అంతం లేనిదీ ప్రేమ! | Endless love! | Sakshi
Sakshi News home page

అంతం లేనిదీ ప్రేమ!

Dec 7 2016 12:45 AM | Updated on Sep 4 2017 10:04 PM

అంతం లేనిదీ ప్రేమ!

అంతం లేనిదీ ప్రేమ!

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు సూటిగా చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతాయి.

సినిమాల్లోనైనా.. సినిమా వేడుకల్లోనైనా...
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు సూటిగా చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతాయి. కొన్ని పదాలకు ఆయన ఇచ్చే నిర్వచనాలు ఆకట్టుకుంటాయి. ఐడియా దర్శక, నిర్మాతల్లో ఎవరిదో కానీ త్రివిక్రమ్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా సినిమా టైటిల్‌కి కూడా భలే నిర్వచనం కుదిరింది. నితిన్ హీరోగా పాటల రచయిత కృష్ణచైతన్య దర్శక త్వంలో పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్న సినిమాకి ‘జ్ఛీ’ (‘అబద్ధం’ అని అర్థం) అనే టైటిల్ ఖరారు చేశారట. ‘లవ్ ఈజ్ ఎండ్‌లెస్’ అనేది ఉపశీర్షిక. అంటే.. ‘ప్రేమ అనంతం’ అని అర్థం. ‘జ్ఛీ’కి  వీళ్లు ఇచ్చిన నిర్వచనం బానే ఉంది. మరి..  ‘లై’ అంటే అబద్ధం కాబట్టి.. ప్రేమకూ, అబద్ధానికీ కూడా సినిమాలో ఏదో ముడి ఉండే ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement