బాలీవుడ్ సూపర్ స్టార్ 'షారుఖ్ ఖాన్' ముంబైలో జరిగిన ఐఐఎఫ్ఏ (IIFA) అవార్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కనిపించారు. ఆ సమయంలో ఆయన చేతికున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్శించింది. ఇంతకీ అది ఏ బ్రాండ్ వాచ్ అని చాలామంది సెర్చ్ చేయడం కూడా మొదలెట్టేసారు.
షారుఖ్ ఖాన్ చేతికున్న వాచ్.. ఆడేమర్స్ పిగుఎంట్ (Audemars Piguet) బ్రాండ్ అని తెలుస్తోంది. ఇది లిమిటెడ్ ఎడిషన్. ఎందుకంటే ఇలాంటి వాచీలు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 250 మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ. 76 లక్షల వరకు ఉంటుందని సమాచారం.
ఐఐఎఫ్ఏ అవార్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కనిపించిన షారుఖ్ ఖాన్.. నలుపు రెండు డ్రెస్సులో ఆకర్షణీయంగా కనిపించారు. ఈయన చేతికి ఖరీదైన వాచ్.. చెవికి ఇయర్ కఫ్ కూడా ధరించి ఉండటం చూడవచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వాచ్ ప్రత్యేకతలు
షారుఖ్ ఖాన్ చేతికున్న ఆడేమర్స్ పిగుఎంట్ వాచ్ చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది 18 క్యారెట్ల సాండ్ గోల్డ్‌తో తయారైనట్లు తెలుస్తోంది. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి ధర కూడా కొంత ఎక్కువగా ఉంది.
షారుఖ్ ఖాన్ వాచ్ కలెక్షన్
నటుడు షారుఖ్ ఖాన్ వద్ద ఆడేమర్స్ పిగుఎంట్ బ్రాండ్ వాచ్ మాత్రమే కాకుండా.. పటేక్ ఫిలిప్ ఆక్వానాట్ క్రోనోగ్రాఫ్ 5968ఏ, పాటెక్ ఫిలిప్పే నాటిలస్ 58811/1జీ, ఆడేమర్స్ పిగుయేట్ రాయల్ ఓక్ ఆఫ్‌షోర్ 2640ఐపీఓ, ఆడేమర్స్ పిగుయేట్ రాయల్ ఓక్ పర్ఫెటుల్ క్యాలెండర్, బెల్గరి ఆక్టో రోమా టూర్‌బిల్లాన్ సఫైర్ 103154, ట్యాగ్ హ్యూయర్ క్యాలిబర్ 1887 స్పేస్ఎక్స్, ట్యాగ్ మొనాకో సిక్స్టీ నైన్ సీడబ్ల్యు911 వంటి ఖరీదైన వాచీలు చాలానే ఉన్నాయి.
ఇదీ చదవండి: 80వేల కియా కార్లకు రీకాల్: కారణం ఇదే..
Comments
Please login to add a commentAdd a comment