దేవరాంపల్లిలో షూటింగ్ సందడి | trivikram srinivas shooting in devarampally | Sakshi
Sakshi News home page

దేవరాంపల్లిలో షూటింగ్ సందడి

Published Sat, Dec 26 2015 2:51 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

దేవరాంపల్లిలో షూటింగ్ సందడి - Sakshi

దేవరాంపల్లిలో షూటింగ్ సందడి

చేవెళ్ల మండలం దేవరాంపల్లి  గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద శుక్రవారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. హీరో నితిన్, హీరోయిన్ సమంతలతో దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ(చిన్నబాబు) నిర్మిస్తున్న చిత్రం సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిం చారు. ఓ ఫైట్ సీన్‌ను బ్రిడ్జిపై షూట్ చేశారు.
 
 హారికహాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు అ...ఆ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. రెండుమూడురోజుల పాటు గ్రామ సమీపంలో మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. షూటింగ్‌ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి
 పెద్ద ఎత్తున రావడంతో సందడి నెలకొంది.         
                               - చేవెళ్ల రూరల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement