మెగాస్టార్ చిరంజీవి కొత్త కారు కొన్నాడు. ఆయన గ్యారేజీలో మరో అత్యాధునిక వాహనం టొయోటా వెల్‌ఫైర్ చేసింది. దీని ధర దాదాపు రూ.1.9 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. బ్లాక్ కలర్‌లో ఉన్న ఈ వాహనం రిజిస్ట్రేషన్ కోసం చిరంజీవి మంగళవారం నాడు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాడు. కొణిదెల చిరంజీవి పేరుతో వాహనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.
మెగాస్టార్ వాహనానికి ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్‌ను కేటాయించారు. రూ.4.70 లక్షలు పెట్టి TS09GB1111 నెంబర్ కైవసం చేసుకున్నాడు చిరు. ఈ మేరకు ఆర్టీఏ ఆఫీసులో ఫోటో, డిజిటల్ సంతకం తదితర ప్రక్రియను పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
టయోటా వెల్‌ఫైర్ ప్రత్యేకత
చిరంజీవి కొన్న టయోటా వెల్‌ఫైర్ వాహనం విషయానికి వస్తే ఆ కారులో మూడు వరుసలు ఉంటాయి. ఏడుగురు దర్జాగా కూర్చొని షికారుకు వెళ్లవచ్చు. భద్రత కోసం ఏడు ఎయిర్ బ్యాగ్స్ ఉండటం విశేషం. ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్స్ మరో ప్రత్యేకత. ట్విన్ సన్‌రూఫ్, 13 అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్స్ వంటి మరిన్ని స్పెషాలిటీస్ ఈ వాహనం సొంతం.
Comments
Please login to add a commentAdd a comment