
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్(Allu Arjun ) నటించే తదుపరి సినిమా ఏంటనేదానిపై ఇప్పుడు రకరకాల ఊహగానాలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. మొన్నటి వరకు త్రివిక్రమ్( Trivikram Srinivas)తో సినిమా ఉంటుంది.. అది కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా అని వార్తలు వినిపించాయి. ఇప్పుడేమో బన్నీ మరో తమిళ దర్శకుడితో చేతులు కలిపాడని, అదే ఇప్పుడు తెరకెక్కుతుందని అంటున్నారు. జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బన్నీ కోసం స్టోరీ రెడీ చేసిన గురూజీ
గుంటూరుకారం తర్వాత తివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమా చేయలేదు. ఆ సినిమా రిలీజ్‌కి ముందే బన్నీతో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బన్నీ సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేశారట. పుష్ప 2 రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కేస్తుందని అంతా భావించారు. కానీ బన్నీ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తివిక్రమ్ కంటే ముందు వేరే దర్శకుడితో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడట.
నా కోసం ఆరు నెలలు ఆగండి
తన కోసం కథ రెడీ చేసి సిద్ధంగా ఉన్న త్రివిక్రమ్‌ని తాజాగా బన్నీ కలిశారు. మరోసారి ఇద్దరు స్క్రిప్ట్ గురించి చర్చించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా బన్నీ తన మనసులో మాట చెప్పేశాడట. ఈ సినిమా షూటింగ్ కంటే ముందు మరో సినిమా చేస్తానని, 2026లో అది రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తివ్రిక్రమ్‌కి వివరించారట. ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజులకే.. ఈ సినిమా కూడా ప్రారంభిద్దామని, తనకోసం ఓ ఆరు నెలలు వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేశారట. దీనికి త్రివిక్రమ్ కూడా అంగీకరించారట.
రెండు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనేలా ప్లాన్ చేసుకోమని బన్నీని అడిగారట. ఆ సినిమా షూటింగ్ మొత్తం అయిపోయేవరకు తాను ఆగలేనని, మధ్యలో జాయిన్ అవుతానంటే తనకు ఓకే అని చెప్పారట. బన్నీ కూడా మొదట అట్లీ సినిమా షూటింగ్ ప్రారంభించి, తర్వాత త్రివిక్రమ్ మూవీని సెట్‌పైకి తీసుకురావాలనుకుంటున్నాడట. త్రివిక్రమ్ మూవీ షూటింగ్‌కి చాలా సమయం పడుతుంది. 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మధ్యలో అట్లీ సినిమా చేస్తే..అది వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసి గ్యాప్ లేకుండా చూసుకోవాలని బన్నీ భావిస్తున్నాడట. పుష్ప 1,2 చిత్రాల కోసం ఐదేళ్లు కేటాయించిన బన్నీ..ఇప్పుడు వరుస సినిమాలతో ఫ్యాన్స్‌ని అలరించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment