ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్.. యూఎస్ఏలో ఏకంగా 80,000 కంటే ఎక్కువ వాహనాలకు రీకాల్ ప్రకటించింది. ముందు ప్రయాణీకుల సీటు కింద వైరింగ్ దెబ్బతినడం వల్ల.. ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్‌లు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఈ కారణంగానే కియా అమెరికా రీకాల్ ప్రకటించింది.
సీటు కింద వైరింగ్ దెబ్బతినడం వల్ల అనుకోకుండా ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని.. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కి దాఖలు చేసిన పత్రాలలో కియా అమెరికా స్పష్టం చేసింది. కంపెనీ రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో 2023 నుంచి 2025 మధ్య తయారైన నీరో ఈవీ, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.
కంపెనీ మొత్తం 80,225 కార్లకు రీకాల్ ప్రకటించింది. కార్లలోని సమస్యను గుర్తించి.. వాటిని ఉచితంగానే పరిష్కరించనున్నట్లు కియా అమెరికా వెల్లడించింది. అంతే కాకుండా వైరింగ్ కవర్లను కూడా ఉచితంగానే భర్తీ చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. కాగా కార్ల యజమానులకు మార్చిలో ఈ మెయిల్ ద్వారా తెలియజేయనుంది.
ఈ రీకాల్ అనేది అమెరికాలోని కియా కార్లకు మాత్రమే పరిమితం. కాబట్టి ఈ రీకాల్ ప్రభావం భారతదేశంలోని కియా కార్లపై ఎటువంటి ప్రభావం చూపదు. కాబట్టి దేశంలోకి కియా కార్ల యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇదీ చదవండి: ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment