నాగచైతన్య-శోభిత వివాహం.. నాగార్జున స్పెషల్‌ ట్వీట్‌ | Naga Chaitanya, Sobhita Dhulipala Married, Chiranjeevi Attend Wedding | Sakshi
Sakshi News home page

Naga Chaitanya- Sobhita Dhulipala: పెళ్లి బంధంతో ఒక్కటైన చై-శోభిత

Published Wed, Dec 4 2024 8:27 PM | Last Updated on Thu, Dec 5 2024 12:06 AM

Naga Chaitanya, Sobhita Dhulipala Married, Chiranjeevi Attend Wedding

హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్‌ శోభిత ధూళిపాళ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇన్నాళ్లు ప్రేమపక్షులుగా ఉన్న ఈ జంట నేడు (డిసెంబర్‌ 4న) భార్యాభర్తలుగా ప్రమోషన్‌ పొందారు. బుధవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో 8.13 గంటలకు చై.. శోభిత మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇరుకుటుంబ సభ్యులు సహా బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. 

ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు అల్లు అరవింద్ దంపతులు, కీరవాణి, దర్శకుడు శశికిరణ్ తిక్క, అశోక్ గల్లా, దర్శకుడు చందు మొండేటి, టి సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరినాథ్, రానా దగ్గుబాటి, సుహాసిని, అడివి శేష్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తదితరులు  హాజరయ్యారు.

నా మనసు సంతోషంతో నిండిపోయింది
కుమారుడి వివాహం గురించి నాగార్జున సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. ఈ పెళ్లి మా కుటుంబానికి చాలా గొప్ప క్షణం. చై, శోభిత అన్నపూర్ణ స్టూడియోస్‌లో వారి ప్రయాణాన్ని ప్రారంభించడం.. కుటుంబం, స్నేహితుల ప్రేమతో నా హృదయం సంతోషంతో ఉప్పొంగుతోంది. ఇది ప్రేమ, సాంప్రదాయం, ఐక్యత కలగలిపిన వేడుక, ఇది మా నాన్న కోసం నిలబడిన విలువలను ప్రతిబింబిస్తుంది. శోభితను మా కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నువ్వు ఆల్‌రెడీ మా జీవితాల్లో అంతులేని ఆనందాన్ని తీసుకొచ్చావు అని రాసుకొచ్చాడు.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement