luxury watch
-
కి‘లేడీ’ పనిమనిషి.. చోరీ చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టి..
ముంబై: ఓ పని మనిషి.. తాను పనిచేసే ఓనర్లో ఇంట్లో చోరీ చేసి పరార్ అయ్యారు. దొంగిలించిన కొత్త వాచ్, చీర ధరించిన ఫొటోలు సదరు పని మనిషి వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకోగా. ఓనర్ దంపతులకు తెలిసిపోయింది. దీంతో పనిమనిషి రూపాలి సింగ్‌పై సమతా నగర్ పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కండివ్లిలోని ఓ దంపతుల ఇంట్లో.. రూపాలి సింగ్ రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ జంట ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యాపారం చేస్తున్నారు. వారి ఇంట్లో రూపాలి పనిమనిషిగా చేరారు.ఇక.. ఇంటిని శుభ్రం చేయటం, వారి పిల్లలను చూసుకోవడం ఆమె పని. అక్టోబరు 7న రూపాలి.. తల్లిదండ్రులు విడిపోవాలని కోర్టును ఆశ్రయించారని పని మానేసి.. తన సొంతూరు వెళ్తున్నట్లు తెలిపారు.అయితే.. ఓనర్ భార్య దసరాకు కొత్త చీర కట్టుకోవాలని భావించించారు. ఆమెకు కొత్త చీర అల్మారాలో కనిపించలేదు. చీర ఎక్కడ ఉందని.. ఆమె పనిమనిషి రూపాలికి ఫోన్ చేసి కనుకున్నారు. తాను ఇస్త్రీ చేసి అల్మారాలో ఉంచానని రూపాలి చెప్పారు. ఇంట్లో ఎక్కడ చూసినా ఓనర్ భార్యకు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి.. అక్టోబర్ 7వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఓనర్ దంపతులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. యజమాని ఇంటి నుంచి పనిమనిషి రూపాలి.. బ్యాగుల్లో ఏదో తీసుకుని వెళ్తున్నట్లు కనిపించారు. యజమాని భార్య తన వాట్సాప్‌ను తనిఖీ చేస్తుండగా.. సింగ్ స్టేటస్ చూసి అవాక్కయ్యారు.వాట్సాప్‌లో స్టేటస్‌లో పనిమనిషి తన యజమానికి సంబంధించిన వాచ్, దుస్తులను ధరించి కనిపించారు. కొత్త చీర, వాచ్ కాకుండా ఇంట్లో పలు విలువైన వస్తువులు కనిపించలేదు. ఆభరణాలు, వాచ్, చీరలు, సన్ గ్లాసెస్, శాలువా, మేకప్ కిట్, పెర్ఫ్యూమ్లు, పిల్లల బ్యాగ్ కనిపించలేదు. వీటి విలువ సమారు 2.4 లక్షల ఉంటుందని ఓనర్ జంట తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ పనిమనిషి కోసం వెతుకుతున్నారు. -
సల్మాన్ చేతికి ఖరీదైన వాచ్ : తెగ ఫీలైపోతున్న ఫ్యాన్స్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సొంతమైన ఖరీదైన వాచ్‌లను ధరించడం కొత్తేమీ కాదు. డైమండ్స్ పొదిగిన ఖరీదైన వాచీలు అంటే సల్మాన్‌కు చాలా ప్రీతి. తాజాగా ఖరీదైన వాచ్‌తో ఓ ఫొటోకు పోజివ్వడం అందర్నీ ఆకర్షించింది.విలాసవంతమైన వాచ్ కంపెనీ జాకబ్ అండ్ కో బిలియనీర్ III వాచ్‌ను ధరించాడు. అంతేకాదు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు జాకబ్ అరబోను ఆలింగనం చేసుకోవడం కనిపించింది. జాకబ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్నాడు. ఇందులో జాకబ్ తన స్వహస్తాలతో 714 వజ్రాలు పొదిగిన గడియారాన్ని సల్మాన్‌కు అలంకరించాడు. తాను ఎపుడు ఎవర్నీ బిలియనీర్ వాచ్‌ని ట్రై చేయనీయలేదు, కానీ సల్మాన్ అందుకు మినహాయింపు అంటూ వీడియోను షేర్ చేశాడు. దీంతో అభిమానులు బీటౌన్ టైగర్, స్టార్ పవర్ ఆ వాచ్కే అందం తెస్తాడు స్పందించారు. అయితే సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచ్ పెట్టుకోవం కాదు. ఈ గడియారాన్ని సల్మాన్ ఖాన్ ధరించడమే విశేషం, సల్మాన్ పెట్టుకోవడం వల్లే దానికి వాల్యూ వచ్చింది, లివింగ్ లెజెండ్, బాస్ ఆఫ్ బాలీవుడ్ అంటూ మరికొంతమంది ఫ్యాన్స్ తెగ ఫీలయి పోతున్నారు. View this post on Instagram A post shared by Jacob Arabo (@jacobarabo)రూ. 41.94 కోట్ల వాచ్ విశేషాలు జాకబ్ అండ్ కో కంపెనీ సంబంధించిన చాలా ప్రత్యేకమైన వాచ్ బిలియనీర్ III . ఇవి ప్రపంచవ్యాప్తంగా కేవలం 18 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని కేస్, లోపలి రింగ్‌పై 152 ఎమరాల్డ్ కట్ డైమండ్స్, అదనంగా 76 వజ్రాలు మరింత ఆకర్షణీయంగా పొదిగారు. 57 బాగెట్-కట్ డైమండ్స్‌తో ,బ్రాస్లెట్లో మొత్తం 504 తెల్లని పచ్చ-కట్ డైమండ్స్‌తో కలిపి మొత్తం న 714 అద్భుతమై వజ్రాలతో దీన్ని రూపొందించారు. జాకబ్ అండ్ కో వెబ్సైట్ ప్రకారం, బిలియనీర్ III ధర. రూ. 41.94 కోట్లు. View this post on Instagram A post shared by Jacob Arabo (@jacobarabo) -
అనంత్ అంబానీ - రాధిక హల్దీ : హాట్ టాపిక్‌గా సల్మాన్ ఖాన్ వాచ్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు సందడి చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో స్టయిల్‌తో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. తాజాగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్ రీవెడ్డింగ్ బాష్‌లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ధరించిన వాచ్ హాట్ టాపిక్గానిలిచింది.అనంత్ అంబానీకి ఎంగేజ్మెంట్మొదలు, తొలి, రెండో క్రూయిజ్ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్, ఇలా ప్రతీవేడుకలోనూ సల్మాన్ హాజరు తప్పకుండా ఉండాల్సిందే. ఇటీవల అనంత్-రాధిక సంగీత్‌లో కూడా అనంత్‌తో కలిసి స్టెప్పులేశారు. ఇక హల్దీ వేడుకలో సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచ్‌తో పాటు ఆల్-బ్లాక్ లుక్‌తో అలరించాడు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డైమండ్స్ పొదిగిన వాచ్ అందర్నీ ఆకర్షించింది. అయితే సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచెస్ ధరించడం కొత్తేం కాదు. కోట్ల విలువ చేసే లగ్జరీ వాచెస్ కలెక్షన్ విలవ కోట్ల రూపాయకుపైమాటే. తాజాగా లగ్జరీ బ్రాండ్ పాటెక్ ఫిలిప్ రెయిన్ బో (Patek Philippe Rainbow Watch) కి చెందిన వాచ్ ధరించాడు. ఆక్వానాట్ లూస్ రెయిన్బో మినిట్ రిపీటర్ హాట్ జ్యూయిలరీ వాచ్ సుమారు 130 వజ్రాలతో పొదిగి ఉందట. దీని ధర దాదాపు రూ. 23.54 కోట్లు ఉంటుందని అంచనా.కాగాజూలై 12న అనంత్, రాధిక వివాహ వేడుక మూడు రోజుల పాటు ఘనంగా జరగ బోతోంది. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) -
లేడీ సూపర్‌స్టార్ నయన్ లగ్జరీ వాచ్..ధర తెలిస్తే!
లేడీ సూపర్‌స్టార్ నయనతార భర్త, ట్విన్స్‌తో కలిసి కొత్త ఏడాది(విషు) వేడుకలను ఘనంగా జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచు కోవడంతోపాటు, అందరికి పండుగ శుభాకాంక్షలకు కూడా అందించింది. ఈ సందర్భంగా ఆమె ధరించిన రోలెక్స్ ఓస్టెర్ ఫ్యాన్స్‌ను ఎట్రాక్ట్ చేసింది. సమ్మర్ సీజన్లో క్లాసిక్ సమ్మర్ రెడీ యాక్సెసరీరీ జతగా లగ్జరీ వాచ్నుధరించింది. దుస్తుల నుండి బ్యాగ్ వరకు అన్నీ లగ్జరీ వస్తువులు కావడం విశేషం. ఇందులో రోలెక్స్ ఆయిస్టర్ పర్మనెంట్ బ్రాండ్ వాచీ మరీ స్పెషల్. కాటన్ సూట్‌కు మ్యాచ్ అయ్యేలా లైట్ పింక్ కలర్ డయల్ ఉన్న రోలెక్స్ వాచ్ అతికినట్టు సరిపోయింది. దీని ధర సుమారు రూ. 53 లక్షలట. నయన్ బర్త్‌డే సందర్బంగా భర్త విఘ్నేష్ శివన్ రూ.2.7 కోట్ల విలువైన మెర్సిడెస్ మేబ్యాక్ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే షూట్ టైం అంటూ చీరలో అద్భుతమై ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది నయనతార. కాగా నయనతార కరియర్ పరంగా వరుసగా హిట్లతో దూసుకుపోతోంది.అలాగే ఇటీవల వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టింది. ఒక కొత్త స్టూడియోను నిర్మిస్తున్న విషయాన్ని న్యూజర్నీ అంటూ ఇటీవల ఇన్‌స్టాలో షేర్ చేసింది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) அனைவருக்கும் இனிய தமிழ் புத்தாண்டு சித்திரை திருநாள் நல்வாழ்த்துகள் #TamilNew2024 ഏവർക്കും ഹൃദയം നിറഞ്ഞ വിഷു ആശംസകൾ#HappyVishu2024 pic.twitter.com/Wh6MlGu21r — Nayanthara✨ (@NayantharaU) April 15, 2024 -
షారుఖ్ రూ. 5 కోట్ల లగ్జరీ వాచ్ : నెటిజన్ల జోక్స్ వైరల్
గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల కొద్దీ అభిమానుల ఫాలోయింగ్, కోట్లాది రూపాయల సంపద, ఖరీదైన వస్తువులు, లగ్జరీ లైఫ్ ఆయన సొంతం. తాజాగా కింగ్ ఖాన్ లగ్జరీ వాచ్ వార్తల్లో నిలిచింది. నీలిరంగు Audemars Piguet చేతి గడియారం దాని ధర చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. దీని ధర సుమారు . 5 కోట్లు. అయితే ఈ వాచ్ ధరపై నెటిజన్లు కమెంట్లు హాట్‌టాపిక్‌గా లిచాయి ఆడెమర్స్ పిగెట్ బ్రాండ్‌కు చెందిన రాయల్ ఓక్ వాచ్‌ను తన బ్లాక్‌బస్టర్ మూవీ పఠాన్ ప్రమోషన్ సమయంలో దీన్ని ధరించి అందర్నీ విస్మయ పర్చిన సంగతి తెలిసిందే. దీని డెలివరీ కోసం రూ. 8 వేలకు చెల్లించాడంటేనే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఆడెమర్స్ వెబ్సైట్ ప్రకారం ఇది బ్లూ-హ్యూడ్ స్టార్రి-నైట్ పీస్. ఇదిచాలా లిమిటెడ్ వెర్షన్ కూడా. ఈ వాచ్ డిజైన్, బిల్డ్ విషయాలను గమనిస్తే..ఇందులో నాలుగు డయల్స్ ఉంటాయి. ఇందులో సమయంతోపాటు, నెలలు, రోజులు తదితర వివరాలు కూడా ఉంటాయి. దుబాయ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ T20 సందర్భంగా కూడా ఈ వాచ్‌తో దర్శమనిచ్చాడు షారుఖ్. అయితే దీన్ని కొంతమంది అభిమానులు వెరైటీగా స్పందించారు. రూ. 500 అయితే ఏంటి, 5 కోట్లు చూపించే టైం ఒకటేగాఅని ఒకరు, మీషో, షాప్సీ వంటి ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్‌లో 200 రూపాయలకే దీన్ని కొనుక్కోవవచ్చు. అంతేకాదు ఇంతకంటే మంచి వాచ్‌లు దొరుకుతాయంటూ వ్యాఖ్యానించడం విశేషం.షారుఖ్ ఖాన్ ఆడెమర్స్ పిగ్యెట్ రాయల్ ఓక్ వాచెస్ కలెక్షన్లో ఖరీదైనది మరొకటి కూడా ఉంది. నీతా అంబానీ నేతృత్వంలోని ఎన్ఎంఏసీసీ ఈవెంట్లో కింగ్ ఖాన్ దీన్ని ధరించాడు. దీని ధర రూ. 31.1 లక్షలు. -
కోహ్లి చేతికి కొత్త లగ్జరీ వాచ్, అదరిపోయే టీ-షర్ట్, ధర ఎంతంటే?
ప్రతిష్టాత్మక ఐపీఎల్ 2024 సమరం శుక్రవారం షురూ అయింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, విరాట్ కోహ్లీ ఓ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో 12 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఈ ఘనతను అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈసందర్బంగా కోహ్లీ కొత్త లుక్, కొత్త టీషర్ట్, లగ్జరీ వాచ్ ఇవన్నీ క్రికెట్ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఐపీఎల్ 2024 సిరీస్కోసం సిద్దమైన కోహ్లీ కొత్త హెయిర్ కట్, గడ్డంతో ముంబై విమానాశ్రయంలో చమక్‌మని మెరిసాడు. కోహ్లీ కొత్త లుక్ చూసిన ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. దీనికి సంబంధించి ఫోటోలు ఇప్పటికీ నెట్టింట్ చక్కర్లు అవుతున్నాయి. అంతేకాదు ఇటీవల రెండో బిడ్డకు తండ్రి అయిన కోహ్లి తెల్లటి టీ-షర్టులో మరింత అందంగా కనిపించాడు. దీనిపై యానిమేషన్ క్యారెక్టర్ బొమ్మతోపాటు, డాడ్(DAD) 'డక్ డక్ గూస్' అని రాసి ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది తన పిల్లలపై ఉన్న ప్రేమను నిదర్శనమంటూ కమెంట్స్ వినిపించాయి. ఈ టీ-షర్టు ధర రూ.2,076(24.95 డాలర్స్) అని సమాచారం. అంతేనా లగ్జరీ వాచ్ కలెక్షన్‌ను సొంతం చేసుకున్న కోహ్లీ మరో లగ్జరీ వాచ్ కూడా హాట్ టాపిక్‌గా నిలిచింది. దీని ధర 38.77 లక్షల అని అంచనా. కుడి చేతికి ధరించి ఈ సొగసైన వాచ్ లగ్జరీ రోలెక్స్ బ్రాండ్‌ది. బ్లాక్ డయల్, మరో మూడు సిల్వర్ కలర్ డయల్స్, బ్లాక్ బెల్ట్‌తో రోలెక్స్ డేటోనా బేబీ లే మాన్స్ ఓస్టెర్ఫ్లెక్స్ సూపర్ లావిష్ వాచ్ ఇది. కోహ్లి భయ్యా..సూపర్ కూల్ అవుట్‌ఫిట్ అంటూ క్రికెట్ అభిమానులు మురిసి పోయారు. కాగా కోహ్లీ, భార్య బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతులకు ఈ ఏడాది ఫిబ్రవరి 15న లండన్‌లో కుమారుడు అకాయ్ జన్మించాడు. వీరికి ఇప్పటికే వామిక అనే పాపకూడా ఉంది. -
తారక్ చేతికున్న వాచ్ ధరెంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!
Jr NTR Patek Philippe Watch: తెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న 'జూనియర్ ఎన్టీఆర్' గురించి పరిచయమే అవసరం లేదు. మంచి నటనా నైపుణ్యంతో ప్రేక్షులకు హృదయాలను దోచుకున్న ఈ నటుడు అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇందులో భాగంగానే లగ్జరీ కార్లు, ఖరీదైన వస్తువులు వినియోగిస్తారు. ఇటీవల ఆయన చేతికి పెట్టుకున్న వాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల నందమూరి సుహాసిని తనయుడు హర్ష వివాహానికి హాజరైన జూ. ఎన్టీఆర్ సుమారు రూ. 2.45 కోట్లు విలువైన వాచ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇది 'పాటక్ ఫిలిప్' అనే స్విజర్ల్యాండ్ బ్రాండ్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో జూ. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో కూడా మరో పాటక్ ఫిలిప్ వాచ్ పెట్టుకుని కనిపించాడు. దీని ధర రూ. 1.56 కోట్లు కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇంకా ఈయన వద్ద రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్, బృందావనం పేరుతో ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉందని సమాచారం. ఇదీ చదవండి: రూ. 76000 మ్యాక్‌బుక్ ఆర్డర్ చేస్తే.. వచ్చింది ఇదా? ఖంగుతిన్న కస్టమర్! ఇక కార్ల విషయానికి వస్తే.. ఈయన వద్ద లంబోర్ఘిని ఉరుస్ గ్రాపైట్ క్యాప్స్యూల్, రేంజ్ రోవర్ రోగ్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే మూవీ చేస్తున్నారు. ఇది 2024లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Jr NTR Universe ™ (@ntr.universe) -
Kohli Watch Collections Pics: కోహ్లి ఖరీదైన వాచ్ కలెక్షన్...మీరు ఓ లుక్కేయండి (ఫొటోలు)
-
ఐపీవోకు లగ్జరీ వాచీల కంపెనీ!
లగ్జరీ, ప్రీమియం వాచీల రిటైల్ కంపెనీ ఇథోస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 18న ప్రారంభంకానున్న ఇష్యూకి రూ. 836–878 ధరల శ్రేణి ప్రకటించింది. 20న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 375 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రస్తుత వాటాదారులు మరో 11 లక్షలకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 472 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 17 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 2020–21లో కంపెనీ రూ. 386 కోట్లకుపైగా ఆదాయం సాధించగా, దాదాపు రూ. 6 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ దేశీయంగా ప్రీమియం, లగ్జరీ వాచీల భారీ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. 50 రకాల బ్రాండ్లను విక్రయిస్తోంది. జాబితాలో ఒమెగా, ఐడబ్ల్యూసీ స్కఫాసెన్, లాంగిన్స్, టిస్సట్, రేమండ్ వీల్, లూయిస్ మొయినెట్ తదితరాలున్నాయి. ప్రిస్టీన్ లాజిస్టిక్స్ ఐపీవో బాట లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీసుల కంపెనీ ప్రిస్టీన్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. -
కోపగించుకున్న కోహ్లి
ముంబై: తన ప్రేమాయణంపై అడిగిన ప్రశ్నకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. తానేమీ రిలేషన్ షిప్ కౌన్సిలర్ ను కాదంటూ చురక అంటించాడు. లగ్జరీ వాచీలు తయారుచేసే టిస్సాట్ తరపున బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన కోహ్లి మంగళవారం ఆ కంపెనీ నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనుష్క శర్మతో బ్రేక్ అప్ గురించి ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నించగా తెలివిగా సమాధానం ఇచ్చాడు. 'ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నానో చెప్పేందుకు నేను రిలేషన్ షిప్ కౌన్సిలర్ ను కాదు. కాబట్టి ఈ ప్రశ్న నన్ను అడగకూడదు. దయచేసి ఎక్స్ ఫర్ట్ ని సంప్రదించండి' అని కోహ్లి జవాబిచ్చాడు. మీకు బహుమతిగా వచ్చిన లగ్జరీ వాచీని బాలీవుడ్ లో ఎవరికి ఇస్తారని అడగ్గా.. ఇదేం ప్రశ్న అని చిర్రుబుర్రు లాడాడు. మరో కోణంలో ప్రశ్నలు అడిగేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డాడు. ఆ వాచీని తన కుటుంబ సభ్యులకో.. సహచర క్రికెటర్లకో కానుకగా ఇస్తానని చెప్పాడు. అయినా ఎవరిస్తే మీకెందుకు అని ఎదురు ప్రశ్నించాడు. -
'సీఎం వాచ్ వేలం వేసి వారిని ఆదుకోండి'
సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ నేత జనార్థన పూజారి సలహా బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన వద్ద ఉన్న రూ.50 లక్షల విలువైన చేతి గడియారాన్ని వేలం వేసి వచ్చిన డబ్బుతో సియాచిన్ హిమపాతంలో చిక్కుకుని వీరమరణం పొందిన రాష్ట్రానికి చెందిన ముగ్గురు సైనికుల కుటుంబాలకు అందజేయాలని కాంగ్రెస్ నేత జనార్థన్ పూజారి సూచించారు. మంగళూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ' ఆయనకు ఎవరు అంత ఖరీదైన వాచ్ ను బహుమతిగా ఇచ్చారో నాకు తెలియడం లేదు. ఆయన ఇంతటి ఖరీదైన వాచ్ ను ధరించడం పార్టీకి కూడా అంత లాభదాయకం కాదు. అందుకే ఆ వాచ్ ను వేలం వేయడమే మంచిది. చేతి గడియారాన్ని ధరించడం అంత ముఖ్యమైన విషయమేమి కాదు, అయితే రాష్ట్రంలో అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయడమే ముఖ్యం. ప్రతిపక్షాల విమర్శలకు కారణమవుతున్న ఈ వాచ్ ను వేలం వేసి, తద్వారా వచ్చిన మొత్తాన్ని వీర సైనికుల కుటుంబాలకు అందజేస్తే బాగుంటుంది' అని జనార్థన పూజారి సూచించారు.