నితిన్ను ఉక్కిరి బిక్కిరి చేసిన సర్దార్ | POWERFUL guest on our sets last nite twitts nitin | Sakshi
Sakshi News home page

నితిన్ను ఉక్కిరి బిక్కిరి చేసిన సర్దార్

Published Thu, Apr 21 2016 8:43 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

నితిన్ను ఉక్కిరి బిక్కిరి చేసిన సర్దార్ - Sakshi

నితిన్ను ఉక్కిరి బిక్కిరి చేసిన సర్దార్

యంగ్ హీరో నితిన్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అ..ఆ..'(అనసూయా రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) సినిమా సెట్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దర్శనమిచ్చారు. తాను నటిస్టున్న సినిమా సెట్కు పవర్ఫుల్ గెస్ట్ వచ్చారని నితిన్ ట్విట్టర్ లొ పేర్కొన్నారు. ఆయన ముందు నటించడం చాలా ఆనందాన్నిచ్చిందని, ఒకింత నెర్వస్గా ఫీలయ్యానని తెలిపారు. పవన్, నితిన్, త్రివిక్రమ్ కలిసి దిగిన ఫోటోను కూడా ట్విట్ చేశారు.


ఇటీవలే పవన్ కల్యాణ్ నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' ట్రయిలర్‌లోని ఓ సన్నివేశాన్ని నితిన్ అనుకరించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి నటి సమంత, దర్శక - రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ లు కూడా తోడయ్యారు.ఓ చెక్క బొమ్మ పై పవన్ కల్యాణ్ అటూ ఇటూ ఊగుతూ ఉండే సన్నివేశం సర్ధార్ గబ్బర్ సింగ్ ట్రయలర్‌లో కనిపిస్తుంది. అయితే సరిగ్గా అలానే నితిన్ కూడా చేశాడు. దీనికి నటి సమంత కొరియోగ్రఫీ చేయగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. ప్రతి వేసవిలో పవన్ నుంచి వచ్చే మామిడి పళ్లను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకోవడం మనకు తెలుసు. ఈసారి ఏకంగా పవర్ స్టారే తన సినిమా సెట్ లో ప్రత్యక్షమవ్వడంతో నితిన్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement