ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు!
‘‘ఆ దేవుడు నన్నెప్పుడూ చిన్న చూపు చూడలేదు. హీరోయిన్‌గా మంచి హోదాలో నిలబెట్టాడు. ఎంతోమంది అభిమానులు నా సొంతం అయ్యేలా చేశాడు. ఇక, ఈ ఏడాదైతే ఫుల్‌గా ఆశీర్వదించేశాడు. అలా ఎందుకు అంటున్నానంటే ప్రస్తుతం నా చేతిలో ఉన్నవన్నీ మంచి సినిమాలే. ఈ సినిమాల తాలూకు ఫలితం తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నాను. అందుకే, విడుదల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని సమంత అంటున్నారు. కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాదు.. విడిగా బోల్డన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటారామె.
అలా చేయడానికి ప్రేరణగా నిలిచింది మా అమ్మగారే అని సమంత చెబుతూ - ‘‘ఒకప్పుడు మాది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. అయినప్పటికీ మా అమ్మగారు ఇతరులకు సహాయం చేసేవారు. నా కలలో కూడా నాకు దేవుడు బోల్డంత డబ్బులిస్తాడనుకోలేదు. కానీ, ఇచ్చాడు. అందుకే, సేవా కార్యక్రమాలు చేస్తున్నాను’’ అన్నారు.