మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సినీ హీరో అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ, పిల్లలతో కలిసి వెళ్లారు. తనతో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే చిరు, సురేఖ ఇద్దరూ బన్నీ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో స్నేహకు వారు అధైర్య పడొద్దని చెప్పారు.
ఈ కేసులో బెయిల్ ద్వారా అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యాక నేరుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. తన న్యాయవాది నిరంజన్‌రెడ్డితో చర్చించాక.. తన నివాసానికి వెళ్లారు. అనంతరం ఆయన్ను పరామర్శించేందుకు టాలీవుడ్ మొత్తం కదిలి ఆయన ఇంటికి వెళ్లింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. అయితే, తాజాగా అల్లు అర్జున్ తన మామయ్య చిరు ఇంటికి వెళ్లడంతో మెగా ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.


Icon Star #AlluArjun is going to meet Mega Star #Chiranjeevi ...@KChiruTweets@alluarjun @AlwaysRamCharan#MegaFamily ❤️❤️❤️ pic.twitter.com/ELQDncYdI3
— WC (@whynotcinemasHQ) December 15, 2024


