Toyota car
-
ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ వీడియో షేర్ చేసారు. ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. ఓ కస్టమైజ్డ్ కారు కనిపిస్తుంది. అయితే ఇది సాధారణ కారు మాదిరిగా కాకుండా డబుల్ డెక్కర్ మాదిరిగా ఉంటుంది. దీనిని కర్ణాటకకు చెందిన దంపతులు.. తమ మహా కుంభమేళా యాత్ర కోసం ప్రత్యేకంగా రూపొందించుకున్నారు.కర్ణాటకకు చెందిన దంపతులు కష్టమైజ్ చేసుకున్న కారు 'టయోటా ఇన్నోవా' (Toyota Innova). దీని కోసం వారు రూ.2 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇందులో రూఫ్ టాప్ కోసం రూ. 1 లక్ష, వెనుక భాగంలో కిచెన్ వంటి సదుపాయం, సోలార్ ప్యానల్ మొదలైన వాటి కోసం మరో లక్ష రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: తక్కువ ధర.. మంచి మైలేజ్: ఇదిగో టాప్ 5 స్కూటర్స్ఎక్కువ రోజులు కుంభమేళాలో ఉండాలని, ఆ తరువాత మరో ఆరు నెలలు రోడ్ ట్రిప్ ప్రారంభించాలనే లక్ష్యంతోనే.. ఈ కారును కస్టమైజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా వీరి క్రియేటివిటీకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా సైతం దీనికి ఎంతగానో ఆకర్షితుడైనట్లు పేర్కొన్నారు.Haan, yah bilkul sach hai ki main aise sanshodhanon aur aavishkaaron se mohit hoon. lekin mujhe yah sveekaar karana hoga ki jab ve mahindra vaahan par aadhaarit hote hain to main aur bhee adhik mohit ho jaata hoon!! 🙂 pic.twitter.com/rftq2jf2UN— anand mahindra (@anandmahindra) January 23, 2025 -
సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్
సినిమా హిట్ అయితే ఆ ఆనందంలో నిర్మాతలు.. సదరు హీరో, దర్శకులకు బహుమతులు ఇవ్వడం సాధారణమైన విషయం. అయితే మూవీ రిలీజైన ఏడాది దాటిపోయిన తర్వాత కూడా కారు బహుమతిగా ఇచ్చే నిర్మాతలు ఉంటారా? అంటే టాలీవుడ్లో ఉన్నారనిపిస్తోంది. ఆయనే సాహు గారపాటి. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడికి మరో కారు గిఫ్ట్‌గా ఇచ్చారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్ ఓటింగ్.. డేంజర్ జోన్లో ఇద్దరు!)అనిల్ రావిపూడి గత సినిమా 'భగవంత్ కేసరి'. గతేడాది దసరాకు రిలీజైంది. మరీ అద్భుతం కానప్పటికీ ఓ మాదిరిగా ఆడింది. ఇందులో బాలయ్య-శ్రీలీల.. తండ్రి కూతురు పాత్రల్లో నటించారు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా అప్పట్లోనే నిర్మాత సాహు గారపాటి.. అనిల్‌కి టయోటా వెల్ఫైర్ కారు బహుమతిగా ఇచ్చారు.తాజాగా ఇప్పుడు మళ్లీ అదే మోడల్ మరో కారుని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్కెట్లో ఈ కారు ధర కోటిన్నర రూపాయలు పైనే. ఇకపోతే అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్‌తో సినిమా చేస్తున్నాడు. దీనికి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ అనుకుంటున్నారు. పేరుకి తగ్గట్టే ఇది సంక్రాంతి పండగకి రిలీజ్ అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓవైపు విడాకుల రూమర్స్.. 10 ఫ్లాట్స్ కొన్న బచ్చన్ ఫ్యామిలీ) -
టయోటా టైజర్ లిమిటెడ్ ఎడిషన్.. మంచి ఆఫర్‌తో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా కాంపాక్ట్ ఎస్యూవీ టైజర్ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రూ.20,160 విలువ చేసే టయోటా జెనివిన్ యాక్సెసరీస్ కిట్‌ను ఆఫర్ చేస్తోంది.అన్ని టర్బో వేరియంట్లలో అక్టోబర్ 31 వరకే ఇది లభిస్తుంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.10.56 లక్షలు. ఇప్పటికే కంపెనీ పండుగ సీజన్ కోసం ఇతర మోడళ్లలోనూ లిమిటెడ్ ఎడిషన్లను అందుబాటులోకి తెచ్చింది. -
లగ్జరీ కారు కొన్న చిరంజీవి, ధరెంతో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి కొత్త కారు కొన్నాడు. ఆయన గ్యారేజీలో మరో అత్యాధునిక వాహనం టొయోటా వెల్ఫైర్ చేసింది. దీని ధర దాదాపు రూ.1.9 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. బ్లాక్ కలర్లో ఉన్న ఈ వాహనం రిజిస్ట్రేషన్ కోసం చిరంజీవి మంగళవారం నాడు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాడు. కొణిదెల చిరంజీవి పేరుతో వాహనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మెగాస్టార్ వాహనానికి ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్‌ను కేటాయించారు. రూ.4.70 లక్షలు పెట్టి TS09GB1111 నెంబర్ కైవసం చేసుకున్నాడు చిరు. ఈ మేరకు ఆర్టీఏ ఆఫీసులో ఫోటో, డిజిటల్ సంతకం తదితర ప్రక్రియను పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. టయోటా వెల్ఫైర్ ప్రత్యేకత చిరంజీవి కొన్న టయోటా వెల్ఫైర్ వాహనం విషయానికి వస్తే ఆ కారులో మూడు వరుసలు ఉంటాయి. ఏడుగురు దర్జాగా కూర్చొని షికారుకు వెళ్లవచ్చు. భద్రత కోసం ఏడు ఎయిర్ బ్యాగ్స్ ఉండటం విశేషం. ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్స్ మరో ప్రత్యేకత. ట్విన్ సన్‌రూఫ్, 13 అంగుళాల ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ వంటి మరిన్ని స్పెషాలిటీస్ ఈ వాహనం సొంతం. -
పెరిగిన ఇన్నోవా హైక్రాస్ ధరలు.. విఎక్స్(ఓ) వేరియంట్ లాంచ్
టయోటా కంపెనీ తన ఇన్నోవా హైక్రాస్ VX(O) వేరియంట్‌ని అధికారికంగా విడుదల చేసింది. ఈ వేరియంట్ 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 26.73 లక్షలు, రూ. 26.78 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). కొత్త ఇన్నోవా హైక్రాస్ విఎక్స్(ఓ) వేరియంట్ ఇప్పటికే అందుబాటులో ఉన్న విఎక్స్, జెడ్ఎక్స్ మధ్య ఉంటుంది. ఇది మూడ్ లైటింగ్‌తో కూడిన పనోరమిక్ సన్‌రూఫ్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే కనెక్టివిటీతో కూడిన 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి వాటిని పొందుతుంది. ఇదిలా ఉండగా కంపెనీ ఇప్పుడు మొదటిసారిగా తన హైక్రాస్ ధరలను పెంచింది. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 25,000, హైబ్రిడ్ వేరియంట్ ధరలు రూ. 75,000 వరకు పెరిగాయి. ధరల పెరుగుదల తరువాత హైక్రాస్ బేస్ వేరియంట్ ధర రూ. 18.55 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 29.72 లక్షలు (ధరలు, ఎక్స్-షోరూమ్). టయోటా ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులో ఉన్నాయి. ఇందులోని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 172 బిహెచ్పి పవర్, 197 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మైల్డ్-హైబ్రిడ్ వెర్షన్ 2.0-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో 183 బిహెచ్పి పవర్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. కేవలం 9.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతాయి, అదే సమయంలో ఇన్నోవా హైక్రాస్ 21.1 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇన్నోవా హైక్రాస్ ADAS టెక్నాలజీ కూడా పొందుతుంది. కావున ఇందులో పార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. డిజైన్ పరంగా ఉత్తమంగా ఉండటమే కాకుండా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. -
బుక్ చేసిన నాలుగేళ్లకు డెలివరీ ప్రచారం.. టయోటా క్లారిటీ
