సూర్య మళ్లీ పట్టాలెక్కుతున్నాడు! | Walking tracks the surya again | Sakshi
Sakshi News home page

సూర్య మళ్లీ పట్టాలెక్కుతున్నాడు!

Published Mon, Aug 26 2013 2:04 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM

సూర్య మళ్లీ పట్టాలెక్కుతున్నాడు!

సూర్య మళ్లీ పట్టాలెక్కుతున్నాడు!

బాక్సాఫీస్ వద్ద తన ‘తడాఖా’ చూపించి మంచి జోష్ మీదున్నారు నాగచైతన్య. ప్రస్తుతం తాతయ్య, తండ్రితో కలిసి ‘మనం’లో నటిస్తూ బిజీగా ఉన్నారాయన. అయితే... ఈ మధ్యలో సైన్ చేసి, దాదాపు షూటింగ్ కూడా పూర్తి చేసిన సినిమా ఒకటుంది. అదే ‘ఆటోనగర్ సూర్య’. మరి ఆ సినిమా మాటేంటి? అటు పరిశ్రమనూ ఇటు ప్రేక్షకులనూ వెంటాడుతున్న ప్రశ్న ఇది. 
 
 ఈ ప్రశ్నకు సదరు చిత్ర దర్శకుడు దేవా కట్టా సమాధానం చెప్పేశారు. కొన్ని కారణాల వల్ల నిర్మాణం విషయంలో అంతరాయం తలెత్తిన ‘ఆటోనగర్ సూర్య’ చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ఆయన పేర్కొన్నారు. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తిగావచ్చిందని, మిగిలిన భాగాన్ని పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెస్తామని దేవా కట్టా ట్విట్టర్‌లో తెలిపారు. 
 
 దేవా కట్టా గతంలో తీసిన సినిమాలు వెన్నెల, ప్రస్థానం. రెండూ ఒకదానితో ఒకటి సంబంధం లేని కాన్సెప్ట్‌లు. ఈ రెండు సినిమాలతో దర్శకునిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారాయన. ముఖ్యంగా ‘ప్రస్థానం’తో విమర్శకుల ప్రశంసలందుకున్నారు. 
 
 మరి నాగచైతన్యను ‘ఆటోనగర్ సూర్య’గా ఆయన ఎలా చూపిస్తారో తెలుసుకోవాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రాష్ట్రంలో చర్చనీయాంశమైన ఓ అంశం ఆధారంగా ఆయన ఈ చిత్ర కథను తయారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: అనూప్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement