
టాలీవుడ్ హీరో నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ ఏడాది ఆగస్టు 8న వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.

హైదరాబాద్‌లో సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఇటీవల ఏఎన్నాఆర్ వేడుకల్లో కాబోయే అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల మెరిసింది.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి తన కోడలిని నాగార్జున పరిచయం చేశారు. ఇప్పటికే పెళ్లి పనులకు సంబంధించిన ఫోటోలను శోభిత షేర్ చేసింది.

పసుపు పనులతో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని పోస్ట్ చేసింది. తాజాగా శోభిత సిస్టర్ సమంత ధూళిపాళ్ల తన ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంది.

కౌంట్ డౌన్ మొదలైందంటూ అమ్మ,నాన్న, శోభితతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. పెళ్లికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అంటూ తన ఫ్యామిలీ పిక్స్‌ను పంచుకుంది.


నాగచైతన్య- శోభిత పెళ్లి వేడుక డిసెంబర్ 4న జరగనుంది.

ఈ వేడుకను అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
