలు చేస్తున్నారు. కీర్తీ సురేష్: నితిన్ తో ‘రంగ్ దే’, మహేశ్‌బాబుతో ‘సర్కారువారి పాట’, గుడ్ లక్ సఖి, తమిళంలో రజనీకాంత్‌తో ‘అన్నాత్తే’, సాని కాయిదం, మలయాళంలో ‘మరక్కార్ : అరబికడలింటే సింహం, వాషి’ చేస్తున్నారు. సాయి పల్లవి: నాగచైతన్యతో ‘లవ్‌స్టోరీ’, రానాతో ‘విరాటపర్వం’, నానితో ‘శ్యామ్ సింగరాయ్’, పవన్ కల్యాణ్‌తో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ సినిమాలు చేస్తున్నారు. పూజా హెగ్డే: చిరంజీవి ‘ఆచార్య’, ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’, అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, హిందీలో సల్మాన్‌ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’, రణ్వీర్ సింగ్‌తో ‘సర్కస్’ చేస్తున్నారు. రష్మికా మందన్నా: అల్లు అర్జున్‌తో ‘పుష్ప’, శర్వానంద్‌తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’, తమిళంలో కార్తీతో ‘సుల్తాన్’ హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’, అమితాబ్ బచ్చన్ తో ‘డాడీ’ సినిమాలు చేస్తున్నారు. రాశీ ఖన్నా: తెలుగులో గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’ తమిళంలో విజయ్ సేతుపతితో ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్ మణై 3’, మలయాళంలో ‘భ్రమం’ సినిమాలు చేస్తున్నారు. అనుష్క: ఒకే ఒక్క సినిమా కమిట్ అయ్యారు. ‘రారా కృష్ణయ్య’ దర్శకుడు మహేశ్ పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మరికొందరు ‘స్కై ల్యాబ్’, ‘నిన్నిలా నిన్నిలా’ చేస్తున్నారు నిత్యామీనన్ . ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి చేతిలో నాని ‘శ్యామ్ సింగరాయ్’, సుధీర్‌బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలు ఉన్నాయి. ‘వరుడు కావలెను’, ‘టక్ జగదీష్’, నిన్నిలా నిన్నిలా’ సినిమాలు చేస్తున్నారు రీతూ వర్మ. ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’, ‘చావు కబురు చల్లగా’ సినిమాలు చేస్తున్నారు లావణ్యా త్రిపాఠి. పవన్ కల్యాణ్ – క్రిష్ సినిమా చేస్తున్నారు నిధీ అగర్వాల్. శర్వానంద్‌తో ‘శ్రీకారం’ , తమిళంలో సూర్యతో ఓ సినిమా చేస్తున్నారు ప్రియాంకా మోహనన్ . నానీతో ‘టక్ జగదీష్’, సాయితేజ్ ‘రిపబ్లిక్’ చేస్తున్నారు ఐశ్వర్యా రాజేశ్. ‘ఎఫ్ 3’ చేస్తున్నారు మెహరీన్.. ‘అంధా ధున్ ’ రీమేక్‌లో నటిస్తున్నారు నభా నటేశ్. ‘సిద్ధా ఇదేం లోకం నాయనా’, ‘కళియుగం’ సినిమాలు చేస్తున్నారు శ్రద్ధా శ్రీనాథ్. -
మాల్దీవుల్లో సమంతా సందడి : ఫోటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్: మాల్దీవుల్లో సెలవులను ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని ఇన్స్టాగ్రామ్ పిక్స్‌తో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తన భర్త నాగ చైతన్యతో కలిసి మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లిన ఆమె అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అద్బుతమైన ఫోటోలతో సందడి చేస్తున్నారు. గురువారం ఉదయం ఈతకు వెళ్లిన ఆమె బికినీ ఫోటోలను షేర్ చేశారు. నీలినీలి ఆకాశం, బ్లూ సీ రిఫ్లెక్షన్లో రిఫ్రెష్ అవుతున్న మధుర క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అంతేకాదు ఆమె పోస్ట్ చేసిన బాత్‌టబ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆహ్లాదకరమైన సముద్రతీరంలో, డాల్సిన్లతో ఈత కొడుతూ, సైకిల్‌పై చక్కర్లు కొడుతూ గడుపుతున్నారు. ఈ సందర్భంగా సమంతా షేర్ చేసిన వీడియో కూడా ఆకట్టుకుంటోంది. (కొడుకుతో నటి క్రికెట్ : ఫోటోలు చూస్తే ఫిదానే) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాను చిత్ర యూనిట్
-
తెలుగు సినిమాకి మంచి కాలం
‘‘ప్రస్తుతం తెలుగు సినిమాకు గ్రేట్ టైమ్. కాన్సెప్ట్ మూవీలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందరికీ ధైర్యం వచ్చింది. ఈ ధైర్యాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు అక్కినేని సమంత. అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం ‘ఎవరు’. ఈ చిత్రంలో రెజీనా కథానాయికగా నటించారు. నవీన్ చంద్ర కీలక పాత్రధారి. వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేసిన సమంత మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగా నచ్చింది. సినిమా మీద ఆసక్తి పెరిగింది. కొత్త కంటెంట్ సినిమాలతో ఇండస్ట్రీని అడివి శేష్ ముందుకు తీసుకెళ్తున్నాడు. అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కించారు వెంకట్. రెజీనా మంచి నటి. నవీన్‌చంద్రతో సహా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు సమంత. ‘‘సమంతలోని పాజిటివ్ వైబ్స్ లక్‌గా మారతాయి. ‘గూఢచారి’ సమయంలో ఆమె సపోర్ట్ చేశారు. ‘క్షణం’ ముందు వరకు అందరూ నన్ను విలన్‌గా చూశారే తప్ప... మెయిన్ లీడ్‌గా ఎవరూ చూడలేదు. ఆ సమయంలో నన్ను నమ్మిన ఒకే ఒక వ్యక్తి పీవీపీగారు. ఆయనకు థ్యాంక్స్. నేను ఎప్పుడూ మంచి సినిమాలో భాగం కావాలనుకుంటాను. ఎందుకంటే మనం ఉండొచ్చు. లేకపోవచ్చు. కానీ మంచి సినిమా ఎప్పుడూ ఉంటుంది. ఈ నమ్మకంతోనే ఈ సినిమా తీశాం. వెంకట్‌ను ఈ సినిమాను మనసు పెట్టి చేయమన్నాను’’ అన్నారు అడివి శేష్. ‘‘మంచి పాత్ర చేశాను’’ అన్నారు నవీన్‌చంద్ర. -
సామ్ నెక్స్ట్ నువ్వే....?
