సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ వీడియో షేర్ చేసారు. ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. ఓ కస్టమైజ్డ్ కారు కనిపిస్తుంది. అయితే ఇది సాధారణ కారు మాదిరిగా కాకుండా డబుల్ డెక్కర్ మాదిరిగా ఉంటుంది. దీనిని కర్ణాటకకు చెందిన దంపతులు.. తమ మహా కుంభమేళా యాత్ర కోసం ప్రత్యేకంగా రూపొందించుకున్నారు.
కర్ణాటకకు చెందిన దంపతులు కష్టమైజ్ చేసుకున్న కారు 'టయోటా ఇన్నోవా' (Toyota Innova). దీని కోసం వారు రూ.2 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇందులో రూఫ్ టాప్ కోసం రూ. 1 లక్ష, వెనుక భాగంలో కిచెన్ వంటి సదుపాయం, సోలార్ ప్యానల్ మొదలైన వాటి కోసం మరో లక్ష రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: తక్కువ ధర.. మంచి మైలేజ్: ఇదిగో టాప్ 5 స్కూటర్స్
ఎక్కువ రోజులు కుంభమేళాలో ఉండాలని, ఆ తరువాత మరో ఆరు నెలలు రోడ్ ట్రిప్ ప్రారంభించాలనే లక్ష్యంతోనే.. ఈ కారును కస్టమైజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా వీరి క్రియేటివిటీకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా సైతం దీనికి ఎంతగానో ఆకర్షితుడైనట్లు పేర్కొన్నారు.
Haan, yah bilkul sach hai ki main aise sanshodhanon aur aavishkaaron se mohit hoon. lekin mujhe yah sveekaar karana hoga ki jab ve mahindra vaahan par aadhaarit hote hain to main aur bhee adhik mohit ho jaata hoon!!
🙂 pic.twitter.com/rftq2jf2UN— anand mahindra (@anandmahindra) January 23, 2025
Comments
Please login to add a commentAdd a comment