సమంత-అనుష్క
దక్షిణ భారత సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్ ప్రేక్షకులలో మంచి క్రేజీ ఉన్న సమంత అని విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆదాయ లెక్కలతో పోల్చితే సమంత కంటే బిగ్ పర్సనాలిటితో టాలీవుడ్ని ఏలుతున్న యోగా టీచర్ అనుష్క అని చెబుతున్నారు. సమంతకు సక్సెస్ఫుల్ హీరోయిన్ అన్న పేరు ఉన్నప్పటికీ అనుష్క భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తోంది. 2014 సంవత్సరం ఆదాయానికి సంబంధించిన లెక్కలను పరిశీలిస్తే సెక్సీ క్వీన్ అనుష్క సంపాదన 15 కోట్ల రూపాయల వరకు చేరుకుందని అంచనా. సినిమాలతోపాటు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలు, బ్రాండింగ్ తరహా క్యాంపెన్ల వంటి సంపాదనంతా లెక్కగడితే ఇంత సంపాదించినట్లు తేలిందని కోలీవుడ్ వర్గాల సమాచారం.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధికంగా సంపాదిస్తున్న హీరోయిన్స్ ఎవరు అన్న దానిపై కోలీవుడ్లో ఇటీవల ఓ మ్యాగజైన్ సర్వే నిర్వహించింది. అందులో అనుష్క మొదటి స్థానం ఆక్రమించినట్లు తెలుస్తోంది. ఆ తరువాతి స్థానంలో గోల్డెన్ లెగ్గా పేరు సంపాదించిన సమంత ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అనుష్క దక్షిణ భారత చలనచిత్ర రంగంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్లో ఒకరు అనేది అందరికీ తెలిసిన విషయమే.
అనుష్క తెలుగు, తమిళ భాషలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 4 సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా ఉన్నారు. తెలుగులో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలైన 'బాహుబలి', 'రుద్రమదేవి' సినిమాల్లో అనుష్క నటిస్తోంది. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన 'లింగా', అజిత్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ నాలుగు క్రీజీ ప్రాజెక్ట్స్లో నటిస్తున్నప్పటికీ అనుష్క గత సంవత్సర కాలంగా కాస్త గ్యాప్ కూడా తీసుకోలేదు. అనుష్క తీరికలేకుండా నటనకు ప్రాధాన్యత గల పాత్రలలో నటిస్తూ, పాత్రల పరంగా శ్రమిస్తూ సంపాదిస్తోందని అంటున్నారు.
**