గ్లామర్ క్వీన్ దీపిక | Deepika Padukone - Glamour Queen of Bollywood | Sakshi
Sakshi News home page

గ్లామర్ క్వీన్ దీపిక

Published Sat, Aug 9 2014 10:47 PM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM

గ్లామర్ క్వీన్ దీపిక

గ్లామర్ క్వీన్ దీపిక

 సరిలేరు నాకెవ్వరూ...అంటూ చిద్విలాసం చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే. ప్రస్తుతం ఈ మగువ క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం దీపికా పదుకునే. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న ఈ బ్లాక్ బ్యూటీ తాజాగా రెండు అరుదైన రికార్డులను నమోదు చేసుకుంది. ఒక పక్క చేతి నిండా చిత్రాలు...మరోపక్క వద్దంటే వచ్చి పడుతున్న యాడ్స్ అవకాశాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న దీపిక ఇప్పటి వరకు 22 చిత్రాల్లో నటించింది.
 
 ఈ చిత్రాల వసూళ్లు 4,000 కోట్లు దాటడం విశేషం. ఇది అరుదైన రికార్డు అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. దీంతో సంతోష సాగరంలో తేలిపోతున్న ఈ ముద్దుగుమ్మను ఇప్పుడు ఆనందంలో ముంచెత్తుతున్న మరో విషయం గ్లామర్‌క్వీన్ పట్టం. ఇటీవల జరిపిన ఒక సర్వేలో మోస్ట్ గ్లామరస్ నటి దీపికా పదుకునేగా ఎంపికైందట. గ్లామర్ క్వీన్ పట్టాన్ని తనకు దక్కిన గౌరవంగా ఈ ముద్దుగుమ్మ భావిస్తున్నట్లు పేర్కొంది. అందమైన రికార్డులను సాధించిన దీపికను చూసి, బాలీవుడ్ హీరోయిన్లు అసూయపడుతున్నారట.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement