సమంత కొత్త హాబీ..! | Samanta Karra Saamu | Sakshi
Sakshi News home page

సమంత కొత్త హాబీ..!

Published Thu, Apr 20 2017 10:00 AM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

సమంత కొత్త హాబీ..!

సమంత కొత్త హాబీ..!

పెళ్లి వార్తల తరువాత సోషల్ మీడియాలో యమా యాక్టివ్ అయిన స్టార్ హీరోయిన్ సమంత, మరో ఇంట్రస్టింగ్ వీడియోతో అభిమానులను ఖుషీ చేసింది. ఇప్పటి వరకు సాఫ్ట్ రోల్స్లో మాత్రమే కానిపించిన ఈ బ్యూటీ, కర్రసాము చేస్తున్న వీడియో అభిమానులకు షాక్ ఇచ్చింది. 'నాకు ఛాలెంజ్ అంటే ఇష్టం. అందుకే కొత్త హాబీ సిలంబం (కర్రసాము). త్వరలోనే ఈ విద్యలో ప్రావీణ్యం సంపాధించాలనుంది' అంటూ ట్వీట్ చేసింది.

అయితే సమంత హాబీగానే ఈ విద్య నేర్చుకుంటుందా..? లేక ఏదైనా సినిమా కోసమా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నాగార్జునతో కలిసి రాజుగారి గది 2తో పాటు రామ్ చరణ్, సుకుమార్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ సమంత నటిస్తోంది. ఈ రెండు సినిమాల తరువాత మరో రెండు తమిళ సినిమాలకు ఓకె చెప్పింది. ఈ మధ్యలోనే నాగచైతన్యతో తన పెళ్లితంతును ముంగించేందుకు ప్లాన్ చేసుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement