![Pariksha Pe CharchaDeepika Padukone mental health comments viral](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/DeepikaPadukone.jpg.webp?itok=Cj-Odyp5)
పని ఒత్తిడిలో మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు, దీపికా పడుకొణె
ఒత్తిడికి దూరంగా ఉండాలి, బలాలు, బలహీనతలను విద్యార్థులు తెలుసుకోవాలి.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone)తాను మానసిక ఆందోళనకు గురైన ఆ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi) ప్రతి ఏడాది నిర్వహించే పరీక్షా పే చర్చ(Pariksha Pe Charcha) తాజా ఎపిసోడ్ (రెండో)లో పాల్గొన్నదీపికా బాల్యంలో, చదువుకునే సమయంలో తానెదుర్కొన్న ఆలోచనలు, సమస్యల గురించి వివరించింది. బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషించే కార్యక్రమం 'పరీక్ష పే చర్చ' ఎపిసోడ్‌కి తనను ఆహ్వానించినందుకు ప్రేక్షకులకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దీపికా పదుకొనే కృతజ్ఞతలు తెలిపింది.
పరీక్షా పే చర్చ 2025 రెండో ఎపిసోడ్ దీపికా పదుకొణెతో విజయవంతంగా ముగిసింది. ఈ ఎపిసోడ్‌లో, దీపికా పదుకొనే తన బాల్య ప్రయాణాన్ని పంచుకుంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తాను అల్లరి పిల్లనని తెలిపింది. లెక్కలు నేర్చుకోవడంలో ఇబ్బంది ఉండేదని గుర్తు చేసుకుంది. అంతేకాదు ఇప్పటికీ లెక్కలంటేనే భయమేనని తెలిపింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి పుస్తకాన్ని కూడా ప్రస్తావించింది. అందరూ తమ మనసులోని భావాలను బయటపెట్టాల్సిన అవసరాన్ని గురించి వివరించింది. మానసిక ఆరోగ్యం, ఒత్తిడి ఎదుర్కోవడం లాంటి అంశాలపై విద్యార్థులకు ఆమె కీలక సలహాలు ఇచ్చారు.
Deepkia Padukone thanks PM Modi for giving her the platform to speak on Depression, anxiety and other mental health issues! pic.twitter.com/BlqGy8fGrN
— Janta Journal (@JantaJournal) February 12, 2025
తన అనుభవాలను పంచుకుంటూ..స్కూల్ విద్యార్థిగా ఉన్నపుడే క్రీడల వైపు ఆసక్తి ఉండేదని, ఆ తరువాత మోడలింగ్, నటన వైపు తన దృష్టి మళ్లిందని తెలిపింది. అయితే ఒకానొక దశలో మానసికంగా చాలా కుంగుబాటుకు లోనయ్యానని, ఆత్మహత్య చేసు కోవాలనే ఆలోచనలు కూడా వచ్చేవని దీపికి తెలిపింది. అవిశ్రాంతంగా పనిచేస్తూ,తన మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోలేదనీ, చివరికి ఒక రోజు స్పృహ కోల్పోయాను. రెండు రోజుల తర్వాత, నిరాశతో బాధపడుతున్నానని గ్రహించి చికిత్స తీసుకున్నట్టు వెల్లడించింది. తన జీవితంలో వచ్చిన ఎన్నో మార్పులను అవగాహన చేసుకుంటూ, తనను తాను మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగినట్టు చెప్పింది. ఈ ఒత్తిడి అనేది కంటికి కన్పించదు, కానీ అనుక్షణం దెబ్బతీస్తుంది. మన జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. నిజానికి మన చుట్టూ ఈ సమస్యతో బాధపడేవారు చాలామందే ఉంటారు. అందుకే రాయడం అలవర్చుకోవాలని పిల్లలకు సలహా ఇచ్చింది. జర్నలింగ్ అనేది మనమనసులోని భావాలను ప్రాసెస్ చేయడానికి, వ్యక్తీకరించడానికి ఒక మంచి మార్గమని ఆమె విద్యార్థులకు సూచించారు. ఒకరితో ఒకరు పోటీ పటడం, పోల్చుకోవడం సహజం. మన బలాలు ,బలహీనతలను గుర్తించడం, మన బలాలపై దృష్టి పెట్టడం, మన బలహీనతలను మెరుగుపరచుకోవడం చాలా అవసరమని పేర్కొంది. అలాగే మన బలాన్ని మనం తెలుగుకో గలిగిన రోజు మీలోని మరో వ్యక్తి బయటికి వస్తారని ధైర్యం చెప్పింది.
కాగా పరీక్షా పే చర్చ ఎపిసోడ్స్ విద్యా మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానల్, మైగవ్ ఇండియా, ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్, దూరదర్శన్ ఛానల్స్ వంటి అన్ని ప్రభుత్వ పోర్టల్స్ ద్వారా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.2014లో క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడిన దీపికా పదుకోన్ ఈ ఎడిసెడ్‌లో పాల్గొంది. హీరో రణవీర్‌ను పెళ్లాడిన దీపిక ప్రస్తుతం పాపకు తల్లిగా మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment