సల్మాన్‌ చేతికి ఖరీదైన వాచ్‌ : తెగ ఫీలైపోతున్న ఫ్యాన్స్‌ | Salman Khan luxury watch from Jacob and Co the details about Billionaire III | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ చేతికి ఖరీదైన వాచ్‌ : తెగ ఫీలైపోతున్న ఫ్యాన్స్‌

Published Thu, Sep 12 2024 1:31 PM | Last Updated on Thu, Sep 12 2024 3:15 PM

Salman Khan luxury watch from Jacob and Co the details about Billionaire III

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌  సల్మాన్‌ ఖాన్‌ సొంతమైన ఖరీదైన వాచ్‌లను  ధరించడం కొత్తేమీ  కాదు. డైమండ్స్​ పొదిగిన  ఖరీదైన వాచీలు అంటే సల్మాన్‌కు చాలా ప్రీతి. తాజాగా ఖరీదైన వాచ్‌తో ఓ ఫొటోకు పోజివ్వడం అందర్నీ ఆకర్షించింది.

విలాసవంతమైన వాచ్ కంపెనీ జాకబ్ అండ్ కో బిలియనీర్ III వాచ్‌ను ధరించాడు. అంతేకాదు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు జాకబ్ అరబోను ఆలింగనం చేసుకోవడం కనిపించింది. జాకబ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్నాడు. ఇందులో జాకబ్ తన స్వహస్తాలతో 714 వజ్రాలు పొదిగిన గడియారాన్ని సల్మాన్‌కు  అలంకరించాడు. తాను ఎపుడు ఎవర్నీ  బిలియనీర్‌ వాచ్‌ని ట్రై  చేయనీయలేదు, కానీ సల్మాన్‌ అందుకు మినహాయింపు అంటూ  వీడియోను షేర్‌ చేశాడు. దీంతో అభిమానులు బీటౌన్ టైగర్, స్టార్ పవర్‌ ఆ వాచ్‌కే అందం తెస్తాడు  స్పందించారు. అయితే  సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచ్ పెట్టుకోవం కాదు. ఈ గడియారాన్ని సల్మాన్ ఖాన్ ధరించడమే విశేషం, సల్మాన్‌ పెట్టుకోవడం వల్లే దానికి వాల్యూ వచ్చింది, లివింగ్‌ లెజెండ్‌, బాస్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ అంటూ మరికొంతమంది ఫ్యాన్స్‌ తెగ ఫీలయి పోతున్నారు.

రూ. 41.94 కోట్ల వాచ్‌   విశేషాలు 
జాకబ్ అండ్ కో  కంపెనీ సంబంధించిన  చాలా ప్రత్యేకమైన  వాచ్‌ బిలియనీర్ III . ఇవి ప్రపంచవ్యాప్తంగా కేవలం 18 మాత్రమే అందుబాటులో  ఉన్నాయి. దీని కేస్, లోపలి రింగ్‌పై 152 ఎమరాల్డ్‌ కట్‌ డైమండ్స్‌, అదనంగా 76 వజ్రాలు మరింత ఆకర్షణీయంగా పొదిగారు. 57 బాగెట్-కట్ డైమండ్స్‌తో ,బ్రాస్‌లెట్‌లో మొత్తం 504 తెల్లని పచ్చ-కట్ డైమండ్స్‌తో కలిపి మొత్తం న 714 అద్భుతమై వజ్రాలతో దీన్ని రూపొందించారు. జాకబ్ అండ్ కో వెబ్‌సైట్ ప్రకారం, బిలియనీర్ III  ధర. రూ. 41.94 కోట్లు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement