‘ఆటోనగర్ సూర్య’దీపావళికి వస్తున్నాడు
‘ఆటోనగర్ సూర్య’దీపావళికి వస్తున్నాడు
Published Fri, Aug 30 2013 12:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
‘ఆటోనగర్ సూర్య’ హంగామా చేయడానికి సన్నద్ధమవుతున్నాడు. బ్యాలెన్స్ వర్క్‌ని పూర్తి చేసి, దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ‘ఏమాయ చేసావె’ తర్వాత నాగచైతన్య, సమంత కలిసి చేస్తున్న సినిమా ఇది.
‘వెన్నెల’, ‘ప్రస్థానం’ చిత్రాలతో దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న దేవా కట్టా ఈ మాస్ చిత్రాన్ని క్లాస్‌గా డీల్ చేస్తున్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 10న చివరి షెడ్యూలు మొదలుకానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ షెడ్యూల్‌లో ఒక పాట, రెండు రోజుల ప్యాచ్‌వర్క్ పూర్తి చేస్తాం.
ఆ తర్వాత మలేసియాలో పాట చిత్రీకరిస్తాం. దాంతో సినిమా పూర్తవుతుంది. మరోపక్క నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలుపెట్టాం’’ అని తెలిపారు. బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్.
Advertisement
Advertisement