This Toyota Car Will Deliver After 4 Years: ఆ కారును బుక్ చేసుకున్నవాళ్లు డెలివరీ కోసం నాలుగేళ్లు ఎదురుచూడక తప్పదంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో జపనీస్ కార్ మేకర్ టయోటా స్పందించింది. టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ 300 కోసం ఎదురు చూడకతప్పదంటూ కొన్ని వెబ్ సైట్లలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ప్రచారం వాస్తవమని, వాహనదారులు మన్నించాలంటోంది టయోటా. నిజానికి ఈ మోడల్‌ను కిందటి ఏడాదే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. అత్యాధునిక సాంకేతికత, హై ఫీచర్లతో తీసుకొచ్చింది. 2022 మూడవ త్రైమాసికంలో మార్కెట్లోకి రావొచ్చని భావించారు. అయితే.. సెమీకండక్టర్ల కొరత వల్ల ఇప్పుడు బుక్ చేసుకున్నవాళ్లకు నాలుగేళ్ల దాకా వాహనం డెలివరీ చేయలేమని కంపెనీ తేల్చేసింది. హై ఫీచర్లు ఉండడంతో సెమీకండర్లు అధికంగా అవసరం పడుతోందని, అందుకే అవాంతరాలు ఎదురవుతున్నాయని, అయినా నాలుగేళ్లలోపే డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని టయోటా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో ప్రభావం ఇతర మార్కెట్లపై పడనుంది. భారత మార్కెట్లో టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ300 ధర కోటిన్నర రూపాయలకు పైనే ఉండొచ్చని అంచనా. ఈ వెహికిల్ 10 శాతం తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఇంజిన్‌పరంగా రెండు వేరియెంట్స్ లభించనున్నాయి. నిస్సాన్ పాట్రోల్, బెర్సిడెజ్ బెంజ్ జీఎస్, బీఎండబ్ల్యూ ఎక్స్ 6 మోడల్స్‌కు గట్టి పోటీగా దీనిని భావిస్తున్నారు. -
సాఫ్ట్వేర్ కంపెనీలకు ఎస్సీ క్యాబ్స్
సాక్షి, హైదరాబాద్ ఎస్సీ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా ఆ కార్పొరేషన్ సరికొత్త ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే శిక్షణ, ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న ఆ శాఖ.. క్యాబ్‌ల ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. దీనికి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో జతకడుతోంది. శిక్షణ పొంది, అనుభవం ఉన్న వారికి నేరుగా ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు వాహనాలను కొనుగోలు చేసేందుకు కార్ల కంపెనీలతో మంతనాలు జరుపుతోంది. ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేసి.. వచ్చే నెలలో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టనుంది. 2017–18లో వెయ్యి యూనిట్ల గ్రౌండింగ్‌కు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. నిర్వహణకు ప్రాధాన్యత... రెండేళ్ల క్రితం కార్ల పథకాన్ని అమలు చేసినప్పటికీ ఎస్సీ శాఖ నిర్వహణ లోపంతో విఫలం చెందింది. మెజారిటీ లబ్ధిదారులు వాటిని మధ్యలోనే అమ్మేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ ఎస్సీ కార్పొరేషన్ కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ కంపెనీల్లో క్యాబ్‌ల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకోనుంది. అదేవిధంగా మెట్రోరైల్, ఓలా కంపెనీలతోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఆయా కంపెనీలతో చర్చలు కూడా జరపడంతో, కార్పొరేషన్ తరుఫున క్యాబ్‌ల నిర్వహణకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తొలి విడత ఒక్కో కంపెనీలో 250 కార్ల చొప్పున నాలుగు కంపెనీల్లో వెయ్యి కార్లకు అనుమతినివ్వాలని నిర్ణయించింది. నేరుగా కంపెనీతో అనుసంధానం కావడంతో బిల్లులకు ఎలాంటి ఇబ్బందులుండవని, ఉపాధికి హామీ ఉంటుందని కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. ఇది విజయం సాధిస్తే వచ్చే ఏడాది నుంచి ఈ పథకాన్ని భారీగా అమలు చేయనుంది. పెద్ద సంఖ్యలో వాహనాలు కొనుగోలు చేస్తున్నందున తక్కువ ధరకు తీసుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు టయోటా కంపెనీతో చర్యలు జరుపుతున్నారు. ఈనెలాఖరులోగా వాహనాల ధరలు ఖరారు చేసి, వచ్చే నెలలో లబ్ధిదారుల ఎంపిక నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు వెలువడనున్నాయి. -
ఈ కారుంటే.. కరెంటును అమ్ముకోవచ్చు!
ఒకప్పటి మాట... ఫోన్‌తో కేవలం అవతలి వ్యక్తితో మాట్లాడటం మాత్రమే వీలయ్యేది. మరి ఇప్పుడు... ఫోన్‌తో చేయలేని పనంటూ ఏదీ లేదు. చిత్రమైన విషయమేమిటంటే... వందేళ్లకుపైగా మనం వాడుతున్న కార్ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులేదు. కొన్ని అదనపు హంగులు వచ్చి చేరాయి గానీ.. లేకుంటే మనుషుల్ని అటూ ఇటూ రవాణా చేసేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కానీ.. ఫొటోలో కనిపిస్తోందే... ఆ కారు రోడ్లపై తిరగడం మొదలుపెడితే మాత్రం పరిస్థితి మారిపోతుందంటున్నారు! జపనీస్ సంస్థ టయోటా తయారు చేసిన ఈ సూపర్ కారు పేరు ‘ఎఫ్‌సీవీ ప్లస్’. కాలుష్యం బాధలేకుండా ఇది హైడ్రోజన్ ఇంధనంతో నడుస్తుంది. అంతేకాదు... ఇదోవిద్యుత్ జనరేటర్ కూడా. ఇంట్లో, లేదంటే ఆఫీసులో మీరు దీన్ని పార్క్ చేశారనుకోండి. అది ఊరికే కూర్చోదు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హైడ్రోజన్ ట్యాంకులకు కనెక్ట్ అయిపోయి నిశ్శబ్దంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్తును బ్యాటరీల్లో స్టోర్ చేసుకుని వాడుకోవచ్చునన్నమాట. ఒకవేళ మీకు అవసరమైన దానికంటే ఎక్కువ విద్యుత్తు ఉంటే దాన్ని గ్రిడ్‌కు అమ్ముకోవచ్చు కూడా. అదీ కాదంటే.. ఈ విద్యుత్తును ఇతర కార్లకు సరఫరా చేయవచ్చు కూడా. అంతేకాదు... దీంట్లో ఇంజిన్ మొత్తం ఒకచోట మాత్రమే ఉండదు. ఒక్కో చక్రంలో ఒక్కో విద్యుత్ మోటర్ ఉంటుంది. అలాగే హైడ్రోజన్‌ను విద్యుత్తుగా మార్చే ఫ్యుయెల్‌సెల్ ముందువైపు ఉంటే.. హైడ్రోజన్ ట్యాంకును వెనుకవైపు ఏర్పాటు చేశారు. ఉత్పత్తయ్యే విద్యుత్తు వైర్లెస్ పద్ధతిలో బ్యాటరీల్లోకి చార్జ్ అవుతుంది. టయోటా గత ఏడాది తొలిసారి ఇలాంటి ఫ్యుయెల్‌సెల్ వెహికల్ (ఎఫ్‌సీవీ)ను అభివృద్ధి చేసింది. దీన్నే మరింత ఆధునీకరించి ఎఫ్‌సీవీ ప్లస్‌గా పారిస్ మోటర్షోలో ప్రదర్శించనుంది.