
లేడీ సూపర్‌స్టార్ నయనతార భర్త, ట్విన్స్‌తో కలిసి కొత్త ఏడాది(విషు) వేడుకలను ఘనంగా జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచు కోవడంతోపాటు, అందరికి పండుగ శుభాకాంక్షలకు కూడా అందించింది. ఈ సందర్భంగా ఆమె ధరించిన రోలెక్స్ ఓస్టెర్ ఫ్యాన్స్‌ను ఎట్రాక్ట్ చేసింది.
సమ్మర్ సీజన్‌లో క్లాసిక్ సమ్మర్ రెడీ యాక్సెసరీరీ జతగా లగ్జరీ వాచ్‌నుధరించింది. దుస్తుల నుండి బ్యాగ్ వరకు అన్నీ లగ్జరీ వస్తువులు కావడం విశేషం. ఇందులో రోలెక్స్ ఆయిస్టర్ పర్మనెంట్ బ్రాండ్ వాచీ మరీ స్పెషల్. కాటన్ సూట్‌కు మ్యాచ్ అయ్యేలా లైట్ పింక్ కలర్ డయల్ ఉన్న రోలెక్స్ వాచ్ అతికినట్టు సరిపోయింది. దీని ధర సుమారు రూ. 53 లక్షలట.
నయన్ బర్త్‌డే సందర్బంగా భర్త విఘ్నేష్ శివన్ రూ.2.7 కోట్ల విలువైన మెర్సిడెస్ మేబ్యాక్ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే షూట్ టైం అంటూ చీరలో అద్భుతమై ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది నయనతార. కాగా నయనతార కరియర్ పరంగా వరుసగా హిట్లతో దూసుకుపోతోంది.అలాగే ఇటీవల వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టింది. ఒక కొత్త స్టూడియోను నిర్మిస్తున్న విషయాన్ని న్యూజర్నీ అంటూ ఇటీవల ఇన్‌స్టాలో షేర్ చేసింది.
அனைவருக்கும் இனிய தமிழ் புத்தாண்டு சித்திரை திருநாள் நல்வாழ்த்துகள் #TamilNew2024
— Nayanthara✨ (@NayantharaU) April 15, 2024
ഏവർക്കും ഹൃദയം നിറഞ്ഞ വിഷു ആശംസകൾ#HappyVishu2024 pic.twitter.com/Wh6MlGu21r