
ప్రముఖ బుల్లి తెర నటుడు రామ్ కపూర్ 55 కిలోల బరువు తగ్గడం నెట్టింట విస్తృత చర్చకు, ఊహాగానాలకు దారితీసింది. ఓజెంపిక్ లేదా సర్జరీ వంటి షార్ట్‌కట్‌ల ద్వారా అంత బరువు తగ్గాడనే అరోపణలను తీవ్రంగా ఖండించిన నటుడు కష్టపడి , అంకితభావంతో 140 కిలోల బరువును 55 కిలోలు తగ్గి 85 కిలోలకు తగ్గించుకున్నట్టు వెల్లడించాడు. దీనిపై రామ్‌కు అనేక ప్రశంసలు లభించాయి కూడా. అయితే రామ్‌కు పేరు తీసుకొచ్చిన టీవీ షో ‘బడే అచ్చే లగ్తే హై’ నిర్మాత ఏక్తా కపూర్ మాత్రం సంచనల వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. తాజాగా ఏక్తాకు కౌంటర్‌గా రామ్ భార్య గౌతమి కపూర్ ఒక వీడియోను పో స్ట్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ ఎంచుకోవాలా లేదా మౌంజారో, ఓజెంపిక్ తీసుకోవాలా, లేదా మౌనంగా ఉండాలా.. బడేహీ అచ్చే లగ్తేహై అంటూ ఒక పోస్ట్ పెట్టింది. పరోక్షంగా రామ్ కపూర్ వెయిట్ లాస్ జర్నీని ఏక్తా కపూర్ ఎగతాళి చేసింది. దీనిపై స్పందించిన గౌతమి వీడియోను విడుదల చేసింది.
ఏక్తా కపూర్ తరహాలోనే కౌంటర్
"నేను యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ తీసుకోవాలా? నేను మౌంజారో తీసుకోవాలా?నేను ఓజెంపిక్ తీసుకోవాలా లేదా పైన పేర్కొన్నవన్నీ తీసుకోవాలా? లేదా నా నోరు మూసుకోవాలా? క్యుంకి హుమే బడే నహీ చోటే హే అచ్చే లగ్తే హై..' అంటూ వీడియో పోస్ట్ చేసింది. అలాగే ఎవరికి నచ్చినది వార్ని చేయనివ్వాలి. జీవించాలి, జీవించనివ్వాలి, ఎందుకంటే లైఫ్‌లో అతి ముఖ్యమైనవి ఆరోగ్యం, ఆనందం, శాంతి అంటూ గౌతమి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చివరగా నీ జీవితం నువ్వు చూస్కో అంటూ చురకలంటించింది. దీంతో భర్తకు సపోర్ట్‌గా నిలిచిన గౌతమిని అభిమానులు ప్రశంసించారు.
ఏక్తా టీవీ సీరియల్ షో, బడే అచ్చే లగ్తే హై సీరియల్‌లో లీడ్ రోల్‌లో నటించిన రామ్‌కు, ఏక్తాకపూర్‌కు మధ్య ఇటీవల పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. బడే అచ్చే లగ్తే హై షోలో గురించి ఒక ఇంటర్వ్యూ లో రామ్ వ్యాఖ్యల నేపథ్యంలో వారువురి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఈ సీరియల్‌లో సాక్షి తన్వర్ పాత్రకు మధ్య తనకు సన్నిహిత సన్నివేశాన్ని రాసినది ఏక్తా కపూర్ అని, టీఆర్‌పీ రేటింగ్ కోసం అలాంటి సీన్లు పెట్టడాన్ని తాను ముందుగానే వ్యతిరేకించానని రామ్ వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన ఏక్తా కపూర్ పరోక్షంగా 'నోరు మూసుకో’ రామ్‌పై అంటూ మండిపడింది. ప్రొఫెషనల్ యాక్టర్ కాదని, అతనివి 'తప్పుడు' వ్యాఖ్యలని, తాను నోరు విప్పితే అసలు నిజం బయటపడుతుందని, కాన మౌనమే బెటర్ అని సమాధానమిచ్చింది. ఆ తరువాత అతని వెయిట్‌లాస్ జర్నీపై కూడా ఏక్తా వ్యంగ్య బాణాలు విసిరిన సంగతి తెలిసిందే.