Number One heroine
-
రష్మిక, పూజా హెగ్డే.. ఎవరు టాలీవుడ్ నెంబర్ 1?
రష్మిక మందన్నా, పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లు వీళ్లే. తెలుగులో ఇప్పుడు వీరిదే హవా. దాదాపు పెద్ద సినిమాలన్నింటినీ తమ ఖాతాలో వేసుకుంటున్నీ ముద్దుగుమ్మలు నెంబర్ వన్ పొజీషన్ కోసం పోటీ పడుతున్నారు. సీనియర్ స్టార్ హీరోయిన్ల హవా తగ్గడం ఈ బ్యూటీస్‌కు మరింత కలిసొచ్చింది. యూత్‌లోనూ ఈ ఇద్దరు హీరోయిన్లకు సూపర్ క్రేజ్ ఉండటంతో దాదాపు బడా సినిమాలన్నింటిలోనూ వీళ్లే డైరెక్టర్ల ఫస్ట్ ఛాయిస్‌గా మరిపోయారు. గతేడాది సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో స్టార్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది కార్తీ సరసన సుల్తాన్ మూవీతో తమిళంలో ఎంట్రీ ఇచ్చేసింది. అంతేకాకుండా బాలీవుడ్లో ఏకకాలంలో రెండు సినిమాలు చేసేస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నులో నటిస్తూనే, బిగ్‌బి అమితాబ్‌తో కలిసి గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తుంది ఈ కన్నడ బ్యూటీ. మరోవైపు శంకర్- రామ్‌చరణ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమాలోనూ రష్మికనే తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక అల వైకుంఠపురములో సినిమాతో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే. కెరీర్ మొదట్లో అపజయాలు పలకరించినా ఇప్పుడు మాత్రం జెడ్ స్పీడుతో దూసుకుపోతుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తూనే, ప్రభాస్ సరసన రాధేశ్యామ్‌తో జతకట్టనుంది. మరోవైపు యంగ్ హీరో అఖిల్ సరసన బ్యాలిలర్ సినిమా చేస్తోంది. అంతేకాకుండా త్వరలోనే యంగ్ టైగర్ యన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఓ సినిమాలోనూ పూజా నటించనున్నట్లు తెలుస్తోంది. మహేష్ సరసన మరోసారి నటించేందుకు రెడీ అయ్యిందట ఈ పొడుగు కాళ్ల సుందరి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది. ఇలా చేతినిండా సినిమాలతో వచ్చే రెండు, మూడేళ్ల వరకు వీరి క్యాలెండర్ ఫుల్ బిజీగా మారిపోయింది. రెమ్యునరేషన్ విషయంలో ఈ ఇద్దరికీ పోటీ నెలకొంది. ప్రస్తుతం రష్మిక 2 కోట్లు డిమాండ్ చేస్తుండగా, పూజా మాత్రం 2.5-3 కోట్ల వరకు అందుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. చదవండి : కరోనా వల్ల మేకప్‌మెన్‌గా మారిన ప్రముఖ నటుడు అందుకే ఆ హీరోతో నటించలేదు : రష్మిక -
ప్రస్తుతానికి అమ్మతోడు చాలు
నేనిప్పుడు పరిణితి చెందానంటున్నారు నటి హన్సిక. తమిళ చిత్ర పరిశ్రమలోనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే ఇప్పుడు నంబర్‌వన్ హీరోయిన్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఎవరి చిత్రం హిట్ అయితే వారే నంబర్‌వన్. అలా చూస్తే ఇక్కడ వారానికో హీరోయిన్ నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. ఇక కోలీవుడ్ విషయానికొస్తే నయనతార, అనుష్క, సమంత, శుృతిహాసన్, త్రిష, కాజల్ అగర్వాల్, హన్సిక ఇల ప్రముఖ హీరోయిన్లుగానే వెలుగొందుతున్నారు. వీళ్లలో ప్రస్తుతం అధిక చిత్రాలు చేతిలో ఉన్న నటి ఎవరంటే ఖచ్చితంగా నటి హన్సికనే అని చెప్పక తప్పదు. సక్సెస్ రేటును పెంచుకుంటూ పోతున్న హన్సిక నటిస్తున్న చిత్రాలు అరడజను ఉన్నాయి. ఇకపోతే ఇంతకుముందు పత్రికల వారితో ముచ్చడించాలంటే ముందుగా హన్సిక అమ్మ మాట్లాడేవారు. అలాంటిది ఇప్పుడే హన్సికనే హాయ్ ఎలా ఉన్నారు? అంటూ ముసిముసి నవ్వులతో గలగలా మాట్లాడేస్తున్నారు. ఆమెలో ఇంత మార్పు ఎలా కలిగింది? ఆ మాటా మంతి చూద్దాం! ప్రశ్న: మీలో చాలా మార్పు వచ్చింది? చాలాపరిణితి చెందినట్లున్నారు? ఆ కథేంటో కాస్త వివరిస్తారా? జవాబు: నేను చిత్ర రంగానికి బాలతారగా పరిచయం అయ్యాను. అప్పటి నా వయసు ఏడేళ్లు. 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్ అయ్యాను. అయితే అది పరిపక్వత చెందని వయస్సే. అప్పటి నుంచి తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ వచ్చాను. అమ్మ తోడుగా ఉండి ఒక గురువుగా కూడా మార్గదర్శకురాలయ్యారు. ఇంకా నేను పరిణితి చెందకుంటే ఎలా? తొలి రోజుల్లో నేను అడిగింది ఇవ్వకుంటేనో చెప్పింది వినకుంటేనో కోపం వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా కోపం రావడం లేదు. అలా నేనిప్పుడు చాలా పరిణితి చెందాను. ప్రశ్న: తమిళం మాట్లాడటానికింకా శ్రమ పడుతున్నట్లున్నారే? జవాబు: నా వెంట అమ్మ ఎప్పుడు ఉంటారు. ఆమెకు తమిళం తెలియదు. యూనిట్ బృందం ఏ విషయాన్నై అర్థవంతంగా చెప్పడానికి ఇంగ్లిషులోనే మాట్లాడుతారు. అలాంటిది నేనుగా ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు టీవీ చూస్తూ పిల్లలతో మాట్లాడుతూ తమిళం నేర్చుకుంటున్నాను. మరి కొంతకాలంలో తమిళ భాష పూర్తిగా నేర్చుకుంటాను. ప్రశ్న : అందంగా ఉన్నారు. చాలా మంది అభిమానులను పొందారు. మీ లక్ష్యాన్ని చేరుకున్నారని భావిస్తున్నారా? జవాబు: ఎక్కడో ఉత్తరభారతం నుంచి వచ్చిన నాకు ఇక్కడి అభిమానులు గుడి కట్టించే స్థాయికి ఆదరిస్తున్నారు. ఇంతకంటే సాధించాల్సింది ఏముంటుంది బలమైన పాత్రల్లో నటించలేదని అంటారా? అలాంటి అవకాశాలు రానీ యండి. నటించి చూపిస్తాను. ఇటీవల అరణ్మణై చిత్రం దెయ్యంగా అలాంటి బలమైన పాత్రనే చేశాను. అయినా దర్శ క నిర్మాతలు నన్ను కమర్షియల్ హీరోయిన్‌గానే చూస్తున్నారు. ప్రశ్న: మళ్లీ బాలీవుడ్లో మకాం వేసే ఆలోచన ఉందా? జవాబు: ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. దక్షిణాదిలోనే నాకు రెడ్ కార్పెట్ ఆహ్వానం లభిస్తోంది. ఇక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి.అంతే కాకుండా దక్షిణాది ప్రేక్షకులకు నేను నచ్చాను. ఇక్కడ నేనింకా చాలా సాధించాల్సింది ఉంది. తరువాత హిందీ చిత్రాల్లో నటించడం గురించి ఆలోచిస్తాను. ప్రశ్న: మల్టీస్టారర్ చిత్రాలకే ప్రాముఖ్యత నిస్తున్నట్లున్నారు? జవాబు: మీకో విషయం చెప్పనా. నేను కథలు వినేటప్పుడు ఆ చిత్రాల్లో హీరో ఎవరని అడగను. కథ బాగుందా? నా పాత్రకు ప్రాముఖ్యత ఉందా? అన్న విషయాల గురించే చూస్తాను. మాన్ కరాటే చిత్రంలో హీరో శివకార్తికేయన్ అన్న విషయం ఆ చిత్రాన్ని అంగీకరించిన తరువాతే తెలిసింది. ప్రశ్న: దత్తత పిల్లలు ఎలా ఉన్నారు? జవాబు: వారి సంఖ్య 30కి పెరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు. పిల్లలకు హోమ్ నిర్మించడానికి స్థలం కొనుగోలు చేశాను. త్వరలో నిర్మాణ పనులు మొదలెట్టనున్నాం. ప్రశ్న:అమ్మ సహకారం మాత్రం చాలానుకుంటున్నారా? జవాబు: మీరు దేని గురించి అడుగుతున్నారో అర్థమైంది. ప్రస్తుతానికి అమ్మ తోడు చాలు. మరో తో డు కోసం మరికొన్ని ఏళ్లు తరువాత ఆలోచిస్తాను. -
అనుష్కానా, సమంతానా?
దక్షిణ భారత సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్ ప్రేక్షకులలో మంచి క్రేజీ ఉన్న సమంత అని విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆదాయ లెక్కలతో పోల్చితే సమంత కంటే బిగ్ పర్సనాలిటితో టాలీవుడ్‌ని ఏలుతున్న యోగా టీచర్ అనుష్క అని చెబుతున్నారు. సమంతకు సక్సెస్ఫుల్ హీరోయిన్ అన్న పేరు ఉన్నప్పటికీ అనుష్క భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తోంది. 2014 సంవత్సరం ఆదాయానికి సంబంధించిన లెక్కలను పరిశీలిస్తే సెక్సీ క్వీన్ అనుష్క సంపాదన 15 కోట్ల రూపాయల వరకు చేరుకుందని అంచనా. సినిమాలతోపాటు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలు, బ్రాండింగ్ తరహా క్యాంపెన్ల వంటి సంపాదనంతా లెక్కగడితే ఇంత సంపాదించినట్లు తేలిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధికంగా సంపాదిస్తున్న హీరోయిన్స్ ఎవరు అన్న దానిపై కోలీవుడ్‌లో ఇటీవల ఓ మ్యాగజైన్ సర్వే నిర్వహించింది. అందులో అనుష్క మొదటి స్థానం ఆక్రమించినట్లు తెలుస్తోంది. ఆ తరువాతి స్థానంలో గోల్డెన్ లెగ్గా పేరు సంపాదించిన సమంత ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అనుష్క దక్షిణ భారత చలనచిత్ర రంగంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరు అనేది అందరికీ తెలిసిన విషయమే. అనుష్క తెలుగు, తమిళ భాషలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 4 సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా ఉన్నారు. తెలుగులో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలైన 'బాహుబలి', 'రుద్రమదేవి' సినిమాల్లో అనుష్క నటిస్తోంది. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన 'లింగా', అజిత్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ నాలుగు క్రీజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నప్పటికీ అనుష్క గత సంవత్సర కాలంగా కాస్త గ్యాప్ కూడా తీసుకోలేదు. అనుష్క తీరికలేకుండా నటనకు ప్రాధాన్యత గల పాత్రలలో నటిస్తూ, పాత్రల పరంగా శ్రమిస్తూ సంపాదిస్తోందని అంటున్నారు. ** -
గ్లామర్ క్వీన్ దీపిక
సరిలేరు నాకెవ్వరూ...అంటూ చిద్విలాసం చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే. ప్రస్తుతం ఈ మగువ క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం దీపికా పదుకునే. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న ఈ బ్లాక్ బ్యూటీ తాజాగా రెండు అరుదైన రికార్డులను నమోదు చేసుకుంది. ఒక పక్క చేతి నిండా చిత్రాలు...మరోపక్క వద్దంటే వచ్చి పడుతున్న యాడ్స్ అవకాశాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న దీపిక ఇప్పటి వరకు 22 చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాల వసూళ్లు 4,000 కోట్లు దాటడం విశేషం. ఇది అరుదైన రికార్డు అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. దీంతో సంతోష సాగరంలో తేలిపోతున్న ఈ ముద్దుగుమ్మను ఇప్పుడు ఆనందంలో ముంచెత్తుతున్న మరో విషయం గ్లామర్‌క్వీన్ పట్టం. ఇటీవల జరిపిన ఒక సర్వేలో మోస్ట్ గ్లామరస్ నటి దీపికా పదుకునేగా ఎంపికైందట. గ్లామర్ క్వీన్ పట్టాన్ని తనకు దక్కిన గౌరవంగా ఈ ముద్దుగుమ్మ భావిస్తున్నట్లు పేర్కొంది. అందమైన రికార్డులను సాధించిన దీపికను చూసి, బాలీవుడ్ హీరోయిన్లు అసూయపడుతున్నారట. -
నయనే నెంబర్ వన్
తమిళం, తెలుగు భాషల్లో నేటికీ నయనతారనే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. అందం ఆమెకు దేవుడిచ్చిన వరం. అయితే అభినయం ఆమె శ్రమకు ఫలితం. వెరసి ప్రేక్షకులు ఆమెకు నెంబర్‌వన్ పట్టం కట్టారు. నయనతార 2005లో అయ్యా చిత్రం ద్వారా కోలీవుడ్‌కి రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత చంద్రముఖి, గజని, శివకాశి, భిల్లా, వల్లవన్, బాస్ ఎన్గిర భాస్కరన్ మొదలగు పలు హిట్ చిత్రాలతో నెంబర్‌వన్ హీరోయిన్ స్థానాన్ని కైవశం చేసుకున్నారు. కొత్తగా ఎందరు హీరోయిన్లు వస్తున్నా ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటునే వున్నారు. తెలుగులోను టాప్ హీరోయిన్గా వెలుగొందుతుండడం విశేషం. వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ప్రతిఘటనలు ఎదురైనా దానిని నిబ్బరంతో ఎదుర్కొన్నారు. వాటి ప్రభావాలను నటనపై పడకుండా జాగ్రత్త పడ్డారు. నటనకు కొద్ది రోజులు దూరం అయినా రీ ఎంట్రీలో కూడా నెంబర్‌వన్ స్థానం ఈ బ్యూటీకి దూరం అవ్వలేదు. రాజారాణి, ఆరంభం చిత్రాలు విజయం సాధించి, నయనతారను మేటి నటిగా నిలబెట్టాయి. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ నయనతారనే. ఆ తరువాత వరుసలో కాజల్ అగర్వాల్ నిలిచారు. ఈ భామ ప్రస్తుతం తెలుగులో మూడు చిత్రాలు తమిళం, హిందీ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్నారు. మూడో స్థానంలో హన్సిక, నాలుగో స్థానంలో సమంత నిలిచారు. వీరి పారితోషికం కోటి నుంచి రెండు కోట్లు వరకు ఉంటుందని సినీ వర్గాలంటున్నాయి.