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియాలో చాలెంజ్‌లు ట్రెండ్ అవుతుంటాయి. ఈ కోవలోనే గతంలో ఐస్ బకెట్ చాలెంజ్, ప్యాడ్మాన్ చాలెంజ్‌లు ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఇప్పుడు ఫిట్నెస్ చాలెంజ్ ట్విటర్లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒలింపిక్ పతక విజేత, కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఈ చాలెంజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రాజ్యవర్ధన్‌తో మొదలై విరాట్, హృతిక్, అనుష్క శర్మ, సింధు, సైనాలు సహా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించిన వారిలో ఉన్నారు. ఇప్పుడు ఈ కోవలోకి అక్కినేని కుటుంబం చేరింది. తాజాగా నాగచైతన్య ఈ చాలెంజ్‌ను స్వీకరించి, ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియోను పోస్టు చేశారు. నాగ చైతన్యను అఖిల్ సవాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగచైతన్య తన భార్య సమంతను, అక్కినేని సుమంత్, నిధి అగర్వాల్‌కు ఫిట్నెస్ సవాలును విసిరారు. దీని గురించి సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్యూట్ మెసేజ్ పోస్టు చేశారు. ‘హమ్‌ఫిట్‌తో ఇండియాఫిట్ చాలెంజ్ నాకు చాలా నచ్చింది. కళ్లకు, మనసుకు చాలా తేలికగా అనిపిస్తుంది. చై నేను నీ సవాల్‌ను స్వీకరిస్తున్నాను. కానీ నువ్వు పోస్టు చేసిన వీడియో చూసి నేను అలసిపోయాను. కాబట్టి రేపు నేను నీ సవాల్‌ను పూర్తి చేస్తాను’ అంటూ పోస్టు చేశారు. సమంత పోస్టు చేయబోయే ఎక్సర్సైజ్ వీడియో కోసం చై కంటే కూడా సామ్ అభిమానులే ఎక్కువ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మహానటి చిత్రంలో మధురవాణిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం యూ టర్న్ సినిమాలో స్వయంగా తానే నటిస్తూ తొలిసారిగా నిర్మాతగా మారారు. The #HumFitTohIndiaFit challenge .. I am quite liking this challenge . So easy on the eyes 😍😍😍 and heart ❤️but mostly eyes 🙃 . I accept your challenge Chay Akkineni But just watching this makes me tired .So tomorrow 😁 A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on May 24, 2018 at 1:28am PDT -
కూకట్పల్లి బిగ్ సిలో సందడి చేసిన సమంత
-
అందరికీ దండాలండోయ్!
తమిళసినిమా: మెర్శల్ చిత్రాన్ని ఆదరిస్తున్న వారికి, అండగా నిలిచిన వారికి దండాలండోయ్ అని అంటున్నారు ఇళయదళపతి విజయ్. ఈ స్టార్ నటుడు కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం మెర్శల్. సమంత, కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ మెర్శల్ దీపావళి సందర్భంగా విడుదలై ఎంత సంచలన విజయం దిశగా పరుగులెడుతుందో,అంతగా వివాదానికి తెరలేపింది. జాతీయ స్థాయిలో దుమారం రేపిన మెర్శల్ చిత్ర కథానాయకుడు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.అందులో సంచలన విజయాన్ని సాధిస్తున మెర్శల్ చిత్రం కొన్ని వ్యతిరేక సంఘటనలను ఎదుర్కొంది. అలాంటి చిత్రానికి ఘన విజయాన్ని కట్టబెట్టడంతో పాటు అండగా నిలిచిన నా చిత్రపరిశ్రమకు చెందిన మిత్రులకు, సన్నిహితులకు, నటీనటులకు, సినీ సంఘాలు దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి, దక్షిణ భారత నటీనటుల సంఘం, నిర్మాతలమండలి నిర్వాహకులకు, అభిమానులకు, ఇతర ప్రేక్షకులకు నా తరఫున, మెర్శల్ చిత్ర యూనిట్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని విజయ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
తెలుగు ప్రేక్షకులు నాకిచ్చిన పెళ్లి బహుమతి ఇది – సమంత
‘‘అమ్మకు ఆస్ట్రాలజీ అంటే నమ్మకం. ఓ సారి ఓ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్లినప్పుడు... ‘మీరు కొత్త పాత్రలు చేస్తే తప్పకుండా హిట్’ అన్నారు. అప్పట్నుంచి ఎప్పుడు కొత్త పాత్రలు చేసినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రాజుగారి గదిలో అందరూ డబ్బులు నిండుతున్నాయంటున్నారు. ఆ సంగతి పక్కనపెడితే, గదిలో ప్రశంసలు నిండటం చాలా హ్యాపీగా ఉంది. ‘సొగ్గాడే చిన్ని నాయనా’ కన్నా పెద్ద హిట్టా మావయ్యా?’ అనడుగుతోంది సమంత. ఆ విషయం తనకు తర్వాత చెబుతా’’ అని నవ్వేశారు నాగార్జున. ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున, సమంత, శీరత్ కపూర్, అశ్విన్, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్ ముఖ్య తారలుగా పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటరైన్మెంట్స్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించిన సినిమా ‘రాజుగారి గది–2’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్ ఆదివారం జరిగింది. నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఫ్యాన్స్ ఫోన్ చేసి... ‘మా హీరో ఇలాంటి సినిమా చేశాడని కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాం’ అన్నారు. ఇలాంటి పాత్రలే చేయమని అడుగుతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? కొత్త కోడలు బ్లాక్ బ్లస్టర్ ఇచ్చింది. ఈ హిట్‌కి నిర్మాతలు, ఓంకార్, తమన్, అబ్బూరి రవి నాలుగు స్తంభాలుగా నిలిచారు’’ అన్నారు. ‘‘ఈ విజయాన్ని తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన పెళ్లి బహుమతిగా భావిస్తున్నా. క్లైమాక్స్‌లో నా క్యారెక్టర్ బాగా రావడానికి, నేను బాగా నటించడానికి హెల్ప్ చేసిన మావయ్యకు థ్యాంక్స్’’ అన్నారు సమంత. ‘‘నైజాంలో ‘ఊపిరి’ ఫస్ట్‌డే షేర్ 80 లక్షలు అయితే... ‘రాజుగారి గది–2’కి కోటిన్నర వచ్చింది. సినిమా ఎంత హిట్టనేది చెప్పడానికే ఈ లెక్కలు చెప్పా. నాగార్జునగారి కెరీర్లో మరో మైల్‌స్టోన్‌గా నిలుస్తుందనుకుంటున్నా. అక్కినేని ఫ్యామిలీకి సమంత లక్కీ లేడీ’’ అన్నారు పీవీపీ. ‘‘పీవీపీగారితో హ్యాట్రిక్ హిట్ అందుకున్నందుకు హ్యాపీగా ఉంది. సినిమా పైరసీ కాపీలు వచ్చేశాయని విన్నాం. ప్లీజ్... కిల్ పైరసీ. థియేటర్లోనే సినిమా చూడండి’’ అన్నారు ‘మ్యాట్నీ’ జగన్. ‘‘ఓ ఫైట్ లేదు, పాట లేదు. అయినా... నాగార్జునగారు కథను నమ్మారు. ఆయన ఫ్యాన్స్ ఆయన్ను వేరేలా ఎక్స్పెక్ట్ చేస్తారేమోనని భయపడ్డా. కానీ, సినిమాను ఆదరించారు. అక్కినేని కోడలు ఇచ్చిన తొలి హిట్ తీసిన దర్శకుడిగా నాకు క్రెడిట్ దక్కినందుకు హ్యాపీ’’ అన్నారు ఓంకార్. శీరత్ కపూర్, అభినయ, అశ్విన్, సంగీత దర్శకుడు తమన్, మాటల రచయిత అబ్బూరి రవి పాల్గొన్నారు. రాజుగారి గది 2 సక్సస్ మీట్ వీడియో -
బ్యాచిలర్ పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్!
బ్యాచిలర్స్ పార్టీల్లో ఎవరెవరు కనిపిస్తుంటారు? పెళ్లి చేసుకోబోయే అబ్బాయి లేదా అమ్మాయి స్నేహితులు. బహుశా... శనివారం రాత్రి అయ్యుండొచ్చు! అక్కినేని నాగచైతన్య, సమంతలు తమ ఫ్రెండ్స్‌కి బ్యాచిలర్ పార్టీ ఇచ్చారట! రామ్‌చరణ్, చైతూ తమ్ముడు అఖిల్ నుంచి మొదలుకొని చైతూ–సమంత స్నేహితులు ఎందరో పార్టీకి వచ్చారు. వాళ్లలో ఒకతనున్నాడు... మీసం లేదు, గడ్డం లేదు, మాంచి హ్యాండ్సమ్ పర్సనాలిటీ! అతన్ని ఎవరైనా కాస్త దూరం నుంచి చూస్తే 30 ప్లస్ వ్యక్తి అనుకోవడం గ్యారెంటీ. దగ్గరకు వెళితే... అతనెవరో కాదు, ‘కింగ్’ నాగార్జున అని తెలిసి, కొంతమంది ఆశ్చర్యపోయారట. యస్... చైతూ–సమంత బ్యాచిలర్ పార్టీలో ఎవర్గ్రీన్ మన్మథుడు నాగార్జున స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారట! కుమారులతో నాగార్జున ఎప్పుడూ ఓ తండ్రిలా కాకుండా, ఫ్రెండ్‌లా ఉంటుంటారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందువల్లే, చైతూ తండ్రిని స్పెషల్‌గా పిలిచుంటారు. అఖిల్ కూడా ‘ఎ నైట్ ఎమాంగ్ స్టార్స్... మై త్రీ ఓల్డర్ బ్రదర్స్’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశారు. అందులో చరణ్, చైతూ, అఖిల్ కాస్త గడ్డాలతో కనిపిస్తుంటే... క్లీన్ షేవ్ లుక్‌తో నాగ్ హ్యాండ్సమ్గా ఉన్నారు. ఈ పార్టీతో చైతూ–సమంతల పెళ్లి సందడి మొదలైంది. వచ్చే నెల 6న వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెళ్లి షాపింగ్‌లో బిజీగా ఉన్నారట!! -
సమంత కొత్త హాబీ..!
-
సమంత కొత్త హాబీ..!
పెళ్లి వార్తల తరువాత సోషల్ మీడియాలో యమా యాక్టివ్ అయిన స్టార్ హీరోయిన్ సమంత, మరో ఇంట్రస్టింగ్ వీడియోతో అభిమానులను ఖుషీ చేసింది. ఇప్పటి వరకు సాఫ్ట్ రోల్స్‌లో మాత్రమే కానిపించిన ఈ బ్యూటీ, కర్రసాము చేస్తున్న వీడియో అభిమానులకు షాక్ ఇచ్చింది. 'నాకు ఛాలెంజ్ అంటే ఇష్టం. అందుకే కొత్త హాబీ సిలంబం (కర్రసాము). త్వరలోనే ఈ విద్యలో ప్రావీణ్యం సంపాధించాలనుంది' అంటూ ట్వీట్ చేసింది. అయితే సమంత హాబీగానే ఈ విద్య నేర్చుకుంటుందా..? లేక ఏదైనా సినిమా కోసమా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నాగార్జునతో కలిసి రాజుగారి గది 2తో పాటు రామ్ చరణ్, సుకుమార్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ సమంత నటిస్తోంది. ఈ రెండు సినిమాల తరువాత మరో రెండు తమిళ సినిమాలకు ఓకె చెప్పింది. ఈ మధ్యలోనే నాగచైతన్యతో తన పెళ్లితంతును ముంగించేందుకు ప్లాన్ చేసుకుంటుంది. Because I like a challenge -
త్రివిక్రమ్ 'పొల్లాచి' షెడ్యూల్ పూర్తయింది!
క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అ..ఆ..' (అనసూయ రామలింగ్ vs ఆనంద్ విహారి) సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ తమిళనాడు పొల్లాచిలో తమ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక్కడ సినిమా చిత్రీకరణ ముగియడంతో ఆనందంతో చిత్ర యూనిట్ ఓ ఫొటో దిగింది. ఈ ఫొటోను డైరెక్టర్ త్రివిక్రమ్ తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్టు చేశారు. హీరో నితిన్, హీరోయిన్ సమంత, డైరెక్టర్ త్రివిక్రమ్ తదితరులు ఈ ఫొటోలో ఉన్నారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న 'అ..ఆ..' చిత్రం ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయాలని భావించారు. అయితే షూటింగ్ ఆలస్యం కావటం ఏప్రిల్‌కు వాయిదా వేశారు. ఏప్రిల్ 22న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ చెప్తోంది. -
దేవరాంపల్లిలో షూటింగ్ సందడి
చేవెళ్ల మండలం దేవరాంపల్లి గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద శుక్రవారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. హీరో నితిన్, హీరోయిన్ సమంతలతో దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ(చిన్నబాబు) నిర్మిస్తున్న చిత్రం సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిం చారు. ఓ ఫైట్ సీన్‌ను బ్రిడ్జిపై షూట్ చేశారు. హారికహాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు అ...ఆ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. రెండుమూడురోజుల పాటు గ్రామ సమీపంలో మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. షూటింగ్‌ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రావడంతో సందడి నెలకొంది. - చేవెళ్ల రూరల్ -
ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు!
‘‘ఆ దేవుడు నన్నెప్పుడూ చిన్న చూపు చూడలేదు. హీరోయిన్గా మంచి హోదాలో నిలబెట్టాడు. ఎంతోమంది అభిమానులు నా సొంతం అయ్యేలా చేశాడు. ఇక, ఈ ఏడాదైతే ఫుల్‌గా ఆశీర్వదించేశాడు. అలా ఎందుకు అంటున్నానంటే ప్రస్తుతం నా చేతిలో ఉన్నవన్నీ మంచి సినిమాలే. ఈ సినిమాల తాలూకు ఫలితం తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నాను. అందుకే, విడుదల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని సమంత అంటున్నారు. కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాదు.. విడిగా బోల్డన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటారామె. అలా చేయడానికి ప్రేరణగా నిలిచింది మా అమ్మగారే అని సమంత చెబుతూ - ‘‘ఒకప్పుడు మాది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. అయినప్పటికీ మా అమ్మగారు ఇతరులకు సహాయం చేసేవారు. నా కలలో కూడా నాకు దేవుడు బోల్డంత డబ్బులిస్తాడనుకోలేదు. కానీ, ఇచ్చాడు. అందుకే, సేవా కార్యక్రమాలు చేస్తున్నాను’’ అన్నారు. -
షాపింగ్ మాల్ ప్రారంభించిన సమంత
-
సదా మీ సేవలో..
చీకటి వెలుగుల జీవితంలో అందరూ కోరుకునేది వెలుగే. ఆ జిలుగు నీడలో పదిమందినీ ఆహ్వానించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారి గురించి పదివుందికీ తెలిస్తే.. మరెందరి హృదయూల్లోనో సేవాభావం వెలుగు చూస్తుంది. సవూజం కోసం మీరు చేతులు కలిపి.. చేసిన చేతల వివరాలు మాకు తెలియజేయుండి. మీకు స్ఫూర్తిగా స్టార్‌డమ్‌కి సేవను జోడించి తనదైన శైలిలో స్పందిస్తున్న సినీ నటి సమంత ‘సిటీప్లస్’లో వెలుగుచూసే కథనాలకు బాసటగా నిలుస్తానంటోంది. మీరు చేయూల్సిందల్లా.. ఓ సంస్థ ద్వారా, వ్యక్తిగతంగా మీరు చేస్తున్న సేవల వివరాలను మాకు మెరుుల్ చేయుండి. వాటిని ‘సిటీప్లస్’లో ప్రచురిస్తాం. వీటిలో ఉన్నతమైన వాటిని ఎంపిక చేసి.. సదరు సేవా సంస్థలు, వ్యక్తులను సమంత పలకరిస్తారు. ఒక్క సమంత మాత్రమే కాదు.. సేవ చేసే హృదయూలను అభినందించడానికి మరెందరో సెలిబ్రిటీలు ముందుకు రానున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు చేస్తున్న చారిటీ వివరాలు sakshicityplus@gmail.com -
సమంతకు మద్దతుగా సుచిత్ర చిత్ర ప్రదర్శన
సినీనటి సమంత చేస్తున్న సేవా కార్యక్రమాలకు మద్దతుగా, ఆమె ఆధ్వర్యంలోని ప్రత్యూష ఫౌండేషన్‌కు నిధుల సేకరణ కోసం ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ భార్య, చిత్రకారిణి సుచిత్రా కృష్ణమూర్తి ఆదివారం నగరంలోని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రకళా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇదే కార్యక్రమంలో ఆమె తాను రాసిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. సుచిత్రా కృష్ణమూర్తి చిత్రకళా ప్రదర్శన ఆదివారం రాత్రి 7.00 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది వారం రోజులు కొనసాగుతుంది. తన సేవా కార్యక్రమాలకు సుచిత్ర చేయూతనివ్వడంపై సమంత హర్షం వ్యక్తం చేశారు. -
సమంతకు వైరాగ్యం!
ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న సమంత మాట తీరు చూస్తుంటే ఇటీవల ఆమెకు వైరాగ్యం ఆవహించినట్లుంది. అక్కినేని నాగచైతన్యతో 'ఏం మాయ చేశావే' సినిమాతో టాలీవుడ్లో జెండాపాతి, ఆ తరువాత వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టింది. దాంతో ఈ ముద్దుగుమ్మ గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకుంది. ఈ బొమ్మ నటించిన మూవీ హిట్ అని టాలీవుడ్లో ఓ సెంటిమెంట్ ఏర్పడిపోయింది. ఐతే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అలాంటి టాప్ హీరోయిన్‌కు కూడా కష్టాలొచ్చి పడ్డాయి. జీవితం అంటే ఇదే. ఓవర్ నైట్‌లో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోయిన సమంత ఇప్పుడు కోలీవుడ్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. రెండు భాషల్లోనూ దుమ్మురేపుతున్న సమయంలోనే సమంత కెరీర్ కాస్త స్లో అయింది. ఈ మధ్య వచ్చిన సినిమాలు సమంత రేంజ్‌కు తగ్గట్టుగా లేవని టాక్ నడుస్తోంది. దానికి ప్రధాన కారణం అంతకు ముందు కాస్త సాంప్రదాయబద్దంగా దుస్తులు వేసుకొని నటించిన ఈ చిన్నది ఈ మధ్య అందాలు ఆరబోయడం మొదలు పెట్టింది. ఎక్స్పోజింగ్ చేయాలన్నా శరీరసౌష్టవం దానికి తగినట్లుగా ఉండాలి. అదేంలేకుండా చీలికలు, పీలికల దుస్తులు, బికినీలు వేసుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదన్న విషయం అర్ధంకానట్లుంది. పరిస్థితి సమంతకు అర్ధమైనట్లుంది. తన మనసులోని మాటలు ఒక్కొక్కటిగా బయట పెడుతోంది. మార్కెట్ తగ్గిన తర్వాత కాకుండా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న టైంలోనే నటనకు స్వస్తి చెబుతానని చెప్పింది. ఎదురుదెబ్బలు తగులుతున్నాయి కాబట్టే సమంత ఇలా మాట్లాడుతోందని ఫిలింనగర్ జనాల అభిప్రాయం. అంతేకాదు, ఈ మధ్య సమంత ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. అందేంటో తెలుసా? పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకునే అమ్మాయిలు సినీ పరిశ్రమలోకి రావద్దని చెప్పింది. ఇదంతా చూస్తుంటే సమంతకు వైరాగ్యం వచ్చేసిందని ఫిల్మ్ నగర్ వర్గాలు అనుకుంటున్నాయి. ఏ హీరోయిన్‌కైనా ఒడిదుడుకులు సహజం. మరి సమంత ఎందుకంత ఇదై పోతుందో అని గుసగుసలు వినిపిస్తున్నాయి. **